కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో స్కూల్ బస్ ను లారీ ఢీ కొట్టడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. రెబ్బన మండలం ఇంద్రానగర్ జాతీయ రహదారిపై స్కూల్ బస్ ను లారీ ఢీ కొట్టింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును లారీ ఢీ కొనడంతో బస్సులో ఉన్న విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఒక ప్రైవేట్ స్కూల్ కు చెందిన బస్ 30 మంది పిల్లలతో వెళ్తున్న క్రమంలో, కొండపల్లి గ్రామంలో కొంత మంది పిల్లలను దింపాల్సి ఉండటంతో రాంగ్ రూట్ లో వెళ్లారు. దీంతో ఎదురుగా వస్తున్న లారీ – బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు గాయాలయ్యాయి. కొంతమంది విద్యార్థులను కాగజ్ నగర్ కు, మరికొంతమంది విద్యార్థులను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. బస్ డ్రైవర్ రాంగ్ రూట్ లో రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
international news
కరీంనగర్ రవాణా శాఖ కార్యాలయంలో ఉన్న చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ పేరును ప్రభుత్వం మార్చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. గత ప్రభుత్వం 2019 లో చిల్డ్రన్స్ పార్క్ కి కృష్ణమనేని వెంకట్రామారావు ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ గా పేరు పెట్టి జీవోను జారీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ పేరును మార్చుతూ రవాణా శాఖ లో జీవో ను జారీ చేసింది. జువ్వాడి చొక్కా రావు ట్రాఫిక్ అవేర్నెస్ పార్కుగా మార్పు చేసింది.
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలులోని బంధువుల స్వగృహానికి మిజోరాం రాష్ట్ర గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు, దంపతులు కుటుంబ సమేతంగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల సమయంలో విచ్చేశారు. నిడుబ్రోలు చేరుకున్న మిజోరాం రాష్ట్ర గవర్నర్ డా.కంభంపాటి హరిబాబును గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి పి.శ్రీఖర్, గుంటూరు వెస్ట్ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి, పొన్నూరు మండల తహశీల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్, పొన్నూరు మునిసిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ లు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నిడుబ్రోలులో బంధువులు ఇంటిలో గడిపిన డాక్టర్ కంభంపాటి హరిబాబు సాయంత్రం 6:00 గంటల సమయంలో తిరిగి విజయవాడకు ప్రయాణమయ్యారు.
అన్నమయ్య జిల్లా, సివిఆర్ న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన పలువురు నేతలు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోనీ పలువురు ప్రముఖులు తమ కార్యాలయాలలో 2024 సివిఅర్ న్యూస్ ఛానెల్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించి సివిఆర్ న్యూస్ వీక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుంటూ, నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తూ ప్రజల ఆధారభిమానాలు పొందుతూ ఇలాగే కొనసాగాలి అన్నారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో విరజిల్లాలని వారు ఆకాంక్షించారు. ఆవిష్కరించిన ప్రముఖులు టిటిడి పాలక మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు, వైసిపి విభాగం మైనార్టీ జిల్లా అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, వైకాపా సీనియర్ నాయకులు,మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి, ప్రతిభా జూనియర్ కళాశాల కరస్పాండెంట్ అరమాటి శివగంగి రెడ్డి,తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు బోనమాల ఖాదర్ వలీ, అన్నమయ్య కన్స్ట్రక్షన్ అరమాటి జంగం రెడ్డి.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం మున్సిపాలిటీ కార్మికుల బిక్షాటన. గత 15రోజుల నుండి ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు దేవాభక్తుని నాగబాబు మద్దతు పలికారు. ఈ సందర్భంగా నాగబాబు
పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం మాట్లాడుతూ గత 15 రోజులుగా జరుగుతున్న సమ్మెకు ప్రభుత్వం ఇకనైనా స్పందించి పారిశుద్ధ్య కార్మికుల న్యాయ పరమైన కోరికలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.సి.పి.ఐ.యు నాయకులు గొల్లపూడి ప్రసాద్, జనసేన నాయకులు సిరిపురం సురేష్, దారపురెడ్డి నాగభూషణం, ధనుంజయ్, తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ, ఎలక్షన్ కమిషన్ ను కలవకుండా నన్ను అడ్డుకుంటున్నారు. ఊరు పేరు లేని పార్టీకి సమయం ఇచ్చారు. పవన్, షర్మిల కంటే ఎక్కువ ఓట్లు తెలంగాణ లో నా పార్టీ కి వచ్చాయి. ఎపిలో పోటీ చేస్తున్నాం అడ్డుకుంటామంటే మీ పప్పులు ఉడకవు. మార్చిలో ఎన్నికలు వద్దు చివరి లో పెట్టమన్నాం. ఎలక్షన్ అవ్వగానే ఓట్లు లెక్కించండి అని డిమాండ్ చేస్తున్నా. రెండు కులాలు, రెండు కుటుంబాలేనా మనల్ని నడిపేది. నా పోరాటం ఆగదు నేను ఇక్కడే ధర్నాకు దిగతా. సౌత్, తెలుగు సత్తా మోదీకి చూపుదాం. బాబు రావాలంటే జాబు రావాలి అని గతంలో నువ్వే కదా అన్నావ్, ఏం జాబులిచ్చావు. ప్రజాస్వామ్యం కోసం పోరాడుదాం అని కేఏ పాల్ అన్నారు.
విజయవాడ, కేంద్ర ఎన్నికల చీఫ్ రాజీవ్ కుమార్ ని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చివరి దశలో పెట్టాలని కోరాను. ఎన్నికల రోజే రిజల్ట్ కూడా ప్రకటించాలి. కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు అవసరం. కాపులందరూ బయటకు రావాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కి నా పర్సనల్ రిక్వెస్ట్ వంగవీటి రంగాని చంపిన పార్టీతో కలవద్దు. నా ఆరోగ్యం బాగానే ఉంది. నా మీద విష ప్రయోగం చేసినా దేవుని కృపతో వైద్యుల సహాయంతో బయటపడ్డాను. నా మీద విష ప్రయోగానికి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను.
విజయవాడ, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్. 18వేల కోట్ల రూపాయల ఉద్యోగులు, ఉపాధ్యాయుల సొమ్ము ప్రభుత్వం వారి సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ చలో విజయవాడకు పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయుల నిర్భంధం. విజయవాడ యూటీఎఫ్ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులను యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో నిర్భంధించిన పోలీసులు. నిరసన తెలిపి తీరుతామంటున్న ఉపాధ్యాయులు. ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్న పోలీసులు. లెనిన్ సెంటర్, ధర్నా చౌక్ ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఉపాధ్యాయులు అరెస్టు.
అనంతపురం, గుత్తి పట్టణంలో ఎస్మా చట్టాన్ని రద్దు చేసి అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో చేపట్టిన సిపిఐ నాయకులు మరియు అంగన్వాడీ వర్కర్లు. రాస్తారోకో ను అడ్డుకున్న పోలీసులు. సిపిఐ నాయకులను మరియు అంగన్వాడిని వర్కర్ లను పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.



Total views : 92152