ఇంచార్జ్ బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు తెలుగుదేశం పార్టీ కార్యలయంలో జయహో బీసీ సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బీసీలకు తుంగలో తొక్కిన వైసీపీ ప్రభుత్వం, బీసీలకు వైసీపీ ప్రభుత్వం హయాంలో బీసీలకు న్యాయం జరగలేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరకి న్యాయం జరిగింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీలకు మళ్లీ పెద్దపీట వేస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరైన పార్వతీపురం నియోజకవర్గం పట్టణ, మండల బీసీల నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Tdp
పల్నాడు జిల్లా, నరసరావుపేట పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట టీడీపీ నేతల ధర్నా చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం వరికెపుడిసెలని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, చదలవాడ అరవింద్ బాబు, పలువురు టీడీపీ శ్రేణులుతో పాటు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
పీలేరులో టీడీపీ రా కదలిరా కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన నాయకులు తరలి వచ్చారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేణిగుంట నుండి హెలికాప్టర్లో పీలేరు కు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో పీలేరు సభాస్థలి వద్దకు జనసేన, టీడీపీ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. పీలేరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని, జనసేన నాయకులు టీడీపీ కార్యకర్తలు, కలసి గెలిపించుకుంటామని అంటున్నా పీలేరు జనసేన నాయకులు కామిసెట్టి సుధాకర్.
రాష్ట్రంలో జనసేన అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గాలలో పిఠాపురం మొదటి స్థానంలో ఉందని చెపుతారు. నిజంగా పార్టీ ఇక్కడ బలంగా ఉంది. కానీ గత కొంతకాలంగా అసమ్మతి పెరిగింది. తొలుత పిఠాపురం ఇన్చార్జిగా మాకినీడి శేషు కుమారి వ్యవహరించారు. హఠాత్తుగా ఆమెను తొలగించి పార్టీ అధినేత పవన్ కు సన్నిహితుడైన టీడీపీ అధినేత తంగేళ్ల ఉదయ శ్రీనివాసును నియమించారు. ఆయన రావడంతోనే ఆమె రాజీనామా చేసి వెళ్లిపోయారు. కొంత కాలం పాటు ఉదయ శ్రీనివాస్ కార్యక్రమాలు సాఫీగానే జరిపారు. ఇదే పార్టీలో సీనియర్లను గుర్తించడం లేదని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ పిల్లా శ్రీధర్, అదే విధంగా గతంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు వచ్చినప్పుడు గొల్లప్రోలులో ఆయన బస చేసిన ఇంటి అధినేత, విద్యావేత్త, సీనియర్ నేత ఇలా ఎందరినో తంగిళ్ళ పట్టించుకోవడం లేదు. వారంతా పార్టీ కోసం పనిచేస్తున్నారు. కానీ ప్రాధాన్యత లేదని వాపోతున్నారు. మరోపక్క టీడీపీ ఇన్చార్జి వర్మ తానే అభ్యర్థని ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో అందరినీ కలుపుకొని పోవలసిన ఉదయ శ్రీనివాస్ ఏకపక్షధోరణి పై విమర్శలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన నాయకులు పిఠాపురం సమావేశంలో కుర్చీలతో కొట్టుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో కొత్తగా జనసేనకు తలనొప్పులు ప్రారంభమయ్యాయి.
కాగా రెండు రోజుల క్రితం పిఠాపురంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి, టీడీపీ ఫైర్ బ్రాండ్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు జనసేనలో కలవరాన్ని పుట్టిస్తున్నాయి. జనసేన ఇంచార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ స్థానికేతుడు అంటూ ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. తంగేళ్ల అనుచరులు దీనిపై మండిపడుతున్నప్పటికీ ఆయన వ్యతిరేకవర్గం మాత్రం హర్షం వ్యక్తం చేస్తోంది. అయ్యన్నపాత్రుడు నిజమే చెప్పాడని వారు వ్యాఖ్యనిస్తున్నారు. జనసేన రెండో వర్గం అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను సమర్ధించడం మరో వివాదాస్పదమైంది.
అయినవిల్లి మండలం ఎస్.మూలపాలెం గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు ను టీవీ లో వీక్షించి ఒక్క సారిగా కుప్పకూలి మృతి చెందిన ఎస్.మూలపాలెం గ్రామ ఉపసర్పంచ్ మోరంపూడి మీరా సాహెబ్ కుటుంబాన్ని పరామర్శించి మూడు లక్షల రూపాయల చెక్ ను నారా భువనేశ్వరి అందజేశారు. అనంతరం కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి బయలుదేరారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ..బీసీలకు జగన్మోహన్రెడ్డి వెన్నుపోటు పొడిచి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారని అన్నారు. తాను ప్రభుత్వంపై పొరాడుతుంటే తనపై కుట్రపూరితంగా అక్రమ కేసులు పెట్టారని అన్నారు. టీడీపీ హయంలో బీసీలకు పెద్దపీట వేశామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని అన్నారు. దేశంలోనే మొదటిసారిగా బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలా అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ నిర్చయించుకుందని తెలిపారు.
ఏపీలో బీసీ కులగణనపై రాజకీయం వేడెక్కింది. సీఎం జగన్ రాజకీయ కుట్రలో బీసీ కులగణన ఓ భాగమని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసమే ఈ కులగణన చేపట్టారని, రాష్ట్రంలో ఉన్న బీసీలు జగన్ ను నమ్మి ఈ కుట్రకు బలికావొద్దని అన్నారు. బీసీల సంక్షేమం కోసం పాటుపడుతున్నానని చెప్పుకునే జగన్, ఇన్నాళ్లు కుల గణన అంశంలో కేంద్రం మీద ఒత్తిడి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కుల గణన అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని జగన్ కనీసం తన ఎంపీలకు కూడా చెప్పలేదని మండిపడ్డారు. ఈ అంశంపై ఇన్నాళ్లు ఎక్కడా మాట్లాడకుండా, ఎవరినీ ప్రశ్నించకుండా, ఉన్నట్టుండి కుల గణనను తెరపైకి తీసుకురావడం జగన్ రాజకీయ అవకాశవాదానికి నిదర్శనం అని అన్నారు. కుల గణన చేపట్టాలని చంద్రబాబు 2014లోనే కోరారని, కానీ కేంద్రం స్పందించలేదని కాల్వ శ్రీనివాసులు తెలిపారు.
Read Also..
Read Also..
రాబోయే రెండు వారాల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోందని ఫిబ్రవరి 2 లేదా 3వ వారంలో షెడ్యూల్ రావాలని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామాల్లోకి సక్రమంగా రావడం లేదని, ఈ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నేదురుమల్లి చేసిన ఆరోపణలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై వచ్చిన ఆరోపణలు ఎవరు నిరూపించ లేదన్నారు. వెంకటగిరి స్థానిక ఎమ్మెల్యేను, వైసీపీ పార్టీ నుండి నన్ను తొలగించారు కానీ, ఎమ్మెల్యే పదవి నుంచి మాత్రం ఎవరూ చేయలేరని అన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ విజయం సాధిస్తుందని, వెంకటగిరి నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ఆనం తెలిపారు.
ఏపీ నుండి బీజేపీకి ఒక్క ఎంపీని ప్రజలు గెలిపించలేదన్నారు APCC అధ్యక్షురాలు షర్మిల. కానీ ప్రభుత్వం మొత్తం బీజేపీ గుప్పెట్లో ఉందని ఆరోపణలు చేశారు. ఏపీ ఎంపీలు బిజెపికి బానిసలైపోయారన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీకి అమ్ముడు పోయిందంటూ మండిపడ్డారు. ప్రజలకు కాంగ్రెస్ శ్రేణులు చెప్పాల్సింది ఇదేన్నారు. మీరు ఓట్లు వేసింది ఒకరికి.. కానీ ఇప్పుడు ఏలుతుంది ఇంకొకరు అన్నారు. ఈ ప్రభుత్వం ఒక్క వాగ్ధానం కూడా నిలబెట్టుకోలేదన్నారు. వైసీపీ, టీడీపీలు…. బీజేపీకి ఊడికం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీని బతికించటం కాదు.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వద్దామన్నారు. రాహుల్ గాందీ మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతామని చెప్పారు.
టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు లంచాలిస్తేనే పనులు జరిగేవని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా నిధుల జమ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. వైసీపీ పాలనలో అక్కాచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో ఈ మంచి ఎందుకు జరగలేదని అందరూ ఆలోచించాలని సూచించారు. గతంలో దోచుకో, పంచుకో అన్నట్టుగా ఉండేదని ఇప్పుడు మీ బిడ్డ బటన్ నొక్కితే, నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బు జమ అవుతోందని ఈ తేడాను గమనించాలని కోరారు. పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత ఆ మాటను గాలికొదిలేశారని జగన్ విమర్శించారు. చంద్రబాబుతో పొదుపు సంఘాలకు నష్టం జరిగిందని అన్నారు. ఇప్పుడు అవే పొదుపు సంఘాలు మంచి శాతంతో గ్రేడులు సాధించి గర్వంగా నిలబడ్డాయని చెప్పారు. కుట్రలు, కుతంత్రాల జెండాలు కట్టడమే చంద్రబాబు అండ్ కో అజెండా అని ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ అజెండా అని అన్నారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే తన లక్ష్యమని చెప్పారు.
Read Also..
Read Also..