హైదరాబాద్, ఉప్పల్ పీస్ పరిధి పరిసర ప్రాంతాల్లో 100కు పైగా సైకిళ్లు ఇతర సామాగ్రి చోరి చేసిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఇళ్లలోకి దర్జాగా గేటు తీసుకొని ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు. దొంగతనానికి పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరలొ రికార్డ్ అయ్యాయి. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్న ఉప్పల్ పోలీసులు.
Health
ఏలూరు, దెందులూరు(Dendulur)లో నేడు సిద్దం బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్. సిద్దం సభ(Siddam Sabha)కు భారీ ఏర్పాట్లు చేసిన వైసీపీ శ్రేణులు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్న సభ. సీఎం జగన్మోహన్ రెడ్డితోపాటు సభకు హాజరుకానున్న వైసీపీ ముఖ్యనేతలు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 50 నియోజకవర్గాల నుండి లక్షలాదిగా హాజరుకానున్న పార్టీ శ్రేణులు. రానున్న ఎన్నికల్లో వైసీపీ మరొకసారి అధికారం చేపట్టేందుకు కార్యకర్తలకు సిద్ధం సభ ద్వారా దిశ నిర్దేశం చేయనున్న సీఎం జగన్. చెన్నై, కలకత్తా జాతీయ రహదారికి ఆనుకుని సభ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను దారి మళ్ళించిన పోలీసులు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నేడు తిరుమలలో ధార్మిక సదస్సు, దాదాపు 57 మంది పాల్గోననున్న మఠాది పతులు, పీఠాధిపతులు. హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ నిర్వహిస్తున్న సదస్సు. గతంలో టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఒకసారి సదస్సు నిర్వహణ. మరలా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్‌గా రెండవసారి ఈ సదస్సు నిర్వహణ. తిరుమల లోని ఆస్థాన మండపం లో సదస్సు నిర్వహణ. సదస్సులో పాల్గొని మాట్లాడనున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి.
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి ఈరోజు అనగా న విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి వారు శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారు శ్రీ అమ్మవారి ఆలయంనకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామీజీ వారితో పాటుగా గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయశాఖ సలహాదారు శ్రీ జ్వాలాపురం శ్రీకాంత్ గారు విచ్చేశారు. అనంతరం స్వామిజి వారు శ్రీ అమ్మవారిని దర్శనము చేసుకొని, పూజలు నిర్వహించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము ఆలయ వేద పండితులు, అర్చకుల వారు స్వామీజీ వారికి వేదస్వస్తి పలికారు. అనంతరం ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు గారు, అధికారులు స్వామీజీ వారికి శ్రీ అమ్మవారి ప్రసాదములు, పండ్లు సమర్పించగా, స్వామీజీ వారు అందరికీ అనుగ్రహభాషణము చేశారు.
కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం, కోడి పందాల నిర్వహించే వారిపై కూచిపూడి పోలీసులు దాడి. చిన్నముతేవి గ్రామం నుండి అయ్యంకి గ్రామం వైపు వెళ్ళు కాలువ గట్టుపై కొంతమంది వ్యక్తులు కోడిపందాలు నిర్వహిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు. 15 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2 కోళ్ళు, 23,200/-రూపాయల నగదు, 6 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కూచిపూడి ఎస్సై సందీప్. కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా జూద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, పెనమలూరు మండలం చోడవరంలో అర్ధరాత్రి అక్రమ ఇసుక క్వారీల తవ్వకాలు అడ్డుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్. ఇది మంత్రి జోగి రమేష్ అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు అంటూ క్వారీలో బైఠాయించిన బోడె. నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోనే మంత్రి జోగి రమేష్ ఇసుక దందా చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదని అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చోడవరం క్వారీలో ఆందోళనకు దిగారు. పెనమలూరు నియోజకవర్గం చోడవరం క్వారీ లో జరుగుతున్న అక్రమ ఇసుక దందాను బయటపెట్టేందుకు పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శుక్రవారం అర్ధరాత్రి క్వారీలో పరిశీలనకు వెళ్లారు. అయితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన జెసి కేసి కంపెనీ కాకుండా అక్రమంగా మరో రెండు చోట్ల ఇసుకను లోడ్ చేస్తున్నారు. ఒకటి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ది కాగా, మరొకటి వైసీపీ పార్టీకి చెందిన రెడ్డిదని స్థానికులు చెప్పారు. బోడె ప్రసాద్ రాకను గమనించిన జోగి రమేష్ అనుచరులు పరారయ్యారు వారితో పాటు పొక్లైన్ ఆపరేటర్లు ఇతర సిబ్బంది కూడా పరారయ్యారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు తెలియజేసిన ఎవరు స్పందించలేదని, పొంతన లేని సమాధానం చెబుతున్నారని బోడె ప్రసాద్ మీడియాకు తెలిపారు. మంత్రి జోగి రమేష్ పెనమలూరు సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించి వారం గడవకముందే ఇసుక దందాకు తెర లేపారని ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని బోడె ప్రసాద్ కోరారు. అక్రమ మైనింగ్ అడ్డుకోవలసిన అధికారులే అండగా నిలబడటం దారుణమని ఇక్కడ అక్రమ మైనింగ్ ను నివారించే వరకు వారిని విడిచిపెట్టేది లేదని బోడె ప్రసాద్ స్పష్టం చేశారు.
విశాఖ, మధురవాడలో కొమ్మాదిలో mro దారుణం హత్య. కొమ్మది చరణ్ క్యాస్టల్ లో సంచలన రేపిన ఘటన. రూరల్ తహశీల్దార్ సనపల రమణయ్య పై హత్య చేసిన దుండగులు. గుర్తు తెలియని నలుగురు ఇంట్లో చొరబడి రాడ్ లతో దాడి. అక్కడక్కడే కుప్పకూలిన తహసీల్దార్ రమణయ్య. ప్రాణప్రాయం స్థితిలో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తహశీల్దార్ మృతి. ఘటన స్థలానికి క్షుణ్ణంగా పరిశీలించిన సిపి రవిశంకర్ ఆయన్నర్. నిందితులు కోసం పోలీసులు గాలింపు. ఘటన పై జిల్లా కలెక్టర్ సీరియస్…
దానిమ్మ తొక్క(pomegranate peel) లో ఉన్న ఔషధగుణాలు:
దానిమ్మ తొక్కలో ఉన్న ఔషధగుణాలు తెలిస్తే ఇకపై తొక్కను పడేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఇంతకీ దానిమ్మ తొక్కతో కలిగే లాభాలేంటో తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం…
దానిమ్మ తొక్క(pomegranate peel)ను ఎండబెట్టి పొడి చేసి దాన్ని కాస్త నీటిలో కలిపి పేస్ట్‌లా చేసుకొని దాంతో దంతాలను తొముకోవాలి. ఇలా చేస్తే పళ్లు తెల్లగా, దృఢంగా మారతాయి. అంతేకాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. అలాగే పొడిని నీటిలో కలిపి పుక్కిలిస్తే గొంతు గరగర వంటి సమస్యలు దూరమవుతాయి.
దానిమ్మ తొక్కలను వేడి నీటిలో నానబెట్టి ఆ నీటిని కషాయంలా తాగాలి దీంతో కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. అంతేకాకుండా వీటిలో ఉండే ఔషధ గుణాల వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకి వెళ్లిపోతాయి. మహిళలు. పీరియడ్స్ టైమ్‌లో కడుపులో నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి సమయంలో దానిమ్మపండు తొక్కల్ని ఎండబెట్టి చేసిన పొడిని గ్లాస్ వాటర్‌లో ఓ టేబుల్ స్పూన్ వేసి కలిపి తాగించాలి. అది రక్తం పోకుండా ఆపుతుంది.
పైల్స్ సమస్య వేధిస్తున్న వారు ఎండిపోయిన దానిమ్మ తొక్కల్ని పొడి చేసి అందులో బెల్లం కలిపి మళ్లీ గ్రైండ్ చేసి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని రోజూ వాడుతూ ఉంటే పైల్స్ సమస్య మటుమాయం అవుతుంది. అలాగే కడుపులో నొప్పిని కూడా తగ్గిస్తుంది.
దానిమ్మ తొక్కలు అతిసారం సమయంలో రక్తస్రావం ఆపడానికి మరియు జీర్ణక్రియ మెరుగుపరచడానికి,పేగు వాపు తగ్గించడానికి,హెమోర్హోయిడ్స్ యొక్క వాపు,పేగు లైనింగ్ పట్టుకు సహాయపడుతుంది. గొంతులో టాన్సిల్స్ సమస్యలు, గుండె జబ్బులు, శరీరం నుంచి చెడు వాసనలు, దగ్గు, బ్లీడింగ్ వంటి వాటికి దానిమ్మ తొక్కల పొడి బాగా పనిచేస్తుంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Read more: తొక్కే కదా అని పడేస్తున్నారా..! ఇవి తెలిస్తే షాక్ అవుతారు- యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడుతున్నారా? జర జాగ్రత్త…by Prakashయాంటీ బయాటిక్స్ ఓవర్ ద కౌంటర్ | Antibiotics యాంటీ బయాటిక్స్(Antibiotics) అందుబాటులో ఉండడంతో ప్రజలు కామన్ కోల్డ్‌కి కూడా యంటీ బయాటిక్ వేసేసుకుంటున్నారు, లైవ్ స్టాక్‌కి ఇంజెక్ట్ చేస్తున్నారు. కొన్ని హాస్పిటల్స్‌లో సరైన ప్రొసీజర్, పరిశుభ్రత ఉండడం లేదు. ఇవన్నీ…
- పనస పండు.. పోషకాలు మెండు…by Prakashపనస ఆరోగ్యానికి భరోసా(jackfruit)… పనసపండు, దీనిని “జాక్‌ఫ్రూట్”(jackfruit) అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పండుగా గుర్తించబడుతుంది, ఒక్కో పండు 100 పౌండ్ల బరువు వరకు ఉంటుంది. పనసపండు చాలా పోషకమైనది, దీనిలో ప్రయోజనాలు మనకు తెలియక దూరంగా పెడుతుంటాం.…
- ఈ చిట్కాలతో సన్ స్ట్రోక్ కి బై బై చెప్పండి..by Prakashసన్ స్ట్రోక్, హీట్ స్ట్రోక్ లేదా వడదెబ్బ అంటే… | Sun Stroke or Heat Stroke బయట ఎండలు మండిపోతున్నాయ్ సన్ స్ట్రోక్ | హీట్ స్ట్రోక్ | వడదెబ్బ పేరు ఏదైనా దెబ్బ మాత్రం ఒక్కటే ! వేసవి…
మునగాకు నీరు ఒక అద్భుతమైన ఆరోగ్య పానీయం. ఇది పోషకాలతో నిండి ఉంటుంది మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగాకు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు…
మునగాకు నీరు విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. మునగాకు నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మునగాకు నీరు జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది, ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది. మునగాకు నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. మునగాకు నీరు ఐరన్‌కు మంచి మూలం. ఇది రక్తహీనత రాకుండా చేస్తుంది. మునగాకు నీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచివి.
మునగాకు నీళ్ళు ఎలా తయారు చేయాలి:
- ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ మునగాకు పొడి వేసి మరిగించాలి.
- మరిగిన తర్వాత వడకట్టి, చల్లబడిన తర్వాత తాగాలి.
మీ వేలు గోర్లు చిన్నవిగా కనిపించవచ్చు, కానీ అవి 32 రకాల బ్యాక్టీరియాలను కలిగి ఉంటుంది. ఈ బ్యాక్టీరియాల నుండి విముక్తి పొందాలనుకుంటున్నారా..? చింతించకండి, చాలా బ్యాక్టీరియాలు హానిచేయవు. కానీ కొన్ని ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. కాబట్టి మీ గోర్లను శుభ్రంగా ఉంచడం ముఖ్యం!
గోర్లను శుభ్రంగా ఉంచే కొన్ని చిట్కాలు :
- తరచుగా మీ చేతులు కడుక్కోండి. ముఖ్యంగా బాత్రూమ్ని ఉపయోగించిన తర్వాత, తినడానికి ముందు మరియు మురికిగా ఉన్నవస్తువు ఏదైనా తాకిన తర్వాత చేతులు కడుక్కోండి. మీ గోళ్లను శుభ్రంగా ఉంచండి.
- గోళ్ల బ్రష్‌తో వాటిని స్క్రబ్ చేయండి మరియు సబ్బు మరియు నీటితో కడిగి గోళ్లను శుభ్రం చేయండి. మీ గోళ్లను కొరకకండి. ఇది బ్యాక్టీరియాను మీ నోటిలోకి తీసుకువెళుతుంది.
- మీ గోళ్ల కింద చర్మం చిట్లకుండా జాగ్రత్త వహించండి. ఇది బ్యాక్టీరియా ప్రవేశించడానికి మార్గాన్ని సృష్టిస్తుంది. మీకు గోళ్ల ఇన్ఫెక్షన్ ఉంటే, వైద్యుడిని సంప్రదించండి. కానీ చింతించకండి, మీ గోర్లను శుభ్రంగా ఉంచడం ద్వారా, మీరు చాలా ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. కాబట్టి వెంటనే మీ గోర్లను స్క్రబ్ చేయండి!