అక్రమంగా తరలిస్తున్న, దాచిన 18.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని చింతలపాలెం మండలంలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన జగన్నాథం శ్రీనివాసరావు చింతలపాలెం మండలం దొండపాడులో మూడు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ప్యాసింజర్ ఆటోలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కునికిపాడుకి చెందిన బండారుపల్లి రామాంజనేయులుకు పంపుతుండగా.. చింతలపాలెం మండలం దొండపాడులోని బొమ్మల సెంటర్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కునికిపాడులోని రామాంజనేయులుకు చెందిన కోళ్ల ఫాంని సోదా చేయగా సుమారు 12.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం లభించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.జనసేన అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన మంగళగిరి కార్యాలయంలో జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కావాలని తాను పార్టీ పెట్టలేదని తెలిపారు. తెలంగాణలో మొదలైన జనసేన ప్రస్థానం కేరళతో పాటు…
- మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడుపై హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా నెల్లూరులో మూడు రోజుల పాటు నిర్వహించాలని భావించిన మహానాడును ఇప్పుడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మే…
- భోజ్శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పుమధ్యప్రదేశ్లో భోజ్ శాల ఆలయ కేసులో కీలక తీర్పు వెలువడింది. వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. అక్కడ సరస్వతిదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి హైకోర్టు సూచన చేసింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తుశాఖ అధీనంలోకి…
- మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..మంచిర్యాల జిల్లావ్యాప్తంగా అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో గోరక్షక్ సభ్యులతో డీసీపీ ఏ. భాస్కర్ ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. చట్టప్రకారం ఆవులు, దూడలను వధించడం పూర్తిగా…
- నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం పాటిస్తున్నాడు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. మోదీ, చంద్రబాబు పిలుపునిచ్చిన పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు సందేశాలను ఆచరణలో చూపిస్తున్నారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా దూసుకుపోతున్న ఎమ్మెల్యే… ఖర్చు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 78272