అనంతపురం జిల్లా కంబదురు ములకనూరు 2 అంగన్వాడీ లో గర్భవతులకు బాలింతలకు కు పెట్టే పౌష్టికాహారం పక్కదారి. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న గ్రామస్తులు. సిడిపిఓ సమాచారం ఇవ్వడంతో ఆమె వెళ్లి తనిఖీ చేశారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం ములకనూరులోని అంగన్వాడీ కేంద్రం – 2 లో అంగన్వాడీ సిబ్బంది పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టించినదని రెడ్ హ్యాండెడ్ గా గ్రామస్తులు పట్టుకున్నారు. అయితే అంగన్వాడీలు సమ్మె బాట పట్టిన సమయంలో జరిగిందా ఇప్పుడు జరిగిందా అనే అనుమాలు వ్యక్తమవుతున్నాయి. అంగన్వాడి సెంటర్ కు చెందిన టాయిలెట్ గదిలో దాచిన ఐదు కేజీల గల పది ప్యాకెట్లు బియ్యం, 20 ఆయిల్, గోధుమ పిండి, 10 ప్యాకేట్లు కందిబ్యాగులు, ఈ నెల పంపిణీ చేయాల్సిన పౌష్టికాహారాన్ని టాయిలెట్ గదిలో దాచడంతో గ్రామస్తులు తాళాలు పగలగొట్టి అందులో లభ్యమైన పౌష్టికాహారాన్ని బయట పెట్టి గుట్టు రట్టు చేశారు. సిడిపిఓ పక్కదారి పట్టించిన అంగన్వాడి సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
health news
గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. పల్నాడు జిల్లా గురజాలలో 12వ వార్డు కౌన్సిలర్ మహంకాళి నీలం రాజు తో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కాల్ సంభాషణ సీవీఆర్ న్యూస్ లో ప్రచురించడంతో వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. నేను ఎవరిని బెదిరించలేదు, మందలించాను అంతే అని ఎమ్మెల్యే కాసు తెలిపారు. రాజకీయాల్లో పార్టీలు మారడం సర్వసాధారణం అని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేసి వెళ్లిపోయారు అది తప్పేం కాదని, మీరు పోవాలంటే పోండి కానీ రాజీనామా చేసి వెళ్ళండి అది ఏవరైనా కానీ అని స్పష్టం చేశారు. ఒక్కడు పార్టీ నుంచి వెళ్తే 10 మంది నాయకులను జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తారని అని అన్నారు.
బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం సుగ్గ లంక గ్రామంలో ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయి నిరాశలైన వారికి వేమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పసుపులేటి రామకృష్ణ తన వంతు ఆర్థిక సహాయం కింద 5000 రూపాయలు నిత్యావసర సరుకులు. ఒక రైస్ బ్యాగ్ అందజేశారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఏ శ్రీనివాసరావు పోలీస్ సిబ్బంది వీఆర్వో సర్పంచ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా C I మాట్లాడుతూ పెద్ద వయసులో ఉన్న వారిని వారి కుమారులు, కుమార్తెలు జాగ్రత్తగా చూసుకోవాలని గ్యాస్ బండ లీక్ అవటంతో గ్యాస్ బండ ఒక్కసారిగా పేలిపోయింది గ్యాస్ వాడే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని పెద్ద వయసు తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత కుమారులపై ఉందని ప్రతి పేదవాడికి సహాయం అందించే విషయంలో ముందుంటారని ఆపదలో ఉన్నవారికి ఒకరికి ఒకరు సహాయం తీసుకోవాలని గ్రామస్తులకు పలు సూచనలు ఇచ్చారు.
కొత్తపేట మండలం పలివెల గ్రామం చౌదరిపురం సత్తెమ్మ తల్లి గుడి వద్ద రోడ్డు పై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఇరువురు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం ఆచంటకు చెందిన ఆటో డ్రైవర్ బండి మోషే రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు కు చెందిన చీమల మాధవరావు మోటార్ సైకిల్ పై వస్తుండగా ఇరువురు ఎదురెదురుగా ఆటో, బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే ఇరువురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చీమల నరసింహారావు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె రాబోయే 2024 ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యం అంటున్న జయచంద్ర రెడ్డి. పి.టీ.ఎం మండలం లో ఎలక్షన్ల హడావిడి నెలకొంది ప్రచారంలో తెలుగుదేశం పార్టీ తరఫున ముందున్న జయ చంద్రారెడ్డి. తంబళ్లపల్లి నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడమే తమ లక్ష్యం అంటున్న జయచంద్రారెడ్డి. నియోజకవర్గంలోని పెద్దతిప్ప సముద్రం మండలంలోని పలు గ్రామాలలో విస్తృత పర్యటన చేసిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త దాసిరిపల్లి జయచంద్ర రెడ్డి మండలంలోని టీ.సదుం పంచాయతీ పాపాగ్ని నది ఒడ్డున వెలసిన సంగమేశ్వర స్వామి ఆలయంలో , చెన్నారాయనపల్లి వద్ద ఉన్న చౌడేశ్వరి దేవి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం టి.సదుం పంచాయతీ నవాబు కోట,బెట్టకొండ, గ్రామాల్లో పర్యటించి ఎన్నికల పరిచయ కార్యక్రమాల్లో ముందున్న జయచంద్ర రెడ్డి. అనంతరం జయచంద్రారెడ్డి మాట్లాడుతూ తంబళ్ళపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలంటే టీడీపీ ప్రభుత్వంతోనే సుసాధ్యతమని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్ అండ్ బి రోడ్లను వేయకుండా గతంలో నిధులు మంజూరు చేసిన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రోడ్లను వేసి మేమే అభివృద్ధి చేశామని చెప్పుకోవడం హాస్యాస్పదమని తెలిపిన జయచంద్ర రెడ్డి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి నియోజకవర్గంలో పారిశ్రామిక కారిడారును ఏర్పాటు చేసి యువతకు ఉపాధి చేకూర్చాలని తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న జయ చంద్రారెడ్డి.
విజయవాడ, డీఆర్ఎం విజయవాడ రైల్వే డివిజన్ గోదావరి ఎక్స్‌ప్రెస్ కు 50 సంవత్సరాలు నిండటంతో రాత్రికి 11గంటలకు గోదావరి ఎక్స్‌ప్రెస్ వద్ద సంబరాలు. గోదావరి ఎక్సప్రెస్ వెళ్ళే అన్ని ప్రధాన స్టేషన్లలో సంబరాలు. గోదావరి ఎక్సప్రెస్ ఒక సెంటిమెంట్ కొందరు ప్యాసింజర్లకు విజయవాడ మధురానగర్ అండర్ పాస్ కు అప్రోచ్ రోడ్డు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వాల్సి ఉంది. నాలుగు లైన్లను అభివృద్ధి చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఏపీకి గణనీయమైన రైల్వే బడ్జెట్ ను ఈ సారి ఏర్పాటు చేసింది కేంద్రం.
విజయనగరం జిల్లా, కొత్తవలసలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించిన నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి. కొత్తవలస మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గురువారం కొత్తవలస మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు & టీడీపీ బీసీ సెల్ ముఖ్య నాయకులతో కలిసి శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ & మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గారు మాట్లాడుతూ బీసీలను అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అని, అందుకు వారందరినీ ఏకం చేయడమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేయడానికి తెలుగుదేశం పార్టీ ఈ జయహో బీసీ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. బీసీలకు వెన్నుదన్నుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు ఉంటారని, వారి నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు, ఆదరణ పథకాలు, బీసీ కార్పొరేషన్ రుణాలు, సబ్ ప్లాన్ నిధులు, బీసీ భవనాలు, విదేశీ విద్య, స్కిల్ డెవలప్మెంట్, ఎన్టీఆర్ విద్యోన్నతి, బీసీ కులగణన, నామినేటెడ్ పదవులు వంటి అన్ని అవకాశాలు దక్కుతాయని అన్నారు. అంతేకాకుండా విద్యార్థి, విద్యార్థులకు విద్యారంగంలోనూ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, సామాజిక ఎదుగుదల, బలహీన బడుగు వర్గాలన్నీటికి రాజకీయ పురోభివృద్ధి, ఆర్థిక ఎదుగుదల వంటివి కూడా ఉంటుందని తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం గోకవరం లో ఆసక్తికరం గా మారిన వైసీపీ నేతల వరుస ఆత్మీయ సమావేశాలు. జగ్గంపేట కొత్త ఇంచార్జ్ గా తోట నరసింహం వచ్చాక, స్థానిక వైసీపీ నేతలతో సమన్వయం లేకపోవడంతో కేడర్ లో అసహనం వ్యక్తం చేస్తున్న నేతలు. మరో పక్క నియోజకవర్గం లో రోజు రోజుకు టీడీపీ లోకి పార్టీ కండువాలతో తమ వైపు మార్చుకుంటున్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. వైసీపీ ఇంచార్జ్ గా తోట నరసింహం వచ్చినప్పటికీ టీడీపీ లోకి కేడర్ మారిపోతుండడంతో ఏమి చేయాలో తెలియక తికమక పడుతున్నామంతున్న నియోజకవర్గ వైసీపీ నేతలు. మరోపక్క ఎమ్మెల్యే గా ఉన్న జ్యోతుల చంటిబాబు కు మళ్ళీ వైసీపీ లో ఇంటిలిజెన్స్ వర్గాల రిపోర్ట్ ల ద్వారా మళ్ళీ అవకాశాలు ఉన్నాయని వస్తున్న వార్తలతో చంటిబాబు అనుచరుల్లో నూతన ఉత్సాహంగా కలిసి పనిచేస్తామంటున్న స్థానిక నేతలు. నియోజకవర్గ పరిధిలోని మండల కేడర్ నేతలతో ఆత్మీయ సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడంతో అనూహ్య గా మారుతున్న రాజకీయం. చంటిబాబు కు మళ్ళీ అవకాశాలు ఉన్నాయని పుకార్లు తో వైసీపీ లో ఇంచార్జ్ గా ఉన్న నేతల మధ్య, టిడిపి నేతలు మధ్య మొదలైన గుబులు. గోకవరం లో స్థానిక జడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్ నివాసం వద్ద తన అనుచరులతో చంటిబాబు వర్గం కార్యకర్తలు తో అత్యవసర భేటి.
మునగాకు నీరు ఒక అద్భుతమైన ఆరోగ్య పానీయం. ఇది పోషకాలతో నిండి ఉంటుంది మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగాకు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు…
మునగాకు నీరు విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. మునగాకు నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మునగాకు నీరు జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది, ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది. మునగాకు నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. మునగాకు నీరు ఐరన్‌కు మంచి మూలం. ఇది రక్తహీనత రాకుండా చేస్తుంది. మునగాకు నీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచివి.
మునగాకు నీళ్ళు ఎలా తయారు చేయాలి:
- ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ మునగాకు పొడి వేసి మరిగించాలి.
- మరిగిన తర్వాత వడకట్టి, చల్లబడిన తర్వాత తాగాలి.
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు మండలం ఆకునూరు లో వైఎస్సార్ ఆసరా ద్వారా లబ్ది పొందిన 3296 మందికి రూ.3.12 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి జోగి రమేష్. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. వైఎస్సార్ ఆసరా ను మహిళలు పండగలా జరుపుకుంటున్నారు. జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. అవ్వా తాతలకు గడప వద్దకే పెన్షన్ అందిస్తున్నాం. 2019 లో ఇచ్చిన అన్ని హామీలు జగన్ అమలు చేశారు. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి .. కట్టిస్తున్నాం. జగన్ చెప్పాడంటే… చేస్తాడంతే.. నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారాయి. విద్య కు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మరు. ఎన్టీఆర్ ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయం అని అన్నారు.




Total views : 92600