వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దమ్ముంటే ప్రధాని మోదీపై పోటీ చేయాలంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అదే రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ సవాల్ విసిరారు. ఇండియా కూటమి నాలుగో సమావేశం సందర్భంగా వారణాసిలో మోదీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ పోటీ చేయాలని మమతా బెనర్జీ సూచించిన నేపథ్యంలో ఆమె ఈ మేరకు ఛాలెంజ్ చేశారు. ప్రియాంకాగాంధీ స్థానంలో మీరు పోటీ చేయాలని సవాల్ విసిరారు. మీరు ప్రధాని కావాలని కోరుకుంటున్నారు కదా అని ప్రశ్నించిన అగ్నిమిత్ర అలాంటప్పుడు ప్రధానిపై పోటీ చేయాలని అన్నారు.
National News
దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పది రోజుల కిందట రోజుకు పదీ ఇరవై లోపు నమోదైన కేసులు తాజాగా వందల్లోకి చేరాయి. వారం కిందట మొత్తం బాధితుల సంఖ్య వందల్లో ఉండగా నేడు అది వేలల్లోకి చేరింది. మొన్న 350 నిన్న 640 గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య శనివారానికి 752 కు చేరింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,420 కాగా ఇందులో ఎక్కువ శాతం కేరళలోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే, ముందుజాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఇప్పటికే అలర్ట్ చేసినట్లు తెలిపింది. వైరస్ తో గడిచిన 24 గంటల్లో నలుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు బయటపడ్డ కేరళలోనే వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోందని తెలిపారు. నిన్న బయటపడ్డ కొత్త కేసులు మొత్తం 752 కాగా అందులో 565 మంది కరోనా బాధితులు కేరళలోనే ఉన్నారని వివరించారు. యాక్టివ్ కేసులు కూడా కేరళలోనే అత్యధికమని, వైరస్ బాధితులలో 2,872 మంది కేరళలోనే ఉన్నారని చెప్పారు. గోవాలోనూ జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయని చెప్పారు.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 2న విజయవంతంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 మిషన్‌పై ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఆదిత్య ఎల్1 మిషన్ జనవరి 6న సూర్యుడికి దగ్గరగా ఉండే ఎల్1 పాయింట్లోకి ప్రవేశిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు అంచనా వేశామని, ఖచ్చితమైన సమయాన్ని నిర్ధిష్ట సమయంలో ప్రకటిస్తామని చెప్పారు. గాంధీనగర్‌లో శుక్రవారం జరిగిన ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆదిత్య ఎల్1 మిషన్‌కు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు.
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,997కి చేరుకుంది. గత 24 గంటల్లో ఏకంగా 640 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో సైతం 3 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. ముఖ్యమంత్రి జగన్ ఈరోజు కరోనాపై సమీక్షను నిర్వహించనున్నారు. కరోనా కట్టడికి సంబంధించి ఆయన కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. టెస్టింగ్ లను పెంచడం, ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు జారీ చేయనున్నారు. పలు రాష్ట్రాల్లో కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. తాజా వేరియంట్ చిన్న పిల్లలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరింది. తెలంగాణలో సైతం రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలు కరోనా బారిన పడ్డారు. నగరంలోని నీలోఫర్ ఆసుపత్రిలో వీరికి పరీక్షలు నిర్వహించగా కొవిడ్ నిర్ధారణ అయింది. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా మరో 6 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 25 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో కొవిడ్ కు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా గణపురం మండలం గాంధీనగర్ కు చెందిన ఒక మహిళలో కొత్త వేరియంట్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. వెంటనే ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె నుంచి శాంపిల్స్ సేకరించారు డాక్టర్లు. టెస్టింగ్ కోసం పూణెలోని ల్యాబ్ కు పంపారు. ఎంజీఎం ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటు చేశారు. సిద్ధిపేటలో కూడా ఒక కేసు నమోదయింది.
Read Also..
Read Also..
జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. గురువారం సాయంత్రం 3.45 గంటల సమయంలో రాజౌరిలోని పూంచ్ ప్రాంతంలో ఉన్న డేరా కీ గలీ నుంచి వెళ్తున్న రెండు ఆర్మీ ట్రక్కులపై ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి తెగబడ్డారు. దీంతో సైనికులు, ఆర్మీ మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. మరో ముగ్గురు జవానులు తీవ్రంగా గాయపడ్డారని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. కాగా ఉగ్రవాదులు నక్కి ఉన్నారని ఇంటెలిజెన్సీ సమాచారం అందడంతో డీకేజీ ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచి భారత సైన్యం ఆపరేషన్ చేపడుతోంది. గురువారం సాయంత్రం నుంచి ఉగ్రవాదులు, సైన్యం మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని, ఎన్కౌంటర్లో పురోగతి ఉందని ఆర్మీ ప్రతినిధి వెల్లడించారు.
కరోనా గురించి యావత్ ప్రపంచం మరిచిపోతున్న తరుణంలో మళ్లీ కరోనా భూతం బెంబేలెత్తిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కలవరపెడుతోంది. మన దేశంలో కూడా కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 358 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మూడు మరణాలు కూడా కేరళలో సంభవించాయి. కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1ను తొలుత కేరళలో గుర్తించారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గత 24 గంటల్లో కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ హైదరాబాద్ లోనే నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం 14 మంది కొవిడ్ చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఏపీలో కూడా కొత్త వేరియంట్ కేసులు నమోదయినట్టు సమాచారం. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. కరోనా కట్టడికి అన్ని చర్యలను చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు మాస్క్ లు ధరించాలని ప్రజలకు సూచించాయి. వృద్ధులు, గర్భిణులు చిన్నారులు, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడే వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గుంపుగా ఉన్న వారి వద్దకు వెళ్లకుండా ఉండటమే మంచిదని అంటున్నారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడంతో పాటు శానిటైజర్ అందుబాటులో ఉంచుకోవాలి. జ్వరం తగ్గకపోవవడం, విపరీతమైన దగ్గు, జలుబు, ముక్కు నుంచి నీరు కారడం ఊపిరి సరిగా ఆడకపోవడం తదితర సమస్యలను ఎదుర్కొంటున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. పోషక విలువలు గల వేడి ఆహారాన్ని తీసుకోవాలి. చిన్న పిల్లలు, వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలి. తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఫీవర్ ఆస్పత్రికి వచ్చి వైద్యులను సంప్రదించి మెరుగైన వైద్యం పొందవచ్చు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయే ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దామోదర రాజనర్సింహ, రఘువీరారెడ్డి, పల్లంరాజు, కొప్పుల రాజు, వంశీచందర్ రెడ్డి, టి.సుబ్బరామిరెడ్డిలు పాల్గొననున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అమలు చేయాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై ఈ భేటీలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లో పార్టీ ఓటమిపై చర్చ, ఇండియా కూటమిలో సీట్ల పంపకాల విషయంలో పార్టీ వ్యూహం ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also..
Read Also..
ఢిల్లీలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి సమావేశమైంది. ఈ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వచ్చే ఎన్నికల్లో విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించారు. లోక్ ఎన్నికల తర్వాతే తమ ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని నిన్న చెప్పిన మమత, ఒక్కరోజులోనే స్వరం మార్చేశారు! ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఖర్గే అంటూ నేటి సమావేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. కాగా మమత ప్రతిపాదనకు ఇండియా కూటమిలో 12 పార్టీల నుంచి మద్దతు లభించింది. అంతేకాదు, ఊహించని రీతిలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. దేశానికి తొలి దళిత ప్రధానిని అందించేందుకు ఇదొక మంచి అవకాశం అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు ఖర్గే నుంచే వ్యతిరేకత వ్యక్తం కావడంతో మమతా బెనర్జీ సహా ఇతర విపక్ష నేతలు నిరాశకు గురయ్యారు. మమత ప్రతిపాదనను ఖర్గే సున్నితంగా తోసిపుచ్చారు. తాను అణగారిన వర్గాల కోసం పనిచేయాలని మాత్రమే కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. మొదట మనం ఎన్నికల్లో గెలవాలి. గెలవడానికి ఏం చేయాలన్నదాని గురించే ఇప్పుడు ఆలోచించాలి. అసలు మనకు ఎంపీలే లేకుండా ప్రధాని పదవి గురించి ఆలోచించడంలో అర్థమేముంది? ముందు మనం ఐకమత్యంతో కృషి చేసి మెజారిటీ పొందాలి” అంటూ ఖర్గే వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. వారణాసిలో ‘స్వరవేద్ మహా మందిర్ ధామ్’ పేరిట ఈ ధ్యాన మందిరం నిర్మించారు. ఇక్కడ ఏకకాలంలో 20 వేల మంది ధ్యానం చేసుకోవచ్చు. ఈ ధ్యాన మందిరాన్ని ఏడు అంతస్తుల్లో నిర్మించారు. రామాయణ, మహాభారత కావ్యాలను ప్రతిబింబించే కళాకృతులు ఈ మహా మందిరంలో అడుగడుగునా దర్శనమిస్తాయి. ఈ ధ్యాన మందిరం నిర్వాహకులు స్వతంత్ర దేవ్ మహరాజ్, విజ్ఞానంద్ దేవ్ మహరాజ్ దీనికి సంబంధించిన విశేషాలను ప్రధాని మోదీకి వివరించారు. ధ్యాన మందిరం పైకప్పు కమలం ఆకృతిలో ఉండడం ప్రధాని మోదీని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. యోగి ఆదిత్యనాథ్ తో కలిసి మోదీ ధ్యాన మందిరం మొత్తం కలియదిరిగారు.
Read Also..
Read Also..
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు మరోసారి దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో మరో కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు రావాలని నోటీసుల్లో కోరింది. కాగా, ఈ నెల 19న మెడిటేషన్ కోర్సు కోసం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీని వీడే అవకాశం ఉందని సమాచారం. ఈ సమయంలో ఈడీ సమన్లు పంపడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలోనే నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని మొదటిసారి ఈడీనోటీసులు ఇచ్చింది. మరోవైపు ఈ కేసు విచారణపైనే ఈ ఏడాది ఏప్రిల్ 16న సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను తొమ్మిది గంటల పాటు విచారించారు. ఆప్ లో ఇద్దరు అగ్రనేతలు లిక్కర్ స్కాం వ్యవహారంలో ప్రస్తుతం జైల్లో ఉన్నారు.