శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్న రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన రవి నాలుగున్నర ఏళ్ల పాటు తిరుమల దర్శన వ్యవహారాలను నడిపించారు. పిఏ రవి ఇంటి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
National News
భారత్ జోడో యాత్రతో పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తాజాగా మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. భారత్ న్యాయ్ యాత్ర పేరుతో ‘మణిపూర్ నుంచి ముంబై’ యాత్ర చేపట్టనున్నారు. ఈమేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ ఈ యాత్ర షెడ్యూల్ ను విడుదల చేసింది. జోడో యాత్రక కొనసాగింపుగా చేపడుతున్న ఈ యాత్రను రాహుల్ గాంధీ బస్సులో చేస్తారని వెల్లడించింది. ఈ యాత్రలో భాగంగా మొత్తం 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాలను రాహుల్ గాంధీ కవర్ చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతారని కాంగ్రెస్ పేర్కొంది. తూర్పు నుంచి పశ్చిమానికి యాత్ర చేపట్టాలన్న ప్రతిపాదనలపై పార్టీ సీడబ్ల్యూసీ మీటింగ్ లో చర్చించి ఈ యాత్రకు రూపకల్పన చేసినట్లు తెలిపింది. ఈ యాత్రలో సుమారు 6,200 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేపడతారని వివరించింది.
Read Also..
Read Also..
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం దాదాపు పూర్తయిన నేపథ్యంలో, ఇకపై ఈ నగరానికి రాకపోకలు పెరగనున్నాయి. అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో జనవరి 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అనంతరం, ఆలయంలోకి భక్తులను అనుమతించనున్నారు. రామజన్మభూమిగా పేర్కొంటున్న అయోధ్యకు నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తారని భావిస్తున్నారు. ఇక, అయోధ్యలో నిర్మించిన మర్యాద పురుషోత్తమ్ శ్రీ రామ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు డిసెంబర్ 30న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో, ఇండిగో ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయి నుంచి అయోధ్యకు నేరుగా విమానాలు నడపాలని నిర్ణయించుకుంది.
ఉదయం 7:30 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రివర్యులు పురుషోత్తం రూపాలాకి బిజెపి శ్రేణులు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. ఈరోజు మధ్యాహ్నం 1 -00 గంటకు కేంద్ర పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, ముత్యశాఖ మంత్రివర్యులు పురుషోత్తం రూపాలా గారి చేతుల మీదుగా స్వర్గీయ. ఆడారి తులసి రావు కాంస్య విగ్రహాన్ని విశాఖ డైరీ ప్రాంగణము నందు ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 1: 45 గంటలకు షీలా నగర్ లోని విశాఖ డైరీ ట్రస్ట్ హాస్పిటల్ నందు క్యాన్సర్ బ్లాకును కేంద్ర మంత్రివర్యులు పురుషోత్తం రూపాలా చేతుల మీదగా ప్రారంభించెదరు. మధ్యాహ్నం 2.00 పాల ఉత్పత్తిదారులు ఆత్మీయ కలియక జరగనున్నది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ను పురస్కరించుకుని ప్రజలు కరుణ, దయ నుంచి ప్రేరణ పొందాలి. క్రిస్మస్ పర్వదినం ప్రేమ, దయాగుణం విశిష్టతను మరోసారి మనకు గుర్తుచేస్తుంది. మానవాళికి నిస్వార్థంగా ఎలా సేవ చేసి తరించాలో ఈ పండుగ మనకు చాటి చెబుతుంది. సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలంటే మనం ఎలాంటి ఆదర్శమయ జీవితం గడపాలో ఏసు క్రీస్తు బోధనలు మనకు విడమరిచి చెబుతాయి. ఇంతటి పర్వదినాన తోటి పౌరులు, ముఖ్యంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు అని రాష్ట్రపతి ఆదివారం తన సందేశంలో పేర్కొన్నారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యాడో లేదో… భారత రెజ్లర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడం తెలిసిందే. సాక్షి మాలిక్ రెజ్లింగ్ కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించగా, భజరంగ్ పునియా తన పద్మశ్రీ పతకాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించాడు. గతంలో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా వ్యవహరించి, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు సంజయ్ సింగ్ సన్నిహితుడు కావడమే దీనంతటికీ కారణం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్యలో నూతనంగా ఎన్నికైన సంజయ్ సింగ్ కార్యవర్గాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నూతన కార్యవర్గం నిబంధనలు పాటించడంలో విఫలమైందని ఆరోపించింది. జాతీయస్థాయి జూనియర్ రెజ్లింగ్ పోటీలు ఈ నెలాఖరులో ప్రారంభం అవుతాయని సంజయ్ సింగ్ డిసెంబరు 21న ప్రకటించారు, నియామవళి ప్రకారం ఓ టోర్నీ ప్రారంభ తేదీకి కనీసం 15 రోజుల ముందు ప్రకటన చేయాల్సి ఉంటుందని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ వివరించింది. సంజయ్ చేసిన ప్రకటనతో రెజ్లర్లు టోర్నీకి సిద్దమయ్యేందుకు తగినంత సమయం లేకుండా పోయిందని, ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. అంతేకాదు, భారత రెజ్లింగ్ సమాఖ్య పూర్తిగా గత కార్యవర్గం అదుపాజ్ఞల్లో పనిచేస్తున్నట్లుందని కేంద్రం పేర్కొంది.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల అలజడి మరింత పెరిగింది. ఇటీవల ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో దారుణానికి ఒడిగట్టారు. బారాముల్లాలోని ఓ మసీదులో రిటైర్డ్ పోలీసు అధికారి మహమ్మద్ షఫీ ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, తీవ్ర గాయాలతో ఆయన ప్రాణాలు కోల్పోయారని కాశ్మీర్ జోన్ పోలీసులు ఇవాళ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇప్పటికే లోయలో ఆర్మీ, పోలీసులు, కేంద్ర పోలీస్ భద్రతా బలగాలు ఉగ్రవాదుల సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. కాగా, ఈ ఘటనతో అధికారులు మరింత పటిష్టంగా తనిఖీలు చేపట్టారు.
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్క రోజులోనే 752 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 21 నుంచి చూస్తే ఇవే అత్యధికం కావడం గమనార్హం. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా నలుగురు మరణించడంతో మరణాల సంఖ్య పెరిగింది. 24 గంటల్లో నమోదైన నాలుగు మరణాల్లో కేరళలో రెండు, రాజస్థాన్, కర్ణాటకలో ఒకటి చొప్పున నమోదయ్యాయి. కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని మళ్లీ కలవరపరుస్తోంది. కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 8.50 లక్షలకు పైగా కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. వైరస్ తో గడిచిన 24 గంటల్లో నలుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు బయటపడ్డ కేరళలోనే వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోందని తెలిపారు. నిన్న బయటపడ్డ కొత్త కేసులు మొత్తం 752 కాగా అందులో 565 మంది కరోనా బాధితులు కేరళలోనే ఉన్నారని వివరించారు. యాక్టివ్ కేసులు కూడా కేరళలోనే అత్యధికమని, వైరస్ బాధితులలో 2,872 మంది కేరళలోనే ఉన్నారని చెప్పారు. గోవాలోనూ జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయని చెప్పారు.
Read Also..
Read Also..
రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో గురువారం 5 గురు జవాన్లు మృతిచెందారు. ఈ క్రమంలోనే జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. పూంచ్, రాజౌరీ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లో సాయుధ బలగాలు జోరుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశారు. టెర్రరిస్ట్‌లు ఉన్నారనే సమాచారంతో భారీగా ఆర్మీ, పారా మిలటరీ, లోకల్ పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు.
Read Also..
Read Also..
కర్ణాటకలో హిజాబ్‌పై నిషేధం ఎత్తివేత కర్ణాటకలోని పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధారణపై ఉన్న నిషేధాన్ని నేటి నుంచి ఉపసంహరించనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించాలని అధికారులను ఆదేశించినట్టు ఆయన తెలిపారు. వస్త్రధారణ ఎంపిక ఒకరి సొంత హక్కు. అందరితో కలిసి అందరి వికాసం అన్న ప్రధాని మోదీ మాటలు బూటకం. బట్టలు, కులం ఆధారంగా బీజేపీ సమాజాన్ని, ప్రజలను విభజిస్తున్నది’ అని సిద్ధరామయ్య అన్నారు. అయితే ఈ నిర్ణయం రాష్ట్రంలో రాజకీయ వివాదాన్ని రేకెత్తించే సూచనలు కనిపిస్తున్నాయి. హిజాబ్ వివాదంపై తీర్పు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.