జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తమ పార్టీ చిత్తశుద్ధి తో పనిచేస్తున్నామని చెపుతున్న సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహం సాక్షీగా మరో మోసానికి తెరతీశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, బహుజనులపై దాడులు చేస్తు అంబేద్కర్ విగ్రహం సాక్షీగా దళితులపై ముసలి కన్నీరు కారుస్తున్నారు. అంబేద్కర్ విదేశి విద్య పేరును మార్చి జగన్ పేరు పెట్టుకున్నారు. దళితులకు పధకాలు రద్దు చేసి వారికి రూ 30 వేల కోట్లు కేటాయించకుండా మెండి చెయ్యి చూపారు. నవరత్నాల వలన దళిత బహుజనులకు ఏటువంటి మేలు జరగలేదు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెట్టి నగరంలో దశాబ్ధాలుగా ఉంటున్న పేద దళిత, ఇతర బలహీన వర్గాల కుటుంబాలని నగరానికి దూరంగా పంపిన దళిత ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రతిదినం సామాజిక మోసానికి పాల్పాడేది వైకాపా ప్రభుత్వం కాదా.. సామాన్యుల గొంతుక అంబేద్కర్ అని చెప్పిన సీఎం జగన్ ఏపీలో ఎవరైనా గొంతు ఎత్తితే గొంతు కోసే సంస్కృతి మీ పరిపాలనలో జరగటం లేదా.. గొంతు ఎంతిన వారి గొంతు కోసే ఫ్యాక్షన్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి ది.. అంటరాని తనం గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి దళిత యువకుడిని చంపిన ఎమ్ ఎల్ సీ అనంతబాబు ను ప్రక్కన పెట్టుకొని దళితులకి ఏం సందేశం ఇస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం సాక్షీగా రాజకీయాలు మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదు. మాయ మాటలతో దళితులను కుటిల రాజకీయాలతో బానిసలుగా మార్చలనే వైకాపా ప్రభుత్వానికి రాబోయో రోజుల్లో చావుదెబ్బ తప్పదు. రాజధాని ప్రాంతంలో దళిత పేదలకు పట్టాలు పంపిణీ చేసినట్లు పైకి చెప్తు లోపల వైకాపా కార్యకర్తలకు పంపిణీ చేశారు. దళితులపై వాళ్ళ మారిన ప్రేమ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ నగరంలో గాని, ఎన్టీఆర్ జిల్లాలో గాని దళిత సామాజిక వర్గానికి చెందిన వైకాపా నాయకులకు ఎవరికైనా నామినేటెడ్ పదవులు ఇచ్చారేమో శ్వేతపత్రం విడుదల చేయాలి.
krishna district news
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అణగారిన వర్గాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాటు పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజల బాగు కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే జగన్మోహన్ రెడ్డి 100 రెట్లు కష్ట పడుతున్నాడు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పని జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఒకప్పుడు ఊరి చివర ఉండే బాబాసాహెబ్ అంబేద్కర్ ను రాష్ట్రం నడిబొడ్డులో నిలబెట్టాడు. ల్యాండ్ పూలింగ్ అంటూ చంద్రబాబు అమరావతి రైతులని దోచుకున్నాడు. టెంపరరీ అసెంబ్లీ, సెక్రటేరియట్ అంటూ చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చల్లపల్లి మండలం వక్కలగడ్డలో ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అధికారుల తీరు రైతులను అవమానపరిచేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొన్న వెంటనే సొమ్ము చెల్లించాలని, బాధ్యత సక్రమంగా నిర్వహించని అధికారులను, సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు రోడ్డుపై రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోవటంతో చల్లపల్లి సీఐ నాగప్రసాద్, చల్లపల్లి, ఘంటసాల, ఎస్ఐలు చినబాబు, శ్రీనివాసు వక్కలగడ్డ చేరుకుని రైతులతో మాట్లాడి రాస్తారోకో విరమింప చేశారు. సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో చర్చించారు.
ఎప్పటి నుంచో జనసైనికులు ఊహించిందే. టీడీపీ నుంచి ఎక్కువ మంది నేతలు జనసేన పార్టీలో చేేరతారని అంచనా వేశారు. అది పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు స్ట్రాటజీ. తన పార్టీ నేతలనే పొత్తులో ఉన్న పార్టీలోకి పంపి అక్కడ టిక్కెట్లు కేటాయించి గెలిపించుకోవడం చంద్రబాబుకు ఇప్పటి నుంచి కాదు.. ఎప్పటి నుంచో చేస్తున్న పనే. అదే విషయాన్ని అనేక మంది సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను చెప్పారు. అయితే ఇప్పటి వరకూ అలాంటి చేరికలు లేకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇక టీడీపీ నేతలు జనసేనలోకి వరస పెడుతుండటంతో జనసైనికుల అనుమానం నిజంగా మారనుంది. పొత్తు ధర్మంలో భాగంగా జనసేన ఈసారి ఎక్కువ స్థానాలను కోరే అవకాశముంది. చంద్రబాబుకు కూడా ఈ ఎన్నికలు అసవరం కావడంతో పవన్ కల్యాణ్ కు అడిగినన్ని కాకపోయినా.. హర్ట్ కాకుండా మెరుగైన సంఖ్యలోనే చంద్రబాబు సీట్లను ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా ఉన్న నేతల సీట్లు కూడా పొత్తులో భాగంగా కోల్పోయే అవకాశముంది. ఇది గ్రహించిన నేతలు కొందరు టీడీపీలో ఉంటే సీట్లు రావని, జనసేనలో చేరి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా అమాయకంగా వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తుండటంతో ఆశ్చర్యపోవడం జనసైనికుల వంతయింది. నిన్న మాగంటి బాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఆయన ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి కానీ, కైకలూరు శాసనసభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ టీడీపీలో ఉంటే సీటు రాదేమోనని భావించి మాగంటి బాబు పవన్ పంచన చేరారు. ఆయన జనసేనలో చేరి ఈ రెండు స్థానాల్లో ఒకచోట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే బూరగడ్డ వేదవ్యాస్ కూడా అంతే. ఆయన పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. టీడీపీలో సీటు డౌట్ కొట్టడంతో ఆయన పవన్ ను కలిశారన్న ప్రచారం పెద్దయెత్తున జరుగుతుంది. అయితే మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా చేరిక కోసమే వారు జనసేన కార్యాలయానికి వచ్చారని అంటున్నారు. ఇన్నాళ్లూ ఏం చేశారు?నిజంగా జనసేన మీద ప్రేమ ఉంటే ఇన్ని రోజులు ఏం చేశారన్న ప్రశ్నను సోషల్ మీడియాలో జనసైనికులు వేస్తున్నారు. ఎన్నికల ముందు చేరుతున్నారంటే వీరిని టీడీపీ నేతలుగానే చూడాల్సి ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే పవన్ కల్యాణ్ రాజకీయానికి భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవన్న హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అయినా వస్తున్న నేతలను కాదనలేని పరిస్థితి పవన్ కల్యాణ్‌ది. టీడీపీ నుంచి వచ్చిన నేతలకు ఆయన టిక్కెట్లు ఇస్తారా? లేక పక్కన పెడతారా? అన్నది ఇంకా నిర్ణయం కాకపోయినా టీడీపీ నుంచి నేతల వలసలు పెద్దయెత్తున సాగుతాయన్న ప్రచారానికి ఇది అద్దం పడుతుందనే కామెంట్స్ మాత్రం ఎక్కువగా వినపడుతున్నాయి.
పట్టణంలోని యాదవ్ బజార్ లో రూ.60 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా స్ట్రోమ్ వాటర్ డ్రైనేజ్ – జగనన్న వాక్ వే ను నిర్మించారు. పాత బస్టాండ్ సమీపంలో రూ.22 లక్షల అంచనా వ్యయంతో ఆధునికరించిన బాబు జగ్జీవన్ రామ్ భవన్ ను మంత్రి జోగి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని అన్నారు. నేను వైసిపి పెనమలూరు అభ్యర్థిని నా మీద ఎవరు పోటీ చేసినా నేను సిద్ధమేనని, పెడన నియోజకవర్గ ఉప్పాల రాముకు నేను పూర్తిగా సహకరిస్తానని అన్నారు. కేశినేని నాని మా పార్టీలోకి వస్తాను అనడంతో అతన్ని పార్టీలోకి ఆహ్వానించామని, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించామని ఆయన అక్కడ గెలవబోతున్నారని అన్నారు. నా నియోజకవర్గం మైలవరం 2009లో రాజశేఖర్ రెడ్డి గారు పెడనలో పోటీ చేయమన్నారు అప్పుడు అక్కడ పోటీ చేశాను. 2014లో జగన్మోహన్ రెడ్డి మైలవరం నియోజకవర్గంలో పోటీ చేయమన్నారు అప్పుడు అక్కడ పోటీ చేశాను. 2019లో మరల పెడన నియోజకవర్గంలో పోటీ చేయమన్నారు మళ్ళి అక్కడ పోటీ చేశాను. ఇప్పుడు పెనమలూరులో పోటీ చేయమంటున్నారు అలానే ఇప్పుడు అక్కడ పోటీ చేస్తాను. జగన్ ఎలా చెప్తే అలా నేను పని చేస్తానని, ఆయన మాటను నేను శిరసా వహిస్తానని ఆయన అన్నారు.
దేశంలోని ప్రధాన నగరాలను వెనక్కి నెట్టి, పరిశుభ్రమైన నగరాల్లో 3వ స్థానంలో నిలిచిన విజయవాడలో నేటి పరిస్థితి భిన్నంగా ఉంది. విజయవాడలోని ప్రధాన కూడలి అయిన బెంజ్ సర్కిల్ వద్ద పరిస్థితి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ సమీపంలో ఉండే ఒక వైన్ షాప్ వద్ద మందుబాబులు చేసే హల్చల్ వర్ణనాతీతం. నిత్యం వేల మంది విద్యార్థులు, ఉద్యోగస్తులు అటుగా వెళుతుంటారు. ఈ వైన్ షాప్ వద్ద మాత్రం నిబంధనలకు విరుద్ధంగా మద్యం సేవిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు వేస్తూ చెత్త కుండీలు గా మార్చేశారు. నడి రోడ్డుపైనే మద్యం సేవిస్తూ, గొడవలు పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. దీంతో స్థానికులు అధికారులు వెంటనే స్పందించి.. తమ సమస్యలను తీర్చాలంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
జగనన్న మా జాబ్ క్యాలెండర్ ఎక్కడ అంటూ బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో జింఖానా గ్రౌండ్ లో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన చేపట్టిన దీక్షకు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరి లో జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగాన్ని రూపుమాపుతానన్న జగన్ హామీ సిఎం అయ్యాక ఏమైందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రాష్ట్ర యువతను పూర్తిగా విస్మరించారని, రాష్ట్రంలో యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆయన ఈ ప్రభుత్వం పై మండిపడ్డారు. యువత భవిష్యత్తు ను తాడేపల్లి ప్యాలెస్ నుంచి నాశనం చేశారని, సిఎం జగన్ నిర్వాకం వలనే ఇవాళ బిజెవైఎం నేతలు ఆమరణ నిరాహారదీక్ష కు దిగారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కి రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతుంటే కనబడటం లేదా అని ఆయన జగన్ ను ప్రశ్నించారు. డిఎస్ సి లకు నోటిఫికేషన్ లు ఇవ్వలేదని, చదువుకున్న యువత వయో పరిమితి దాటి నిరుద్యోగంతో మగ్గుతున్నారని ఆయన అన్నారు. ఉద్యోగాల కోసం 6 లక్షల మంది కి పైగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, నాలుగున్నరేళ్లలో 1345 మంది ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వమంటే వాటిని డైవర్ట్ చేయడానికే ఆడుదాం ఆంధ్రా అంటు ఆటలు ఆడుతున్నారు. కేంద్రం సహకరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం భూము లివ్వడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం భూములివ్వకపోవడం వలన ఆరు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని అన్నారు. ముఖ్యమంత్రి వాళ్ల కుటుంబీకులకు, సన్నిహితులకు పదవులిస్తూ యువత జీవితాలతో ఆటలాడుతున్నారని, ప్రభుత్వం మెడలు వంచైనా జాబ్ క్యాలెండర్ సాధిస్తామని, ముఖ్యమంత్రి తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఆయన అన్నారు.
మచిలీపట్నం పార్లమెంట్ కార్యాలయంలో జెండా ఊపి జయహో బీసీ రథాలను మాజీమంత్రి కొల్లు రవీంద్ర, మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ, తెదేపా బిసి నాయకులు ముందుకు పంపించారు. అనంతరం మాజీ మాత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలను మరోసారి చైతన్య వంతులుగా చేసేందుకే జయహో బీసీ కార్యక్రమమని ఆయన అన్నారు. జయహో బీసీ కార్యక్రమం ద్వారా రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకు చేయబోయే కార్యక్రమాలను వివరించడంతో ప్రజలు వారికి అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు. జగన్ ని తరిమికొట్టడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమని, జగన్ ఓటమికి సిద్ధమయ్యాడని అన్నారు. జగన్ చెస్ గేమ్ ఆడుతున్న అనుకుంటున్నాడు కానీ తను ఆడుతుంది వైకుంఠపాళీ అని అతనికి తెలియడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఐదేళ్ల ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పావులుగా వాడుకున్నాడని, బీసీలు పక్కన పెట్టాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగస్తులను మారుస్తున్నట్టు MLA లను పక్క నియోజకవర్గాలకు జగన్ బదిలీ చేస్తున్నాడని అన్నారు. MLA క్యాండెట్స్ మార్చడం కాదు ముందు జగన్ ని మార్చాలని, సూపర్ సిక్స్ ద్వారా ప్రజల్లోకి వెళుతున్నామని ఆయన అన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, టీడీపీ వచ్చాక మళ్ళి పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని అన్నారు. బీసీలకు జగన్ అన్ని రకాలుగా అన్యాయం చేశాడని, లక్షాధికారులను చేస్తానని చెప్పి 56 కార్పొరేషన్లు పెట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. బీసీలను దగా చేస్తున్నాడని, 300 మంది బీసీలను పొట్టన పెట్టుకున్నాడని ఆయన జగన్ పై మండిపడ్డారు. ఈ నెల 7 వ తేదీన నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తిరువూరులో రా కదలిరా అనే నినాదంతో భారీ బహిరంగ సభ జరగనున్నది. 18వ తేదీన మచిలీపట్నం పార్లమెంట్, గుడివాడ నియోజకవర్గం లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి, చిత్తజిల్లు నాగ రాము, అక్కు మహాంతి రాజా, గోపు సత్యనారాయణ, లంకె నారాయణ ప్రసాద్ , పళ్లపాటి సుబ్రమణ్యం , వూకంటి రాంబాబు, లంకే శేషగిరి, తిరుమణి నారాయణ, కాగిత గోపాలరావు, తదితర బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
దేశంలోనే మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ స్మృతివనం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అన్ని ప్రాంతాల నుంచి అంబేద్కర్ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఈ నెల 19న జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
విజయవాడలోని స్వరాజ్ మైదాన్ లో ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ స్మృతివనం, 125 అడుగుల విగ్రహాలను ఈనెల 19న ప్రారంభించనున్న నేపథ్యంలో గురువారం రాష్ట్ర సచివాలయంలో ఈ కార్యక్రమ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో నాగార్జున సమీక్షించారు. ఈ కార్యక్రమం కోసమే జనభాగీధారి పేరిట అన్ని ప్రాంతాల నుంచి జనసమీకరణ కోసం జరుగుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. దేశంలో మరెక్కడా లేనంత ఎత్తులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా స్మృతివనంలో అంబేద్కర్ జీవిత విశేషాలను తెలిపే విగ్రహాలు, చిత్రాలు, ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. స్వరాజ్ మైదానంలో రెండు దశలుగా చేపట్టిన అంబేద్కర్ స్మృతివనం పనులను తొలి దశలో రూ.268.46 కోట్లతోనూ, మలి దశలో రూ.106.64 కోట్లతోనూ చేపట్టారన్నారు. సుమారుగా రూ.400 కోట్ల తో స్మృతివనాన్ని తీర్చిదిద్దడం జరిగిందని వివరించారు. విగ్రహ నిర్మాణం ఇదివరకే పూర్తి కాగా దీనికి సంబంధించిన లైటింగ్, పెయింటింగ్ పనులు కొనసాగుతున్నాయని, మినీ థియేటర్, మ్యూజియం, స్కై లైటింగ్, ఫౌంటెన్లు, విగ్రహం ముందు, వెనుక భాగాల్లో ఉద్యానవనాలతో సుందరీకరణ, భవనాలు, ప్రహారీ గోడల నిర్మాణం, లిఫ్టులు, వెహికల్ పార్కింగ్, ఫుడ్ కోర్ట్ తదితర ప్రధానమైన పనులన్నీ దాదాపుగా పూర్తయిపోయాయని తెలిపారు. సందర్శకులకు అంబేద్కర్ చరిత్ర పూర్తిగా అవగతం కావడంతో పాటుగా ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించేలా అంబేద్కర్ స్మృతివనాన్ని తీర్చిదిద్దడం జరుగుతోందని తెలిపారు. ఈనెల 19 న జరిగే అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి దళితులు, దళిత సంఘాల నేతలతో పాటుగా అంబేద్కర్ భావ జాలాన్ని అభిమానించే వారందరూ హాజరు కావాలని నాగార్జున పిలుపునిచ్చారు. ప్రస్తుతం అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవానికి అంచనాలకు మించి ఎక్కువ సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని నాగార్జున అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన రీతిలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై. శ్రీలక్ష్మి ప్రస్తుతం చేస్తున్న ఏర్పాట్లను గురించి మంత్రికి వివరించారు. ప్రస్తుత నిర్ణీత కార్యక్రమాల్లో కొన్ని మార్పులను మంత్రి సూచించారు.
రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మాదిగ, ఉపకులాలకు 21 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని, అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు చట్టసభల్లో రాజకీయ సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 31 న ఛలో విజయవాడ యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలని AP MRPS రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఈ రోజు విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా పేరుపోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ బిజెపికి మద్దతు ఇవ్వడాన్ని తప్పు పట్టారు. మందకృష్ణ మాదిగ ప్యాకేజి స్టార్ అంటూ మండి పడ్డారు.