సాగర సంగమ క్షేత్రాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కోడూరు మండలం హంసలదీవి సాగర సంగమ క్షేత్రాన్ని మండలి బుద్ధ ప్రసాద్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్, టీడీపీ నాయకులు పరిశీలించారు. దెబ్బతిన్న భవనాలు, విగ్రహాలు, రోడ్డు పరిశీలించారు. ఈ సందర్బంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మాఘ పౌర్ణమి అంటేనే సంగమ స్నానం అని ఈ ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. ఈ నెల 24న మాఘ పౌర్ణమి స్నానాలు ఖచ్చితంగా సాగర సంగమంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో ఒక్కసారి కూడా భక్తులకు సాగర సంగమానికి అనుమతి ఇవ్వలేదన్నారు. సాగర సంగమ ప్రాశస్థ్యం తెలిసి ఆది శంకరాచార్యులు ఇక్కడ స్నానం చేశారని, గంగానది కాకి రూపంలో వచ్చి స్నానం చేసి హంస రూపం పొందిందన్నారు. శతాబ్దాలుగా దేశవ్యాప్తంగా భక్తులు మాఘ పౌర్ణమికి సాగర సంగమానికి వస్తారని, గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు మాఘ పౌర్ణమి స్నానాలు సంగమ క్షేత్రంలోనే నిర్వహించాయని గుర్తు చేశారు. గత కృష్ణా పుష్కరాలకు వేలాది మంది ప్రతి రోజు సంగమ క్షేత్రంలో స్నానాలు చేశారని, ఒక్క అవాంఛనీయ ఘటన లేకుండా బాధ్యతగా నిర్వహించామన్నారు. సంగమ క్షేత్రంలో చంద్రబాబు పుష్కర స్నానం చేసి అభివృద్ధికి సహకరించారన్నారు. ఈ క్షేత్రంలో భక్తుల కోసం రెండు భవనాలు నిర్మించి దేవతల విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు. అటవీ శాఖ అధికారులు ఈ భవనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ ప్రభుత్వం దేవుళ్ళ విగ్రహాల నిర్వహణ పట్టించుకోలేదని బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి హిందూ మనోభావాలపై విశ్వాసం ఉంటే ఖచ్చితంగా సంగమ క్షేత్రంలో నిర్వహించాలన్నారు. జగన్మోహనరెడ్డికి హిందూ మనోభావాలపై విశ్వాసం ఉంటే తక్షణమే ఏర్పాట్లు చేయాలన్నారు. లేకపోతే భక్తుల శాపాలతో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతుందన్నారు.
krishna district news
“My first vote for CBN” :
ధర్మాన్ని కాపాడే ఓటును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలనీ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ తేలిపారు. అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన “మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్”(“My first vote for CBN”) కార్యక్రమంలో బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఓటు హక్కు వచ్చిన యువతి యువకులను ఉద్దేశించి బుద్ధప్రసాద్ మాట్లాడారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం గల దేశం భారతదేశం మాత్రమేనని, అతివంటి దేశంలో మీరు వేసే ఓటు ప్రజాస్వామ్యానికి చేటు కాకూడదు అని బుద్ధప్రసాద్ అన్నారు. ఓటు వేసే ముందు ఎవరికి వేయాలి, ఎటువంటి వారికి వేయాలో ముందుగా ఆలోచించుకుని వేయాలని, మనం వేసే ఓటు చరిత్ర గతిని మారుస్తోందని అన్నారు. మన గ్రామం, మన రాష్ట్రం, మన దేశం భవిష్యత్తు మనం ఎన్నుకునే లీడర్ పైనే ఆధారపడి ఉంటుందని తెలియచేసారు. దానికోసం సరైన విజన్ గల నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. అటువంటి విజన్ గల నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమేనని అన్నారు. 78 సంవత్సరాల వయసులో కూడా యువత భవిత కోసం ఆలోచిస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
నాడు చంద్రబాబు నాయుడు విజన్ 2020 ని ప్రారంభించి రాష్ట్రానికి ఐటి కంపెనీలను తీసుకుని వచ్చారని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన అనంతరం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎన్నో పరిశ్రమలను తీసుకుని వస్తే, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన కంపెనీలను కూడా రాష్ట్రం నుండి బయటకు పంపించేసారని అన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసారని అన్నారు. కావున మొదటిసారి ఓటు హక్కుని వినియోగించుకునే ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి పథంలో నడిపిస్తారో గుర్తించి, వారికి ఓటు వేయాలని కోరారు. మొదటిసారి మీరు వేసే ఓటు రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయిస్తుందని తెలిపారు. తాను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో భారత రాష్ట్రపతి అభ్యర్థిగా డా.ఏపీజే అబ్దుల్ కలాం కి వేసిన ఓటు తనకెంతో సంతృప్తిని ఇచ్చిందని బుద్ధ ప్రసాద్ గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
కృష్ణాజిల్లా మచిలీపట్నం 600 హామీలు యిచ్చి కనబడిన ప్రతి ఊరు, జిల్లా ప్రతి కులానికి మ్యానిఫెస్టోలో పెట్టలేనివి కూడా పిట్టల దొర సామెత గా వేల సంఖ్యలో చంద్రబాబు హామీలు యిచ్చారు. ఉదాహరణకు బందరు చూసుకుంటే పోర్ట్ 6 నెలల్లో పూర్తిచేశాను అన్నాడు చేశాడా ? కనీసం పనులు అయినా మొదలు పెట్టారా… ఆక్వా హబ్ గా మచిలీపట్నం చేస్తాను అన్నాడు ఏమైంది. 3 సెంట్ల యిళ్ల స్థలాలు యిస్తనన్నాడు 3 గజాలు అయినా యిచ్చాడా… 2019 ఎన్నికల్లో హైద్రాబాద్ నుండి నిరుద్యోగులు మచిలీపట్నం వలస వస్తారు అన్నారు ఏమైంది. మచిలీపట్నానికి కాకుండా రాష్ట్రానికే కొన్ని వేల హామీలు యిచ్చేసి వాటి నీ తుంగలో తొక్కిన చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. మ్యానిఫెస్టోలో లో యిచ్చిన హామీలను కానీ, యివ్వని హామీలను సైతం నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి నీ తప్పు పడతారా. గురివింద గింజ కు క్రింద మాత్రమే నలుపు వుంటుంది ఈ రాజకీయ గురివింద చంద్రబాబు కి వళ్ళంతా మచ్చే జగన్మోహన్ రెడ్డి నీ తప్పు పట్టే అర్హత చంద్ర బాబుకు లేదు. ప్రజల్లో వున్న మాట ఏంటో తెలుసా ఎన్నికల ముందు హామి యిస్తాడు అధికారం లోకి వచ్చాక మోసం చేస్తాడు అని ప్రజల మాట..
జగన్ కంటే పెద్ద సైకో ఎంపి నాని నమ్మిన వాళ్లను ముంచే మనస్తత్వం ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తానని పైసా వసూలు తాడేపల్లి ఫ్యాలెస్, కేశినేని భవన్ వదిలి పోయేది వాళ్లే.. ఎంపి నానికి ఇవే చివరి ఎన్నికలు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే మీడియా ముందుకి బాధితులు. ఎంపి నాని టిడిపి లో వున్నప్పుడు కోవర్ట్ ఆపరేషన్స్ చేశాడు. ఒక ఉసరవెల్లిలా కోర్టు హాల్ లో వికృత చేష్టలు చేశాడు. అక్కడ జరిగే విషయాలను ఎప్పటికప్పుడు సైకో జగన్ కి ఇన్పర్మేషన్ అందించాడు. ఈ విషయం అందరికీ తెలుసు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ జరిగి జైలుకి వెళ్లినప్పుడు పూజలు చేసి లోకేష్ చేతికి రక్షా బంధనం కట్టి వచ్చిన ఈ వ్యక్తి ఈ రోజు వారి పై ఈ విధంగా మాట్లాడటానికి సిగ్గుండాలి. గత ఎన్నికల తర్వాత ఎంపి నాని ఎన్ని గ్రామాల్లో పర్యటించాడో అధిష్టానానికి ప్రజలకు తెలుసు…ఈస్ట్ విజయవాడలో, మైలవరంలో ఎమ్మెల్యే టిక్కెట్స్ ఇప్పిస్తానని చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. వీరిలో ఒక వ్యక్తి కోటి రూపాయలు ఇవ్వగా మరో వ్యక్తి నాలుగు కోట్లు ఇవ్వటం జరిగింది. ఈ ఆరాచకాలన్నీ తొందరలో బయటికి వస్తాయి. వీటికి సంబంధించిన ఆధారాలు కాల్ రికార్డ్స్ అన్నీ వున్నాయి. నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే నీకు డబ్బులు ఇచ్చిన వ్యక్తులు మీడియా ముందుకు త్వరలోనే వస్తారు..నువ్వు పెద్ద వసూలు రాజా అని ప్రజలకి అర్ధమైంది.
అవనిగడ్డ ఒకటో వార్డు నందు ఉన్న చర్చి వెనక ఆదివారం రాత్రి అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు. అదే సమయంలో బయటికి వెళ్లి వచ్చిన పాస్టర్ కు పాప ఏడుపు వినిపించి వెంటనే అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం పాపను ఉన్నత వైద్యం కోసం మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. Icds సూపర్ వైజర్ నిర్మల మాట్లాడుతూ మాకు విషయం తెలియగానే స్థానిక పోలీస్ స్టేషన్ లో జరిగిన పూర్తి సమాచారం తెలుసుకుని మా పై అధికారులు ద్వారా మచిలీపట్నం మాతా శిశు గృహంలో పసిపిల్లకి సంరక్షణ కలగజేస్తామన్నారు. ప్రస్తుతం డెలివరీ అయిన మహిళల వివరాలు అంగన్వాడీ వర్కర్లు ద్వారా చిన్నారులు సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. అవనిగడ్డ si రమేష్ మాట్లాడుతూ అర్థరాత్రి జరిగిన సంఘటన గురించి సీసీ ఫుటేజ్ ద్వారా దృశ్యాలను, సోషల్ ఇంచార్జీ ల ద్వారా వివిధ కోణాల్లో విచారణ చేస్తూన్నామన్నారు.
గుడ్లవల్లేరు మండల కేంద్రమైన గుడ్లవల్లేరు పరిధిలో నూతనంగా నిర్మించిన సచివాలయం 2, అనుబంధ RBK కేంద్రం మరియు విలేజ్ హెల్త్ క్లినిక్ లను ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం ప్రారంభించారు. తొలుత గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే కొడాలి నానికు వైసీపీ నేతలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ ప్రధాన రహదారుల్లో ర్యాలీగా పర్యటించిన ఎమ్మెల్యే కొడాలి నాని, భారతరత్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, ఆర్.సి.యం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే నాని కు వీధి వీధినా మంగళ హారతులు పూలమాలలతో గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక, ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గ ప్రజల కోసం 14 ఏళ్ల సీఎం చంద్రబాబు ఒక్క ఎకరా అయిన సేకరించారా అన్న తన ఛాలెంజ్ కు బదులు చెప్పలేని టిడిపి నేతలు, రోడ్లపై తిరుగుతూ తమ నాయకుడు మాదిరే కల్లబొల్లి మాటలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ప్రజల మంచి కోసం చేసిన కార్యక్రమాలను చూసి ప్రతి ఒక్కరు తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఉన్న బటన్లు నొక్కి వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే నాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక, ఎంపీపీ సురేష్, వైస్ ఎంపీపీ సాయన రవి, వైసీపీ నాయకులు కోటప్రోలు నాగు, పాలేటి చంటి, ఉప్పాల రాము, పడమటి సుజాత, వేమవరం కొండలమ్మ దేవస్థానం చైర్మన్ శేషం గోపి, మాజీ చైర్మన్ తాళ్లూరు మాధవ్, పిఎసిఎస్ అధ్యక్షుడు దుగ్గిరాల శేషుబాబు, వ్యవసాయ సలహా కమిటీ జిల్లా డైరెక్టర్ పెన్నేరు ప్రభాకర్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్, వైసిపి జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగు మాల కాళీ, ఎంపీటీసీ పెనుమాల పూర్ణిమ, రంగారావు, దుగ్గిరాల శేషుబాబు, డోకిపర్రు రామిరెడ్డి, వడ్లమన్నాడా గోపి, గుదే రవి, మండల పరిధిలోని వెలాధిమంది డ్వాక్రా సంఘాల మహిళలు, ప్రభుత్వ శాఖల అధికారులు, మండలంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు అభిమానులు, సచివాలయ కన్వీనర్ లు, గృహ సారధులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
విజయవాడ ఎంపీగా రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని టీడీపీ నుంచి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో కేశినేనికి అదేస్థానం నుంచి వైసీపీ తరుపున పోటీకి రెడీ అని ప్రకటనలు వచ్చాయి! అయితే తాజాగా చేయిస్తున్న సర్వేల్లో కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఈసారి విజయవాడ లోక్ సభ స్థానం నుంచి ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో బెజవాడ రాజకీయాల్లో సరికొత్త సమీకరణలు తెరపైకి వస్తున్నాయి.
గంగూరు శాఖ యూనియన్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. గంగూరు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న ప్రభావతికి భర్తతో విబేధాలున్నాయి. ఆమె స్వగ్రామం నూజి వీడు మండలం మర్రి బంధం గ్రామం, కాగా అదే గ్రామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావుకు హైదరాబాద్ లో ఉన్న బ్యాంకు ఖాతాను ప్రభావతి గంగూరు శాఖకు ట్రాన్స్ఫర్ చేయించింది. ఈ సందర్భంగా యోగేశ్వరరావు తన వద్ద ఉన్న పాత్రలు, బంగారం కోసం లాకరు అడిగాడు. ప్రభావతి లాకరులో బంగారం దాయటం కన్నా బ్యాంకు రుణం తీసుకోమని, నాకు టార్గెట్లు ఉన్నాయి అని ఆయనకు సూచించింది. దీంతో యోగేశ్వర రావు రూ.2 లక్షలు రుణం తీసుకున్నాడు. తీసుకున్న రుణాన్ని ఆయన గతేడాది నవంబరులో చెల్లించాడు. అనంతరం బ్యాంకులో తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు గురించి అడగ్గా ఆ నగలు తన వద్దనే ఉన్నాయని ప్రభావతి తెలిపింది. ఈ విషయమై గంగూరులోని తన ఇంటికి వచ్చి మాట్లాడమని కోరింది. యోగేశ్వరరావు ఆమె ఇంటికి వెళ్లి బంగారు ఆభరణా విషయమై ప్రశ్నించగా తనంటే ఇష్టమని, పెళ్లి చేసుకోమని కోరింది. బంగారు ఆభరణాలతో వడ్డాణం చేయిస్తున్నానని చెప్పింది. ఒక్కసారిగా యోగేశ్వరరావు షాక్ తిన్నాడు. ఈ ఘటనపై యోగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రమేయం లేకుండా తన సంతకాన్ని ప్రభావతి ఫోర్జరీ చేసి ఆభరణాలు కాజేసిందని పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Read Also…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
NTR జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం రంగుల మహోత్సవం 2024 సందర్భంగా పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ నందు మండల రెవెన్యూ అధికారులు, దేవాదాయ శాఖ సిబ్బంది సమక్షంలో జరిగింది. పోలీస్ వారి సమక్షంలో శ్రీ అమ్మవారు మరియు పరివార దేవతలను పెనుగంచిప్రోలు నుండి జగ్గయ్యపేట తీసుకువేళ్ళుటకు ఎద్దుల బండ్ల లక్కీ డ్రా ను చిన్న పిల్లల చేత పోలీస్ స్టేషన్ నందు నిర్వహించారు. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కోసం ఎద్దుల బండికి, బర్రెల పెద్ద వెంకయ్య గోపయ్య స్వామి కోసం ఎద్దుల బండికి కొత్తగుండ్ల అజయ్ కుమార్ ఎంపిక కాబడినారు. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయ పాలక మండలి చైర్ పర్సన్ జంగాల శ్రీనివాసరావు, ఎస్ ఐ దుర్గప్రసాద్, మండల రెవెన్యూ అధికారులు, ఆలయ అధికారులు, గ్రామానికి చెందిన ఎద్దుల బండ్ల యజమానులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆనాలోచన నిర్ణయం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. ఉయ్యూరు ఆర్టీవో కార్యాలయంలో ధాన్యం కొనుగోలు పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తో పాటు ఆర్డిఓ రాజు, ఎమ్మార్వో మస్తాన్ రావు, నగర పంచాయతీ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్ బి కే నుండి మిల్లర్లకు తరలించిన ధాన్యం రోజుల తరబడి దిగుమతి చేసుకోకుండా తేమ శాతం పేరుతో బస్తాకు 300 నుంచి 400 రూపాయలు తగ్గించి ఇస్తున్నారని దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పార్థసారథి ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని అలాగే తేమశాతం పేరుతో మిల్లర్లు రైతులను మోసగిస్తున్న అధికారులు, మంత్రులు స్పందించడం లేదని అన్నారు. పకృతి విపత్తు వల్ల ఈ సంవత్సరం కుప్పనూరుపుళ్ళు మార్చి తర్వాత కూడా జరుగుతాయని కానీ ప్రభుత్వం మార్చి తర్వాత ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసాని మాత్రం రైతులకు కల్పించడం లేదని అన్నారు. మంత్రులు ప్రతిపక్షాలను బూతులు తిట్టడమే కాదని రైతు సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని చురక అంటించారు. ఇక్కడ ధాన్యాన్ని కడప, కర్నూలు, నెల్లూరు మిల్లులకు తరలించి ఇక్కడ మిల్లర్లకు సైతం ప్రభుత్వం అన్యాయం చేస్తుందని సారధి తెలిపారు.