నామినేషన్ దాఖలు చేసిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ కేంద్రంలో బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి హనుమ నాయక్ కు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం మీడియాతో పుట్ట మధుకర్ మాట్లాడుతూ.. ఒక బిసీ బిడ్డగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు మూడో సారి అవకాశం ఇచ్చారని, నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బిసిలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రవర్ణాలలో ఉన్నవారికి అనేక అవకాశాలు ఉన్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అనిచి వేశారని అందుకే ఈ సారి నేను పోటీలో ఉండవలసిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఎవరికి సాయం చేయని కాంగ్రెస్ పార్టీ, రాజకీయంగా ఎదిగిన వారిని రాజకీయ సమాధి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళు అన్ని విషయాల మీద పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఎమ్మెల్యే అయితే, ఇప్పటికే నాలుగు సంవత్సారాలు ఏవిధమైన అభివృద్ధి జరిగిందో ప్రజలు చూసారని గుర్తు చేశారు. ఈ సారి బి ఆర్ ఎస్ పార్టీ తరుఫున నామినేషన్ వేసిన తనను ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు.
telangana
ఎంత మంది తీస్మార్ఖాన్లు వచ్చినా ఏమీ చేయలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు
కేసీఆర్ ప్రజాభిమానం ముందు ఎంత మంది తీస్మార్ఖాన్లు వచ్చినా ఏమీ చేయలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో కల్వకుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో, షాద్‌నగర్ చౌరస్తాలో అభ్యర్థి అంజయ్యయాదవ్‌తో కలిసి నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. ఒక్క చాన్స్ ఇవ్వండి అంటున్న కాంగ్రె్‌సకు గతంలో ప్రజలు 11సార్లు ఇస్తే ఏం సాధించారని ప్రశ్నించారు. వారి పాలనలో కరెంట్ లేక రైతులు, తాగు నీరు దొరకక మహిళలు అష్టకష్టాలు పడ్డారన్నారు. రాష్ట్రంలో 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. కాంగ్రెస్ నేతలు ఐదు గంటల కరెంటు చాలు అనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరుగుతున్న యుద్ధం అని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ లేకుండాపోయిందని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎన్నికలకు ముందే అస్త్రసన్యాసం చేశారన్నారు. యుద్ధం చేసే ధైర్యం లేక బరిలో నిలువకుండా పారిపోయాడని విమర్శించారు. తెలంగాణలో గులాబీ జెండా ఉండగా గుజరాత్, ఢిల్లీ రాజుల పాలన మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ ఒంటరి పోరాటమే చేసి, మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు
కేసీఆర్‌ను మించిన మోసగాడు..రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డ ఎంపీ ధర్మపురి అర్వింద్.
కేసీఆర్ మీద కల్వకుంట్ల కుటుంబం మీద తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. ఒక్కసారిగా మాట మార్చారు. కేసీఆర్ మంచోడే అంటూ ఆశ్చర్యపోయే కామెంట్లు చేశారు. అది కూడా రేవంత్ రెడ్డితో పోల్చుతూ.. ఈ స్టేట్ మెంట్ ఇచ్చారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మాట్లాడిన అర్వింద్.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావటం అసంభవమని.. బీజేపీకే స్పష్టమైన మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లేకపోతే హంగ్ వచ్చే అవకాశం ఉందని.. అలా జరిగితే అధికారంలోకి వచ్చేది బీజేపీనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ధర్మపురి అర్వింద్.
ఈ క్రమంలోనే.. రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు అర్వింద్. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి.. కేసీఆర్‌ను మించిన మోసగాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డితో పోల్చితే కేసీఆరే మంచోడంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డిని మించిన మోసగాడు ఎవరూ లేరన్నారు. రేవంత్ రెడ్డి మేడిగడ్డ వెళ్తే మేడిగడ్డలో పిల్లర్లు మునిగిపోతాయంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి కేసీఆర్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని త్వరలోనే బయటపెడతానని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్… శివలింగంపై తేలు వంటి వారని అభివర్ణించారు. తేలును కొడదామంటే కింద తెలంగాణ అనే లింగం ఉంటుందని అన్నారు. అందుకే కేసీఆర్ అనే తేలును ఓటు అనే ఆయుధంతోనే కొట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ కల సాకారం చేసిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని సూచించారు. అహంకారానికి, ఖమ్మం ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచేలా ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అన్నారు.
కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం అన్న కేసీఆర్.. ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దన్నారు. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం..అన్నీ ఆలోచించి ఓటెయ్యాలన్నారు. ప్రతీ పార్టీ అభ్యర్థుల గురించి తెలసుకోవాలని.. అభ్యర్థి కంటే పార్టీ చరిత్ర చూసి ఓటెయ్యాలన్నారు. సింగరేణికి 134 ఏళ్ల చరిత్ర ఉందన్నారు.
సింగరేణి తెలంగాణ ఆస్తి అని చేత కాని దద్దమ్మల పార్టీ కాంగ్రెస్ పాలనలో సింగరేణి నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. అందుకే కేంద్రానికి 49 శాతం వాటా ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. తెలంగాణ వచ్చాక..బీఆర్ఎస్ పాలనలో సింగరేణి లాభాలను రూ.419 కోట్ల నుంచి…రూ.2,184 కోట్లకు తీసుకెళ్లామని కేసీఆర్ తెలిపారు.
జనగామ జిల్లా జనగామ నియోజకవర్గ బిజెపి పార్టీ అభ్యర్థి ఆరుట్ల దేశమంతా రెడ్డి ఎన్నికల ప్రచారం ఉద్ధృతం చేశారు. ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆరుట్ల ఏ గ్రామానికి వెళ్లిన మహిళలు మంగళ హారతుల తోటి స్వాగతం పలుకుతున్నారు. కాగా తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఇక్కడి ఒటర్లు స్థానికేతరుడు వద్దు స్థానికుడే కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్థానికుడు కాకపోవడం వలన జనగామ అభివృద్ధి చెందలేదన్నారు. జనగామ అభివృద్ధి చెందాలి అంటే బిజెపి పార్టీ అభ్యర్థి అయిన తనకు ఓటు వేయాలని కోరారు
తెలంగాణలో ఎన్నికల బరిలో దిగుతున్నామని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బొడే రామచంద్ర యాదవ్ ప్రకటించారు. తమ పార్టీ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. అన్నివర్గాల అభివృద్ధికి మేనిఫెస్టోను ప్రకటించామన్నారు. దేశ రాజధానిగా హైదరాబాద్ ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు రామచంద్ర యాదవ్. బీసీవై పార్టీ మొదటి జాబితాను విడుదల చేశారు. మొత్తం 20 మంది అభ్యర్థుల పేర్లను ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించారు రామచంద్రయాదవ్.
అనాసాగరం గ్రామంలో తెలంగాణ మద్యం డంప్ ను నందిగామ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే నందిగామ శివారు అనాసాగరం గ్రామ సమీపంలోను బెరేతుల నాగమణి అనే మహిళ నిర్మానుష్య ప్రాంతంలో భూమిలో సొరంగంల గుంత తీసి ఆ గుంతలో తెలంగాణా మద్యం దాచింది. ఎసిపి జనార్ధన్ నాయుడు సిఐ హనీష్ తనిఖీలు జరపగా గ్రామ సమీపంలో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు భూమిలో సొరంగం త్రవ్వి ఆ గుంతలో భారీ మొత్తంలో తెలంగాణ మద్యం నిల్వ ఉంచగా గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ మద్యం ఆంధ్రాలో అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఏసీపీ సీఐ హెచ్చరించారు. ఏసీపీ జనార్దన్ నాయుడు మాట్లాడుతూ తెలంగాణ మద్యం తీసుకొచ్చి ఆంధ్రాలో అధిక ధరలకు అమ్ముతున్న వారిపై ఇప్పటికే 65 చోట్ల రైడ్స్ చేశామని తెలిపారు భారీ మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నాం నందిగామ పిఎస్ లో పరిధిలో అధిక మద్యం స్వాధీనం చేసుకున్నము రోజు మద్యం డంప్ ను స్వాధీనం చేసుకున్నాం సిఐ హనీష్ ఆయన టీం అక్రమ మద్యం పై ఉక్కు పాదం మోపుతున్నారని వారి సేవలు గుర్తించి రివార్డులు అందజేశామని ఆయన అన్నారు తెలంగాణ మద్యం ఆంధ్రాలో అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఏసీపీ హెచ్చరించారు.





Total views : 90752