భారతీయ జనతా పార్టీ గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ (ఇంచార్జ్) కురుమద్దాలి ఫణి కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు, సంబరాల్లో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాదు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాదెండ్ల మోహన్, రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులు కానూరు శేషు మాధవి బిజెపి నాయకులు, ఈ సందర్భంగా కురుమద్దాలి ఫణి కుమార్ మాట్లాడుతూ దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసింది చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో కంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓటు శాతం పెరిగినందుకు సంతోషిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయానికి కృషి చేస్తాం. భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నంతకాలం మనదేశానికి ఏ విధమైన ఆటంకం గాని కీడులుగాని జరగవని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ప్రజలు కూడా తెలుసుకోవాలని మనవి చేస్తున్నాం.
pm modi
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బిజెపి సభకు భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని డోర్నకల్ మహబూబాబాద్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు భూక్యా సంగీత, జాటోత్ హుస్సేన్ నాయక్ ల ను గెలిపించాలని ప్రజలకు సూచించారు. కాగా ఈ వేదికపై ఆసక్తికర సన్నివేశం నెలకొన్నది.
ప్రధాని మోదికి డోర్నకల్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థిని భూక్యా సంగీత గిరిజన సాంప్రదాయ ఆభరణాలను అందించారు. తదుపరి ప్రధాని కాళ్లకు సంగీత నమస్కరించారు. ఇది సాధారణంగా ప్రతి వేదికలపై జరిగే విషయమే కానీ దేశ అత్యున్నత స్థానమైన ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోడీ అతి సాధారణ మారుమూల గిరిజన తండాలో పుట్టిన ఎమ్మెల్యే అభ్యర్థిని పాదాలకు తిరిగి నమస్కరించారు. కాగా ఈ సన్నివేశం సభలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దేశ ప్రథమ పౌరుడైన మహిళల పట్ల ఇచ్చే అత్యున్నత గౌరవం భాజపాకు మాత్రమే సాధ్యమవుతుందని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు.
Read Also
తెలంగాణకు వచ్చినప్పుడల్లా ప్రజల్లో ఆశావాహ దృక్పథాన్ని చూస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ స్వార్థ పార్టీలని విమర్శించారు. తెలంగాణ ప్రజల్లో తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ అవినీతి పాలన వల్ల ప్రజల సామర్థ్యాలు వెలుగులోకి రావటంలేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణేనికి రెండు ముఖాలని కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే బీఆర్ఎస్ కు వేసినట్లేనన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే నా లక్ష్యమని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే బీసీ వ్యక్తి సీఎం అవుతారన్నారు. మాదిగల వర్గీకరణకు కొత్తగా కమిటీని ఏర్పాటు చేశామని మోదీ వెల్లడించారు.
కుత్బుల్లాపూర్ ప్రజల ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్న. కుత్బుల్లాపూర్ లో బలమైన నాయకుడు శ్రీశైలం గౌడ్. కుత్బుల్లాపూర్ లో ఏ సమస్యలు ఉన్న భారతీయ జనతా పార్టీ, జనసేన సమిష్టిగా పోరాడుతుంది దేశానికి మోడీ గారి లాంటి బలమైన నాయకత్వం కావాలి. నా మిత్రుడు శ్రీశైలం ను ఎమ్మెల్యేగా గెలిపించాలి. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఎంతైనా ఉంది బీసీ ముఖ్యమంత్రి బిజెపితోనే సాధ్యం. నరేంద్ర మోడీ గారికి ఓటేస్తే పవన్ కళ్యాణ్ కు ఓటేసినట్టే. కుత్బుల్లాపూర్ లో శ్రీశైలం గౌడ్ కు ఓటేస్తే పవన్ కళ్యాణ్ కు, జనసేనకు వేసినట్టే. దేశంలో ఉగ్రదాడులు జరగకుండా బలంగా నిలబడిన పార్టీ బిజెపి. నరేంద్ర మోడీ గారి లాంటి ఒక బలమైన నాయకత్వంలో దేశం ప్రగతిపథాన నడుస్తుంది.
ఎన్నికల సమయంలో ఎం మాట్లాడాలో, ఎవరి గురించి చెప్పాలో అది చెప్పాలని వచ్చాను. బిఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎవరు సంతోషంగా లేరు. గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి ప్రాజెక్టులు పూర్తయ్యాయా, ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ముల్కనూర్ గ్రామంలో ఏమయిన అభివృద్ధి జరిగిందా, స్థానిక ఎమ్మెల్యే భూ నిర్వాసితుల పక్షాన మాట్లాడడా, 10 సంవత్సరాలు గడుస్తున్న నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాడ, వడ్ల తూకంలో ఎక్కువ తరుగు తీస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఏం చేశాడు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదువులు ఇచ్చాడు కానీ, ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంలో చాలా అవినీతి జరిగింది. రైతుల రుణమాఫీ చెయ్యలేదు రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక లో కాంగ్రెస్ రైతులకు రుణ మాఫీ చేసింది ఆదాని కి దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ అప్పగిస్తున్నాడు. రైతు ఒక్కరోజులో 70 రూపాయలు సంపాదిస్తుంటే, అధాని మాత్రం 16 వందల
కోట్లు సంపాదిస్తున్నారు. 10 సంవత్సరాలు బిఆర్ఎస్ పాలన చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర అభివృద్ధికి ఒక ప్రణాళిక తో మీ ముందుకు వచ్చింది. ఎంఐఎం తెలంగాణలో పుట్టిన పార్టీ దేశంలో వివిధ రాష్ట్రాల్లో 50, 60 సీట్లలో పోటీ చేస్తుంటే రాష్ట్రంలో 8, 9 సీట్లకు ఎందుకు పోటీ చేస్తుంది. ఓవైసీ ఎప్పుడు రాహుల్ గాంధీ ని నిందిస్తారు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రజలను రాహుల్ గాంధీ కలిశారు. బిఆర్ఎస్ బిజెపి ఎంఐఎం కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. ఎందుకంటే వల్ల అవినీతి సొమ్మును బయటికి తీసి, ప్రజలకు పంచుతామని, సోనీయామ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమెను మీరు గౌరవిస్తారు. మహాత్మా గాంధీ నుండి ఇప్పటి వరకు మేము ప్రజల కోసం కొట్లాడుతున్నాము. ప్రజల సంపద ప్రజలకే చెందాలని కాంగ్రెస్ చూస్తుంది. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారం లోకి రాగానే 6 గ్యారంటీ లు అమలు చేస్తాం. ఛత్తీస్ ఘడ్, కర్ణాటక రాష్ట్రాల్లో చేసి చూపించాం. హుస్నాబాద్ లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం. మీరు ఈ సారి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, కాంగ్రెస్ మీ అభివృద్ధి కోసం పాటుపడుతుంది. మీరు ఈ సారి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, 5 ఎండ్ల తరవాత వచ్చి నేను ఇదే వేదిక పైన ఎం చేశామో గర్వంగా మాట్లాడుతాను. తెలంగాణ కోసం కొట్లాడింది మీరు, రాష్ట్రం మీది, మీకోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది.
కొడంగల్ ఎమ్మెల్యే అభ్యర్థి బంటు రమేష్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల..
నారాయణపేట జిల్లా కోస్గి పట్టణ కేంద్రంలో కోడంగల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బంటు రమేష్ కు మద్దతుగా కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల, బిజెపి నాయకులు చీకోటి ప్రవీణ్ కుమార్ లు హాజరై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రచార సభలో మాట్లాడుతూ..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశాన్ని ప్రపంచంలోనే గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేశారని అన్నారు… ప్రపంచంలోని దేశాల్లో భారతదేశం ఆర్థిక రంగంలో ఐదవ స్థానంలో ఉందని, వచ్చే ఐదేళ్లలో మూడవ స్థానంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గం లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బంటు రమేష్ ను గెలిపిస్తే, రైల్వే లైన్ తో పాటు, పలు అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.అనంతరం చీకోటి ప్రవీణ్ మాట్లాడుతూ….ధర్మం కోసం, దేశం కోసం పోరాడే బంటు రమేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ లో అందరూ c m క్యాండెట్ లే నని ఎద్దేవా చేశారు.హిందూ మిత్రులారా మీరు తప్పకుండా బా జ పా కి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
బీజేపీ తోపాటు జనసేన పార్టీ సేవలు అవసరం అనిపిస్తుంది. బీసీ బిడ్డను సీఎం గా చూడాలని బీజేపీ కోరుతున్న అజెండాలో నేను కూడా ఒక్కడిని. ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మణించింది. తెలంగాణలో కనీసం త్రాగు నీళ్లు లేని తండాలను గతంలో నేను గుర్తించా. అదిలాబాద్ జిల్లా ఓ తండాలో నేను భోరు బావి వేయించా. వరంగల్ తూర్పు, పశ్చిన అభ్యర్ధులను ఖచ్చితంగా గెలిపించుకుంటాం.. ఇక నుండి మీ కష్టసుఖాల్లో నేను పాలు పంచుకుంటా. అవినీతి రహిత తెలంగాణను నేను కోరుకుంటున్నా. గద్దర్ తో కలిసి సామాజిక తెలంగాణ సాధించాలనుకున్నా. మోడి తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిగా హామి ఇచ్చారు. ఇప్పటికే ముప్పై ఒక్క మంది ఓబీసీలను కేంద్ర మంత్రులుగా నియమించారు. గద్దర్ మరియు నా ఆశయాలు నెరవేరే క్షణం ఇప్పుడు సాకారం అవ్వబోతుంది. బీజేపి అధికారంలోకి రాగానే ఓరుగల్లు భద్రకాళి వారికి మొక్కులు తీర్చుకుంటా. తెలంగాణ నా గుండె చప్పుడు…ఆ మాట వింటే చాలు నా రోమాలు నిలుచుంటాయి. రౌడీలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొంటున్న నేను తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తాను. నాకు దన బలం లేకున్నా గుండె బలం వచ్చింది తెలంగాణ ఉద్యమ ఘటనలే… పదె పదె గద్దర్ ప్రస్తావన తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్…నాకు ఇష్టమైన నాయకుడు భాతర ప్రధాన మంత్రి నరేంద్ర మోది…తెలంగాణ సాధనలో భవిష్యత్తు కోసం 1200 అమరులయ్యారో వారి సాక్షిగా భవిష్యత్తు కోసం జనసేనా కొనసాగిస్తుంది.
తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ప్రవళిక వంటి యువత ఆత్మహత్యలు జరగకుండా చూస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అత్యంత అవినీతిమయ ప్రభుత్వం కేసీఆర్‌దే అన్నారు. అధికారంలోకి రాగానే సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఓవైసీ ఒత్తిడికి లొంగి కేసీఆర్… రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో ఉమ్మడి ఏపీకి రూ.2 లక్షల కోట్లు ఇస్తే, మోదీ ప్రభుత్వం ఒక్క తెలంగాణకే రూ.2.5 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు. ప్రధాని మోదీ ఓబీసీలకు సముచిత స్థానం కల్పించారు. ఎంబీబీఎస్ సీట్లలో బీసీలకు 25శాతం రిజర్వేషన్లు కల్పించామని అమిత్ షా వివరించారు.
ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ గర్జన సభలో పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సమావేశం అనంతరం ప్రధాని తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. ఎల్బీ స్టేడియంలో జరగనున్న బీసీ గర్జన సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర బీజేపీ కూడా ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందిని సభకు తరలించేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. సభ ఏర్పాట్లను పార్టీ ప్రతినిధుల బృందం పరిశీలిస్తోంది. ఎజెండాతోనే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతామని బీజేపీ నేతలు చెబుతున్నారు.
తెలంగాణలో మెజారిటీ ఓటర్లుగా ఉన్న బీసీ ఓట్లను దక్కించుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. తెలంగాణలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను అన్ని పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, అయితే మరే ఇతర పార్టీ వారికి రాజ్యాధికారం ఇవ్వదనే కోణంలో బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీసీలకు రాజ్యాధికారం దక్కడం బీజేపీతోనే సాధ్యమని ప్రచారం చేస్తున్నారు.
తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా సూర్యాపేట సభలో తెలంగాణలో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ అని ప్రకటించారు. బీసీ సీఎం విషయంలో బీజేపీ నేతలు ప్రచార అస్త్రంగా వాడి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించనున్నారు. బీసీ గర్జన సభలో ప్రధాని మోడీ ప్రకటించి బీసీ డిక్లరేషన్‌లో ఎలాంటి అంశాలు, హామీలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆ పార్టీ ముఖ్యనేతలు రాష్ట్రానికి రానున్నారు. మొత్తం 40 మంది నేతలు ప్రచారంలో పాల్గొననున్నట్లు బీజేపీ ప్రకటించింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు ఈ ప్రచారానికి రానున్నారు. ఈ మేరకు ముఖ్యనేతల పేర్లను భాజపా వెల్లడించింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలూ ఉన్నారు.క్యాంపెయినర్ జాబితాలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల, రాజాసింగ్, లక్ష్మణ్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేయనున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, యడియూరప్ప. ఇదిలాఉండగా ప్రచారం కమిటీలో ఉన్న విజయశాంతి కి కమిటీలో చోటు దక్కలేదు. కనీసం విజయశాంతితో మాట్లాడేందుకు కూడా బీజేపీ నేతలు యత్నించలేదు.




Total views : 89016