కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఇవాళ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీని రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు ఇతరులను అనుమతి ఇవ్వలేదు. బ్యారేజీ కుంగిన పిల్లర్లను రాహుల్ గాంధీ సహా ఇతర నేతలు పరిశీలించారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజి వద్దకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను తోసుకుంటూ మేడిగడ్డ బ్యారేజీ వైపునకు కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Revanth Reddy
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉగ్రవాదుల్లా కార్యకర్తలను రెచ్చగొట్టి కల్లోలాలు సృష్టిస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ని ఖండించారు. ప్లాన్ ప్రకారం వ్యూహాత్మకంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారని, గన్ మెన్ లేకపోతే మరింత విషాదం జరిగేదన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోడి కత్తి డ్రామా అంటూ చెప్పటం సిగ్గుచేటన్నారు. 50ఏళ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏంచేసిందో చెప్పాలన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టీజేఎస్ చీఫ్ కోదండరాంతో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీసులో సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేదా, మద్దతు విషయంపై చర్చించనున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో కోదండరాం భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ,టీజేఎస్ కలిసి పనిచేయాలని ఇప్పటికే నిర్ణయించాయి. ఇటీవల తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీతో కరీంనగర్ వీ పార్క్ హోటల్ లో కోదండరామ్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని రాహుల్ కోరినట్లు చెప్పారు. తెలంగాణలో నిరంకుశ పాలన పోవాలనే అభిప్రాయాన్ని రాహుల్ వ్యక్తం చేసినట్లు కోదండరాం తెలిపారు. తెలంగాణలో నిరంకుశ పాలన పోవాలన్న తన అభిప్రాయంతో రాహుల్ ఏకీభవించినట్లు తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు,బీఆర్ఎస్ పాలనపై చర్చించామన్నారు. మరోసారి రాహుల్ టీం తమతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో రేవంత్ తో కోదండరాం భేటీ అయ్యారు.
అవసరం తీరిన తర్వాత మర్చిపోవడం కేసీఆర్ లక్షణమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా సోనియాగాంధీకి మాట ఇచ్చి… ఆ మాట తప్పిన విషయం తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. సంగారెడ్డిలో విజయభేరి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ… కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఐదు గ్యారంటీస్ అమలవుతున్నాయని… ఈ విషయంలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా కేసీఆర్, కేటీఆర్ వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.. ఇందిరాగాంధీ గతంలో మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారానికి వచ్చి హామీ ఇచ్చినట్లుగానే బీహెచ్ ఈఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను పెట్టారని.. ఇదీ వారు ఒక మాట ఇస్తే నెరవేర్చుకునే మంచి వ్యక్తిత్వానికి నిదర్శమన్నారు. ఇప్పుడు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు సైతం పక్కాగా తెలంగాణలో అమలవుతాయన్నారు. రాష్ట్రం ఏర్ప డేటప్పుడు మిగులు బడ్జెట్ తొమ్మిదేళ్లలో ఉంటే అప్పుల కుప్పగా మార్చారని కేసీఆర్ పరిపాలన తీరును విమర్శించారు. అంతకు ముందు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..జగ్గారెడ్డిని సంగారెడ్డి లో50వేల అధిక్యంతో గెలిపించాలని కోరారు..జగ్గన్న.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించబోతున్నారు.పని మంతుడు పందిరి వేస్తె కుక్క తోక తాకి కూలిందంట. మేడిగడ్డ పరిస్థితి అట్లుంది. వీళ్లను కొరడాతో కొట్టాలి. జైల్లో వేసి చిప్ప కూడు తినిపించాలి. అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
టికెట్ రాని అసంతృప్తుల నిరసనలతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టికెట్ రాకపోవడంతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు గాంధీభవన్ ముందు ఆందోళనకు దిగారు. గాంధీభవన్ ముందు బైఠాయించి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో విష్ణు అనుచరులు గాంధీభవన్‌పైకి రాళ్లు కూడా విసిరారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఆందోళనల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు..భద్రతను కట్టు దిట్టం చేశారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని శంకర్పల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్, పరిగి కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఇంతకుముందు పార్టీ ఫిరాయించిన వ్యక్తులను అసెంబ్లీ ముందు పాత వెయ్యాల్సిందిగా జనాలను ఉద్దేశించి మాట్లాడారు. 25 వేల మెజార్టీతో కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.
సోనియాగాంధీని గతంలో రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిందని.. తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోందన్నారు.మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భాగంగా శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న ఆరోపణలు సరికాదని కేటీఆర్ అన్నారు. రుణాలు తెచ్చి ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టామన్నారు. రుణాల మొత్తాన్ని సాగునీటి రంగం, మిషన్ భగీరథకు వినియోగించామన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం రుణాలు తెచ్చామన్నారు. 9 ఏళ్ల క్రితంతో పోలిస్తే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. తెలంగాణది సమ్మిళిత, సమగ్ర, సమీకృత మోడల్ అన్నారు. 9 ఏళ్లలో కరువు లేదు, కర్ఫ్యూ లేదన్నారు. రాష్ట్రంలో ఎలాంటి వివక్ష లేదన్నారు. పేదరికంలో దేశం నైజీరియాను దాటిపోయింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తోందన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూనే పారిశ్రామికీకరణలో దూసుకుపోతున్నామన్నారు. కాంగ్రెస్ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏళ్లు బాధపడిందన్నారు. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ 24 వేలు ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే ఇచ్చిందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 9 ఏళ్ల అభివృద్ధి ఇప్పుడు ప్రజలకు కనిపిస్తోందన్నారు. తాము ప్రజలకు ప్రగతి నివేదికలు సమర్పిస్తున్నామన్నారు. ఐటీలో హైదరాబాద్, బెంగళూరును మించిపోయిందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ చేసిన ట్వీట్‌కు టీపీసీసీ చీఫ్ స్పందించారు. బీజేపీ దగ్గర శిష్యరికంతో ఈ డ్రామారావు ఫేక్ ప్రచారాల్లో రాటుదేలాడని, తెలంగాణలో కాంగ్రెస్ సునామి చూసి ఈ సన్నాసికి ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి ఫేక్ ప్రచారాలకు దిగాడని విమర్శించారు.తెలంగాణాలో కాంగ్రెస్ దూసుకెళ్తుంటే, ఇన్ని రోజులు నింపుకున్న జేబులను ఇప్పుడు దులుపుతున్నారన్నారు. మీరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కోట్లాది రూపాయలు కుమ్మరించినా, తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయమని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ వస్తుంది! తెలంగాణ గెలుస్తుంది! అని ట్వీట్ ముగించారు.





Total views : 90415