బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి, టీపీసీసీ చీఫ్ రేవంత్ స్టేషన్ ఘనపూర్ లో తనపై చేసిన విమర్శల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాఫర్‌గడ్‌లో జరిగిన పార్టీ సమావేశంలో కడియం మాట్లాడుతూ…2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర తమ పార్టీ ఎమ్మెల్యే రాజయ్య చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయిందని గుర్తుచేశారు. ఇందిర నియోజకవర్గంపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతోందని అన్నారు. ఇందిర ఒక్కరికి కూడా సాయం అందించలేదన్నారు. కానీ కడియం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నట్లు చెప్పారు. తనపై ఎలాంటి కేసులు లేవని, కానీ రేవంత్ రెడ్డి, ఇందిరలపై ఉన్నాయన్నారు. ఇందిరపై ఇక్కడ చీటింగ్ కేసు నమోదు అయిందని, ఆ కేసు సుప్రీంకోర్టులో ఉందన్నారు. నియోజకవర్గంలో ప్రజలకే అందుబాటులో ఉండని ఇందిరకు ఇక్కడి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి? అని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని ప్రజలు, మాదిగలపై ఇందిరకు ప్రేమ ఉంటే ఆమె ఆస్తులు రాసివ్వాలని సవాల్ చేశారు. ఆమె తన ఆస్తులను రాసిస్తే మరుక్షణమే తానూ రాసిస్తానన్నారు. రేవంత్ రెడ్డి ఓ గజదొంగ అన్నారు.
Revanth Reddy
రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో పాల్గొన్నారు. కేసీఆర్ సీఎం, రాజయ్య ఎమ్మెల్యే అయ్యాక ఆడబిడ్డలకు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే రాజయ్య, బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి మహిళలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. వీరిద్దరి గురించి మనం పెద్దగా చెప్పవలసిన పని లేదన్నారు. శ్రీహరి గురించి రాజయ్య, రాజయ్య గురించి శ్రీహరి చెప్పారన్నారు. వీళ్లిద్దరికీ ఓ సారూప్యత ఉందని, వీరిద్దరూ ఉపముఖ్యమంత్రులుగా పని చేసి ఉద్యోగం ఊడగొట్టుకున్నారన్నారు. వీరి గురించి కేసీఆర్‌కు తెలుసు కాబట్టే ఉద్యోగం ఊడగొట్టారన్నారు. ఇలాంటి వారిని ఎమ్మెల్యేలుగా ఎన్నుకుందామా? అన్నారు. ఈ పదేళ్లలో వారు సరిగ్గా పాలన అందిస్తే, ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేదా? అన్నారు. కేసీఆర్ కేబినెట్లో మాదిగ సామాజిక వర్గానికి, మహిళలకు సరైన ప్రాధాన్యత లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు మహిళా మంత్రులు ఉంటారన్నారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరింత వేడెక్కాయి. కాంగ్రెస్, మజ్లీస్ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి ఇటివల మజ్లీస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసారు. ఈ నేపద్యంలో అక్బరుద్దీన్ స్పందించారు. రేవంత్ రెడ్డి తమను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన హిందూ – ముస్లిం గొడవలు తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తమ జోలికి రావొద్దని, వస్తే కనుక ఆయన జీవితచరిత్ర బట్టబయలవుతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్సెస్ నుంచి వచ్చాడని, ఆ తర్వాత టీడీపీ, ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారని అన్నారు. తెలంగాణలో రెడ్డి, రావు, ఎవరైనా సరే మా ముందు వంగాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ దేశ విభజన వల్లే భారత్ – పాకిస్తాన్ రెండుగా ముక్కలైందని, లేదంటే ఒకే దేశంగా ఉండేదన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే దౌల్తాబాద్ అభివృద్ధి, సంక్షేమం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా దౌలతాబాద్‌లో నిర్వహించిన విజయభేరి యాత్రలో మాట్లాడారు. డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాలు, కాలేజీలు తెస్తామని బీఆరేస్ నేతలు చెప్పారు. కానీ పదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు. మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ఎన్నికల అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆయన నామినేషన్ ను అధికారులు రిజక్ట్ చేసారు. నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసేందుకు జానారెడ్డి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈయన తో పాటు నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి మొత్తం 28 నామినేషన్లు దాఖలు చేసారు. నాగార్జున సాగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే నామమాత్రంగానే తాను నామినేషన్ వేసినట్లు జానారెడ్డి చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే దౌల్తాబాద్ అభివృద్ధి, సంక్షేమం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా దౌలతాబాద్‌లో నిర్వహించిన విజయభేరి యాత్రలో మాట్లాడారు. డబుల్ బెడ్రూం, దళితులకు మూడెకరాలు, కాలేజీలు తెస్తామని బీఆరేస్ నేతలు చెప్పారు. కానీ పదేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు. మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తామని పేర్కొన్నారు.
Read Also..
Read Also..
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్‌ను ఇప్పటివరకు ఎందుకు బయట పెట్టలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దాడి విషయంలో మంత్రి హరీష్ రావు నటనకు తెలంగాణ యువకులు భావోద్వేగానికి లోనయ్యారని ఎద్దేవా చేశారు. నిందితుడు రాజు రిమాండ్ రిపోర్టు బయటపెట్టలేదని ఆయన అన్నారు. కుట్రలు జరగబోతున్నాయని కేటీఆర్ అన్నారని, ఆయన మాటలను సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించాలని రేవంత్ డిమాండ్ చేశారు.అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దాడి ఘటనపై స్పందిస్తూ.. అదంతా డ్రామా అని రేవంత్ కొట్టిపారేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని బీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ వార్నింగ్ ఇచ్చారు. బాల్క సుమన్ వద్ద వందల కోట్లు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించడమే దీనికి కారణం. తన వద్ద వందల కోట్లు ఉన్నాయనే విషయాన్ని రేవంత్ నిరూపించాలని సుమన్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి వందల కోట్లు ఇచ్చి చెన్నూరు కాంగ్రెస్ టికెట్ ను వివేక్ వెంకటస్వామి కొనుక్కున్నారని విమర్శించారు. వివేక్, వినోద్ వంటి వారు గెలిస్తే ఫ్యూడలిస్ట్ పాలన వస్తుందని అన్నారు. వివేక్ తండ్రి వెంకటస్వామి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టించారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 80కి పైగా సీట్లలో గెలిచి హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Read Also..
Read Also..
కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని, తమ అభిప్రాయాలను ఎవరైనా స్వేచ్ఛగా చెప్పొచ్చని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో అలాంటి ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించదని, తాను సీఎం అవుతానని హరీశ్‌రావుకు చెప్పే ధైర్యం లేదని, అలా చెప్పిన మరుక్షణం ఆయన జైలులో ఉంటారని చెప్పారు. నిర్వహించిన ‘క్వశ్చన్ అవర్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తరచూ సీఎంలను మార్చుతుందన్న అపవాదుపై రేవంత్ స్పందిస్తూ.. హిమాచల్ ప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, అక్కడ సీఎంలు మారారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ఉంటేనే ఉద్యమకారుడు.. లేదంటే తెలంగాణ ద్రోహి అనడం ఫ్యాషన్ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉద్యమకారులకు సీట్లు ఇస్తే.. వేలకోట్లు ఉన్న వారికి బీఆర్ఎస్ రాజ్యసభ సీట్లు ఇచ్చిందని విమర్శించారు. ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తాము 60 శాతం సీట్లు ఇచ్చామన్నారు. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లికి ఓడిపోయే సీటు ఇచ్చారన్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరని ప్రచారం చేశారని, ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణిపై తొలి నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్న రేవంత్.. అంతర్జాతీయ నేరగాళ్లు ఉండే దేశాల నుంచి ధరణి పనిచేస్తోందని ఆరోపించారు. రెవెన్యూ రికార్డులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. వాటిని వారికి ఇచ్చే అధికారం కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని కొందరు ధరణి వచ్చాక వందల ఎకరాలకు ఆసాములయ్యారని తెలిపారు. ఊళ్లలోని భూములను ఎప్పుడో అమ్మేసుకున్న వారి పేర్లు ఇప్పుడు రికార్డుల్లోకి ఎలా వచ్చాయని రేవంత్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో కాంగ్రెస్ విజయభేరి యాత్ర – బీసీ డిక్లరేషన్ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ అందరికీ నా నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. రేవంత్ రెడ్డి రెండుచోట్ల ఘన విజయం సాధిస్తారన్నారు. కేసీఆర్ తన అవినీతి డబ్బుతో మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్‌ను ఓడించాలని నిర్ణయించుకున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని ఆ పార్టీ నాలుగైదు సీట్లు గెలిస్తే ఎక్కువ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని, ఈ నెల 30వ తేదీన ఓటు వేసేందుకు ప్రజలు వేచి చూస్తున్నారన్నారు.





Total views : 90822