అన్నమయ్య జిల్లా, రాయచోటి పిడి హౌసింగ్ కార్యాలయంలో వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ పై దాడికి ప్రయత్నించిన మరో వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీ హరి. అవమానంతో పెట్రోల్ తో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రమేష్ నాయక్…తన భార్యతో కలిసి హౌసింగ్ కార్యాలయంలోనే ధర్నాకు దిగిన రమేష్ నాయక్… రాయచోటి జగనన్న కాలనీలో వర్క్ ఇన్స్పెక్టర్ లుగా పని చేస్తున్న రమేష్ నాయక్, హరి ప్రసాద్. నాకు నా కుటుంబ సభ్యులకు ఏమి జరిగిన వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీ హరి, పీలేరు డి ఈ గోపాల్ నాయక్, రాయచోటి డి ఈ చంద్రశేఖర్, హౌసింగ్ పిడి సాంబ శివయ్య లదే బాధ్యత. ఎస్పీ కి పిర్యాదు చేయనున్న రమేష్ నాయక్ కుటుంబ సభ్యులు. మీడియా వస్తున్న విషయాన్ని తెలుసుకొని అదృశ్యమైన ఉన్నత అధికారులు…..
Police
రాష్ట్రంలో పోలీసు నియామకాలు వెంటనే చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలు లేకుండా ఈ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. పోలీస్, వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రెటేరియట్లో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సెలక్షన్ ప్రక్రియలో ఉన్న లోపాలు, పరిష్కారాలు, రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకూ జరిగిన రిక్రూట్మెంట్లపై కూడా నివేదిక ఇవ్వాలని కోరారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ స్కూల్ మాదిరిగా ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఎనిమిదేళ్లుగా హోంగార్డు నియామకాలు లేవని పేర్కొన్న సీఎం, వెంటనే నియామకాలు చేపట్టాలని కూడా ఆదేశించారు. హోం గార్డు సేవలు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు వినియోగించాలని కూడా సూచించారు.
ఏలూరు శివారు జాతీయ రహదారిపై దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు యువకులు, ఇద్దరు మైనర్లను పెదపాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఏలూరులోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు డీఎస్పీ అశోక్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి నిందితులు అనేక దారి దోపిడీలకు పాల్పడినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 2 ఆటోలు, 2 బైక్ లు, 2వేల 200 నగదును రికవరీ చేసినట్లు వెల్లడించారు. రెండు రోజుల క్రితం కలపర్రు టోల్ ప్లాజా వద్ద రాత్రి సమయంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీ డ్రైవర్ను కత్తితో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో తనపై కేసు నమోదైన విషయం వాస్తవమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. దీనిని ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా చూడట్లేదని అన్నారు. భూకబ్జాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు. శామీర్ పేట్ మండలంలోని కేశవాపురం గ్రామంలో 47 ఎకరాల భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని గ్రామస్థులు ఆరోపించారు. ఎన్నికల సమయంలో రాత్రికిరాత్రే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మండిపడ్డారు. తన అనుచరులతో కలిసి మల్లారెడ్డి ఈ దందా చేశారని కేశవాపురం గ్రామస్థులు చెప్పారు. దీనిపై పోలీసులను ఆశ్రయించగా మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు తొమ్మిది మంది, తహసీల్దార్ పై కేసు నమోదు చేశారని వివరించారు. మల్లారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. మాజీ మంత్రి అనుచరులపై చీటింగ్ కేసు నమోదు చేశామన్నారు.
Read Also..
Read Also..
శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్ పోస్ట్ వద్ద భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. పోలీసుల తనిఖీల్లో భాగంగా పెద్ద మొత్తంలో కంటైనర్ ద్వారా అనంతపురం వైపు నుండి జాతీయ రహదారిపై బెంగళూరుకు వెళ్తున్న కంటైనర్ వాహనాన్ని పోలీసులు ముందస్తు సమాచారంతో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో కంటైనర్ లో బెంగళూరుకు తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకొన్నారు. ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోడికొండ చెక్ పోస్ట్ మీదుగా బెంగళూరు వెళ్తున్న కంటైనర్ ని ఆపి చెక్ చేయగా గంజాయి బయటపడింది. గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతోనే పోలీసుల దాడులు గంజాయి విలువ భారీ మొత్తంలో ఉన్నట్లు సమాచారం.
పోలి స్వర్గస్నానం చేసేందుకు విజయవాడలో కృష్ణా నదికి భక్తులు పోటెత్తారు. ఇంద్రకీలాద్రి వద్దకు కుటుంబాల సమేతంగా తరలివచ్చారు. దుర్గా ఘాట్ భక్తులతో కిటకిటలాడింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారు జాము మూడు గంటల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు పోలి స్నానం ఆచరించి కార్తీక దీపాలు వదిలారు.
Read Also..
Read Also..
జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ను వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలోని నొవాటెల్ హోటల్ వద్ద ఆందోళన చేస్తున్న మనోహర్ ను, ఇతర జనసేన నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో అక్కడి నుంచి తరలించారు. టైకూన్ కూడలిలో రోడ్డు మూసివేతను నిరసిస్తూ మనోహర్ నేతృత్వంలో జనసేన ధర్నా చేసింది. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా నిర్మిస్తున్న కట్టడానికి వాస్తు బాగోలేదని రోడ్డును మూసేశారని ఈ సందర్భంగా మనోహర్ మండిపడ్డారు. వైసీపీ నేతల నిర్మాణాలకు వాస్తు దోషం ఉంటే రోడ్లను మూసేస్తారా అంటూ ప్రశ్నించారు. తమ ధర్నా రాజకీయ కార్యక్రమం కాదని శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమమని మనోహర్ చెప్పారు. తమ ధర్నా కార్యక్రమం గురించి తెలిసి నిన్నటి నుంచి పోలీసులు పలు విధాలుగా తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. తమ వాళ్లను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారని అన్నారు. వైసీపీ నేతల ట్రాప్ లో పోలీసు అధికారులు పడొద్దని సూచించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని విమర్శించారు.
చిరు వ్యాపారాల పైన జులుం ప్రదర్శిస్తున్న దాచేపల్లి నగర పంచాయతీ కమిషనర్ మరియు పోలీసులు. అక్రమంగా రాత్రి సమయంలో తమ వ్యాపారాల మొత్తాన్ని కాళీ చేయించారంటు దాచేపల్లి లో కార్మికుల ఆందోళన. పల్నాడు జిల్లా దాచేపల్లి కోట్ల బజారుకు వెళ్ళే దారికి ఇరువైపులా ఉన్న పూల, కాయల బండ్ల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని దాచేపల్లి మున్సిపల్ కమిషనర్ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉదయం నాలుగు గంటల నుంచి ఇరువైపులా ఉన్న బండ్లను తొలగిస్తున్న అధికారులు. రోడ్డున పడ్డ వందలాది కుటుంబాలు. మా వ్యాపారాలు మొత్తం పోయాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న రోజు వారి ఫ్రూట్ బండి కార్మికులు. రెక్క ఆడితే కానీ డొక్కా ఆడని బ్రతుకులు మావి, అలాంటిది మా వ్యాపారాలు పోవడంతో మాకు ఆత్మహత్యలే దిక్కు అంటున్న దాచేపల్లి కార్మికులు.
ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వులు మేరకు గిద్దలూరు ci దేవ ప్రభాకర్ కంభం సీఐ రాజేష్ గిద్దలూరు టౌన్ లోని అర్బన్ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు టౌన్ అర్బన్ కాలనీలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా 16 బైకులు రెండు ఆటోల కు సరైన లైసెన్సు పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ కార్యక్రమంలో కంభం మండలం సిఐ గిద్దలూరు మండలం సిఐ దేవ ప్రభాకర్ మరియు ఆరు మండలాల ఎస్సై లు పాల్గొన్నారు. అర్బన్ కాలనీ లోని వాసులకు సీఐ దేవ ప్రభాకర్ పలు అంశాలపై సూచనలు ఇచ్చారు.
తిరుపతి అటవీప్రాంతం పరిధిలో పోలీసులు10 మంది ఎర్రచందనం దొంగలను అరెస్టు చేసారు. భాకరాపేట రేంజ్ లో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తుండగా పోలీసులు దోంగలను పట్టుకున్నారు. 306 కిలోల ఎర్రచందనం దుంగలను, రెండు కార్లు, ఒక మోటారు సైకిల్ ను పోలీసు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూర్ జిల్లాకు చెందిన ఇద్దరు స్మగ్లర్లు, 8 మంది కూలీలును పోలీసులు అరెస్టు చేసారు.