సింగరేణిలో బొగ్గు బ్లాక్ లను వేలం వేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఖండించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలానికి వేయాలని తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు. గతంలో పలు సందర్భాల్లో ప్రధాని మోదీ, మంత్రి కిషన్ రెడ్డి సింగరేణిని ప్రైవేట్ పరం చేయమని చెప్పారని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతోమంది కార్మికులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని దీన్ని జాతీయ కార్మిక సంఘాలు ఖండించాలన్నారు. రానున్న రోజుల్లో కార్మిక సంఘాలను కలుపుకొని బొగ్గు బ్లాక్ వేలాన్ని అడ్డుకుంటాం…కార్మిక నేత రాజిరెడ్డి అడ్డుకుంటామని హెచ్చరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్‌లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 197599