తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం గోకవరం లో ఆసక్తికరం గా మారిన వైసీపీ నేతల వరుస ఆత్మీయ సమావేశాలు. జగ్గంపేట కొత్త ఇంచార్జ్ గా తోట నరసింహం వచ్చాక, స్థానిక వైసీపీ నేతలతో సమన్వయం లేకపోవడంతో కేడర్ లో అసహనం వ్యక్తం చేస్తున్న నేతలు. మరో పక్క నియోజకవర్గం లో రోజు రోజుకు టీడీపీ లోకి పార్టీ కండువాలతో తమ వైపు మార్చుకుంటున్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. వైసీపీ ఇంచార్జ్ గా తోట నరసింహం వచ్చినప్పటికీ టీడీపీ లోకి కేడర్ మారిపోతుండడంతో ఏమి చేయాలో తెలియక తికమక పడుతున్నామంతున్న నియోజకవర్గ వైసీపీ నేతలు. మరోపక్క ఎమ్మెల్యే గా ఉన్న జ్యోతుల చంటిబాబు కు మళ్ళీ వైసీపీ లో ఇంటిలిజెన్స్ వర్గాల రిపోర్ట్ ల ద్వారా మళ్ళీ అవకాశాలు ఉన్నాయని వస్తున్న వార్తలతో చంటిబాబు అనుచరుల్లో నూతన ఉత్సాహంగా కలిసి పనిచేస్తామంటున్న స్థానిక నేతలు. నియోజకవర్గ పరిధిలోని మండల కేడర్ నేతలతో ఆత్మీయ సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడంతో అనూహ్య గా మారుతున్న రాజకీయం. చంటిబాబు కు మళ్ళీ అవకాశాలు ఉన్నాయని పుకార్లు తో వైసీపీ లో ఇంచార్జ్ గా ఉన్న నేతల మధ్య, టిడిపి నేతలు మధ్య మొదలైన గుబులు. గోకవరం లో స్థానిక జడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్ నివాసం వద్ద తన అనుచరులతో చంటిబాబు వర్గం కార్యకర్తలు తో అత్యవసర భేటి.
Tdp
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్చార్జి పొత్తూరి రామరాజు టీడీపీ సీనియర్ నాయకుడు కొవ్వలి యతిరాజు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మరియు కొందరు వ్యక్తులు ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీట్ మాకే కేటాయించిందంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఇదే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కష్ట కాలంలో ఉండగా పార్టీ బాధ్యతలు నేను చేపట్లేనని పార్టీ నడి మధ్యలో వదిలేసి వెళ్లిపోయారని వెంటనే అధిష్టానం కొత్త వ్యక్తులకు ఇన్చార్జ్ పదవిని ఇచ్చి తెలుగుదేశం పార్టీ బాధ్యతలు కట్ట పెట్టారని అయితే ఇప్పుడు పార్టీ బలోపేతం అయి ప్రభుత్వం చేపట్టే దిశలో ఉండడంతో పార్టీ ఆదేశాలను ధిక్కరించి ఇన్చార్జి ప్రమేయం లేకుండా సొంత కార్యక్రమాలు చేస్తున్నారని కార్యకర్తలు ఎవరు నమ్మొద్దని కచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తగిన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని టీడీపీ ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు అన్నారు. ఏది ఏమైనా కష్టపడే వారిని అధిష్టానం గుర్తిస్తుందని ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సీట్ అంటూ కేటాయిస్తే అది ఇన్చార్జ్ అయిన పొత్తూరి రామరాజు లేదా సీనియర్ నాయకుడు కొవ్వలి యతిరాజు రామ్మోహన్ నాయుడికి ఎమ్మెల్యే సీటు వస్తుందని కార్యకర్తలు ఎవరు అపోహ పడొద్దని కొన్ని మీడియాలో వచ్చిన వార్తలని నమ్మవద్దని అన్నారు.
మాకు లబ్ధి పొందిన నాలుగు కోట్ల మంది ప్రజలతో పొత్తు ఉంది. టీడీపీ జనసేన ఒత్తులో ఉన్నప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంతమందిని పార్టీలో చేర్చుకుంటున్నారు. మేము పార్టీలో చేర్చుకునేందుకు ఒక కమిటీని వేసాము. పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తాము, 175 సీట్లు లోని పోటీ చేసే విధంగా 175 నియోజకవర్గాల్లో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాము. మొదట పోటీలో ఉన్న తర్వాత పొత్తుల కోసం ఆలోచిస్తాము. మాది జాతీయ పార్టీ పొత్తులు విషయం జాతీయ నాయకులు చూసుకుంటారు. సంక్షేమం అభివృద్ధి విషయంలో మా పార్టీ జడివానల ముందుకు సాగుతుంది. సంక్షేమ విషయంలో అధికార వైసీపీ కొసరుల వెళ్తుంది..
ఈనెల 5న ఏలూరు జిల్లా చింతలపూడిలో జరిగే రా కదలిరా భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏలూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిలతో ప్రోగ్రాం కోఆర్డినేటర్లు మాజీ మంత్రులు సమావేశమై కార్యచరణ రూపొందించడం జరిగిందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రా కదిలిరా బహిరంగ సభలో లక్ష మందికి పైగా పార్టీ కార్యకర్తలు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, జగన్ ప్రజలకు చేస్తున్న మోసాలను ఎండకట్టి, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు..
వైసీపీ నియంతృత్వ పాలనపై ప్రజలు విసిగిపోయి టీడీపీ- జనసేనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని నరసాపురం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ పొత్తూరు రామరాజు తెలిపారు. అద్భుతమైన రాజధానిని నిర్మించాలనే లక్ష్యంతో చంద్రబాబు.. ప్రజలకు 33 శాతం ఇచ్చే ఒప్పందంలో 33 వేల ఎకరాలు సేకరించారన్నారు. సిఎం జగన్ ఉద్దేశపూర్వకంగా అక్రమకేసులు బనాయించారని మండిపడ్డారు. వైసీపీ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, రాబోయే రోజుల్లో జగన్ జైలుకెళ్లడం ఖాయమన్నారు. ఐదేళ్ల పాలనపై ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నరసాపురం నియోజకవర్గంలో టీడీపీ – జనసేనలో టిక్కెట్ ఎవరికీ ఇచ్చినా విజయానికి కృషి చేస్తామని రామరాజు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా చెప్పుకోవచ్చు. అత్యధికంగా సామాజిక వర్గంగా కాపులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ భిన్నమైన తీర్పులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. 2014లో ఇండిపెండెంట్ గా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వర్మ విజయం సాధించారు. ఏకంగా 50 వేల ఓట్ల మెజార్టీతో రికార్డు సృష్టించారు. 2019 లో మాత్రం జగన్ గాలికి ఆయన కూడా కొట్టుకుపోయారు. ప్రస్తుతం జనసేన టిడిపి బలంగా ఉన్న వర్గాల్లో పిఠాపురం మొదటి స్థానంలో ఉందని చెప్పాలి అయితే ఇక్కడ వర్మ సీటు ఆశిస్తున్నారు. కానీ జనసేనకు పిఠాపురం తప్పనిసరి అని వాదన బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్థానికత అంశం కూడా తెరపైకి రావడం రాజకీయంగా కలవరం సృష్టిస్తుంది. ప్రస్తుతం జనసేన ఇన్చార్జిగా ఉన్న ఉదయ శ్రీనివాస్ రాజమండ్రి దగ్గర కడియంకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని జనసేన నాయకుల మధ్య వైరాన్ని తగ్గించేందుకు పార్టీ కార్యక్రమాలు చక్కదిద్దేందుకు మాత్రమే ఉదయ్ శ్రీనివాసన్ పంపించారనేది మరొక వాదన అయితే ఉదయ శ్రీనివాస్ కు సీటు పక్కా అని పవన్ కళ్యాణ్ ఇంట్లో మనిషిగా ఉదయ శ్రీనివాస్ కు పేరు ఉందని ప్రచారం ఎక్కువగా ఉంది. అయితే తెలుగుదేశం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా పిఠాపురం ప్రత్యేక స్థానంలో ఉంది. ఇందుకు గతంలో తెలుగుదేశానికి పడ్డ ఓట్లే ఉదాహరణగా చెబుతున్నారు. జనసేన బలంగా ఉన్నప్పటికీ లోకల్ ఫీలింగ్ బయటకు రావడంతో ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ పరిస్థితి అయోమయంగా మారింది. దీంతో ఇక్కడ సీటును తెలుగుదేశానికి కేటాయించే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోపక్క అధిష్టానం కూడా ఎటు తేల్చకపోవడంతో ఈ సీటు ప్రస్తుతం గందరగోళ పరిస్థితిని నెలకొల్పిందనే చెప్పాలి. ఆఖరి నిమిషం వరకు పిఠాపురం సీటు తేల్చాలని ప్రతిసారి ఇలాగే చేసి కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని చెబుతున్నారు. ఆయా పార్టీల అభిమానులు ఎవరో ఒకరికి సీటు వస్తుందని పక్కాగా చెబితే ఆ దిశగా మేము కార్యక్రమాలు చేస్తామని అప్పటివరకు ఈ కన్ఫ్యూజన్ తప్పదని జనసేన టిడిపి కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. మరోపక్క వైసీపీ ఇప్పటికే సీట్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేసింది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దొరబాబును పక్కనపెట్టి కాకినాడ ఎంపీ వంగ గీతకు ఇన్చార్జ్ పగ్గాలు అప్పగించారు. పిఠాపురం సీటు విషయంలో ఎమ్మెల్యే మరో దారి లేక పార్టీ వెంటే ఉన్నారు. ప్రస్తుతం పిఠాపురం రాజకీయ పరిస్థితి చూస్తే జనసేన టిడిపి పోటాపోటీగా సీటు కోసం పాకులాడుతున్నాయి. మరోపక్క పిఠాపురం స్థానం నుండి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అలా జరిగితే ఎవరికీ గొడవ ఉండదని నెగ్గించుకుంటామని టిడిపి జనసేన అభిమానులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే పిఠాపురం సీటు విషయంలో చివరి వరకు డైలమా తప్పదని ఇది గతం నుండి ఆనవాయితీగా వస్తుందని స్థానికులు అంటున్నారు.
వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా చాలమ్మలశెట్టి సునీల్ పేరు ఖరారు అయింది.. వైసీపీ అయిదవ జాబితాలో ఆయన పేరు ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈయన కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడం నాలుగో సారి. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి మళ్లీ ఓటమిని ఎదుర్కొన్నారు. 2019లో టీడీపీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని ఓటమి బాట పట్టారు. అప్పటినుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆరు నెలల క్రితం వైసీపీలో చేరారు. జగ్గంపేట అసెంబ్లీ టికెట్ అడిగారు. కానీ పార్టీ అధిష్టానం ఆయనకు కాకినాడ ఎంపీ టికెట్ కేటాయించింది. కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం అసెంబ్లీ ఇన్చార్జిగా నియమించడంతో ఎంపీగా సునీల్ పేరు ఖరారు చేసారు. వరుసుగా మూడుసార్లు ఓడిపోయిన సానుభూతి నేపథ్యంలో నాలుగవసారి గెలుస్తారు అన్న చర్చ జరుగుతోంది. విదేశాలలో పెద్ద ఎత్తున వ్యాపార వాణిజ్య కేంద్రాలు నిర్వహించే సునీల్ రాజకీయ అరంగేట్రంతోనే ఓటమి చవి చూసారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆయన గెలుపు బాట పడతారా అనే చర్చ జరుగుతోంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతంగాను, రాజకీయ దురందుల కోటగాను పేరుగాంచిన జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయం ఊపందుకుంది. సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తున్నందున మెట్ట ప్రాంతంలో మాత్రం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆది నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల నడుమ రాజకీయ పోరు కొనసాగుతుంది. తాజాగా మారుతున్న కాలాన్ని బట్టి పెరుగుతున్న రాజకీయ పార్టీల తాకిడితో మెట్ట ప్రాంతమైన కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట లో రాజకీయం రసవత్తరంగా మారింది. CVR న్యూస్ ప్రత్యేక కథనం మెట్ట ప్రాంతంగా పిలవబడే జగ్గంపేటలో ఆది నుంచి పంతం, తోట, జ్యోతుల కుటుంబాల నడుమ రాజకీయ పోరు కొనసాగుతుంది. ఈ మూడు కుటుంబాలకు ఉభయగోదావరి జిల్లాలోని అన్ని పార్టీల నాయకులతో కుటుంబ బాంధవ్యాలు పెనవేసుకుని ఉన్నాయి. దీనితో రాజకీయంగా ప్రధాన పార్టీలు ఆయా కుటుంబాలను కాదని గత ఐదు దశాబ్దాలుగా మరొకరికి ప్రాతినిధ్యం కల్పించిన దాఖలాలు లేవు. తాజాగా కొత్త పార్టీలు ఎన్నికల బరిలోకి దిగడంతో ఆయా కుటుంబాలకు దగ్గర బంధువులే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు.
జగ్గంపేట రాజకీయం ఒక చిత్రం పరిశీలిస్తే ప్రస్తుత శాసనసభ్యుడిగా వైకాపా నుంచి జ్యోతుల చంటిబాబు ఎన్నికయ్యారు. ఈయన రాజకీయ దురంధరుడు గా పేరుగాంచిన తన పెదనాన్న జ్యోతుల నెహ్రూ పై పోటీ చేసి గెలుపొందారు. మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఆరితేరిన జ్యోతుల నెహ్రూ జగ్గంపేట సెగ్మెంట్లో ప్రతిపక్ష పార్టీ నేతగా రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నారు. ఇబ్బడి ముబ్బడి సంక్షేమ పథకాలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జగనన్న పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించే విధంగా జ్యోతుల నెహ్రూ జగ్గంపేటలో ఏదో ఒక కార్యక్రమాన్ని కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు.
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబునీ కాదని అధికార వైసిపి మాజీ మంత్రి తోట నరసింహంను జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. ఆయన పాత క్యాడర్ ను వెంటబెట్టుకుని నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీని పటిష్టవంతం చేసే చర్యల్లో ఆయన తనదైన శైలిలో పావులు కదుపుతూ ముందుకు పోతున్నారు. నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీకి చెందిన కొంత క్యాడర్ మాత్రం ఎటువైపు వెళ్లకుండా గుంభనంగా ఉన్నారు. అధికార వైసిపి టికెట్ జ్యోతుల చంటి బాబు కాదని మాజీ మంత్రి తోట నరసింహం పేరు ప్రకటించగానే పార్టీలో అసంతృప్తులు పెరిగాయనే వాదన మాత్రం బలంగా వినిపిస్తుంది. ఈ వాదనలకు బలం చేకూర్చే విధంగా నియోజకవర్గ పరిధిలో వైసిపి నుండి టిడిపిలోకి చేరికలు జోరుగానే సాగుతున్నాయి. కిర్లంపూడి ఎంపిపి,జెడ్పీటీసీ, గండేపల్లి జెడ్పీటీసీ, గోకవరం ఎంపిపి లు తమ అనుచర వర్గంతో వైసిపి నీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీటికి తోడు గ్రామస్థాయిలో కూడా టిడిపి నేత జ్యోతుల నెహ్రూ పార్టీలో చేరికలు జోరుగా సాగిస్తూ తన మార్క్ రాజకీయాలు సాగిస్తూ బలం పుంజుకుంటున్నారు.
నియోజకవర్గ స్థాయిలో వైసిపి నుండి టిడిపి లోకి జోరుగా చేరికలు పెరగడంతో అధికార వైసిపి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అసంతృప్త వాదులను పార్టీలోకి తీసుకుని బలం పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికి తోడు పార్టీకి దూరంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబును సైతం దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు అధిష్ఠానం చేపట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు కూడా తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆయన కాకినాడ ఎంపిగా జనసేన పార్టీ తరుపున బరిలోకి దిగనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. పొత్తులో బాగంగా బరిలోకి జ్యోతుల కుటుంబాలు కలిసి దిగితే అధికార వైసిపి ఓటు బ్యాంక్ గండి పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ రెండు పార్టీలకు సమాంతరంగా జనసేన పార్టీ జగ్గంపేట ఇన్చార్జి పాఠం శెట్టి సూర్యచంద్ర గత ఏడాదికాలంగా తన భార్యతో కలిసి ప్రతిరోజు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఒక దఫా మొక్కల పంపిణీ అంటూ మరో దఫా పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసు పంపిణీ చేస్తూ నిత్యం ప్రజల్లోనే పర్యటిస్తూ పార్టీ ప్రచారం చేసుకుంటున్నారు. పొత్తు లో భాగంగా జగ్గంపేట టికెట్ టిడిపికి కేటాయిస్తే సూర్యచంద్ర పయనం ఎటు అనే విషయం ఆలోచింప చేస్తుంది. అధికార వైసిపి లో ఉన్న లుకలుకలు మాదిరిగానే పొత్తు కుదిరితే జనసేన లోను లుకలుకలు బహిర్గతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో మరణించిన కుటుంబాలను పరామర్శించారు. నిజం గెలవాలి అనే పేరుతో చేస్తున్న యాత్రలో భాగంగా దర్శి పట్టణంలోని 5వ వార్డులో మరణించిన తురిమెల్ల పరిశుద్దరావు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు అనంతరం మూడు లక్షల రూపాయిల చెక్కును అందించారు. అక్కడ నుండి ముండ్లమూరు మండలం సింగన్నపాలెం గ్రామంలో మరణించిన బత్తిని హనుమంత రావు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయాన్నిఅందించారు. అక్కడ నుండి తాళ్లూరు మండలం గుంటిగంగ దేవాలయం వద్ద గల తేజా వృద్ధాశ్రమం నందు జంపాల నరసింహ రావు కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. భువనేశ్వరి వెంట టీడీపీ జిల్లా నాయకులు ఉన్నారు.
వైఎస్సార్ కుటుంబం తో ఉన్నటువంటి అనుబంధాన్ని ఎవ్వరు కూడా విడగొట్టలేరని, మంచి జరిగిన, చెడ్డ జరిగిన నా జీవితం జగనన్నతోనేనని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి లో ప్రభుత్వ హై స్కూల్ మైదానం లో మున్సిపల్, మెప్మా, వెలుగు అధికారుల అద్వర్యంలో నాల్గవ విడత వైఎస్సార్ ఆసరా పథకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. మునిసిపల్ పరిధిలోని 745 సంఘాలకు 5.36 కోట్లు, మండల పరిధి లోని 424 సంఘాలకు 3.14 కోట్లు మేగా చేక్కును లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు అభివృద్ధి తో పాటు ప్రజాధనం మెండుగా ఉన్న జగనన్నను ఎదుర్కొనే దమ్ము దైర్యం లేక కొత్త రకం కుట్రలకు తెరలేపారు టిడిపి శ్రేణులు. నేను జగన్ మోహన్ రెడ్డి గారిని ఎదురించి మాట్లాడను అంటూ సిగ్గులేని వెదవలు వీడియోలు ద్వారా దుస్పాచారం చేస్తున్నారని, జగన్ మోహన్ రెడ్డి నాకు దైవం, నా ప్రాణం, నన్ను బయటకు పొమ్మని తోసిన పార్టీలోనే బ్రతికేటటువంటి సైనికున్ని అన్నారు. నా ఊపిరి, నర నరనా వైఎస్సార్ పార్టీ జీర్ణించుకు పొయ్యిందని సిగ్గులేని వెధవల్లారా మేమెందిరా మా నాయకుడితో గొడవపడేదన్నారు. చంద్రబాబు చేసిన లక్షల కోట్లు అప్పులు ఏమయ్యాయి అని ప్రశ్నిస్తే మంచి చేసే జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేసే పనిగా పెట్టుకొన్నారు చంద్ర బాబు. మీ బిడ్డ జగన్ చేసిన అప్పులు ప్రజలకు చేరాయి. మీ బిడ్డ శ్రీకాంత్ రెడ్డి ఏ తప్పు చేయడు. మిమ్మల్నే నమ్ముకొని ఉన్నానన్నారు. చంద్ర బాబు నాయుడు మదనపల్లె జిల్లాను, కొడుకు రాజంపేట జిల్లాను చేస్తానని మాట్లాడడం వారి మూర్ఖత్వమే కాకా మరేమిటని ఎద్దేవా చేశారు. జిల్లా మారిస్తే మనం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. నా రాజకీయ జీవితంలో నా కుటుంబం కోసం పది శాతం కేటాయిస్తే నియోజకవర్గం ప్రజల కోసం 90 శాతం కేటాయించానన్నారు. రాయచోటిలో ఎన్నికలు అంటే రాళ్ళు రువ్వు కోవడం, బాంబులు వేసుకోవడం తొడలు కొట్టే సంస్కృతి ఉండేది తల్లి, నేను వచ్చిన తర్వాత ఎక్కడైనా ఇలాంటి గొడవలు ఉన్నాయా ఈ పుణ్యం అంతా వైఎస్సార్ పుణ్యమే తల్లి.. వారి కుటుంబం అనునిత్యం పేద ప్రజలకు మంచి చేయాలని తపించే కుటుంబం అన్నారు. మీ బిడ్డ, మీ ఆశీస్సులతో, దీవెనలతో గెలిచిన నేను ఎప్పటికి మోసం చేయను అని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు.