తిరుమల శ్రీవారిని తెలంగాణ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ….పార్లమెంట్ ఎన్నికలకు కేసీఆర్ నాయకత్వంలో ఒంటరిగానే బిఆర్ఎస్ బరిలో దిగుతుందన్నారు. ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఇచ్చారు. ప్రజా తీర్పుకు శిరసా వహిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ హక్కుల గురించి, నది జలాల్లో రావాల్సిన వాటాపై పోరాడేది కేవలం బిఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రశ్నించే గొంతుకను మాత్రమే పార్లమెట్ కు పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోలేదన్నారు. కృష్ణానది జల వాటాపై పోరాడే పార్టీ కేవలం బిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని తెలిపారు. ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పెత్తనంపై బిఆర్ఎస్ వ్యతిరేకిస్తుందన్నారు. ఆపరేషన్ మ్యానువల్ ప్రకారమే నీటి విడుదల ఉంటుందని తెలిపిన ఆయన…. నాగార్జున సాగర్., శ్రీశైలం ప్రాజెక్ట్ లను కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకోవడం వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. కేఆర్ఎంబీ ఆధీనంలోకి ప్రాజెక్టులు వెళ్లకుండా బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.
health news
కంచికచర్ల మండలం పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం నుండి పెండ్యాల గ్రామం వరకు వైకాపా శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. పెండ్యాల గ్రామంలో మంచినీటి ట్యాంకు, సిసి రోడ్డును ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ రాజకీయాలు అనేవి మనం స్వచ్ఛంగా చేయాలని, ఈ ప్రాంతంలో నాకు ఓటేసారు అంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం పని చేయాలని అన్నారు. కేశినేని చిన్ని, బుద్ధ వెంకన్నను ఉద్దేశిస్తూ నా స్థాయికి తక్కువ గల మనుషుల గురించి నేను మాట్లాడను. చీటర్స్ గురించి, బ్రోతల్ హౌసులు నడిపే వారి గురించి, కాల్ మనీ చేసే వారి గురించి మీరు మీడియాలో అనవసరంగా మాట్లాడించి పెద్దోళ్ళని చేస్తున్నారు. దయచేసి వారి గురించి నేను మాట్లాడి నా స్థాయి తగ్గించుకోలేనని ఆయన అన్నారు. నా స్థాయికి చంద్రబాబు గురించి అడిగితే చెప్తా, లోకేష కూడా నా స్థాయికి తక్కువేనని అన్నారు. కొంతమంది పాపులారిటీ కోసం నా మీద మాట్లాడతారని, ఎలక్షన్ అయ్యాక బాక్సులు తెరిచాక ఎవరి పార్టీ ఖాళీ అవుతుందో తెలుస్తుంది వారి గురించి మాట్లాడి నా స్థాయి తగ్గించవద్దని ఆయన అన్నారు. త్వరలో నా అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి వైకాపా పార్టీలోకి ఆహ్వానిస్తాను ఎవరిని బలవంతం చేయను. ముఖ్యమంత్రిగా జగన్ గారు పిలవగానే ఆయన మాట కాదనలేక జాయిన్ అయ్యాను త్వరలో మా అనుచరులతో సమావేశం అవుతానని అన్నారు. నందిగామ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన అన్నారు. నందిగామ పట్టణాన్ని కూడా విజయవాడ పట్టణానికి ధీటుగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.
ప్రభుత్వ ఆనాలోచన నిర్ణయం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. ఉయ్యూరు ఆర్టీవో కార్యాలయంలో ధాన్యం కొనుగోలు పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తో పాటు ఆర్డిఓ రాజు, ఎమ్మార్వో మస్తాన్ రావు, నగర పంచాయతీ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్ బి కే నుండి మిల్లర్లకు తరలించిన ధాన్యం రోజుల తరబడి దిగుమతి చేసుకోకుండా తేమ శాతం పేరుతో బస్తాకు 300 నుంచి 400 రూపాయలు తగ్గించి ఇస్తున్నారని దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పార్థసారథి ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని అలాగే తేమశాతం పేరుతో మిల్లర్లు రైతులను మోసగిస్తున్న అధికారులు, మంత్రులు స్పందించడం లేదని అన్నారు. పకృతి విపత్తు వల్ల ఈ సంవత్సరం కుప్పనూరుపుళ్ళు మార్చి తర్వాత కూడా జరుగుతాయని కానీ ప్రభుత్వం మార్చి తర్వాత ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసాని మాత్రం రైతులకు కల్పించడం లేదని అన్నారు. మంత్రులు ప్రతిపక్షాలను బూతులు తిట్టడమే కాదని రైతు సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని చురక అంటించారు. ఇక్కడ ధాన్యాన్ని కడప, కర్నూలు, నెల్లూరు మిల్లులకు తరలించి ఇక్కడ మిల్లర్లకు సైతం ప్రభుత్వం అన్యాయం చేస్తుందని సారధి తెలిపారు.
2019లో ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అధికారంలోకి రావడానికి మోసపూరితమైన హామీలు ఇచ్చి మెట్ట ప్రాంత రైతులను నిలువునా దగా చేశారని పశ్చిమ ఆయిల్ ఫామ్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ హామీలలో స్థిరమైన మద్దతు ధర కల్పించలేకపోవడం, ఫ్యాక్టరీలలో పాత యంత్రాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి, తక్కువ ధరకు ఎరువులు ఇస్తానని, సబ్సిడీ మీద డ్రిప్పులు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నేరవేర్చలేదని రైతులు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి స్పందించి ఆయిల్ ఫామ్ కు టన్నుకు 18000 గిట్టుబాటు ధర కల్పించాలని పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తమ పార్టీ చిత్తశుద్ధి తో పనిచేస్తున్నామని చెపుతున్న సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహం సాక్షీగా మరో మోసానికి తెరతీశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, బహుజనులపై దాడులు చేస్తు అంబేద్కర్ విగ్రహం సాక్షీగా దళితులపై ముసలి కన్నీరు కారుస్తున్నారు. అంబేద్కర్ విదేశి విద్య పేరును మార్చి జగన్ పేరు పెట్టుకున్నారు. దళితులకు పధకాలు రద్దు చేసి వారికి రూ 30 వేల కోట్లు కేటాయించకుండా మెండి చెయ్యి చూపారు. నవరత్నాల వలన దళిత బహుజనులకు ఏటువంటి మేలు జరగలేదు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెట్టి నగరంలో దశాబ్ధాలుగా ఉంటున్న పేద దళిత, ఇతర బలహీన వర్గాల కుటుంబాలని నగరానికి దూరంగా పంపిన దళిత ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రతిదినం సామాజిక మోసానికి పాల్పాడేది వైకాపా ప్రభుత్వం కాదా.. సామాన్యుల గొంతుక అంబేద్కర్ అని చెప్పిన సీఎం జగన్ ఏపీలో ఎవరైనా గొంతు ఎత్తితే గొంతు కోసే సంస్కృతి మీ పరిపాలనలో జరగటం లేదా.. గొంతు ఎంతిన వారి గొంతు కోసే ఫ్యాక్షన్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి ది.. అంటరాని తనం గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి దళిత యువకుడిని చంపిన ఎమ్ ఎల్ సీ అనంతబాబు ను ప్రక్కన పెట్టుకొని దళితులకి ఏం సందేశం ఇస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం సాక్షీగా రాజకీయాలు మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదు. మాయ మాటలతో దళితులను కుటిల రాజకీయాలతో బానిసలుగా మార్చలనే వైకాపా ప్రభుత్వానికి రాబోయో రోజుల్లో చావుదెబ్బ తప్పదు. రాజధాని ప్రాంతంలో దళిత పేదలకు పట్టాలు పంపిణీ చేసినట్లు పైకి చెప్తు లోపల వైకాపా కార్యకర్తలకు పంపిణీ చేశారు. దళితులపై వాళ్ళ మారిన ప్రేమ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ నగరంలో గాని, ఎన్టీఆర్ జిల్లాలో గాని దళిత సామాజిక వర్గానికి చెందిన వైకాపా నాయకులకు ఎవరికైనా నామినేటెడ్ పదవులు ఇచ్చారేమో శ్వేతపత్రం విడుదల చేయాలి.
ఎమ్మిగనూరు, కర్నూల్ జిల్లా డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె నేటికీ 40 వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా ఎమ్మిగనూరులో అంగన్వాడీలు సోమప్పా సర్కిల్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి శివ సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక్క అవకాశం అన్నందుకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్న పాపానికి మహిళలు రోడ్లెక్కే పరిస్థితి ఎదురైందని ఆరోపించారు. ఇన్నిరోజులుగా అంగన్వాడీలు ఇళ్ళు, కుటుంబాలను వదిలి రోడ్లెక్కి నిరసనలు చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనీ అమలు చేయాలని కోరుతున్నామని అదనంగా మేము ఏమి కోరడం లేదన్నారు. 40 రోజులు అవుతున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఎంత ఆలస్యం చేస్తే అంత పెద్ద ఎత్తున ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని హెచ్చరించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చాలని, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేసి, ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.
మాజీ కేంద్రమంత్రి సినీ నటుడు దివంగత యూవీ కృష్ణంరాజు జయంతి వేడుకలు స్వగ్రామం మొగల్తూరులో అభిమానులు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పెద్ద కుమార్తె ప్రసిద్ధ లు పాల్గొని కృష్ణంరాజు బర్త్ డే కేక్ ను కట్ చేశారు. అనంతరం యూకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ మెగా వైద్య శిబిరాన్ని మొగల్తూరు స్థానిక అందే బాపన్న కళాశాల నందు ఏర్పాటు చేశారు. ఈ వైద్యం శిబిరంలో యూకేపి చెందిన ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు కె వేణు ప్రముఖ భీమవరం హాస్పిటల్ వర్మ తదితర ప్రముఖ డాక్టర్లు పాల్గొని రోగులకు వైద్య సేవలు అందించారు. డయాబెటిక్ పేషెంట్లను ఎడాప్ట్ చేసుకుని వారికి జీవితకాలం వైద్య సదుపాయం అందిస్తామని డాక్టర్ వేణు తెలిపారు. కృష్ణంరాజు గారి జయంతి సందర్భంగా వారి స్వగ్రామం మొగల్తూరులో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవి నాయుడు అన్నారు. ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవలు చేసి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన వ్యక్తి కృష్ణంరాజు అని గుర్తు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. దళితులు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తమ పార్టీ చిత్తశుద్ధి తో పనిచేస్తున్నామని చెపుతున్న సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహం సాక్షీగా మరో మోసానికి తెరతీశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, బహుజనులపై దాడులు చేస్తు అంబేద్కర్ విగ్రహం సాక్షీగా దళితులపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. అంబేద్కర్ విదేశి విద్య పేరును మార్చి జగన్ పేరు పెట్టుకున్నారు. దళితులకు పధకాలు రద్దు చేసి వారికి రూ 30 వేల కోట్లు కేటాయించకుండా మెండి చెయ్యి చూపారు. నవరత్నాల వలన దళిత బహుజనులకు ఏటువంటి మేలు జరగలేదు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెట్టి నగరంలో దశాబ్ధాలుగా ఉంటున్న పేద దళిత, ఇతర బలహీన వర్గాల కుటుంబాలని నగరానికి దూరంగా పంపిన దళిత ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రతిదినం సామాజిక మోసానికి పాల్పాడేది వైకాపా ప్రభుత్వం కాదా? సామాన్యుల గొంతుక అంబేద్కర్ అని చెప్పిన సీఎం జగన్ ఏపీలో ఎవరైనా గొంతు ఎత్తితే గొంతు కోసే సాంసృతి మీ పరిపాలనలో జరగటంలేదా? గొంతు ఎత్తిన వారి గొంతు కోసే ఫ్యాక్షన్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి ది. అంటరాని తనం గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి దళిత యువకుడిని చంపిన ఎమ్ ఎల్ సీ అనంతబాబు ను ప్రక్కన పెట్టుకొని దళితులకి ఏం సందేశం ఇస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం సాక్షీగా రాజకీయాలు మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదు. మాయ మాటలతో దళితులను కుట్రల రాజకీయాలతో బానిసలగా మార్చలనే వైకాపా ప్రభుత్వానికి రాబోయో రోజులలో చావుదెబ్బ తప్పదు. రాజధాని ప్రాంతంలో దళిత పేదలకు పట్టాలు పంపిణి చేసినట్లు పైకి చెప్తూ లోపల వైకాపా కార్యకర్తలకు పంపిణీ చేశారు. దళితులపై వాళ్ళ మారిన ప్రేమ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ నగరంలో గాని, ఎన్టీఆర్ జిల్లాలో గాని దళిత సామాజిక వర్గానికి చెందిన వైకాపా నాయకులకు ఎవరికైనా నామినేటెడ్ పదవులు ఇచ్చారేమో శ్వేతపత్రం విడుదల చేయాలి.
ప్రపంచమే ఆశ్చర్యంలో భారతదేశం వైపు చూసేలా చేసిన అంతరిక్ష ప్రయోగం చంద్రయాన్ 3. అగ్రదేశాలతో పోలిస్తే. అత్యంత తక్కువ ఖర్చుతో అతి క్లిష్టమైన టాస్కు తీసుకొని సక్సెస్ అయిన చంద్రయాన్ 3 ప్రయోగం కారణంగా భారత కీర్తి ప్రతిష్టలు ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. చంద్రయాన్ 3 ప్రయోగ ప్రత్యేకత. ఇప్పటివరకు మరే దేశం కూడా చంద్రుడిలోని దక్షిణ ధ్రువ ప్రాంతానికి వెళ్లే ప్రయత్నాలు ఫలించకపోవటం తెలిసిందే.
ముందుగా అనుకున్నట్లే. చంద్రయాన్ 3 నుంచి సిగ్నళ్లు ఆగిపోయాయి. అద్భుత రీతిలో సిగ్నళ్లు వస్తాయని ఆశగా కొందరు చూసినప్పటికీ వారికి నిరాశే మిగిలింది. ఇలాంటి వేళ. అంచనాలకు భిన్నంగా అద్భుతం అన్న రీతిలో. నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయిన చంద్రయాన్ 3లో అమర్చిన పరికరాల నుంచి తాజాగా సిగ్నళ్లు అందుకున్నట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష ఒప్పందాల్లో భాగంగా చంద్రయాన్ 3 ల్యాండర్ లో నాసాకు చెందిన లూనార్ రికనిసెన్స్ ఆర్బిటర్ ను అమర్చారు. ఇందులోని లేజర్ రెట్రో రెఫ్లెక్టర్ ఎరే.. తాజాగా తన సేవల్ని పునరుద్ధరించినట్లుగా చెబుతున్నారు. భూమి మీద పదిహేను రోజులు చంద్రుడి మీద ఒక రోజుతో సమానమన్న సంగతి తెలిసిందే. పగటి వేళ ముగిసిన తర్వాత మొదలయ్యే రాత్రిళ్లు ఉష్ణోగ్రతలు అసాధారణంగా ఉండటంతో.. చంద్రయాన్ లోని పరికరాలు స్లీప్ మోడ్ లోకి వెళ్లిపోతాయి. వాటి నుంచి మళ్లీ మేల్కొనటం సాధ్యం కాదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్పించి.. అవి నిద్రాణ స్థితి నుంచి మేల్కొనే వీల్లేదు. తాజాగా చంద్రయాన్ 3లో అమర్చిన పరికరాలు తమ నిద్రాణ స్థితి నుంచి బయటకు వచ్చి. తానున్న దక్షిణ ధ్రువంలోని లొకేషన్ మార్కర్ సేవల్ని పునరుద్దరించుకున్నట్లుగా తెలిపే సంకేతాల్ని పంపటం ఆసక్తికరంగా మారింది.
కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. అంగన్వాడీఉద్యోగులకు మద్దతుగా వామపక్ష పార్టీ నేతలు ధర్నా. చల్లపల్లి ప్రదానరహదారి దిగ్బంధం. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు. అంగన్వాడి కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వామపక్ష పార్టీ నేతలు రహదారులను నిర్బంధించారు. చల్లపల్లి బస్టాండ్ సెంటర్ లో అంగన్వాడీల దీక్షకు మద్దతుగా రోడ్డు దిగ్భందించి నిరసన తెలియజేస్తున్న అఖిలపక్ష ఆందోళనకారులను స్థానిక ఎస్ఐ. చిన్నాబాబు చెదరగొట్టి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోన్నారు.





Total views : 92778