బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా చేవెళ్ల ఎంపీ, బీఆర్ఎస్ నేత రంజిత్ రెడ్డిపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తమ పార్టీకి చెందిన నేతలు, సర్పంచ్‌లను ఎందుకు కలుస్తున్నావని, ఎందుకు మాట్లాడుతున్నావంటూ అగౌరవంగా మాట్లాడారని, అసభ్యకరంగా మాట్లాడారని విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు జనవరి 17న రంజిత్ రెడ్డి తనకు కాల్ చేశారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. రంజిత్‌రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 504 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు విషయంలో న్యాయ సలహా తీసుకున్నామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపారు. నాంపల్లిలోని మూడో ఏసీఎంఎం కోర్టును సంప్రదించగా పోలీసులకు కీలక సూచనలు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉన్న సమయంలో జరిగిన ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Tag:
police case
పేరు మోసిన అంతర్రాష్ట్ర దొంగతో పాటు మరో ఇద్దరిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురి నుంచి సుమారు రూ. 12 లక్షల రూపాయల విలువచేసే 24 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనంచేసుకున్నారు. వీరిపై ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలో 50 కి పైగా కేసులు నమోదయ్యాయి. దొంగలను పట్టుకున్న అనంతపురము రూరల్, పుట్లూరు మరియు గుంతకల్లు వన్ టౌన్ పోలీసులను ఎస్పీ అభినందించారు. జల్సాలకు అలవాటుపడి డబ్బు సంపాందించాలని దొంగతనాలకు అలవాటు పడ్డారని ఎస్పీ తెలిపారు.




Total views : 92871