హైదరాబాద్, డిసెంబర్ 14న రాష్ట్ర సమాచార, రెవిన్యూ, గృహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రిని ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, వేముల వీరేశం, ఆదినారాయణ, బాలు నాయక్, ఆది శ్రీనివాస్, యశస్వినీ రెడ్డి తోపాటు పలువురు సీనియర్ నాయకులు రేణుకా చౌదరి, రామసహాయం సురేందర్ రెడ్డి, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్ అండ్ బీ కార్యదర్శి శ్రీనివాస రాజు, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ కె. అశోక్ రెడ్డి, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, జేడీ లు జగన్, శ్రీనివాస్, వెంకట రమణ, డీడీ లు మధు సూధన్, హాష్మి, రాజా రెడ్డి, సీఐఈ రాధా కిషన్, వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. భువనగిరిలో స్పోర్ట్ కాంప్లెక్స్ కు 10 ఎకరాల భూమి భువనగిరి జిల్లా రాయగిరి లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి పది ఎకరాల భూమిని కేటాయిస్తూ తన మొదటి ఫెయిల్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంతకం చేశారు. రూ. 9.50 కోట్ల విలువ గల ఈ పదెకరాల స్థలాన్ని మల్టి పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి చేపట్టేందుకు యువజన, క్రీడల శాఖకు కేటాయించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల డీపిఆర్ఓ లకు అధునాతన కెమెరాలు అందచేసే సమాచార, పౌర సంబంధాల శాఖ కు చెందిన ఫైల్ పై మంత్రి పొంగులేటి సంతకం చేశారు. గృహ నిర్మాణ శాఖ కు చెందిన పలు పరిపాలనా సంబంధిత ఫైళ్ల పై సంతకం చేశారు.
ponguleti srinevasa reddy
ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ని డెప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాటల వరకే పరిమితం కాకుండా మొదటి రెండు రోజుల్లో నే ఆరు గ్యారెంటీ ల్లో రెండు గ్యారెంటీ లను అమలు చేసిందన్నారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను అమలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టభోతోందని శ్రీనివాస రెడ్డి తెలిపారు.
Read Also..
ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రుల హోదాలో తొలిసారి ఖమ్మం జిల్లాకు వస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ముగ్గురు మంత్రులు జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్దకు చేరుకున్నారు. వీరికి కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో వచ్చి ఘన స్వాగతం పలికారు. మంత్రులు ర్యాలీగా ఖమ్మం బయలు దేరారు. అనంతరం మంత్రులు పాలేరు నుండి భద్రాచలం వరకు వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు.





Total views : 75313