ప్రతి పెదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో 13.90 ఏకరాలలో అర్హులైన 415 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి చేతుల మీదుగా జగనన్న ఇళ్ల పట్టాలను పంపిణి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో ఎన్ని అడ్డంకులు వచ్చిన ప్రతి లబ్దిదారునికి ఈ రోజు పట్టా ఇవ్వడం జరుగుతుందన్నారు. కానీ టీడీపీ వారు ఏమి చేయకున్నా ప్రభుత్వం పై తప్పుడు నిందలు వేస్తున్నారని, ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారో గుర్తించలన్నారు. కావున వచ్చే ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తోడుగా నిలబడాలని తెలిపారు.
kurnool district news
శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి గత సంవత్సరం కంటే కొద్దిగా ఆదాయం పెరిగింది. మొత్తం 6,14,22,180 రూపాయల నగదు రాబడిగా లభించగా ఈ ఆదాయాన్ని గత 28 రోజులలో కార్తీకమాసం సందర్భంగా శ్రీస్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటుగా ఈ హుండీ లెక్కింపులో 403 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారు, 10 కేజీల 160 గ్రాముల వెండి లభించగా వీటితోపాటు పలు రకాల విదేశీ కరెన్సీ కూడా లెక్కించారు. అందులో 1118- యుఎస్ఏ డాలర్లు, 130 యూఏఈ దిర్హమ్స్, 100 యూకే ఫౌండ్స్, 40 – ఆస్ట్రేలియా డాలర్లు, 22 మలేషియా రింగిట్స్, 20- కెనడా డాలర్లు, 19 సింగపూర్ డాలర్లు, 10 – ఈరోస్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.
శ్రీశైలంలోని పాతాళగంగలో మెట్ల మార్గంలో నీటి కుక్కలు సందడి చేశాయి. పాతాళగంగకు భక్తులు వెళ్లివచ్చే దారిలో టూరిజం శాఖ ఏర్పాటు చేసిన జెట్ పై ఆడుతూ విన్యాసాలు చేస్తూ అటుగా వెళ్లే యాత్రకుల కళ్ళకు కనువిందు చేస్తూ కనపడ్డాయి. దీనితో నీటి కుక్కల కళ్ళను చూపుర్లను కట్టిపడేస్తున్నాయి. నీటి కుక్కలు ముఖ్యంగా ఎగువన వర్షాలు పడినప్పుడు నీళ్లు పెరిగిన, లేదా డ్యామ్ లో నీటిమట్టం తగ్గిన శ్రీశైలం జలాశయం పరిసరాలలో చేపల కోసం ఆహ్లాదకరమైన వాతావరణం కోసం నీటి కుక్కలు ఒడ్డుకు వచ్చి సందడి చేస్తాయి. అలానే ప్రతి సంవత్సరం శ్రీశైలం పాతాళగంగలో ఏపీ టూరిజం ఏర్పాటు చేసుకున్న జెట్టుపై విన్యాసాలు చేస్తూ కనువిందు చేస్తుంటాయి. నీటి కుక్కలు సాధారణంగా మనిషి కనపడిన శబ్దం చేసిన తుర్రుమంటూ మాయమవుతాయి. ఈరోజు ఉదయం సమయంలో నీటి కుక్కలు శ్రీశైలంలోని పాతాళగంగా మెట్ల మార్గం దగ్గర టూరిజం శాఖ జెట్టుపై ఒక్కసారిగా ప్రత్యక్షమై కనపడంతో యాత్రికులకు కనువిందు చేసాయి. అయితే యాత్రికులు సైతం తమ సెల్ ఫోన్ లో నీటి కుక్కల సందడిని చిత్రీకరించారు. నీటి కుక్కలు పాతాళగంగకు వెళ్లే వారికి వీటిని చూస్తూ ఆనందంతో పిల్లలు పెద్దలు కేరింతలు కొట్టారు.
శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ పెరిగింది శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రోడ్లపై కార్లు బస్సులు నిలిచిపోయాయి. సుమారు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది వరుస సెలువులు అందులోను కార్తీకమాసం చివరి రోజులు కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి వాహనాలలో భారీగా తరలి వస్తున్నారు. భక్తులరద్దిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు స్వామివారి స్పర్శ దర్శనం అభిషేకాలు పూర్తిగా రద్దు చేశారు. భక్తులందరికి స్వామివారి దర్శనం కల్పించేందుకు అందరికి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా సొంత కార్లలో తరలి వస్తున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్ మొత్తం సింగిల్ రోడ్డు కావడంతో వచ్చి వెళ్లె వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్రీశైలం నుండి హటకేశ్వరం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖద్వారం నుండి శ్రీశైలానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది. అయితే ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్స్ తో అష్టకష్టాలు పడుతూ ట్రాఫిక్ ని అదుపు చేయడంలో నిమగ్నమయ్యారు.
శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరి మార్గంలో ప్రొటెక్షన్ వాచర్ పై ఎలుగుబంటి దాడి దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఎలుగుబంటి దాడిలో ప్రొటెక్షన్ వాచరు చెవుల వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇష్టకామేశ్వరి వద్ద విధులను పూర్తి చేసుకొని సున్నిపెంటకు వస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటి దాడి చేసి వెంకటేష్ ని అక్కడే వదిలేసి అడవిలోకి వెళ్లిపోవడంతో కొద్దిసేపటికి తేరుకున్న బాధితుడు మోటార్ సైకిల్ సహాయంతో రోడ్డు మార్గంలో ఉన్న ప్రొటెక్షన్ సెంటర్ వద్దకు వెంకటేష్ చేరుకోగా, తీవ్రంగా రక్తస్రావ గాయలతో ఉన్న వెంకటేష్‌ను హుటాహుటిన సుండిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్ర గాయాలైన వెంకటేష్ కు ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలిస్తున్న అటవీశాఖ అధికారులు వైద్యులు తెలిపారు.
అవుకు పట్టణం బలిజ సంఘం అధ్యక్షుడు రామన్న ఆధ్వర్యంలో కార్తీక వనమహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి తనయుడు కాటసాని ఓబుల్ రెడ్డి హాజరయ్యారు. గజమాలలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.అవుకు మండల బలిజ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కాటసాని ఓబుల్ రెడ్డిని గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ అవుకు మండలంలో అత్యధిక ఓట్ల శాతం కలిగి ఉన్న బలిజ సంఘం రాజకీయాల్లోకి రావాలని వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. బలిజ సంఘాల కొరకు ఒక కోటి 20 లక్షల రూపాయలతో కళ్యాణమండపం ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే అత్యధికంగా ఇంటి స్థలాలు భూ పంపిణీ కార్యక్రమంలో వారికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. త్వరలోనే ఇంటి స్థలాలతో పాటు భూ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు ఎవరని ప్రజలు గుర్తించాలని అలాంటి వ్యక్తులకే 2024 లో మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, శాసనసభ్యుడిగా తనను గెలిపించాలని చెప్పారు.
శ్రీశైలం గోశాల గో ఉత్పత్తుల తయారీ కేంద్రంలో రక్త పింజర పాము కలకలం రేపింది. సుమారు 4 అడుగుల రక్త పింజరి పాము కనపడటంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. గో ఉత్పత్తుల తయారీ కేంద్రంలోకి పాము రావడంతో గమనించిన సిబ్బంది, అధికారుల ద్వారా స్నేక్ క్యాచర్ రాజకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన గో ఉత్పత్తి కేంద్రం వద్దకు చేరుకున్న స్నేక్ క్యాచర్ రాజ పామును చాకచక్యంగా పట్టుకుని దట్టమైన అటవీప్రాంతంలో పామును వదిలిపెట్టారు.
నంద్యాల జిల్లా డోన్ మండలంలో సాధారణ వాహన తనికీల్లో భాగంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బస్ ఆంధ్ర ప్రదేశ్ కు కట్టవలసిన రోడ్ టాక్స్ కట్టకుండా బెంగళూరు నుండి ఉత్తరప్రదేశ్ కు వెళ్తుండటంతో గుర్తించి వాహనానికి 404500/- జరిమానా విధించి బస్ ను సీజ్ చేయడం జరిగినది అన్ని డోన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ తెలిపారు. రెండు రోజుల క్రితం కూడా ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక మినీ బస్ 265500/- జరిమానా వేసి సీజ్ చేయడం జరిగినది గత మూడురోజుల లో రెండు బస్సులకు గాను 670000/- జరిమానా విధించటం జరిగినది
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామ సమీపంలో 148 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మ్యూచువల్ గ ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి, జిల్లా కలెక్టర్ సృజన, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ విద్యుత్ ఉపకేంద్రం ను సుమారు 12 ఎకరాల్లో నిర్మిస్తునట్టు తెలిపారు. ప్రస్తుతం జనాభా పెరుగుతున్న తరుణంలో విద్యుత్ సరఫరాలో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. వాటిని అదిగామించేదుకే రాష్ట్ర ప్రభుత్వం 220/132/33 కెవి గల ఈ విద్యుత్ ఉపకేంద్రంను ఏర్పటు చేస్తునమ్మని, ఈ ఉపకేంద్రం వల్ల ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు మండలాల ప్రజలకు లబ్ది జరుగుతుందని,ఈ ప్రాంతాల్లో లో ఓల్టేజి సమస్య తీరడమే కాకుండా,దీని ద్వారా వ్యవసాయ రంగంలో పగటిపూట తొమ్మిది గంటలు నిరంతరం నాణ్యమైన విద్యుత్తు పంపిణి జరుగుతుందని తెలిపారు.
నవనందుల కోట నంద్యాల టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా నంద్యాల నవాబుగా ముద్దుగా పిలుచుకునే ఎన్ఎండి ఫరూక్ కె టిడిపి అధిష్టానం అధికారికంగా ఉత్తర్వులు వెల్లడించడంతో కనుచూపుమేరలో ఎన్నికలు ఉన్న సందర్భంలో నియోజకవర్గ నూతన ఇన్చార్జి నియామకంతో టికెట్ కూడా కచ్చితంగా ఖరారైనట్లేననీ ఆనందం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ టిడిపి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీ వర్గాలు… అయితే మరి కొంత మంది మైనారిటీలో, ఫరూక్ వ్యతిరేక వర్గంలో మరో చర్చ మొదలైంది అని చెప్పొచ్చు. 2004 లో శిల్పా మోహన్ రెడ్డి తో, 2024 లో శిల్పా రవి తో ఓడిపోయి చరిత్ర సృష్టించనున్న మాజీ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ అంటూ మైనార్టీ వర్గాల్లో చర్చ.మేము తెలుగుదేశం అభిమానులము , మైనార్టీలమే కానీ మనసు చంపుకొని ఫరూక్ కు వేయము,ఇతర పార్టీకి ఓట్లు వేస్తామని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి వర్గంలో కలకలం తారాస్థాయికి చేరుకుంది ఇన్ని రోజులు పార్టీని అంటిపెట్టుకొని ఎన్నో రకమైన ఒడిదుడుకులు ఎదుర్కొని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుని ఇప్పుడు టికెట్ లేదంటే బాబు నిన్ను నమ్ముకున్న నాకు షూరిటీ లేకుండా పోయిందని భూమా బ్రహ్మానందరెడ్డి వర్గం వాపోతున్నారు… నంద్యాల పార్టీ అసెంబ్లీ నియోజకవర్గానికి రెబల్ అభ్యర్థిగానైన ఒంటరిగా బరిలోకి దిగుతానని బ్రహ్మానంద రెడ్డి వర్గం కార్యకర్తల సమావేశంలో ఆయన వెలిబుచ్చారు భవిష్యత్తులో ఇంకా ఎన్ని మార్పులు చేర్పులు ఈ శిబిరాలలో జరుగుతాయో వేచి చూడాల్సి ఉంది.




Total views : 89919