దేశానికి ఆదర్శంగా తెలంగాణ ముందుకెళ్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కొడంగల్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కేటీఆర్ మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది.. కరెంటు పోయిందన్నారు. కర్ణాటక రైతులు కొడంగల్ వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అక్కడి ప్రజలు చెంపలు వేసుకుంటున్నారన్నారు. తెలంగాణలో 24గంటల విద్యుత్ కాదని 5గంటలు ఇస్తామంటున్నారన్నారు. కొడంగల్ పేరును అంతర్జాతీయ స్థాయిలో చెడగొట్టిన వ్యక్తి రేవంత్‌రెడ్డిఅని విమర్శించారు. రూ.50 లక్షలతో అడ్డంగా దొరికారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని ప్రజలు గెలిపిస్తే.. కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా ప్రమోషన్ ఇప్పిస్తానన్నారు. కొడంగల్‌ను అద్భుత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం అని కేటీఆర్ అన్నారు.
Ktr
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. ఆర్మూరులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో రథం నుంచి ఆయన ముందుకు పడ్డారు. ఇదే సమయంలో వాహనంపై నుంచి సురేశ్ రెడ్డి, జీవన్ రెడ్డి నేలపై పడ్డారు. కేటీఆర్ కింద పడకుండా ఆయన గన్ మెన్లు గట్టిగా పట్టుకున్నారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓపెన్ టాప్ వాహనంపై వీరు ప్రయాణస్తుండగా వ్యాన్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడం వలన వాహనంపై ఉన్న రెయిలింగ్ ఊడిపోవడంతో వారంతా అదుపు తప్పి ముందుకు పడిపోయారు. ఈ ఘటనపై కేటీఆర్ స్పందించారు. తన ఆరోగ్యానికి ఏమి ప్రమాదం లేదని చెప్పారు. తరువాతి ర్యాలీకి కేటీఆర్ వెళ్లారు.
ఐదవ సారి నామినేషన్ దాఖలు చేశాను . రాజకీయంగా జన్మనిచ్చి విదేశాల్లో గుర్తింపు నిచ్చింది సిరిసిల్ల. సిరిసిల్ల ప్రజల ప్రజా ప్రతినిదిగా చెప్పుకోవడానికి గర్వ పడుతున్నాను. 15 ఏండ్ల గా అవినీతి రహితంగా పని చేసినం.. సిరిసిల్ల ముఖ చిత్రం మార్చిన.. పల్లెలు పచ్చ బడ్డాయి.. వ్యవసాయంలో అగ్రగామిగా ఉన్న మీ బిడ్డగా రాష్ట్ర స్థాయి లో గౌరవం పెరిగింది. అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నాను. గౌరవ ప్రదమైన మెజారిటీతో గెలిపిస్తారాని నమ్ముతున్న గులాబి దండు నాకు అండగా ఉంది. ఇంటింటికి ప్రగతి నివేదిక పంపుతున్న 55 ఎండ్లు అధికారం ఇచ్చిన ఏమీ చేయని కాంగ్రెస్ కు ఓటు వేస్తారు. సంక్షేమం అభివృద్ధి చేసిన నన్ను గెలిపిస్తారా..! ఒకే ఒక గొంతుకను అనిచి వేయాలని రాహుల్ గాంధీ వస్తున్నాడు. మనకు మనకు ఏమన్న ఉంటే మనం మనం పరిష్కరించు కుందాం. ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఒకనాటి సామంత రాజ్యంగా కావాలా.. కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా ..నీళ్ళు కావాలా.. కన్నీళ్లు కావాలా.. స్కాములు కావాలా సంబంధ వర్గాల అభ్యున్నతికి బిఆర్ఎస్ కుల మత పిచ్చి గాల్లను గెలిపిద్దమ్మ ఆలోచించండి. జిల్లా తెచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. నేతన్నల తలరాతలు మార్చాం. ప్రలోబాలకు లొంగీ పోతే ఆగం ఐతం. గతంలో తప్పు చేస్తే మళ్ళీ 50 ఎండ్లు బడపడ వలసి వస్తది. మళ్ళీ డిల్లీ మొచేతి నీళ్ళు తాగే పరిస్తితి వస్తది. సిరిసిల్ల ప్రజలు చైతన్య వంతమైన ప్రజలు. సిరిసిల్ల ప్రజల కోసం పనిచేసిన నన్ను మళ్ళీ భారీ మెజారిటీతో గేలిపిస్తారని విశ్వాసం ఉంది.
కూకట్ పల్లి నియోజకవర్గం లో మరోసారి బిఆర్ఎస్ పార్టీ గెలుపు తద్యమని అన్నారు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కేపి.హెచ్.బి డివిజన్ లోని వసంత నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ ప్రచార కార్యాలయాన్ని స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు తో కలిసి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తమకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గత పాలకుల సమయంలో కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎన్ని కష్టాలు పడ్డాము ప్రతి ఒక్కరికి తెలుసని మరల అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా కారు గుర్తుపైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ నోరు విప్పాలని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. సీఎం జగన్ గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలోని రోడ్ల గురించి పట్టించుకోలేదని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా విమర్శించారు. జగన్ పాలనపై తెలంగాణ సీఎం, మంత్రులు కూడా హేళన చేస్తున్నారన్నారు. రాష్ట్రం పరువును జగన్ రోడ్డున పడేశారని అన్నారు. ప్రజల అవస్థలను జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు.
‘ఛల్ దేఖ్ లేంగే’ అంటూ కేటీఆర్ స్టెప్పులు… ఎన్నికల వేళ కార్యకర్తలలో కొత్త జోష్
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓటర్లు పరిణతితో ఆలోచించి ఓటేస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని BRS అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్రలో నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఓటును సరిగ్గా వాడితే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. అభ్యర్థి వెనుక ఉన్న పార్టీల గురించి కూడా ఆలోచన చేసి ఓట్లేయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. గత పాలకులు పాలమూరు జిల్లాను పట్టించుకోలేదు. వలసలు వెళ్లి చాలా బాధలు అనుభవించిన జిల్లా పాలమూరు. గతంలో పాలమూరు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులకు కాంగ్రెస్ కారణం కాదా అని కేసీఆర్ ప్రశ్నించారు. దేవరకద్ర నియోజకవర్గ BRS అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కార్నర్ మీటింగ్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఒక్కకేసీఆర్ ని ఓడించడానికి ఢిల్లీ, కర్ణాటక నుంచి గుంపులు గుంపులుగా వస్తున్నారు. కానీ సింహం సింగిల్ గానే వస్తుంది. 2014 నుంచి కేసీఆర్ సింగిల్ గానే పోటీ చేస్తున్నాడు. ఢిల్లీ నుంచి కాదు కదా ఎక్కడి నుంచి అయినా రండి. నవంబర్ 30 నాడు తెలంగాణ దమ్మెందో చూపిస్తాం. ఢిల్లీ దొరలకు తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలకు మధ్య జరిగే పోరాటం ఇది. కాంగ్రెస్ కు గాని బీజేపీకి గాని తెలంగాణలో సత్తా ఉన్న నాయకులు లేరు. వాళ్లు బయటి రాష్ట్రాల నుంచి నాయకులను తెచ్చుకుంటున్నారు. షాద్ నగర్ నియోజకవర్గానికి రాబోయే కాలంలో ఐటీ హబ్ తీసుకువస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఒకపక్క కేసీఆర్ బహిరంగ సభలతో ప్రచారంలో దూసుకెళ్తుండగా మరోపక్క కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడానికి తన వంతుగా ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం లోని ఆమనగల్ పట్టణానికి రానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా విటాయిపల్లిలో పెద్ద ఎత్తున కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. అనంతరం ఆమనగల్ మున్సిపాలిటీ లోని మాడుగుల రహదారిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగుతున్న స్థలాన్ని అత్యంత సుందరంగా వేదికను ఏర్పాటు చేసి సమావేశానికి వస్తున్న ప్రజలకు కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది ఎదురవకుండా ప్రత్యేకంగా కుర్చీలను ఏర్పాటు చేశారు ఆమనగల్లు సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
Read Also..
కేసీఆర్ మళ్లీ గెలవకపోతే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పుట్టుక నుంచి చివరి దాక చూసుకునేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయమన్నారు. భారాస పాలనలో హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగిందన్నారు. హైదరాబాద్‌లో ఉంటే అమెరికాలో ఉన్నట్లుందని రజినీకాంత్ అన్నారు. హైదరాబాద్‌లోనే ఇల్లు కొనుక్కోవాలని అనిపిస్తోందని భాజపా ఎంపీ సన్ని దేవోల్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అందరికీ కనిపిస్తోంది. కానీ, విపక్షాలకు కనిపించట్లేదు అని విమర్శించారు. సంపద పెంచాలి.. పేదలకు పంచాలి అనేదే కేసీఆర్ సిద్ధాంతం అని కేటీఆర్ అన్నారు. ఈ తొమిదిన్నరేళ్లు అద్భుతంగా పరిపాలన చేసిన కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తామని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంత బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తున్న నాయకుడికి ప్రజలు ఎందుకు ఓటు వేయొద్దు? కేసీఆర్‌కు ఎందుకు ఓటు… వేయొద్దంటున్నారో ప్రజలు ప్రశ్నించాలి. ఎవరో వచ్చి ఏవేవో మాట్లాడుతారు. వారు చెప్పిన మాటలు విని ఆగమైతే.. ఎక్కడి అభివృద్ధి అక్కడే ఆగిపోతుంది. ఇదే జరిగితే కాంగ్రెస్ హయాంలో పడిన ఇబ్బందులు, సమస్యలు మళ్లీ మొదలవుతాయి అని కేటీఆర్ తెలిపారు.
ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి సీఎం కేసీఆర్ జీవితమే ఉదాహరణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మారుమూల ప్రాంతంలో పుట్టారని, ముంబైలోని షాపూర్జీ పల్లోంజీ కాంపెనీలో కాంట్రాక్టులు చేశారని చెప్పారు. రాజకీయాల్లో ప్రవేశించిన మొదట్లో సింగిల్ విండో ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారన్నారు. అయినా పట్టుదలతో రాజకీయాల్లో కొనసాగారని తెలిపారు. ఆర్వాత ఎన్నికల్లో గెలిచి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదని వెల్లడించారు. హైదరాబాద్ పార్క్ హయత్‌లో గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్ మీట్లో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన పారిశ్రామిక వేత్తలను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఏ కులంలో పుట్టామనేది ముఖ్యం కాదని, అవకాశాలను అందిపుచ్చుకోవడం ప్రధానమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటున్నదని చెప్పారు. భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు కావాలన్నారు.