మండల కేంద్రం ఉలవపాడు లోని జి. వి.ఎస్.ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సందర్శించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జిలానిభాష కళాశాల విద్యార్థుల సంఖ్య గురించి ప్రశ్నించారు కళాశాల విద్యార్థుల సంఖ్య పెంచాలని అందుకు అవసరమైన మౌలికవస్తులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు కళాశాల లో విద్యను మధ్యలో వదిలేసిన విద్యార్థులతో మరల పరీక్ష రాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కళాశాలలో ట్యూబ్ లైట్లు వారంలో బిగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఆయనతో ఆర్ జె డి సుబ్బారావు జిల్లా విద్యాశాఖ అధికారి గంగాభవాని సబ్ కలెక్టర్ శోభిక డిప్యూటీ శ్రీనివాసులు విద్యాశాఖ అధికారులు ప్రసాద్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు
prakasham district news
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం లోని నల్లగుంట్ల గ్రామంలో త్రాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఉన్న మహిళలు బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాకు చివరు అయిన అడవి ప్రాంతంలో నివసిస్తున్న మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ట్యాంకర్ ద్వారా నీటి సరఫరాను ఆపివేయడం జరిగింది. తమ నీటి కష్టాలను తీర్చి ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయాలని మంత్రిని స్థానిక అధికారులను కోరారు
ప్రకాశం జిల్లా దర్శి లో పోలీసుల కార్డెన్ సెర్చ్ లో 21 బైకులు, 4 ఆటోలు స్వాధీనం….వివరాల్లోకి వెళ్తే, దర్శి లోని ఆటోనగర్ 11 వ లైన్ ప్రాంతం లో గంజాయివ్యాపారం జోరుగా జరుగుతుందని, వివిధ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువస్తున్నారని కార్డెన్ సెర్చ్ చేయగా ఎటువంటి పత్రాలు లేని 21 బైకులు, 4 ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కార్డెన్ సెర్చ్ లు నిరంతరంగా తాళ్లూరు,దర్శి, ముండ్లమూరు ప్రాంతాల్లో తరచుగా జరుగుతాయని దర్శి సీఐ జె. రామకోటయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో లో దర్శి ఎస్సై డి.రామకృష్ణ, దర్శి సీఐ మరియు సెబ్ అధికారులు పాల్గొన్నారు
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తూ ప్రజలను వేదించుకుతింటున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే లక్ష్యంగా ఇరు పార్టీల నాయకులు సమన్వయంతో కలిసి పోరాడాలని మార్కాపురం టీడీపీ ఇంచార్జ్ కందుల నారాయణరెడ్డి మరియు జనసేన ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్లు టీడీపీ, జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం మార్కాపురం పట్టణంలోనీ సౌజన్య ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో మార్కాపురం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇరు పార్టీల ఇంచార్జ్ లు మాట్లాడుతూ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వెనుకబడిన మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించడమే కాకుండా త్వరితగతిన వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీరు ఇస్తామని అన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజలు ఏవైతే కోల్పోయారో వాటిని తిరిగి ప్రజలకే ఇప్పించడం జరుగుతుందని అన్నారు. ప్రజలు ఎవరు కూడా భయపడనవసరం లేదని మీ వెంట టిడిపి, జనసేన నాయకులు ఉంటారని ఆ విధంగా ప్రజలకు ధైర్యం కల్పించి పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా సమన్వయంతో ముందుకు సాగుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం జనసేన ఇన్చార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ ఒకప్పుడు నేను కూడా టిడిపి సభ్యుడినేనని మా మధ్య ఎటువంటి బేదాభిప్రాయాలు లేవని అన్నదమ్ముల్లాగా కలసి ముందుకు సాగుతామని ఎవరు ఎటువంటి అపోహాలు పడవలసిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రం అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అన్నీ వర్గాలను వేదించటమే పనిగా పెట్టుకున్నారని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సమిష్టి పోరాటానికి సిద్ధమయ్యారని, వారి ఆదేశాల మేరకు మార్కాపురం నియోజకవర్గంలో కూడా కలిసికట్టుగా కృషి చేసి, రాష్ట్రంలో వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రతీ ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ప్రతీ గ్రామంలో సమన్వయంతో పని చేసి రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన సైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమన్వయ కమిటీ కార్యక్రమంలో టిడిపి నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున, తాళ్లపల్లి సత్యనారాయణ, కాకర్ల శ్రీనివాసులు, రామాంజనేయరెడ్డి, జనసేన నాయకులు,షేక్ సాదిక్, కాశీ రత్నం, ఇరు పార్టీల ముఖ్య నాయకులు,టీడీపీ జనసేన కార్యకర్తలు, అభిమానులు, భారీ సంఖ్యలో పాల్గోన్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుల ఉన్నత పాఠశాలలో దీపావళి పండుగ సందర్భంగా 10-11-23 నుండి 12-11-23 వరకు 19 షాపులకు పర్మిషన్ ఇవ్వగా పర్మిషన్ టైం అయిపోయినా కానీ మమ్మల్ని ఎవరేం చేస్తారు అంటూ ఈరోజు కూడా వారి దుకాణాలను కొనసాగించుకోవడం ప్రశ్నార్థకంగా ఉన్నది అధికారులకు కావాల్సిన అంత మామూలు అందిన వేమోకానీ వారి చూపు మాత్రం అటువైపు లేవు. కంటికి కనపడటం లేదు ఫైర్ స్టేషన్ అధికారులకు వారికి కేటాయించిన స్థలంలో ఎవరు లేకపోవటం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది. దీపావళి దుకాణాలు ఈరోజు నడుపుకోవటానికి ఏ అధికారి పర్మిషన్ ఇచ్చారో తెలియదు. ఇప్పటికైనా అధికారులు ఇటువంటి వాటిలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
దీపావళీ పండగ రోజున ప్రకాశం జిల్లా మార్కాపురం లో రెండు చోట్ల అగ్నిప్రమాదాలు జరిగాయి. పట్టణంలోని స్థానిక నెహ్రు బజార్లో నరకాసుర వధ కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది.బజార్లోని మాధవి హ్యాండ్లూమ్స్ షాప్ బయట శారీలు ఉన్న అట్టలకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో తక్షణమే స్పందించి ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తో మంటలను ఆర్పి వేశారు. షాపులో సుమారు రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మండలం లోని వేముల పేట గ్రామంలో పూరింట్లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 60 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగిందనీ ఇంటి యజమాని తెలిపారు.