జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. మంగళవారం కావటం, దీనికి తోడు సమ్మక్క సారళమ్మ జాతరకు ముందు అంజన్నను దర్శనం చేసుకోవటం అనవాయితీ కావటంతో రాష్ర్ట నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అంజన్నను దర్శించుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి గంట సమయం పడుతోంది. క్యూలైన్లు నిండి వెలుపల వరకు భక్తులు బారులు తీరారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆయల అధికారులు తెలిపారు. అనంతరం మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
news
అక్రమ కట్టడాలపై బల్దియా అధికారులు కొరడా జులిపించారు. పార్కింగ్ స్థలాలలో ఉన్న కట్టడాలను తొలగించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఉదయం వరంగల్ చౌరస్తా నుండి ఎంజీఎం జంక్షన్ వరకు పార్కింగ్ స్థలాలలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వాటిని తొలగించారు. ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదుల మేరకు తాము అక్రమ నిర్మాణాలు కూల్చివేసామని ఇకనైనా రోడ్డు సైడ్ ఉన్న వ్యాపారులు నిర్మాణం కోసం తీసుకున్న పర్మిషన్ లో నిర్మాణాలే చేపట్టాలని పార్కింగ్ స్థలాలలో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ సిటీ ప్లానర్ వెంకన్న తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాలలో గత నాలుగు సంవత్సరాల నుండి విపరీతమైన క్రైమ్ జరుగుతుందని అన్నారు. శిల్పా వెంచర్ లో మైనర్ బాలిక అనుమానస్పదంగా చనిపోయిన విషయం రెండు రోజులుగా వింటున్నామని అన్నారు. దానిపైన పోలీసులు గాని ఎమ్మెల్యే గాని ఎందుకు స్పందించడం లేదని కొంతమంది మాట్లాడుకోవడం, మీడియా లో అమ్మాయిని రేప్ చేసి చంపినట్లు అనుమానిస్తున్నారని ఆయన అన్నారు. పోలీసులు ఎమ్మెల్యే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అనుచరుడే మద్యం అమ్ముతూ పట్టుబడ్డాడని, అభివృద్ధి పై ఎమ్మెల్యే తో చర్చకు సిద్ధమని, ఎక్కడకి చెబితే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. నేను ఎవరితో టచ్ లో లేను శిల్పా వారే టీడీపీ తో టచ్ లో వున్నారని అన్నారు. టిక్కెట్ కోసమే అందరం కష్ట పడుతున్నామని ఒకవేళ టిక్కెట్ రాకపోతే అప్పుడు మాట్లాడుతానని ఆయన అన్నారు. పార్టీ పదవులు మార్చాలంటే అచ్చం నాయుడు నుంచే రావాలని, చంద్రబాబు నాయుడు గారు నంద్యాలకు వస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
రిటైర్డ్ కార్మికుల కోసం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) అధ్యక్షులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కొరిమి రాజ్ కుమార్ యాజమాన్యంతో మాట్లాడి వారికి రిటైర్డ్, డెత్ రావలసిన బకాయిలు సింగరేణి యాజమాన్యం కార్మికుల చేసే అడిట్ జాప్యం వలన రెండు రోజులు లేట్ కావడంతో కొన్ని సంఘాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. వెంటనే రావాల్సిన బకాయిలు ఇవ్వాలని వొత్తిడి ఫలితంగా రిటైర్డ్ కార్మికులకు (Not On Roles ) వారికి రావాల్సిన లాభాల వాటా 32% PLR బోనస్ మరియు వెజ్ బోర్డ్ ఏరియల్స్ ఈ రోజు చెల్లించనున్నట్టు యాజమాన్యం తెలిపింది. కావున ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారము కార్మికులకు రావలసిన బకాయిలను ఇప్పించుటలో కార్మికుల సమస్యలు ఫై ఏఐటీయూసీ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు.
NTR జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం రంగుల మహోత్సవం 2024 సందర్భంగా పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ నందు మండల రెవెన్యూ అధికారులు, దేవాదాయ శాఖ సిబ్బంది సమక్షంలో జరిగింది. పోలీస్ వారి సమక్షంలో శ్రీ అమ్మవారు మరియు పరివార దేవతలను పెనుగంచిప్రోలు నుండి జగ్గయ్యపేట తీసుకువేళ్ళుటకు ఎద్దుల బండ్ల లక్కీ డ్రా ను చిన్న పిల్లల చేత పోలీస్ స్టేషన్ నందు నిర్వహించారు. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి కోసం ఎద్దుల బండికి, బర్రెల పెద్ద వెంకయ్య గోపయ్య స్వామి కోసం ఎద్దుల బండికి కొత్తగుండ్ల అజయ్ కుమార్ ఎంపిక కాబడినారు. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయ పాలక మండలి చైర్ పర్సన్ జంగాల శ్రీనివాసరావు, ఎస్ ఐ దుర్గప్రసాద్, మండల రెవెన్యూ అధికారులు, ఆలయ అధికారులు, గ్రామానికి చెందిన ఎద్దుల బండ్ల యజమానులు పాల్గొన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కార్యాలయంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కేశినేని చిన్ని. ఎంపీ కేసినేని నాని పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేశినేని చిన్ని. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఎంపీ కేశినేని నాని దేవినేని అవినాష్ కు ముఖ్య అనుచరుడుగా మారాడు. దేవినేని అవినాష్ ఎటు తిరిగితే ఆయన వెనుక నాని అటు తిరుగుతున్నాడు. కేశినేని నాని వైసీపీలోకి వెళ్లాక ముగ్గురు నలుగురు కూడా నాని వెంట లేరు. కేశినేని నానికి విజయవాడ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో టిడిపిని ఖాళీ చేయడం కేశినేని నాని వల్ల కాదు. కొడాలి నానిలా బూతులు మాట్లాడుతూ కేశినేని నాని తయారయ్యాడు. మేము గేట్లు తెరిస్తే వరదలా రావడానికి వైసిపి నేతలు సిద్ధంగా ఉన్నారు. దుష్ట పరిపాలన అంతమొందించడమే చంద్రబాబు లక్ష్యం.
చిత్తూరు జిల్లా, కుప్పంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కుప్పం పట్టణంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం నియోజకవర్గ ఇంచార్జి మునిరత్నం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుప్పం బైపాస్ కూడలిలోని నారా లోకేష్ కటౌట్ పాలాభిషేకం నిర్వహించారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్న క్యాంటీన్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
మెదక్ లోని నవాబు పేట వీధిలో యువకుడి దారుణ హత్య, జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో సోమవారం రాత్రి బొండుగుల నగేష్ (25) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. రంజిత్ కుమార్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. నగేష్ తమ్ముడు విజయ్ పాల్ రంజిత్ కుమార్ అక్కని సోమవారం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆగ్రహించిన రంజిత్, నగేష్ ను పొడిచాడు. ఈ ఘటనలో నగేష్ చనిపోగా, అతని తండ్రి యాదగిరి, కజిన్ పోతరాజు సాయి కుమార్ కు గాయాలయ్యాయి.
మంచిర్యాల జిల్లాలో మైనర్ బాలిక ప్రసవం కలకలం రేపింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చింది. తనకు కడుపు నొప్పి వస్తుందని తల్లికి చెప్పడంతో ఆమెను ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో ప్రసవించింది. ఆమెను మాతా శిశు సంక్షేమ ఆసుపత్రికి తరలించారు. తల్లీ శిశువు క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మైనర్ బాలికను గర్భం దాల్చింది ఎవరు అని జిల్లా కేంద్రంలో చర్చ కొనసాగుతుంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు ధర్యప్తులో విషయం తెలనుంది.