Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home National సీఎం కేజ్రీవాల్‌ కు ఈడీ మరోసారి నోటీసులు

సీఎం కేజ్రీవాల్‌ కు ఈడీ మరోసారి నోటీసులు

by Satya
CM Arvind

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు మరోసారి దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో మరో కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు రావాలని నోటీసుల్లో కోరింది. కాగా, ఈ నెల 19న మెడిటేషన్ కోర్సు కోసం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీని వీడే అవకాశం ఉందని సమాచారం. ఈ సమయంలో ఈడీ సమన్లు పంపడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలోనే నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని మొదటిసారి ఈడీనోటీసులు ఇచ్చింది. మరోవైపు ఈ కేసు విచారణపైనే ఈ ఏడాది ఏప్రిల్ 16న సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను తొమ్మిది గంటల పాటు విచారించారు. ఆప్ లో ఇద్దరు అగ్రనేతలు లిక్కర్ స్కాం వ్యవహారంలో ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

Advertisements

You may also like

Our Visitor

014285
Total views : 79736

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.