బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి చేరారు. తాజాగా ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చారు. ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు.కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్సీలు దండె విఠల్, భాను ప్రసాద్, ఎగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, బస్వరాజు సారయ్యలు హస్తం గూటికి చేరారు. వీరి చేరికలతో శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 12కి పెరిగింది. మండలిలో సభ్యుల సంఖ్య 40. రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు పార్టీ వీడుతుండటంతో బీఆర్ఎస్ పరేషాన్ అవుతోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు ఎమ్మెల్సీలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పడం గులాబీ పార్టీలో గుబులు పెంచింది. ఇక సీనియర్ నేత కే కేశవరావు సైతం కాంగ్రెస్ లో చేరిపోయారు. అంతేకాదు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 91110