పుంగనూరు, బీడీ కాలనీ వద్ద ఆటోను ఢీకొన్న స్కూల్ బస్. ఆటోలో కూలీ పనులకు వెళుతున్న ముగ్గురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులు పెద్దపంజాని(మం)భద్రాచలం కు చెందిన వారిగా గుర్తింపు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికు తరలింపు. స్కూల్ బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది అని పోలీసులు వెల్లడించారు.
sports news
కర్నాటక రాష్ట్రం బెంగుళూరులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి అపూర్వ స్వాగతం ఏర్పాట్లు. ఇవాళ బెంగుళూరు సిటీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రానున్న చంద్రబాబు కోసం భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు. చిత్తూరు టిడిపి నాయకుడు జి.జే.ఎమ్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ గురజాల జగన్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఫ్లేక్సిలు,స్వాగత తోరణాలు ఏర్పాటు. రోడ్డుకి ఇరు వైపులా భారీ ప్లెక్కీలు,స్వాగత తోరణాలు ఎర్పాటు.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్న రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన రవి నాలుగున్నర ఏళ్ల పాటు తిరుమల దర్శన వ్యవహారాలను నడిపించారు. పిఏ రవి ఇంటి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ, స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముట్టడికి కార్మిక సంఘాలు ఐక్యతా కార్యాచరణ పేరిట పిలుపునిచ్చాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్దకు చేరుకున్న వేలాది కార్మికులు మరియు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులను విధుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ గేటు వద్ద పెద్ద ఎత్తున జిందాల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అడ్మినిస్ట్రేషన్ ముట్టడికి తమ సర్వశక్తులు ఒడ్డి పోరాటానికి సిద్ధంగా కార్మికులు ఉన్నారని నాయకులు తెలిపారు. జిందాల్ తో చేసుకున్న చీకటి ఒప్పందాన్ని వెంటనే కార్మిక సంఘాలకు బహిర్గతం చేయకుంటే అడ్మినిస్ట్రేషన్ ను ముట్టడిస్తామంటూ కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సంజయ్ సింగ్ సారథ్యంలో కొత్తగా ఏర్పాటైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బాడీని సస్పెండ్ చేసింది. బీజేపీ ఎంపీ, మాజీ ఎఫ్‌డబ్ల్యూఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడుగా ఎన్నిక కావడంపై తీవ్ర నిరసలకు దారితీసిన నేపథ్యంలో క్రీడల శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సంజయ్ సింగ్ గత గురువారంనాడు డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా 47 ఓట్లకు 40 ఓట్లు గెలుచుకుని సంచలన విజయం సాధించారు. అధ్యక్షుడిగా ఎన్నిక కాగానే ఆయన ఈ ఏడాది చివర్లో గోండా (యూపీ)లోని నందిని నగర్లో నేషనల్స్ జరుగుతాయని ప్రకటించారు. ఈ ప్రకటనను తొందరు పాటు చర్యగా, రెజ్లర్లకు తగిన నోటీసు ఇవ్వకుండా తీసుకున్న నిర్ణయంగా క్రీడల మంత్రిత్వ శాఖ ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది.
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో హార్ధిక్ పాండ్యా పేరును ప్రకటించడం క్రికెట్ వర్గాల్లో చర్ఛనీయాంశమైంది. జట్టుని ఏకంగా 5 సార్లు టైటిల్ విజేతగా నిలిపిన హిట్‌మ్యాన్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తాజాగా రోహిత్ శర్మ భార్య రితికా కూడా తొలిసారి రియాక్ట్ అయ్యింది. ముంబై కెప్టెన్ మార్పు అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో హృదయపూర్వకంగా స్పందించింది. ఉత్సాహభరితమైన సవాలుకు ఒక ఏడాది! చాలా గౌరవప్రదం రోహిత్!’’ అంటూ రోహిత్‌కు సానుభూతిగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్టు పెట్టింది. ఈ పోస్టుపై పసుపు రంగు హార్ట్ ఎమోజీతో రితికా స్పందించింది. కాగా పసుపు రంగు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంతో ప్రత్యేకమైనది. ఆ జట్టు జెర్సీ కూడా అదే రంగులో ఉంటుంది. చెన్నై సొంత మైదానం మొత్తం పసుపుమయంగా కనిపిస్తుందన్న విషయం తెలిసిందే. ఫ్రాంచైజీకి ఆదర్శప్రాయమైన సేవలు అందించిన రోహిత్‌కు ధన్యవాదాలు అంటూ పేర్కొంది.
దక్షిణాఫ్రికాపై 3వ టీ20 మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అసాధారణ రికార్డులు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో నాలుగు సెంచరీలు సాధించిన మూడవ బ్యాట్స్‌మెన్‌గా మిస్టర్ 360 గా నిలిచాడు. ఈ జాబితాలో చెరో 4 సెంచరీలతో ఉన్న రోహిత్ శర్మ, గ్లేన్ మ్యాక్స్‌వెల్ సరసన నిలిచాడు. అయితే సూర్య కేవలం 57 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డును సాధించగా రోహిత్ 79 మ్యాచ్‌లు, మ్యాక్స్‌వెల్ 92 ఇన్నింగ్స్ ఆడడం గమనార్హం. దీనినిబట్టి సూర్య ఎంత వేగంగా 4 సెంచరీలను అందుకున్నాడో అర్థమవుతోంది. ఇక టీ20 ఫార్మాట్లో వీళ్లు ముగ్గురు మాత్రమే 4 చొప్పున సెంచరీలు నమోదు చేయగా సబావూన్ డేవిజి 3, కోలిన్ మన్రో 3, బాబర్ ఆజం 3 ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు. దక్షిణాఫ్రికాపై సూపర్ సెంచరీ సాధించిన సూర్య ఖాతాలో మరో రెండు రికార్డులు పడ్డాయి. టీ20లలో అత్యధిక స్కోరు సాధించిన మూడవ భారత కెప్టెన్‌గా సూర్య నిలిచాడు. ఇక సూర్య సాధించిన నాలుగు సెంచరీలు వేర్వేరు దేశాల్లో నమోదు చేయడం మరో రికార్డుగా ఉంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఇండియా, తాజాగా దక్షిణాఫ్రికాలో సెంచరీలు బాదాడు. ఈ ఫీట్ సాధించిన ఏకైక ఆటగాడిగా మిస్టర్ 360 గా నిలిచాడు. మాక్స్వెల్ సెంచరీల్లో రెండు భారత్‌లో, శ్రీలంక, ఆస్ట్రేలియాల్లో ఒక్కోటి చొప్పున బాదాడు. ఇక రోహిత్ ఇండియాలో 3, ఇంగ్లండ్‌లో ఒక సెంచరీ కొట్టాడు.
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ కు చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ నగరం ఆతిథ్యమిస్తోంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు రాయ్ పూర్ చేరుకున్నారు. గువాహటి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆటగాళ్లకు రాయ్ పూర్ ఎయిర్ పోర్టులో సాదర స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది తమకు కేటాయించిన హోటల్ కు వెళ్లిపోయారు. టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ఈరోజు రాయ్ పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు జరగ్గా తొలి రెండు మ్యాచ్ ల్లో టీమిండియా నెగ్గగా, మూడో టీ20లో ఆస్ట్రేలియా గెలిచింది.
వరల్డ్ కప్ లో ఘోర వైఫల్యం చెందడంతో శ్రీలంక క్రికెట్ బోర్డును ఆ దేశ క్రీడల మంత్రి రద్దు చేయడం తెలిసిందే. దాంతో, క్రికెట్ బోర్డులో రాజకీయ, ప్రభుత్వ జోక్యం తమ నిబంధనలకు విరుద్ధమంటూ ఐసీసీ శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసింది. శ్రీలంకలో జరగాల్సిన అండర్-19 వరల్డ్ కప్ వేదిక మారింది. అండర్-19 వరల్డ్ కప్ ను శ్రీలంక నుంచి దక్షిణాఫ్రికాకు తరలిస్తున్నట్టు ఐసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. పురుషుల విభాగంలో 15వ అండర్-19 వరల్డ్ కప్ వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతుందని తెలిపింది. ఐసీసీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే అండర్-19 వేదిక మార్పు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ ఉన్నప్పటికీ… శ్రీలంక జట్టు అంతర్జాతీయ క్రికెట్లో ద్వైపాక్షిక సిరీస్ లతో పాటు, ఐసీసీ టోర్నీల్లో పాల్గొనవచ్చని ఊరట కలిగించే నిర్ణయాన్ని వెల్లడించింది. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డుకు లభించే నిధులను ఇకపై ఐసీసీ నియంత్రిస్తుంది.






Total views : 89152