మేము ఊహించి దానికంటే మహిళలు యువకులు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నా విజయం ఖాయం గా భావిస్తున్న ఎన్నో కష్టనష్టాలు ఓర్చి ఉద్యమాలు నిర్మించిన చరిత్ర నాకుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల రెండొందల కిలోమీటర్ల పాదయాత్ర 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యమాల్లో క్రియాశీలకంగా ఉన్న ఆనాడు నైజాం కు వ్యతిరేకంగా మా తండ్రి పోరాడారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి గా అవిశ్రాంతంగా పనిచేస్తున్న చరిత్ర నాకుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని సీపీఎం కు ఓటేయాలి. రాబోయే ఇరవై రోజుల్లో కార్యకర్తలు అవిశ్రాంతంగా పని చేసి నన్ను గెలిపించాలి. మన గడ్డ కోసం హక్కుల కోసం పొరడతాను.
Telagana
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. లక్ష్మణ్, ఈటల, రఘునందనరావు తదితర బీజేపీ నేతలతో కలిసి కిషన్ రెడ్డి ప్రాజెక్టును పరిశీలించారు. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ కుంగుబాటు గురించి మాట్లాడకూడదనే ఉద్దేశంతో తాము ఇప్పుడు ప్రాజెక్టును సందర్శించామని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, విధానాలపై తెలంగాణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. మేడిగడ్డ వద్ద కుంగిన ప్రాంతాన్ని పూర్తిగా తొలగించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిందన్నారు. గ్రౌండ్ రిపోర్ట్ చూశాక మాట్లాడాలనే ఉద్దేశ్యంతో తాము ఈ ప్రాజెక్టును సందర్శిస్తున్నామన్నారు. కాగా, బీజేపీ నేతలు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడిగడ్డ వద్దకు చేరుకున్నారు.
గత పదేళ్లుగా నన్ను చూస్తూ వస్తున్నారు. నేను మాట ఇచ్చానంటే అది చేసి చూపిస్తా.. అందుకోసం ఎక్కడిదాకా అయినా వెళ్తా. పాలేరు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న నన్ను గెలిపించండి’’ అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్, పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విజ్ఞప్తి చేశారు. నేలకొండపల్లి మండలంలోని ఆచర్ల గూడెం, ఆరెగూడెం, కోనాయిగూడెం, కోరట్ల గూడెం, అమ్మగూడెం, రాజేశ్వరపురం, శంకరగిరి తండా, ముఠాపురం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాలేరుకి ఆరు గ్యారెంటీల హామీ పోస్టర్ను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని.. అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను గెలిచిన ఏడాదిలోనే పాలేరు నియోజకవర్గానికి ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఇది పాలేరు నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలకు తన స్పష్టమైన హామీ అని అన్నారు.
డబ్బు మద్యం ఎరవేయకుండా ఓట్లు అడిగే ధైర్యం టిఆర్ఎస్, కాంగ్రెస్ బిజెపిలకు ఉందా? అని నర్సంపేట నియోజకవర్గం ఎంసిపిఐ(యు) ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారపు రమేష్ సవాల్ విసిరారు. ఓటర్లకు డబ్బు మద్యం ఎరవేయకుండా ప్రలోభాలకు గురి చేయకుండా ఓట్లు అడిగే ధైర్యం లేదన్నారు. ఆశయాలకు అనుగుణంగా నీతిగా నిజాయితీగా విధానాల ప్రాతిపదికన ప్రజలను చైతన్యం చేసి ఓట్లు అభ్యర్థించే ఏకైక పార్టీ ఎంసిపిఐ(యు) అని అన్నారు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు గుమ్మరించి మద్యం మత్తులో ఓట్లు దండుకొని రాజకీయాలను వ్యాపారంగా మార్చిన రాజకీయ పార్టీలను గుర్తించాలని కోరారు. నీతివంతమైన రాజకీయాలను ముందుకు తీసుకెళ్లేందుకు సమర్ధుడైన బహుజన బిడ్డగా నన్ను ఆదరించాలని ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.






Total views : 75440