తెలంగాణ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 3న ఫలితాలు కూడా రానున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీల అభ్యర్థులు విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ పై అంచనాలు వేసుకుంటున్నారు. ఎక్కడ పరిస్థితులు అనుకూలంగా మారాయి.. ఎక్కడ ప్రతికూలంగా మారాయంటూ బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో పలు సర్వేలు కూడా తెలంగాణలో ప్రముఖ పార్టీ గెలువనుందని తెలిపాయి. అయితే కేటీఆర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా, మంత్రి కేటీఆర్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘‘చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్ర పట్టింది. ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోలేదు. ఎగ్జిట్ పోల్స్ మాకు శుభవార్తనిస్తాయి’’ అంటూ రాసుకొచ్చారు.
Ktr
తెలంగాణలో పార్టీ ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి. చివరి రోజు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ ప్రచారాన్ని హోరెత్తించారు. రోడ్ షో లతో హడావుడి చేశారు. ఇక ఓటర్ పై భారం వేశారు. సీఎం కేసీఆర్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, బీజేపీ తరఫున మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలు, కేటీఆర్, హరీశ్ రావు, రేవంత్ రెడ్డి సహా పలు పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంత జిల్లాల్లో గంట ముందుగానే పోలింగ్ ముగియనుంది. జిల్లాలో మొత్తం ఐదు నియోజకవర్గాల్లో 9,66,439 మంది ఓటర్లు ఉన్నారు. 1098 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 320 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. మొత్తం 95 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో, కొత్తగూడెంలో సీపీఐ పోటీలో ఉంది. బీజేపీ, జనసేన కూటమి నేపథ్యంలో బీజేపీ మూడు స్థానాల్లో, జనసేన రెండు స్థానాల్లో పోటీకి దిగింది. ఏ పార్టీ భవితవ్యం ఏంటనేది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంటుంది. డిసెంబర్ 3న ఇక తెలంగాణను ఏలేది ఏ పార్టీ అనేది తేలిపోతుంది. ఓటర్లు ఎవరిని దీవిస్తారు? ఎవరికి పట్టం కడతారు? అనే అంశంపై ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాజకీయ నేతలు. అయితే, అంతకంటే ముందుగానే.. జనం నాడి ఏంటి? ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఏ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు? అనే అంశాన్ని తేల్చేందుకు అనేక సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ప్రజల మూడ్ ఏంటో తెలుసుకున్నాయి. వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో నిర్ధారించాయి.
తెలంగాణలో పార్టీ ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి. చివరి రోజు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ ప్రచారాన్ని హోరెత్తించారు. రోడ్ షో లతో హడావుడి చేశారు. ఇక ఓటర్ పై భారం వేశారు. సీఎం కేసీఆర్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, బీజేపీ తరఫున మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలు, కేటీఆర్, హరీశ్ రావు, రేవంత్ రెడ్డి సహా పలు పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఈనెల 30న ఉదయం 7 గంటల నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కావడంతో జిల్లాలో గంట ముందుగానే పోలింగ్ ముగియనుంది. జిల్లాలో మొత్తం ఐదు నియోజకవర్గాల్లో 9,66,439 మంది ఓటర్లు ఉన్నారు. 1098 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 320 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. మొత్తం 95 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో, కొత్తగూడెంలో సీపీఐ పోటీలో ఉంది. బీజేపీ, జనసేన కూటమి నేపథ్యంలో బీజేపీ మూడు స్థానాల్లో, జనసేన రెండు స్థానాల్లో పోటీకి దిగింది. ఏ పార్టీ భవితవ్యం ఏంటనేది ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంటుంది. డిసెంబర్ 3న ఇక తెలంగాణను ఏలేది ఏ పార్టీ అనేది తేలిపోతుంది. ఓటర్లు ఎవరిని దీవిస్తారు? ఎవరికి పట్టం కడతారు? అనే అంశంపై ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాజకీయ నేతలు. అయితే, అంతకంటే ముందుగానే జనం నాడి ఏంటి? ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? ఏ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు? అనే అంశాన్ని తేల్చేందుకు అనేక సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ప్రజల మూడ్ ఏంటో తెలుసుకున్నాయి. వారు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో నిర్ధారించాయి.
Read Also..
Read Also..
కేసీఆర్ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ హామీల వర్షం కురిపించారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ అందిస్తామన్నారు. జనవరిలో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు అందిస్తామన్నారు. అలాగే రేషన్ కార్డులపై సన్నబియ్యం కూడా ఇస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు ఐదు లక్షల భీమా అందిస్తామని హామీ ఇచ్చారు. పెన్షన్ దశలవారీగా ఐదు వేల రూపాయలకు పెంచుతామని చెప్పారు.
తెలంగాణకు స్వీయ పాలనే శ్రీరామరక్ష అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో ఏడాదిలోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదన్నారు. రాహుల్‌గాంధీ 2014 నుంచి ఆయన రాజకీయ నిరుద్యోగిగా ఉన్నారని విమర్శించారు. గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పెట్టిందన్నారు. గోషామహల్లో బీజేపీ అభ్యర్థిని ఓడిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఈ ఏడాది నవంబర్ 29న దీక్షా దివస్ గా ఘనంగా నిర్వహిస్తామని కేటీఆర్ చెప్పారు. ఆరోజు బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడివారు అక్కడే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
నిజామాబాద్ జిల్లా ఖిల్లా రోడ్డులో నిర్వహించిన రోడ్డు షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ చరిత్రలో బీజేపీతో జత కట్టలేదని భవిష్యత్తులోనూ జత కట్టదని స్పష్టం చేశారు. కేసీఆర్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, అయినా కాంగ్రెస్, బీజేపీలకు భయపడేది లేదన్నారు. గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందే ఉందని, దానిని చూసి ఓటేయాలని కోరారు. నిజామాబాద్ నుంచి పొరపాటున షబ్బీర్ అలీని గెలిపిస్తే ఆ తర్వాత ఆయన ఇక్కడ మళ్లీ కనిపించడని మంత్రి కేటీఆర్ అన్నారు. తమకు ఒక్క అవకాశమివ్వమని కాంగ్రెస్ అంటోందని, కానీ 11సార్లు అవకాశమిచ్చినా చేసిందేమీ లేదన్నారు. పైగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి ప్రయోజనమవుతుందని వ్యాఖ్యానించారు. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా చేసిన అభివృద్ధికి తానే సాక్ష్యమన్నారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌కు దీటుగా నిజామాబాద్‌లో ట్యాంక్‌బండ్ ఏర్పాటు చేశామని, నగరంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అండర్ గ్రౌండ్ పనులు పూర్తి చేశామన్నారు. కరోనా సమయంలో ప్రజల కష్టాలను చూసి సొంత డబ్బుతో గణేష్ గుప్తా సేవలు అందించారని గుర్తు చేశారు. తెలంగాణలో పదేళ్లలో ఒక్క మత ఘర్షణ లేదన్నారు. కాంగ్రెస్ మతపరంగా ఓట్లు పొందాలని ప్రయత్నం చేస్తోందన్నారు. కామారెడ్డిలో పని చేయలేని షబ్బీర్ అలీ నిజామాబాద్‌లో ఏం పని చేస్తాడు? అని ప్రశ్నించారు. కామారెడ్డిలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? అన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం పనిచేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అజెండా ఒక్కటేనని, స్వలాభం కోసమే వాళ్లు పని చేస్తారని యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ విమర్శించారు. వేములవాడలో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే కరోనా వ్యాక్సిన్ ఇచ్చేదా? పేదలకు ఉచితంగా కాంగ్రెస్ బియ్యం ఇచ్చేదా?అని ప్రశ్నించారు.ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అంటే కేసీఆర్ కు భయమని ఎద్దేవా చేశారు. యూపీలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ ఇంజన్ స్పీడుతో ఉపాధి, శాంతిభద్రతలు కల్పించడం అని యోగి అన్నారు. తెలంగాణ పరిస్థితి మారాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ హయాంలో పేపర్ లు లీక్ చేసి నిరుద్యోగులను మోసం చేశారన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ నిరుద్యోగుల ఆశలను ఆవిరి చేశారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కచ్చితమైన ఉద్యోగ ప్రకటనను ఇస్తామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండో ఒకటే అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే కాంగ్రెస్ కు వేసినట్లేనన్నారు. బీసీని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారన్నారు. బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలన్నారు.
మంత్రి కేటీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రణ్‌దీప్ సూర్జేవాలా ఫిర్యాదు చేయడంతో ఈసీ నోటీసులు పంపించింది. టీ వర్క్స్‌లో స్టూడెంట్ ట్రైబ్ భేటీలో చేసిన వ్యాఖ్యలపై సూర్జేవాలా ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులలో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని టీ వర్క్స్ భేటీలో విద్యార్థులకు కేటీఆర్ హామీ ఇచ్చారని, అలాగే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కూడా చెప్పారని, తద్వారా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ కార్యాలయం టీ వర్క్స్‌ను ఉపయోగించుకున్నారని సూర్జేవాలా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ… కేటీఆర్ ప్రాథమిక ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడింది. రేపు మధ్యాహ్నం మూడు గంటల లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
డిసెంబర్ 3 తర్వాత సీఎం కేసీఆర్ కొత్త కార్యక్రమం చేపట్టనున్నారన్నారు మంత్రి కేటీఆర్. అదే సౌభాగ్య లక్ష్మీ అని తెలిపారు. ప్రతి నెల తెలంగాణ ఆడబిడ్డలందరికీ 3వేల రూపాయలను ఇవ్వనున్నారన్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ విధంగా తెలిపారు. అలాగే ఆసారా ఫించన్లను 2వేల రూపాయల నుండి దశల వారీగా 5వేలకు పెంచుతాన్నామన్నారు. 65 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనులు ఈ తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. కొంతమంది లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అసైన్డ్ భూములు ఉన్న వారికే పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏ రాష్ట్రంలోను బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వరని, కేసీఆర్ ఇస్తున్నారన్నారు.
Read Also..
Read Also..