పల్నాడు జిల్లా, దాచేపల్లిలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి నిర్వహించే ఆత్మీయ సమావేశం అర్ధాంతరంగా నిలిచింది. వైసిపి అధిష్టానం పిలుపు వచ్చిందంటూ చెప్పి సమావేశం నుండి వెళ్లిపోయిన ఎమ్మెల్సీ కృష్ణమూర్తి. గురజాల నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తి జోరుగా పర్యటన. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
ఫిర్యాదు మేరకు జంగాకు అధిష్టానం నుండి పిలుపు అంటూ ప్రచారం. అధిష్టానం రమ్మని పిలుపునిచ్చిందని స్వయంగా చెప్పి సమావేశం నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.
sports news
ఐదు డివిజన్లను గెలుచుకుని గుర్తింపు సంఘంగా విజయం సాధించిన AITUC. ఆరు డివిజన్లలో విజయం సాధించి ప్రాతినిధ్య సంఘంగా రెండవ స్థానంలో నిలిచిన INTUC. బెల్లంపల్లి ,మందమర్రి,శ్రీరాంపూర్, రామగుండం-1, రామగుండం-2 డివిజన్లలో AITUC విజయం. కార్పొరేట్, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, భూపాలపల్లి, రామగుండం-3 డివిజన్లలో గెలుపొందిన INTUC. సంస్థ వ్యాప్తంగా 1999 ఓట్ల ఆదిక్యంతో INTUC పై విజయం సాధించిన AITUC. సింగరేణి సంస్థలో 4 వ సారి గుర్తింపు సంఘంగా ఎన్నికైన AITUC .
తెలంగాణాలో మంచు కవ్విస్తుంది, మరో కాశ్మీర్ ను తలపిస్తున్న దృశ్యాలు. తెల్లవారు జామునుండి పొగమంచుతో కమ్ముకుంది సూర్యుడు కూడా పొగ మంచు కారణంగా కాంతిని ప్రసరించ లేక పోతున్నాడు. ఆసిఫాబాద్ కుమురం భీమ్ జిల్లాలో మారుమూల ప్రాంతాలు అడవికి ఆనుకోని ఉన్నందున విపరీతమైన చలితో పాటు పొగమంచు ఈప్రాంతాన్ని చుట్టేసింది ప్రకృతి సోయగం కనువిందు చేస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి కాశ్మీర్ ను తలపిస్తున్న తెలంగాణ ప్రకృతి ని ఆస్వాదిస్తున్నారు ప్రకృతి ప్రేమికులు ఒక పక్క మంచు దుప్పటి మరో పక్క చలి తీవ్రతతో చైల్డ్ అవుతున్నారు జిల్లా ప్రజలు పట్టణాలు, రోడ్ల పై మంచు కమ్ముకుంది.
హనుమకొండ జిల్లా లో గ్రేటర్ వరంగల్ 5వ డివిజన్ కొత్తూరు సగర కమ్యూనిటీ హాల్లో ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల ను ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందరెడ్డి. పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి, బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాష, జిల్లా నోడల్ అధికారులు, స్థానిక కార్పొరేటర్ శ్రీమన్, వరంగల్ పశ్చిమ ఎమ్యెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొత్త పింఛన్లు రేషన్ కార్డులు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తాం. నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి డివిజన్ లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసాం. అధికారుల ఆఫీసుల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. ప్రజల వద్దకే పాలన వస్తుంది అని అన్నారు.
తిరుపతి, టిటిడి కేటాయిస్తున్న ఇళ్ల పట్టాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటోను వ్యతిరేకిస్తున్న విపక్షాలు. పట్టా పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటారని ఎక్కడికక్కడ నాయకులను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. మహతి ఆడిటోరియం లో పట్టా పంపిణీ కార్యక్రమంలో భారీ పోలీసు బందోబస్తు. తిరుపతిలో టిడిపి, జనసేన, సిపిఎం నాయకులను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు. టిటిడి ఉద్యోగస్తులకు పట్టాల పంపిణీని స్వాగతిస్తున్నాం అని, కానీ పట్టాలపై ఓపక్క వెంకటేశ్వర స్వామి ఫోటో, మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు టిడిపి సీనియర్ నాయకులు వూకా విజయ కుమార్. టిడిపి నాయకులను జనసేన నాయకులను హౌస్ అరెస్టు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈరోజు ఇంటి పట్టాలపై వేసిన ఫోటోలు రేపు సేవా టికెట్లపై అలాగే టిటిడి సంబంధించిన వెబ్సైట్లో కూడా జగన్ ఫోటో పెడతారా అంటూ టిటిడిఈఓ ధర్మారెడ్డిని, చైర్మన్ కరుణాకర్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ద్వారా గాని టీటీడీ నిధులు తో గాని ఇవ్వనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటోను ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు. టిటిడి ఉద్యోగస్తులు వారి సొంత డబ్బుతో కొనుక్కుంటున్న జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. కేవలం కరుణాకర్ రెడ్డి తన కొడుకు అభినయ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారని,ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడానికి కూడా వీలు లేకుండా పోలీసులతో హౌస్ అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంచిది కాదని త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు.
చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు ముందుకొస్తున్న అధికార పార్టీ మొరసనపల్లి గ్రామ సర్పంచ్ జగదీష్ భార్య నీలిమ. తాను ఎమ్మెల్యే అయితే కుప్పంలో నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలను పరిష్కరిస్తానని ముందుకొచ్చింది. కుప్పం అసెంబ్లీ స్తానంలో ఒక మహిళ కూడా ఎమ్మెల్యేగా స్థానం కల్పింలేదు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు సేవ చేయడానికే ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నానని నీలిమ స్పష్టం చేస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు కుప్పం ప్రజలను ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారని నీలిమ ప్రశ్నిస్తోంది. అసలు 14 ఏళ్ల సీఎం గా, 35 ఏళ్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు కుప్పం ప్రజలకు ఏమి చేసారో చెప్పాలని ప్రశ్నిస్తోంది. ఇక గత నాలుగున్నర సంవత్సరాలుగా ఎమ్మెల్సీ భరత్ కుప్పం ప్రజలకు ఏమి చేసారో చెప్పాలని భరత్ కు నీలిమ సవాల్ విసిరింది. కుప్పం ప్రజలు, మహిళలు ఆలోచించి, తనకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించాలని కోరిన నీలిమ. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని, తనకు ఒక అవకాశం ఇవ్వాలని నీలిమ కోరారు.
తిరుపతి, టిటిడి ఉద్యోగుస్తుల 3 దశాబ్దాల ఇంటి స్థలాల కల సాకారం. నేడు టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈఓ ధర్మారెడ్డి చేతులు మీదుగా ఇంటి స్థలాల పంపిణీ. చిత్తూరు జిల్లా వడమాల పెట వద్ద 400 ఎకరాల్లో స్థలం కేటాయింపు. అర్హులైన వారందరికీ 50 అంకణాల స్థలం కేటాయింపు. దాదాపు 3 వేల మంది ఉద్యోగస్తులను అర్హులుగా గుర్తించిన టిటిడి. త్వరలోనే రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇంటి స్థలాలు కేటాయించేందుకు టిటిడి చర్యలు.
అనారోగ్య కారణాలతో చెన్నైలోని సత్యనగర్ లో ఉన్న మియోట్ ఆస్పత్రిలో చేరిన డీఎండికే అధినేత విజయకాంత్ తుదిశ్వాస విడిచినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆయన గత నెల రోజుల క్రితం శ్వాస సంబంధిత వ్యాధితో పాటు, కిడ్నీ, లివర్లలో ఇన్ఫెక్షన్ చేరడంతో ఆస్పత్రిలో చేరారు. పది రోజుల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి తిరిగి ఇంటికి చేరుకున్నారు. అయితే మూడు రోజుల క్రితం విజయ్ కాంత్ కు కరోనాసోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మియేట్ ఆసుపత్రిలో ఆయన చేర్చగా ఈరోజు చికిత్స పొందుతూ విజయ్ కాంత్ మృతి చెందారు. వడపళణిలోని తన నివాసానికి మరికాసేపట్లో పార్తివదేహాన్ని తరలించనున్నారు. ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున విజయకాంత్ అభిమానులు, డిఎండికె పార్టీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. విజయ్ కాంత్ మృతిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆసుపత్రి వద్ద విషాద వాతావరణం నెలకొంది.
అక్రమంగా గోవధకు తరలిస్తున్న 40 పశువులను మదనపల్లి గో సంరక్షణ సమితి, బిజెపి, ఆర్ఎస్ఎస్, విహెచ్పి నేతలు బుధవారం సాయంత్రం అడ్డుకుని పట్టుకున్నారు. పట్టుబడిన పశువులను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. గో సంరక్షణ సమితి పశువులను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నా మరోవైపు వదిలిపెట్టేస్తున్నారని పోలీసుల తీరిపై వారు మండిపడ్డారు. పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలంటే పోలీసులు తమిళనాడులోని గోవధశాలకు పశువులను అక్రమంగా తరలించే నిందితులపై కఠినమైన కేసులు నమోదు చేసి అరెస్టు అనంతరం, వాహనాలను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.




Total views : 89163