కేశినేని రాజీనామా నేపద్యంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన PVP. ట్విట్టర్ లో నాని రాజీనామా పోస్ట్ ను షేర్ చేస్తూ విమర్శలు చేసిన పీవీపీ. కేశినేని నాని పిప్పళ్ల బస్తా, బెజవాడకే గుదిబండలా తయారయ్యావు. ఏదో మచ్చేసుకుని పుట్టావు, పార్టీలో పదేళ్లు బండి కొనసాగించావు. బ్యాంకులను బాదావు, జనాలని ఉద్యోగులని పీల్చి పిప్పి చేశావు. ఇకనైనా ఒట్టిమాటలు కట్టి పెట్టి, అన్ని మూసుకొని మూలపడుండు పుండాకోర్.!! అంటూ తీవ్ర స్దాయిలో విమర్శలు గుప్పించిన పీవీపీ. 2019 ఎన్నికల్లో నానిపై పోటి చేసిన పీవీపీ. వైసీపిలో పీవీపి కొనసాగనప్పటికి ఐదేళ్లుగా నాని విషయంలో మాత్రం విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు.
health news
జీడిపప్పు అనేది డ్రై ఫ్రూట్, ఇది కొలెస్ట్రాల్‌ను పెంచని ఆహారం. సాధారణంగా జంతు ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే జీడిపప్పులో మాత్రం జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. జీడిపప్పు చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్‌డిఎల్‌ను తగ్గించడమే కాకుండా, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులను కూడా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీడిపప్పు మొక్కల ఆధారిత ఆహారం. జీడిపప్పులో ఉండే కొవ్వులో ఎక్కువ భాగం స్టెరిక్ యాసిడ్ నుండి వస్తుందని, ఇది రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ పై ఎటువంటి ప్రభావం చూపదని అనేక పరిశోధనలలో నిరూపించారు. రోజుకు గుప్పెడు జీడిపప్పులు తినడం వల్ల గుండెకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అమరావతి, గుంటూరు – విజయవాడ వారధిపై హిట్ అండ్ రన్. స్కూటీ పై వెళ్తున్న మహిళలను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదంలో ఇద్దరు మహిళలు స్పాట్ డెడ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కృష్ణ లంక పోలీసులు. గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన మహిళలుగా గుర్తింపు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు. గుంటూరు నుండి విజయవాడ వస్తుండగా ప్రమాదం. ఢీ కొట్టిన వాహనం కోసం సీసి కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులు.
కడప జిల్లా, కాజీపేటలో 300 కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశం లోకి చేరిక. వైకాపా ఎంపీటీసీ చంద్ర భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు టీడీపీ ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో టీడీపీలోకి చేరికలు. సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి కావాలని సొంత పార్టీ ఎంపీటీసీ అడిగితె సస్పెండ్ చేసిన ఘనత వైకాపా కు చెందుతుంది. వైకాపా ఎంపీటీసీనే చేరుతున్నారంటే వారి అరాచకం అర్ధం అవుతుంది. రాష్ట్రానికి అభివృద్ధి కావాలి సంక్షేమం కాదు. అభివృద్ధి లేకుండా సంక్షేమం పనికిరాదు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని రాత్రికి రాత్రే అరెస్టు చేస్తారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది. నియంత పాలన ఎక్కువ రోజులు ఉండదు. మైదుకూరు శాసనసభ్యులు రఘురామిరెడ్డి కి దోచుకోవడం తప్పితే అభివృద్ధి చేయడం తెలియదు. శాసనసభ్యుడు రఘురామిరెడ్డికి సంక్షేమానికి, అభివృద్ధికి తేడా కూడా తెలియదు. తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యం అని వైకాపా నుంచి తెలుగుదేశం లోకి చేరుతున్నారు. తెలుగుదేశం లోకి స్వచ్ఛంగా చేరుతున్న వైసీపీ పార్టీ అధికార నాయకులు. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. కాజీపేట మండలం అభివృద్ధిలో వెనకబడి ఉంది అని వెల్లడించారు.
రాత్రివేళల్లో చాలా మంది ఎక్కువగా తింటారు. తిన్న వెంటనే పడుకుంటారు. దీనివల్ల తొందరగా బరువు పెరుగుతారు. కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవాళ్లు రాత్రి సమయంలో మితంగా తినాలి. అన్నం బదులు స్నాక్స్ వంటివి తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. డైటింగ్ చేస్తున్నప్పుడు సలాడ్స్, పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి ఆకలి నియంత్రిస్తాయి. పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. వీటిలో అధిక కేలరీలు ఉంటాయి. కాబట్టి పండ్లను ఎక్కువగా తినాలి. నెమ్మదిగా తినడం, ఎక్కువగా నమిలి తినడం వంటివి అలవాటు చేసుకోవాలి. ఫోన్ మాట్లాడుతూ టీవీ చూస్తూ తినడం వల్ల ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. కాబట్టి ఆ అలవాట్లకు దూరంగా ఉండాలి. పండ్లు, ఆకుకూరలు తినడం మంచిదే. అలా అని ఎక్కువ తిన్నా కూడా తొందరగా బరువు పెరుగుతారు. ఎప్పుడూ 20 శాతం కడుపు ఖాళీగా ఉంచుకునేలా చూసుకోవాలి. ముఖ్యంగా త్వరగా జీర్ణమయ్యే పండ్లను తీసుకోవడం ఉత్తమం. అరటి పండ్లు తొందరగా జీర్ణమవుతాయి. కాబట్టి బరువు పెరిగే అవకాశమే ఉండదు. అలాగే దోసకాయ, క్యారెట్, బీట్రూట్ వంటివి తినడం కూడా మంచిది. వీటితో పాటు శనిగలు తీసుకోవడం కూడా ఉత్తమమే. వీటిలోకార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లతో పాటు బీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియకు బాగా సహకరించి బరువును తగ్గిస్తాయి.
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని పేదలు, అట్టడుగువర్గాలకు కరుణతో సేవ చేయాలనే ఆయన సందేశం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. బీజేపీ ఉంగుటూరు అసెంబ్లీ కన్వీనర్ శరణాల మాలతీరాణి ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో ఏర్పాటుచేసిన భారతీయ జనసంఘ్ సహవ్యవస్థాపకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిశోర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ రూపొందించిన అంత్యోదయ సిద్ధాంతాన్ని ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి భారతీ పవర్ తెలుగు ప్రసంగం ఆకట్టుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ విగ్రహాన్ని చెక్కిన వారు, ఏర్పాటు చేసిన వారు, ఆవిష్కరించిన వారు మహిళలే కావడం గర్వంగా ఉందన్నారు. సర్పంచి రాంధే లక్ష్మీసునీత, మహిళామోర్చా రాష్ట్రాధ్యక్షురాలు నిర్మలా కుమారి, మైనార్టీమోర్చా రాష్ట్రాధ్యక్షుడు బాజీ, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని పొత్తులపై వివరాలు కోరగా అతిత్వరలో వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
విజయవాడ, టీడీపీకి గుడ్ బై చెప్పిన విజయవాడ ఎంపీ కేశినేని నాని. త్వరలో టీడీపీకి రాజీనామా చేయనున్న ఎంపీ కేశినేని నాని. ఫేస్ బుక్ పోస్ట్, ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించిన కేశినేని నాని. తెలుగుదేశం పార్టీకి నా అవసరం లేదని చంద్రబాబు భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని నా భావన. త్వరలో ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ ను కలిసి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా. ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తా.
ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట మండలం, జాతీయ రహదారి 65 మీద గరికపాడు చెక్ పోస్ట్ వద్ద 69 లక్షల 98వేలు నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పోలీసులు సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ వైపు నుండి బస్ లో విజయవాడ వైపుకు వెళ్తున్న గుడ్లవల్లేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద నుండి భారీ మొత్తంలో నగదు స్వాధీనం. ఎటువంటి ఆధారాలు లేని నగదుగా గుర్తించి కేసు నమోదు చేసిన చిల్లకల్లు పి.ఎస్ సబ్-ఇన్స్పెక్టర్ కృష్ణబాబు.
అనంతపురం జిల్లా గుత్తి మండలంలో కీచక యోగా టీచర్ ను గురువారం గుత్తి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పి నర్సింగప్ప వెల్లడించారు. డిఎస్పీ మాట్లాడుతూ…. గుత్తి మండలం తొండపాడు గ్రామంలోని జడ్పీహెచ్ స్కూల్ నందు ఔట్ సోర్సింగ్ పై యోగా టీచర్ గా పని చేస్తున్న అనిల్ కుమార్ రెడ్డి అదే స్కూల్లో చదివే ఓ మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి నమ్మించి బాలిక ఇంటిలోని బంగారు నగలు తెప్పించుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెంట తీసుకొని పోయి శారీరకంగా అనుభవించి తిరిగి గుత్తికి తీసుకొచ్చి వదిలేసి తనకు బంగారం ఇచ్చినట్లు గాని, శారీరకంగా కలిసినట్లు గాని, ప్రేమ విషయం గానీ, ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఇతనిపై గతంలో 2019వ సంవత్సరంలో ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా రేప్ కేసులో నిందితుడు నిందితుడిగా ఉంటూ ఆ కేసులో కోర్టు వాయిదాలకు హాజరవుతున్నాడు. అయితే గత నెల 25 నుంచి బాలిక కనపడకపోవడంతో తల్లిదండ్రులు గుత్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి అనుమానంతో పాఠశాలలో పనిచేసే యోగా టీచర్ అనిల్ కుమార్ రెడ్డిని విచారణ చేయగా ఈ భాగోతం బయటపడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు యోగా టీచర్ అనిల్ కుమార్ రెడ్డిపై IPC 366, 344, 376,406,మరియు ఫోక్సో ఆక్ట్ 5,6 సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. అతని వద్ద నుంచి ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. అనంతరం ముద్దాయిని కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు.
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు కంచరకుంట్ల రాజు (40) అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం మతిస్థిమితం కోల్పోయి కొంచెం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వాడు. గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమీపాన మతి స్థిమితం కోల్పోయి కన్నతల్లిని గొడ్డలితో విచక్షణా రహితంగా నరికి చంపాడు. దీంతో పక్కింట్లో ఉండే మహిళ అడ్డుపడ గా మహిళ తల పై గొడ్డలితో నరకడంతో చుట్టుపక్కల వారు కొన ఊపిరితో ఉన్న మహిళను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రాజు స్థానికుల నుండి తప్పించుకొని గొడ్డలితో ఊరందరిని చంపేస్తా అంటూ పారిపోయి ఒంటరిగా ఉన్న వారి పై దాడి చేయడానికి ప్రయత్నిస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి రాజు కోసం గ్రామంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒంటరిగా ఎవరు బయటకు రావద్దని గ్రామస్తులను పోలీసులు హెచ్చరించారు. దీంతో తిరుమలగిరి గ్రామం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై, విషాదఛాయలు అలుముకున్నాయి.



Total views : 92173