ఎన్నికల హామీల అమలుపైతొలిఐదు సంతకాలతో చంద్రబాబు పాలనప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు,కూటమి కార్యకర్తలు ఆనందోత్సాహాలతో ఉన్నారని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఆయనమీడియాతో మాట్లాడుతూ మెగాడిఎస్సి గా 16,347 టీచర్ పోస్టులు భర్తీ,ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు,పేదలకు పింఛను 4000,అన్నా క్యాంటీన్లకు మళ్లీ శ్రీకారం,స్కిల్స్ సక్సెస్ పై ఐదో సంతకం చేసినట్లు తెలిపారు.పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప..అదేవిధంగా సంక్షేమం ఉపాధి ఉద్యోగం వ్యవసాయం నైపుణ్యం తదితర పథకాలే ధ్యేయంగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారనిఅన్నారు.రాష్ట్రంలో అధికారులతో పాటు నాయకులు కార్యకర్తలు అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపినట్లు రాజప్ప పేర్కొన్నారు.పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప..ఇప్పటికే వివిధ నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు ప్రారంభించినట్లు తెలిపారు.అదేవిధంగా పెద్దాపురం సామర్లకోట పురపాల సంఘ పరిధిలో ఉన్న అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజప్ప తెలిపారు…
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 90534