విజయవాడలో రాజకీయం కీలక మలుపులు తిరుగుతోంది. టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే ఎన్టీఆర్ జిల్లాలో సమీకరణాలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ తో పాటుగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీటు కోసం నేతల మధ్య పోరు కొనసాగుతుంది. టీడీపీ – జనసేన పొత్తుతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో పశ్చిమ నుంచి బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్, నాగుల్ మీరా, బేగ్ వంటి నేతలు రేసులో ఉన్నారు. అయితే సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి విషయంలో చర్చ తీవ్రమైంది.
Tdp
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్ సంచలన కామెంట్స్ చేశారు. రా కదిలి రా సభ ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు మానసిక స్థితిని కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. ఏ ప్రాంతానికి వెళ్లిన వాళ్ళ రాసిన స్క్రిప్ట్ చదువుతున్నాడంటూ విమర్శలు చేశారు. ఆ చదవడంలో కూడా వయస్సు పెరిగిపోవడం వల్ల తడబడుతున్నాడన్నారు. ప్రజలను బానిసలుగా చేయాలనే తత్వం చంద్రబాబు అని అన్నారు. సైకో లక్షణాలు ఆయన దగ్గరనే కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రాన్ని ప్రత్యేక ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాజకీయాల్లో విలవలు లేని చంద్రబాబుకు అమ్మాయిలపైన జరిగే హింసలపై మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందన్నారు.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాల్లో 56 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహిస్తారు. దీంతో ఏపీలో రాజకీయ సందడి నెలకొంది. ఖాళీ కానున్న 3 రాజ్యసభ సీట్లలో ఎవరు ఎన్నికవుతారన్న చర్చకు తెరలేసింది. వైసీపీ, టీడీపీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా.. రాజమండ్రిలో రా కదిలిరా సభలో చంద్రబాబు నాయుడుకి ప్రమాదం తృటిలో తప్పింది. చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో సాల్వలతో ఒక్కసారిగా స్టేజ్ మీదకు టిడిపి నేతలు రావడంతో.. ఆ తోపులాటలో స్వల్పంగా చంద్రబాబు నాయుడుని తోయడంతో.. ఉలిక్కిపడ్డ చంద్రబాబు నాయుడిని పట్టుకున్న వ్యక్తిగత సిబ్బంది.. సెక్యూరిటీ గార్డ్స్ అలెర్ట్ కావడంతో ప్రమాదం తప్పింది.
ఏలేశ్వరం నియెజకవర్గము లో ఈ సందర్భంగా మూది నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇంచార్జి వరుపుల సత్యప్రభ రాజా ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సీఎం జగన్మోహన్రెడ్డి బీసీలకి తీరని అన్యాయం చేశారని, తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే బీసీలకి అనేక సంక్షేమ పథకాలు అమలు అయ్యేవని బీసీలందరూ టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఏలేశ్వరం నగర పంచాయతీతో పాటు మండల పరిధిలో ఉన్న బీసీ సోదరులు అందరూ ఈ సమావేశానికి హాజరు అవ్వాలని కోరారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు రాజకీయాల్లో టీడీపీ పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు టీడీపీ టికెట్ వ్యవహారంలో అనేకమంది ఆశావహులు ఉండగా, ఇంకా పార్టీ అధిష్టానం అభ్యర్థుల జాబితా ప్రకటించక ముందే ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరున ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి అంటూ పోస్టర్లు పట్టణంలో వెలిశాయి. దీంతో జనం ఆ పోస్టర్లను ఆసక్తిగా చూస్తున్నారు. ప్రొద్దుటూరు టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరద రాజులరెడ్డి, సీఎం సురేష్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఎం.లింగారెడ్డితోపాటు రాజుపాలెంకు చెందిన శెట్టిపల్లె ప్రభాకర్ రెడ్డి, ప్రొద్దుటూరు మైనార్టీ నాయకులు ఇవి ముక్తియార్ కూడా ఆశిస్తున్నారు. మొన్నటి చంద్రబాబు రా కదలిరా సభకు ముందు రోజు కూడా పార్టీ అధిష్టానం ఐవిఆర్ కాల్ ద్వారా మాజీ ఎమ్మెల్యే వరద, సీఎం సురేష్ నాయుడు, జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డిలలో ఎవరు అభ్యర్థిగా అనుకుంటున్నారంటూ సర్వే కూడా చేసింది. కదలి రాసభకు భారీ ఎత్తున జనాలను ఇక్కడి నేతలు ఎవరి స్థాయిలో వారు తీసుకెళ్లారు. ఇటీవల తిగిరి పార్టీలో చేరిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చారని ప్రకటించారు. ఆ మరుసటి రోజే టీడీపీ ప్రొద్దుటూరు అభ్యర్థి ప్రవీణ్ కుమార్ రెడ్డి అంటూ నేరుగా పోస్టర్ల వెలియడంపై మిగిలిన వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలతో ఇలా ప్రవీణ్ కుమార్ రెడ్డి పోస్టర్ల రూపంలో అడుగు ముందుకేశాడా లేక తనకే టికెట్ వస్తుందన్న నమ్మకంతో పోస్టర్లు వేయించాడా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. మొత్తానికి రాత్రికి రాత్రికి వెలసిన టీడీపీ ఇన్చార్జి పోస్టర్లు ప్రొద్దుటూరులో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
తెలుగుదేశం పార్టీలో పార్థసారథి అసలు చేరకుండానే సీటుపై హామీ అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఫోన్లు వస్తున్నాయి అంటూ జరుగుతున్న ప్రచారం వైసీపీ కుట్రే అని నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు గారు అన్నారు. గత మూడు రోజులుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా నూజివీడు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది గ్రామ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్సిపి నాయకులకు ఫోన్ చేసి తనకు సీటు కన్ఫర్మ్ అయినట్లు పార్థ సారథి తెలుపుతున్నాడని ఆయన అన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు తన వెంట ఉన్నారని తెలిపిన ముద్ద్రబోయిన వెంకటేశ్వరావు. పార్టీ అధ్యక్షులు కాని అధిష్టానం కాని ఇంతవరకు తనను సంప్రదించలేదని తెలిపారు. పార్థసారథికి సీటు హామీ విషయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా దుష్ప్రచారంపై సంప్రదించామని తమకు ఎటువంటి సమాచారం లేదని ఆయన తెలిపారన్నారు. దీనిని బట్టి చూస్తే వైసీపీ దుష్ప్రచారంలో భాగంగానే సీటు హామీ ప్రచారం జరుగుతోందని దీనిని ఎవరు నమ్మవద్దని ఆయన కోరారు. ఎట్టి పరిస్థితుల్లో తానే పోటీలో టీడీపీ అభ్యర్థిగా ఉంటారన్నారు.
కడప జిల్లా… జమ్మలమడుగు మండలంలోని మోరగుడి గ్రామానికి చెందిన 50 చేనేత కుటుంబాలు వైయస్సార్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరారు. పార్టీలో చేరిన వారికి జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి కండువావేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా.. కదలిరా నినాదాన్ని విశ్వసించి గ్రామానికి చెందిన 50 కుటుంబాలు పార్టీలో చేరి పార్టీని బలోపేతం చేయడం జరిగిందని అన్నారు. వైకాపా ప్రభుత్వం పేద ప్రజలపై ధరల భారాన్ని మోపి ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాల్సిన ఆవశ్యకతను మన అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో రా.. కదలిరా.. కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే వైసీపీ ప్రభుత్వంపై అలాగే అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఖండించారు. మాజీ మంత్రి పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చంద్రబాబు వ్యవహార శైలి పై ధ్వజమెత్తారు. ఆయన తన స్థాయిని తగ్గించుకొని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు రాష్ట్రంలో చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదంటున్నారు.
అల్లూరి జిల్లా చింతపల్లి అంబేద్కర్ కాలనీలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ద్వారా, పాడేరు నియోజక వర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి అభిమానులు కార్యకర్తలు పూల జల్లులతో చింతపల్లి నలుమూలల పర్యటించారు. అనంతరం చింతపల్లి అంబేద్కర్ కాలనీలో భారీ బహిరంగ సభలో, నేను మీకు అండగా ఉన్నాను, మన ప్రభుత్వ రావడానికి ఒక్క నెల మాత్రం ఉంది, మీ భవిష్యత్తు గ్యారెంటీ మీకు ఏ కష్టం వచ్చినా ఏ అర్ధరాత్రి అయిన నన్ను పిలవండి నేను వస్తాను.. మీ సమస్య తీరుస్తాను.. మీ శరీరం మీద ఈగ పడితే నా శరీరం మీద దుడ్డు పడినట్లే మా వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే నేను ఊరుకుండేది లేదని బరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వైసీపీలో పనిచేస్తున్న ముఖ్య నేత చిందాడ, చిన్నతోపాటు, అంబేద్కర్ కాలనీ వాసులు తెలుగుదేశం పార్టీలోకి గిడ్డి ఈశ్వరి చేతుల మీదుగా, తెలుగుదేశం కండువాలు వేసుకొని పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు పై అభిమానంతో ఈ రోజున ప్రజలు భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.