రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే డిశంబర్ 27 న నిర్వహించాలని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టియుసి) కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు సిద్దంశెట్టి రాజమౌళి, ప్రధాన కార్యదర్శి కాంపెల్లి సమ్మయ్యలు కోరారు. మంగళవారం పట్టణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పని చేసిన కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేలా, ఐఎన్టియుసిని అబాసు పాలు చేసేలా, ఎన్నికలు వాయిదా వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఐఎన్టీయూసీ కి మద్దతు ఇవ్వడం లేదనే చేస్తున్న ప్రచారం అసత్యమని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కేంద్ర కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి, ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షుడు రాంశెట్టి నరేందర్, ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య, నాయకులు మిట్ట సూర్యనారాయణ పాల్గొన్నారు.
INTUC
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు రోజులు అవ్వకముందే సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి డేట్ ఫిక్స్ అయ్యింది. సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ ప్రక్రియ చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అది పోస్ట్ పోన్ చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో డిప్యూటీ లేబర్ కమిషనర్ సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు సమక్షంలో జరిగిన సమావేశంలో టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, విప్లవ కార్మిక సంఘాలైన ఐఎఫ్టీయూ, ఇతర సంఘాల నాయకులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించి ఏకాభిప్రాయానికి రావడంతో 27న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికుల ఓటరు లిస్ట్‌ను ఎన్నికల అధికారి కార్మిక సంఘాల నాయకులకు అందజేశారు.





Total views : 77957