మంచిర్యాల జిల్లాకు పిసిసి అధ్యక్షుడు సభలో పాల్గొననున్నారు…!బెల్లంపల్లికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రానున్నారు. ఇందుకు సంబంధించి పాత బస్టాండ్ ఏరియాలోని సింగరేణి తిలక్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ సభా ఏర్పాట్లు పూర్తి చేసారు నియోజకవర్గం నుండి జనాన్ని సభకు తరలించానున్నారు ట్రాఫిక్ ను నీవరించడానికి పోలీస్ లు అన్ని విధాలా చర్యలు చేపట్టారు
Revanth Reddy
కాంగ్రెస్ అహంకారాన్ని ఓడిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఇతర నాయకులు విపరీతమైన అహాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అంటే ఆత్మీయత… కాంగ్రెస్ అంటే అహంకారమని అన్నారు. కాంగ్రెస్ లో ఒక్క కుర్చీ కోసం నాయకులు కొట్టుకుంటారని, ఇక కాంగ్రెస్ కు ప్రజల గురించి ఆలోచించే సమయం వారికి ఎక్కడ ఉంటుందని అడిగారు. తమ సీఎం అభ్యర్థి సీఎం కేసీఆర్… మరి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని అడుగుతున్న బీజేపీ ఆరు సార్లు అవకాశమిస్తే నిజామాబాద్ కు ఎం చేసిందని నిలదీశారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి కవిత గారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన తీరు గురించి కార్యకర్తలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. గత పదేళ్ల కాలంలో తమ పార్టీ ప్రతీ ఒక్కరి సంక్షేమానికి, బాగు కోసం పనిచేశామని, కానీ ఎప్పుడూ అహంకారాన్ని ప్రదర్శించలేదని తెలిపారు. ఎప్పుడూ ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీలు చెప్పలేనంత అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వేదిక వద్ద కార్యకర్తలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తంతున్న వీడియోను చూశానని, గతంలో కొడుతున్న వీడియోను చూశామని వివరించారు. ఉస్మానియా విద్యార్థులను అడ్డమీది కూలీలని కూడా రేవంత్ రెడ్డి దూషించారని, రైతులకు మూడు గంటల కరెంటు చాలని అన్నారని, ఇలా విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఆత్మీయంగానే ఉన్నామని, ఇప్పుడూ అలానే ఉంటున్నామని చెప్పారు. బీఆర్ఎస్ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ అంటే అహంకారమని అన్నారు. బీఆర్ఎస్ మన ఇంటి పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ మన మంచికోరే పార్టీ కాదని తెలిపారు. తెలంగాణ ఇవ్వడానికి 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అరిగోస పెట్టిందని, సీఎం కేసీఆర్ దీక్ష చేస్తే ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకుందని, చివరికి వందలాది మంది తెలంగాణ బిడ్డలను పొట్టనపెట్టుకున్న తర్వాత తెలంగాణ ఇచ్చిందని వివరించారు. “కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏక్ అనార్ హై సౌ బిమార్ హై” అన్నట్లుగా ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో ఒక్క కుర్చీ కోసం అనేక మంది కొట్టుకుంటారని, కానీ తాము మాత్రం తమ సీఎం అభ్యర్థి సీఎం కేసీఆర్ అని గర్వంగా చెబుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు. కుర్చీ కోసం కొట్లాటకే కాంగ్రెస్ నాయకుల సమయం సరిపోదని, ఇక ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఆ పార్టీ నాయకులకు లేదని అన్నారు. బీఆర్ఎస్ బలమైన పార్టీ అని, కాబట్టి తప్పకుండా మూడో సారీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని బీజేపీ చెబుతోందని, కానీ ఆరు సార్లు అవకాశం ఇస్తే అవకాశం ఇచ్చినా చేయని పనులు కొత్తగా ఏమి చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి 54 ఏళ్లు అవకాశం ఇచ్చినా ఏమీ చేయలేదని విమర్శించారు. గుణమున్న గణేష్ కావాలా లేదా ధనమున్న ధన్ పాల్ కావాలా అన్నది నిజామాబాద్ తేల్చుకోవాలని, గుణమున్న గణేష్ గుప్తాను ప్రజలు గెలిపించుకుంటారన్న సంపూర్ణ విశ్వాసముందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏలోనే గుణముందని తెలిపారు. ప్రజల కోసం మంచి చేసే వ్యక్తి గణేష్ అని చెప్పారు. నిజామాబాద్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించారని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం సీఎం కేసీఆర్ ను ఒప్పించి రూ. 45 కోట్లు తెచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అంటే పుష్పక విమానమని, ఎంత మంది వచ్చినా స్వాగతించామని, ఇంకా రావాలన్న కూడా స్థలముందని, అంత పెద్ద పార్టీ తమదని స్పష్టం చేశారు. డివిజన్ వారీగా సమన్వయం చేసుకోవాలని, తద్వారా ప్రతీ గల్లీలో తమకు ఎదురు ఉండదని స్పష్టం చేశారు. కనీసం 55 వేల మెజారిటీతో గణేష్ గుప్తాను గెలిపించడానికి కృషి చేయాలని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు
పాలకుర్తి గడ్డకు ఒక చరిత్ర ఉంది.. పోరాట పటిమ ఉంది..మిమ్మల్ని చూస్తుంటే దొరల కడ్డీలను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోంది
అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. పాలకుర్తి కాంగ్రెస్ విజయభేరి యాత్ర సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ
ఒకనాడు డీలర్ గా ఉన్న దయాకర్ రావు దందాలు చేసి ఇప్పుడు డాలర్ దయాకర్ రావు అయిండన్నారు.. ఝాన్సీ రెడ్డి కుటుంబం పేదలకు సేవలు చేశారు.మీకు సేవచేసేందుకు కాలేజీలు, ఆసుపత్రుల కోసం 80 ఎకరాల భూమి కొంటే దయాకర్ రావు లిటిగేషన్లు పెట్టి ఇబ్బందులు పెట్టిండన్నారు. రేవంత్ రెడ్డి వస్తే తెలంగాణను అమ్ముకుంటాడని కేసీఆర్ అంటున్నాడు .. 2009లో సికింద్రాబాద్ ఎంపీ సీట్లు కేసీఆర్ అమ్ముకున్నాడన్నారు. పాలకుర్తిలో కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించండి…ఈ ఎన్నికలు కేసీఆర్ నలుగురు కుటుంబ సభ్యులకు… నాలుగు కోట్ల ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని దొరల తెలంగాణ కావాలో, ప్రజల తెలంగాణ కావాలో నిర్ణయించుకోండి అని అన్నారు.
దళిత, గిరిజనులకు కాంగ్రెస్ కు ఉన్న ప్రేమ ఏ పార్టీకి ఉండదన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ కంటే ముందు దళితులు, ఆదివాసీలకు ఎవరైనా భూములు ఇచ్చారా..? లేదా అనే విషయాన్ని ఆలోచన చేయాలని కోరారు. కాంగ్రెస్ ఐటీడీఏ ప్రాజెక్టులు ప్రారంభించిందన్నారు. ధరణి పోర్టల్ తీసుకువచ్చి అసైన్డ్ భూములను రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించారు. దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ దగ్గర నోట్లు ఉంటే.. తమ అభ్యర్థుల దగ్గర ఓట్లు ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ది చేయించే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇంద్రవెల్లి కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేస్తానని, ఆ బాధ్యత కూడా తనదే అన్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ అధికారికంగా ఖరారైంది. కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. 16 మంది అభ్యర్థులతో కూడిన మూడో విడత జాబితాను విడుదల చేసింది. నిజామాబాద్ అర్బన్ సీటును సీనియర్ లీడర్ షబ్బీర్ అలీకి పార్టీ కేటాయించింది. ఇక చెన్నూరు నుంచి జి.వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. రెండు సీట్లలో అభ్యర్థులను మార్చుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది. బోథ్ నియోజకవర్గంలో అశోక్ స్థానంలో ఆదె గజేందర్, వనపర్తిలో చెన్నారెడ్డి స్థానంలో మేఘారెడ్డికి సీట్లు కేటాయిస్తూ మార్పులు చేసింది. మరోవైపు పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయించింది. తాజా జాబితాతో మొత్తం 114 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినట్టయ్యింది. తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ, చార్మినార్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
తెలంగాణ ఎన్నికలు యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ యువతకు ఉద్యోగాలు అందించేందుకు జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలు అని రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్‌లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని జోస్యం చెప్పారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడికి లక్ష 20వేల మెజారిటీ వచ్చిందని, కొడంగల్‌లో అంతకంటే ఎక్కువ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు.
నాకు ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్ష పదవి.. నాకోసం కాదు.. మీకోసమేనన్నారు. ఈ ఐదేళ్లలో కొడంగల్ నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి జరిగిందా?కొడంగల్ ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ మళ్లీ ఎలా ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు.
హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. తన ఊరిని రేవంత్ రెడ్డి కాపాడాలంటూ ఓ వ్యక్తి పెట్రోల్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీన్ని గమనించిన కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. మక్తల్ నియోజకవర్గంలోని చిత్తనూర్ లో ఇథనల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారని, దీని వల్ల గ్రామానికి నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడాలని వేడుకున్నాడు.
నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ ముఖ్య అనుచరులు, ప్రజాప్రతినిధులు అనూహ్యంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉంటూ అనునిత్యం చేదోడువాదోడుగా ఉంటున్న సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు మరి కొంతమంది నాయకులు కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. దీంతో నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉంటున్న నాయకులు కాంగ్రెస్ లో చేరికతో ఎమ్మెల్యే షాక్ లో ఉన్నారు. నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ కు ఎదురులేదనుకొని ధీమాగా ఉన్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కి ఒక్కసారిగా ఎదురు దెబ్బ తగిలింది. దీంతో నియోజకవర్గంలో ఏం జరుగుతుంది తన అనుచరుల్లో ఇలాంటి అయోమయం ఉందో తేరుకోలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే మర్రి ఉన్నారు. నిన్నటి వరకు ఎదురులేద్దనుకొని ధీమాగా ఉన్న మర్రి జనార్దన్ రెడ్డికి తన అనుచరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో పరిస్థితి అయోమయంగా మారింది. గెలుపు ధీమాలో ఉన్న మర్రికి పరిస్థితి పట్టడం లేదు. బిఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ లో చేరడంతో నాగర్ కర్నూలు జిల్లాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు చోట్ల బరిలోకి దిగేందుకు సిద్దమయ్యారు. కొడంగల్‌లో తో పాటు కామారెడ్డి బరిలో కూడా నిలువాలని ఉందని , కేసీఆర్ ఫై పోటీ చేసే అవకాశం వస్తే బాగుంటుందని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ రావడం తో..రేవంత్ కామారెడ్డి లో కేసీఆర్ ఫై పోటీ కి సిద్ధం అవుతున్నారు. ఈ నెల 6 న ముందుగా కొడంగల్‌లో రేవంత్ నామినేషన్ వేసి , తర్వాత ఈ నెల 8వ తేదీన కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు. ఇక రేవంత్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతుండడంతో షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయబోతున్నాడు. అలాగే షబ్బీర్ అలీ నామినేషన్‌కి రేవంత్‌రెడ్డి వెళ్లనున్నట్లు సమాచారం.






Total views : 90753