ఢిల్లీలో మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మూడు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం లభించింది. బయో ఈ-3 విజ్ఞాన్ ధార పథకం. 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్ షిప్ పథకానికి కేంద్ర మంత్రి మండలి పచ్చజెండా ఊపింది. క్యాబినెట్ భేటీపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. బయో మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం నూతనంగా బయో ఈ-3 కార్యాచరణను తీసుకువస్తోందని వివరించారు. త్వరలో బయో విప్లవం రానుందని, బయో సైన్స్ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఇకసైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, ఆవిష్కరణలు, టెక్నాలజీ వృద్ధి వంటి విభాగాలను ‘విజ్ఞాన్ ధార’ పథకంలో సమ్మిళితం చేశారని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 11 ,12 తరగతి విద్యార్థులకు ఇంటర్న్ షిప్11, 12వ తరగతి చదివే విద్యార్థులకు కొత్తగా ఇంటర్న్ షిప్ ఉంటుందని, దీనికి కేంద్రం ఆమోదం లభించిందని తెలిపారు. ఉద్యోగులకు సామాజిక భద్రతను అందించే ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 90724