కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, 53 మద్యం సీసాలను, 5 లక్షల 50 వేలు నగదును స్వాధీనం చేసుకున్న గన్నవరం పోలీసులు. సాధారణ తనిఖీలలో భాగంగా గన్నవరం మండలం కేసరపల్లి- సవారిగూడెం జంక్షన్ వద్ద వాహనాలు చెకింగ్ లో భాగంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న గన్నవరం పోలీసులు. వారి వద్ద నుండి 53 మద్యం సీసాలను 5 లక్షల 50 వేలు నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గన్నవరం పోలీసులు.
health news
ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో పురుగుమందు సేవించి తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కి చెందిన కొప్పుల విజయభారతి (35), కొప్పుల శ్రీనిధి (13)గా గుర్తింపు. స్థానికుల సమాచారంతో చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి తరలింపు. పురుగుమందు సేవించిన తల్లీకూతుళ్ల ఆరోగ్యం పరిస్థితి విషమం. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చలికాలంలో ఈ రేగు పండు ఎంతో మేలు చేస్తుంది. రేగుపండ్లు పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరడం కామన్ పుల్లగా, తియ్యగా ఉంటాయి. వాతావరణంలో మార్పు వల్ల కలిగే ఇంఫెక్షన్స్ ను ఇది అడ్డుకుంటుంది. జలుబు, దగ్గు, జ్వరముతో అంటూ ఉండే వారికి రేగు పండు చాలా ఉపశమనాన్ని ఇస్తుందని అంటున్నారు నిపుణులు. రేగు పండ్లులో పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, ఐరన్, జింక్ పోషకాల్ని కలిగివుంటాయి. ఈ మినరల్స్ మన గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. రక్తంలో కీలకమైన హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం. రక్త ప్రసరణ సాఫీగా సాగాలంటే రేగు పండ్లు మన శరీరానికి అవసరం. ఎనీమియాగా పిలిచే రక్త హీనత సమస్య నుంచీ మనల్ని కాపాడతాయి రేగు పండ్లు. ఎముకల్ని బలహీన పరిచే ఆర్థరైటిస్ సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే, వారికి ఈ పండ్లు తినిపించడం సరైన పరిష్కారం. ఎండిన రేగు పండ్లలో కాల్షియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లు తింటే మంచిది వీటిలోని యాంటీ-ఇన్ఫామేటరీ గుణాలు కీళ్ల మంటల్ని చల్లబరుస్తాయి. పొట్టలో గ్యాస్ వంటి సమస్యలు ఉంటే రేగు పండ్లు తినడం మంచిది. కొంతమందికి ఎంత ట్రైచేసినా నిద్రపట్టదు. చివరకు నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటారు. అలాంటి వారికి సరైన పండ్రు రేగు పండ్లు. తేలిగ్గా జీర్ణమయ్యే ఈ పండ్లు ఎక్కువ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలతో మన శరీరం జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. రేగులో యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు వుండటం వల్ల ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా కాపాడుతుంది. ఆకలి లేమి, రక్తహీనత, నీరసం, గొంతునొప్పి వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ పండ్లు రక్తాన్ని శుభ్రం చేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగటానికి కూడా బాగా సహాయపడతాయి.
Read Also..
Read Also..
ఆరోగ్యకరమైన కంటి చూపు, చర్మం మరియు రోగనిరోధక పనితీరును నిర్వహించడానికి విటమిన్ ఎ అవసరం. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో మరియు బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి బలమైన ఎముకలు మరియు దంతాలను నిర్వహించడానికి, అలాగే రోగనిరోధక పనితీరుకు మరియు గుండె జబ్బులు, మధుమేహం మరియు మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ముఖ్యమైనది. విటమిన్ ఇ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది ఆక్సీకరణ నష్టం మరియు వాపు నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఈ రెండూ క్యాన్సర్ మరియు గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దోహద పడుతాయి. విటమిన్ K రక్తం గడ్డకట్టడం మరియు ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనది. ఇది గుండె జబ్బుల నుండి రక్షించడంలో కూడా సహాయపడుతుంది. ఈ ముఖ్యమైన విటమిన్లతో పాటు, నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉన్న ఒకషార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు గట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బ్యూట్రిక్ యాసిడ్ పెద్దప్రేగులో ఫైబర్‌ను పులియబెట్టినప్పుడు గట్ బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాపును తగ్గిస్తుంది మరియు కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. నెయ్యి లాక్టోస్ లేని మరియు పాల రహితమైనది. ఇది లాక్టోస్ తినడానికి ఇష్టపడని లేదా పాలు అలెర్జీ ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే నెయ్యి తయారీ ప్రక్రియలో పాలు ఘనపదార్థాలు మరియు నీరు తొలగిపోతాయి. స్వచ్ఛమైన వెన్న కొవ్వు మాత్రమే మిగిలిపోతుంది.
లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దగ్గుకు సహజమైన మందు లవంగం, శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. తేనె, కొన్ని చుక్కల లవంగాల నూనెను గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. తులసి, పుదీనా, లవంగాలు, యాలకుల మిశ్రమంతో టీ చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. ఆహారం సరిగా జీర్ణం కాకపోయినా, వాంతులు వచ్చినా లవంగాల నూనెను తీసుకుంటే ఉపశమనం ఉంటుంది. వాతావరణం మార్పు వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మందులా పని చేస్తుంది. ఆహారంలో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది.
Read Also..
Read Also..
కాకినాడ, సీఎం వీడియో కాన్ఫరెన్స్ కి దూరంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు. సెక్రటేరియట్ నుంచి పాల్గొన్న సీఎం జగన్. జనవరి నెలలో అమలు చేసే పధకాలకి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి దాడిశెట్టి రాజా. పిఠాపురం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొన్న ఎమ్మెల్యే దొరబాబు కి పిఠాపురం సీటు నిరాకరించిన సీఎం, అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ సొంత వర్గాన్ని మెయింటైన్ చేస్తున్న దొరబాబు. అధికారులు నుంచి సమాచారం వచ్చిన స్పందించని ఎమ్మెల్యే.
విజయనగరం జిల్లా,
స్నేహితులతో కలిసి అరకు విహారయాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డ యువకుడు. కొత్తవలస – అరకు ప్రధాన రహదారిలో నిమ్మలపాలెం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం జిల్లా మింది గ్రామానికి చెందిన యువకుడు తేజ (23) మృతి చెందాడు. స్నేహితులతో కలిసి అరకు విహారయాత్రను ముగించుకొని తిరిగి వస్తుండగా నిమ్మలపాలెం గ్రామం వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న వ్యానును బలంగా ఢీకొనడం వల్ల సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు ప్రయాణం చేస్తున్న మరొక యువకుడు భాను తీవ్రంగా గాయపడటంతో 108 అంబులెన్స్ లో పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
పల్నాడు జిల్లా, సత్తెనపల్లి శరభయ్య హైస్కూల్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న, జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్. జాయింట్ కలెక్టర్ బౌలింగ్ చేయగా బ్యాటింగ్ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ. క్రీడాకారులతో ఆడుకుందాం ఆంధ్ర గురించి అడిగి తెలుసుకున్న పి.ఎస్. క్రికెట్ ను వీక్షించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ, జాయింట్ కలెక్టర్.
అన్నమయ్య జిల్లా, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి గ్రామాలలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ కు రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ రెండు గ్రామాల క్రికెట్ జట్లు కెప్టెన్లకు ఒక్కొక్కరికి రూ 10 వేలు చొప్పున రూ 20 వేలు క్రికెట్ కిట్టు కొనుగోలు కోసం చెక్కు అందజేశారు. యువత శక్తివంతంగా ఎదగాలి, యువతతోనే దేశంలో మార్పు సాధ్యం అని ఆయన వెల్లడించారు. యువత క్రీడారంగం, రాజకీయ రంగమే కాక అన్ని రంగాలలోనూ రాణించి శక్తివంతంగా ఎదిగి దేశ అభ్యున్నతి కోసం పాటుపడాలని అన్నారు. వీరబల్లి మండలానికి చెందిన ఈడిగ పల్లె, వడ్డిపల్లె గ్రామాల యువకుల కోరిక మేరకు క్రికెట్ కిట్టు కొనుగోలు కోసం చెక్కు అందజేశారు.
అనంతరం జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలు, చదువు పట్ల మక్కువ పెంచుకొని, ప్రతి దినము వ్యాయామం చేస్తూ శరీరాన్ని ఆరోగ్యంగా, సౌష్టవంగా ఉంచుకోవాలని సూచించారు. యువత మంచిగా ఉంటే దేశం బాగుపడుతుందని ఆయన తెలిపారు.
ఎన్నికల వేళ నేతలు వెదజల్లే డబ్బులు కోసం ఆశ పడకుండా, మీ భవిష్యత్తు బాగుండాలి అంటే వచ్చిన నాయకులను, అధికారులను రోడ్లు, పారిశుద్ధ్యం, మంచినీటి వసతి వంటి అభివృద్ధి పనుల కోసం అధికారులను, నేతలను నిలదీయాలని అన్నారు. గ్రామ గ్రామాన ఇందుకోసం యువత నడుం బిగించాలని, అప్పుడే దేశం సమగ్రాభివృద్ధి చెందుతుందని తెలిపారు. రానున్న ఎన్నికలలో టిడిపి, జనసేన కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన చేనేత వికాస రాష్ట్ర కార్యదర్శి రాటాల రామయ్య, శ్రీనివాసులు, చౌడయ్య, కొత్తూరు వీరయ్య ఆచారి,కత్తి సుబ్బరాయుడు, పోలిశెట్టి రజిత, శిరీష, వీరబల్లి మండలం వడ్డీ పల్లె క్రికెట్ జట్టు కెప్టెన్ బాలచంద్ర, ఈడిగపల్లె జట్టు కెప్టెన్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి ఇళ్ల స్థలాలు కేటాయింపు సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి చైర్మన్ గారు మాట్లాడుతూ సరిగ్గా 17 ఏళ్ల క్రితం దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటయింపు చేశాం. కార్మిక పక్ష పాతిగా, ఉద్యోగ పక్ష పాతి గా మేము ఉన్నాము, ప్రతి ఒక్క ఉద్యోగికి ఇళ్ళ స్థలాలు కేటాయింపు చేయాలి అని సీఎం జగన్ అన్నారు అన్నట్టుగానే ఇళ్ళ స్థలాలు కేటాయింపు చేశాం. నాకు అత్యంత ఇష్టమైన పని టిటిడి ఉద్యోగులకు ఇళ్లు పట్టాలు ఇవ్వడం, సంతోషం గా ఉంది అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు అని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు చేయాలని సీఎం చెప్పారు, మొత్తం ఏడు వందల ఎకరాలు పై చిలుకు టిటిడి ఉద్యోగులకు కేటాయింపు చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి, వీటికి 80 కోట్లు కేటాయింపు చేశారు. విమర్శలు చేస్తున్నా మమ్మల్ని పడదోయాలనీ కుట్రలు చేసినా మేము కార్మికులు, అణగారిన వర్గాల ప్రజలకు అండగా ఉంటాం. బాధ్యతతో చేసిన పనే తప్ప , వేరే ఉద్దేశ్యం లేదు. శ్రామిక వర్గం పక్షాన నిలబడి ఈరోజు ఇళ్లు స్థలాలు కేటాయింపు చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. పోటు కార్మికులకు 10వేలు జీతం పెంచాం, వాహన బేరర్లు ను స్కిల్డ్ లేబర్ గా గుర్తింపు చేశాం. 415 ఎకరాలు పాధిరేడు అరణ్యం వద్ద టిటిడి ఉధ్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు. ఏర్పేడు వద్ద 350 రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు.



Total views : 92154