తిమ్మాపూర్ మండలం, ఎల్ఎండి కాలనీలో గల నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఆదివారం దొంగలు పడ్డారు ఎస్సై చేరాలు కథనం మేరకు ఎల్ఎండి కాలనీలో గల నీటిపారుదల శాఖ ప్రభుత్వ కార్యాలయం ఆదివారం కావడంతో సాయంత్రం ఆఫీసుకు ఉన్న బేడాలను పగలగొట్టి సుమారు 5 కంప్యూటర్లతో పాటు వైఫై కనెక్టింగ్ డేటా, వివిధ సామాగ్రిని దొంగలించినట్లు తెలిపారు. సుమారు 2.5 లక్షల విలువ గల సామాగ్రి చోరీకి గురైనట్లు పేర్కొన్నరు. ఈ విషయమై కార్యాలయ సూపరిండెంట్ అంజిరెడ్డి సమాచారం అందించడంతో ఎస్సై చేరాలు కార్యాలయానికి చేరుకొని సిబ్బందితో కలిసి కార్యాలయంలో దొంగిలించిన కంప్యూటర్లు వివిధ సామాగ్రి తో పాటు ఇంకా ఏమి దొంగతనానికి గురయ్యాయని పరిశీలించారు అక్కడే ఉన్న అధికారులను సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా అని ఆరా తీశారు కొంతకాలంగా పనిచేయకపోవడం లేదని చెప్పారు. దొంగతనానికి గురైన కంప్యూటర్లలో ప్రాజెక్టు కు సంబంధించిన డేటా తో పాటు క్యాంపు క్వార్టర్లు అటెండర్లు వివిధ డెవలప్మెంట్ కు సంబంధించిన డేటా కంప్యూటర్ లో భద్రపరుస్తామని ఆ కంప్యూటర్ లు మాత్రమే చోరీకి గురయ్యాయని అలాగే బీరువా ను పగలగొట్టి వివిధ ఫైళ్లు కూడా చోరీ చేసారు అని వెల్లడించారు. వెంటనే క్లూస్ టీం కు సమాచారం అందించడంతో సోమవారం వేలిముద్రలు సేకరించినట్లు తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
health news
యుక్తవయస్కుల నుండి పెద్దల వరకు చాలా మంది ఈ చుండ్రు సమస్యతో చాలా బాధపడుతున్నారు. మొదట్లో చాలా తక్కువగా మొదలయ్యే ఈ చుండ్రు క్రమంగా తల మొత్తం వ్యాపించి సమస్యలను కలిగిస్తుంది. చుండ్రును వదిలించుకోవడానికి ఇంటి నివారణలలో పెరుగు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పెరుగును తలకు పట్టించి కాసేపు ఆరనివ్వడం వల్ల చుండ్రుతో పోరాడుతుంది. పెరుగును అప్లై చేసి కాసేపు ఆరనివ్వండి, ఆపై షాంపూతో మీ తలను కడగాలి. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ ఉసిరిపొడిని చుండ్రుకు ఎక్కువగా ఉపయోగిస్తారు. మరో విధంగా, పెరుగులోని ఈస్ట్ మన శరీరంలోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాలలో ఒకటి. ఈ రెండూ కలిసి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ,చుండ్రును వదిలించుకోవడానికి సహాయపడతాయి. చుండ్రుతో పోరాడడంలో వేప ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది శిలీంధ్రాలు మరియు శిరోజాల నుండి చుండ్రును తొలగించడమే కాకుండా, జుట్టు పెరిగే స్కాల్ప్ రంధ్రాల నుండి మలినాలను తొలగించి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కొన్ని వేప ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి తలకు పట్టించి కొంత సమయం తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
నెల్లూరు జిల్లా, ఉదయగిరి బెల్ట్ దుకాణాలపై పోలీసులు దాడులు. ఉదయగిరి పట్టణంలోని గండిపాలెం మార్గం వైపు ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా అనుమతి లేకుండా బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 51 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. మద్యం విక్రయిస్తున్న ఇద్దరు మహిళలు కూడా అదుపులో తీసుకున్నారు.
కాకినాడ జిల్లా, అంగన్వాడీల పై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రకటించిన మేము భయపడేది లేదు ఆనాడు తమిళనాడు ప్రభుత్వం ఎస్మా ప్రకటించింది ఆ ప్రభుత్వం కనుమరుగయ్యింది. త్వరలో జగన్మోహన్ రెడ్డి అదే పరిస్థితి ఎదుర్కొంటాడు. కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ లు నైట్ కూడా దిక్షలు నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతాం అని ప్రభుత్వానికి అంగన్వాడీ లు హెచ్చరిస్తున్నారు.
భార్యతో కలిసి కన్న తల్లిని హత్య చేసిన దుర్మార్గుడు. బంధువులకు అనుమానం రావడంతో బయటపడిన విషయం. ఆస్తి అమ్మడానికి అడ్డు వస్తుందని కన్నతల్లినే భార్యతో కలిసి మట్టు పెట్టాడు ఓ కిరాతకుడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ వెంకట్ రెడ్డి నగర్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.
వెంకట్ రెడ్డి నగర్ ప్రాంతానికి చెందిన కసావేణి సుగుణమ్మ భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు ఆమెకు కుమారుడు అనిల్ ,కోడలు తిరుమల ఉన్నారు
వీరి ఇద్దరు పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు, భర్త చనిపోయిన తర్వాత ఇంటిని సుగుణమ్మ తన పేరు మీదకు మార్చుకుంది కొడుకు జులాయి గా తిరగడంతో అప్పులు పెరిగాయి, అప్పులు తీర్చేందుకు ఇల్లు అమ్మాలని కొడుకు, కోడలు కొంతకాలంగా సుగుణమ్మ పై ఒత్తిడి చేస్తున్నారు అయితే సుగుణమ్మ ససేమీరా అనడంతో కోడలుతిరుమల పుట్టింటికి వెళ్ళింది ఇల్లు అమ్మాలంటే ఎలాగైనా తల్లి అడ్డు తొలగించుకోవాలని అనిల్ నిర్ణయించుకున్నాడు ఈ నెల నాలుగవ తేదీ అర్ధరాత్రి తిరుమల మరో వ్యక్తి శివతో కలిసి వెంకటరెడ్డి నగర్ వచ్చింది అదే రాత్రి సుగుణమ్మ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు, అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రలో ఉన్న సుగుణమ్మ ముఖంపై దిండు అదిమి గొంతు చుట్టి హత్య చేశారు అమ్మ నిద్రలోనే చనిపోయిందని అనిల్ బంధువులతో బుకాయించారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో బయటపడ్డ అసలు నిజం. మరణ వార్త విని సుగుణమ్మ తల్లి దాసరి ఐలమ్మ సహా బంధువులు వరంగల్ ప్రాంతం నుంచి భారీగా తరలివచ్చారు 5వ తేదీన అంత్యక్రియలకు సన్న హాలు చేశారు సుగుణమ్మ మృతదేహానికి స్నానం చేయిస్తుండగా మెడమీద గాయాలు కనిపించాయి దీంతో అనుమానం వచ్చి బంధువులు అనీలు నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు దీంతో పోలీసులు కొడుకు, కోడలిని అదుపులోకి తీసుకొని విచారించడంతో విషయం బయటపడింది. ఆస్తి కోసం అమ్మను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని భార్య ఆమెతో వచ్చిన శివతో కలిసి హత్య చేసినట్లు అనిల్ పోలీసులకు తెలిపాడు దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
నెల్లూరు జిల్లా, గుడ్లూరు (మం) మాచర్ల వద్ద జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీ కొట్టిన TSRTC బస్సు ఒకరు మృతి, 7గురి పరిస్థితి విషమం. మృతి చెందిన వ్యక్తి బస్ డ్రైవర్ వినోద్ గా గుర్తింపు. మిర్యాలగూడ నుండి తిరుపతి వెళ్తున్న TSRTC బస్సు. క్షతగాత్రులను కావలి ఏరియా వైద్యశాల లో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలింపు. ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్న పోలీసులు.
తిరుపతి, ఉమ్మడి నెల్లూరు జిల్లా, గూడూరు జిల్లాలో పలుచోట్ల ఉద్రిక్తత అర్ధరాత్రి మున్సిపల్ కార్మికుల బైటాయింపు. కార్మికులు సమ్మెలో ఉండగా పర్మనెంట్, ప్రైవేట్ కార్మికులతో అర్ధరాత్రి చెత్త తీపిస్తున్న అధికారులు. అడ్డుకున్న మున్సిపల్ పారిశుధ్య ఔట్ సోర్సింగ్ సిబ్బంది. అధికారులు, పోలీసులుతో పారిశుద్ధ్య కార్మికుల వాగ్వాదం. నెల్లూరు నగరంలోనూ ఇదే పరిస్థితి. రోజు రోజుకూ ఉధృతం అవుతున్న కార్మికుల సమ్మె.
అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. సమ్మె పై ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించిన ప్రభుత్వం. అత్యవసర సర్వీస్ లు క్రిందకు తీసుకొస్తూ GO జారీ. ఆరు నెలలు పాటు సమ్మె నిషేధం. అత్యవసర సర్వీస్ లు క్రిందకు రాని అంగన్వాడీల సేవలు. పౌష్టికాహారం సరఫరా చేసే ప్రక్రియ దృష్యా అత్యవసర సర్వీస్ ల క్రిందకు తీసుకువచ్చిన ప్రభుత్వం. GO నంబర్ 2 ను విడుదల చేసిన ప్రభుత్వం.
మందస మండలం రట్టిలో ఎలుగు బంటి సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. రట్టి గ్రామానికి సమీపంలోని తోటలో అలజడి చేసిన ఎలుగుబంటిని చూసిన గ్రామస్తులు భయబ్రాంతులకు గురయ్యారు. రట్టిలో ఆహార అన్వేషణ కోసం ఎలుగుబంటి పుట్టను త్రవ్వి హల్ చల్ చేసింది. అటు ఇటు తిరుగుతూ కాసేపు చక్కర్లు కొట్టిన ఎలుగుబంటి నెమ్మదిగా జారుకుని సమీపంలోని జీడి తోటల్లోకి పారిపోయింది. రట్టి సమీపంలోని కొండల నుంచి ఎలుగు బంట్లు గ్రామాల్లోకి చొరబడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అటవీశాఖ అధికారులు స్పందించి భల్లూకాలు జనవాసాల్లోకి రాకుండా శాశ్వత చర్యలు తీసుకొని ఎలుగుబంట్ల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
గుంటూరు ఎంపీ ఎన్నికల బరిలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నియామకం చేసేందుకు వైసీపీ కసరత్తు. ఎంపీ మార్పు పై ఆసక్తి చూపని నరసరావు పేట పార్లమెంట్ ఎమ్మెల్యేలు. నరసరావు పేట ఎంపీ స్థానాన్ని బిసి వర్గాలకి ఇస్తే అన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించవచ్చని వైసీపీ అధిష్టానం యోచన. సీఎం జగన్ మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరిన ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు. నరసరావు పేట పార్లమెంట్ లో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు. గుంటూరు పార్లమెంట్ కి వస్తే తాడికొండ, మంగళగిరి లాంటి నియోజకవర్గాల్లో అసంతృప్తి సెగ తగులుతుందని ఎంపీ ఆలోచన. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు ఎలాంటి మార్పు జరుగుతుందా అని వైసీపీ కింది స్థాయి నేతల్లో ఆసక్తి నెలకొంది.




Total views : 92253