Telangana News
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మధ్య రీజినల్ బ్యూరో అధికార ప్రతినిధి ప్రతాప్ లేఖ విడుదల…బూటకపు ప్రజాస్వామ్య అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించిన ప్రజలకు విప్లవాభివందనాలు మా పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ 5 రాష్ట్రాలలో జరుగుతున్న బూటకపు విధానసభ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ లో తొలి విడుత నవంబర్ 7నాడు జరిగిన ఎన్నికలలో మా ఉద్యమ ప్రాంతాలలోని మెజార్టీ ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. మధ్య రీజినల్ బ్యూర్ అభినందిస్తున్నది. ఉద్యమ ప్రాంతాలలో ఒకటైన బీజాపుర్ నియోజికవర్గం లో కేవలం 41 శాతం పోలింగ్ మాత్రమే జరిగి దాదాపు 59 శాతం ప్రజలు ఎన్నికలను బహిష్కరించి వాటి బూటకత్వాన్ని ఎండగట్టారు. ఛత్తీస్ గఢ్ లో విధానసభ ఎన్నికలు రెండు విడుతలుగా జరుపుతున్నారు. తొలి విడుత పోలింగ్ జరిగిన 20 నియోజికవర్గాలు మా ఉద్యమ ప్రాంతంలోనే వుండడంతో వీటిలో 1-2 చోట్ల మినహా ఎక్కడా 50-60 శాతానికి మించి పోలింగ్ జరుగలేదు. మా ప్రాంతాలలోని ప్రజలు తాము ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకుంటున్న విప్లవ ప్రజా కమిటీ (జనన సర్కార్)లపైనే మరోమారు తమ విశ్వాసాన్ని ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రజలలో భయోత్పాతాన్ని సృష్టించడానికి పెద్ద ఎత్తున అదనపు అదనపు భద్రతా బలగాలను దించారు. ఇప్పటికే వేలాది సంఖ్యలో అడుగడుగున తుపాకులు ధరించిన ఖాకీలతో అడవులు నిండిపోగా, మరిన్ని అదనపు బలగాలను తెచ్చి మొహరించినప్పటికీ, ఎన్నికల అధికారిని రీనాబాబా సాహెబ్ కంగాలీ పదే పదే ఓట్లు వేయాలనీ విజ్ఞప్తులు చేసినప్పటికీ పనికి రాని ప్రజాస్వామ్య మంత్రం పారలేదు. ప్రజల రక్షణలో నిలిచిన మా వీర పీ.ఎల్.జీ.ఏ గెరిల్లాలు కేంద్ర, రాష్ట్ర పోలీసుల అణచివేత చర్యలను ప్రతిఘటించడంలో భాగంగా దాదాపు 10 మంది పోలీసులు మరణించడమో, గాయపడడమో జరిగింది. అక్కడక్కడ పోలింగ్ సిబ్బంది కూడ గాయపడ్డారు. ప్రజల రక్షణకు అంకితమైన .పీ.ఎల్.జే.ఏ. గెరిల్లాల సాహసిక చర్యలను సీ.ఆర్. బి. అభినందిస్తున్నది. ఎన్నికల సిబ్బంది ఇప్పటికైనా మా ప్రాంతాలలోకి పోలీసులు వెంట రాకూడదని మరో మారు విజ్ఞప్తి చేస్తున్నాం. అతి త్వరలో తెలంగాణలోనూ ఎన్నికలు జరుగునున్నాయి. ఎన్నికల బహిష్కరణలో నమూనాగా నిలిచిన ఛత్తీస్ గఢ్ బీజాపుర్ ప్రజలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలోనూ ఎన్నికలు బహిష్కరించాలనీ మరో మారు విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ, దానిని అంటకాగుతున్న బీ.ఆర్.ఎస్.ను తన్ని తరమాలనీ మరోమారు పిలుపునిస్తున్నాం
తెలంగాణ రాష్ట్రంలో జరగనునున్న ఎన్నికల నేపధ్యంలో జోరందుకున్న ప్రచారాలు, బహిరంగ సభలు. (AIMIM)పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన పార్టీ అభ్యర్థులతో కలిసి పాదయాత్రలలో, బహిరంగ సభలలో తీరిక లేకుండా పాల్గొంటూ తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని రియాసత్ నగర్ ప్రాంతంలో జరిగిన ఎం ఐ ఎం పార్టీ బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అందరి కంటే ఎక్కువ మెజారిటీతో అక్బరుద్దీన్ ఓవైసీ గెలుస్తారాని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, mim పార్టీకి ఓటు వేసి తమ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసితో పాటు చంద్రాయనగుట్ట సిట్టింగ్ ఎమ్మెల్యే మరియు AIMIM పార్టీ అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ, చంద్రాయనగుట్ట నియోజకవర్గ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
హైదరాబాద్ జిల్లాకు సాధారణ ఎన్నికల పరిశీలకులుగా 8 మంది ఐ.ఏ.ఎస్ అధికారులు హైదరాబాద్ జిల్లాలో ఎన్నికలను పరిశీలించడానికి భారత ఎన్నికల సంఘం 8 మంది ఐ.ఏ.ఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించిందని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. వారి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- మలక్ పేట్ – అంబర్ పేట్ నియోజకవర్గాలకు యతీంద్ర ప్రసాద్ ఐ.ఏ.ఎస్ (8125971984)
- చార్మినార్ – చాంద్రాయణ గుట్ట నియోజకవర్గాలకు సమీర్ వర్మ ఐ.ఏ.ఎస్ (8125972478)
- ఖైరతాబాద్ – జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు జె.జయకాంతన్ ఐ.ఏ.ఎస్ (8125967488)
- సనత్ నగర్ – నాంపల్లి నియోజకవర్గాలకు డా. అహ్మద్ ఇక్బాల్ ఐ.ఏ.ఎస్ (8125972156)
- కార్వాన్ – గోషామహల్ నియోజకవర్గాలకు కవిత రాము ఐ.ఏ.ఎస్ (8125971991)
- యాకత్ పుర – బహదూర్ పుర నియోజకవర్గాలకు దీపాంకర్ సిన్హా ఐ.ఏ.ఎస్ (8125972009)
- సికింద్రాబాద్ – సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాలకు గాయత్రి క్రిష్ణన్.బి ఐ.ఏ.ఎస్ (8125972486)
- ముషీరాబాద్ నియోజకవర్గానికి సచీంద్ర ప్రతాప్ సింగ్ ఐ.ఏ.ఎస్ (8125972490)
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతో ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం 51 వ డివిజన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ గౌడ్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి, తన నివాసం నుండి భారీ ర్యాలీగా డప్పు వాయిద్యాల బోనాల కోలాహలాల నడుమ కార్యకర్తలు అభిమానులతో కలిసి ఆర్డిఓ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.శంషాబాద్, రాజేంద్రనగర్, గండిపేట మండలం నుంచి గ్రామ గ్రామాన ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేస్తారని కళ్ళు కబుర్లు చెప్పే వారి మాటలు నమ్మకుండా న్యాయంగా పనిచేసే వారికే ప్రజలు పట్టం కడతారని ప్రకాష్ గౌడ్ అన్నారు
మంచిర్యాల జిల్లాకు పిసిసి అధ్యక్షుడు సభలో పాల్గొననున్నారు…!బెల్లంపల్లికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రానున్నారు. ఇందుకు సంబంధించి పాత బస్టాండ్ ఏరియాలోని సింగరేణి తిలక్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ సభా ఏర్పాట్లు పూర్తి చేసారు నియోజకవర్గం నుండి జనాన్ని సభకు తరలించానున్నారు ట్రాఫిక్ ను నీవరించడానికి పోలీస్ లు అన్ని విధాలా చర్యలు చేపట్టారు
నామినేషన్ల దాఖలుకు నేడు శుక్రవారం చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థు వ్యర్థి,లకు సంబంధించి మరో సెట్ నామినేషన్లు, స్వంతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. శనివారం నుంచి నామినేషన్ల ఉపసంహరణ, పరిశీలనలో తిరస్కరణ ఆతర్వాత ఎన్నికల బరిలో ఉన్న తుది పోటీదారుల జాబితా వెల్లడవుతుంది. దీంతో ప్రచార వేడి ఊపందుకోనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీ లైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థుల ప్రకటన వెలువడింది. అన్నీ పార్టీల్లోనూ నామినేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఇక ఓట్ల కోసం అభ్యర్థుల ప్రచారం ముమ్మరం కానుంది.
మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రైవేటీకరణను ప్రోత్సహించింది బిఆర్ఎస్ ప్రభుత్వమని పార్లమెంటులో 13 మంది ఎంపీలు సంతకం చేయగా ప్రైవేటీకరణ చేయడం జరిగిందని దానిలో బాల్క సుమన్ కూడా ఒక ఎంపీ అని ఈరోజు ప్రైవేటీకరణ ఆపామని వాక్యానించడం పలు ఆశ్చర్యానికి గురి చేస్తుందని బుధవారం ఐ ఎన్ టి యు సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి intuc యూనియన్ నాయకులు జనక ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….బాల్క సుమన్ కెసిఆర్ కు ఒక పాలేరుగా ఉంటూ ప్రజలను మభ్యపెడుతూ చెన్నూర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు.రాష్ట్రంలో కేసీఆర్ సీఎంగా ఉంటూ నియంత పాలన సాగిస్తున్నాడని, కుటుంబ పాలన సాగుతుందని తెలిపారు. వీరి ఆధ్వర్యంలో భారీ చేరికలు జరగగా కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. అనంతరం intuc జనక్ ప్రసాద్ మాట్లాడుతూ…..సింగరేణిలో ఒక్క బొగ్గుభాయి కూడా తవ్వని అసమర్థ సీఎం కేసీఆర్ అని బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక 80000 మందికి ఉద్యోగాలు లేకుండా చేశారని పది అండర్ గ్రౌండ్ మైంన్ డ్లను ప్రారంభిస్తానని చెప్పి ఒక్క మైన్ కూడా తవ్వలేదని 20000 ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్క ఉద్యోగం కూడా ఇప్పియ్యలేదని ఇన్కమ్ టాక్స్ రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయలేదని పేర్లు మార్పిడి చేస్తానని చేయలేదని ఒక భారతదేశంలో కాదు ఇండోనేషియా ఆస్ట్రేలియాల కూడామైన్స్ ఓపెన్ చేస్తానని చెప్పి ఒక్క హామీని కూడా నెరవేర్చే లేదని చెప్పారు. ప్రజా ఆశీర్వాద సభలో మేము అధికారంలోకి వస్తే టాక్సీని రద్దు చేసి ప్రభుత్వమే భరిస్తుందని చెప్పగా నువ్వు చేయాలనుకుంటే అధికార పార్టీ ముఖ్యమంత్రి గానే ఉన్నావు కదా రద్దు చేయాలని అనుకుంటే ఒక్క నిమిషం పని అని అన్నారు.తెలంగాణ వస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆశించిన యువకులకు నిరాశ ఎదురయిందని రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్ళీ అధికారం చేపడితే పాత రోజులు వస్తాయని గడిల పాలన మొదలవుతుందని ప్రజలు బానిసలుగా బతకాల్సి వస్తుందన్నారు.ఇకనైనా సింగరేణి సమస్యలు నెరవేరాలంటే ఈ సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ని గెలిపించుకోవాలని ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ వెంకటస్వామిని గెలిపించి వారి తండ్రి అయిన వెంకటస్వామి ప్రజల కార్మికుల పక్షాన నిలబడి సమస్యలను పరిష్కరించారో అలాగే వివేక్ వెంకటస్వామి కూడా ప్రజల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కరించేలా చూడవలసిన బాధ్యత ప్రజల పైనే ఉందని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నచో సమస్యలన్నీ నెరవేరుస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే విప్ నల్లాల ఓదెలు,కాంపెల్లి సమ్మయ్య,దేవి భూమయ్య, పాల్గొన్నరు
మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో పొద్దున ఓ పార్టీ కండువా కప్పుకొని, ఇచ్చిన కమిట్మెంట్ సరిపోక కొద్ది గంటల వ్యవధిలోనే మరో పార్టీ కండువా కప్పుకొని ఆ గట్టునుంటావా,ఈ గట్టునుంటావా అన్న చందంగా తయారయ్యారు ఇక్కడి ఓటర్లు… తాజాగా చెన్నూర్ పట్టణానికి చెందిన టప్ప రాము స్థానికంగా మిర్చి బండి వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు..అయితే అతను గత కొద్ది రోజులుగా బీజేపీ పార్టీలో ఉంటూ పార్టీ కోసం కష్టపడుతూ వున్నాడు..అనూహ్యంగా బీజేపీ పార్టీలో నుండి వివేక్ వెంకటస్వామి గత కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన రాము కొద్ది గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరకు సర్వోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీకి నినాదాలు చేసాడు..కొద్ది రోజుల క్రితమే బీఆర్ఎస్ 17 వ వార్డు కౌన్సిలర్ నాయిని శ్యామల భర్త సతీష్ రాత్రి కాంగ్రెస్ కండువా వేసుకొని తిరిగి తెల్లారే స్వంత గూటికి చేరిన విషయం మనకు తెలిసిందే…ఏది ఏమైనా కండువాల మార్పు కహానితో ఆయా పార్టీల అభ్యర్థులకు ఎవరు మనవారో,ఎవరు ఎటు పోతారో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు….
కాంగ్రెస్ అహంకారాన్ని ఓడిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఇతర నాయకులు విపరీతమైన అహాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అంటే ఆత్మీయత… కాంగ్రెస్ అంటే అహంకారమని అన్నారు. కాంగ్రెస్ లో ఒక్క కుర్చీ కోసం నాయకులు కొట్టుకుంటారని, ఇక కాంగ్రెస్ కు ప్రజల గురించి ఆలోచించే సమయం వారికి ఎక్కడ ఉంటుందని అడిగారు. తమ సీఎం అభ్యర్థి సీఎం కేసీఆర్… మరి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని అడుగుతున్న బీజేపీ ఆరు సార్లు అవకాశమిస్తే నిజామాబాద్ కు ఎం చేసిందని నిలదీశారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి కవిత గారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన తీరు గురించి కార్యకర్తలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. గత పదేళ్ల కాలంలో తమ పార్టీ ప్రతీ ఒక్కరి సంక్షేమానికి, బాగు కోసం పనిచేశామని, కానీ ఎప్పుడూ అహంకారాన్ని ప్రదర్శించలేదని తెలిపారు. ఎప్పుడూ ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీలు చెప్పలేనంత అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వేదిక వద్ద కార్యకర్తలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తంతున్న వీడియోను చూశానని, గతంలో కొడుతున్న వీడియోను చూశామని వివరించారు. ఉస్మానియా విద్యార్థులను అడ్డమీది కూలీలని కూడా రేవంత్ రెడ్డి దూషించారని, రైతులకు మూడు గంటల కరెంటు చాలని అన్నారని, ఇలా విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఆత్మీయంగానే ఉన్నామని, ఇప్పుడూ అలానే ఉంటున్నామని చెప్పారు. బీఆర్ఎస్ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ అంటే అహంకారమని అన్నారు. బీఆర్ఎస్ మన ఇంటి పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ మన మంచికోరే పార్టీ కాదని తెలిపారు. తెలంగాణ ఇవ్వడానికి 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అరిగోస పెట్టిందని, సీఎం కేసీఆర్ దీక్ష చేస్తే ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ వెనక్కి తీసుకుందని, చివరికి వందలాది మంది తెలంగాణ బిడ్డలను పొట్టనపెట్టుకున్న తర్వాత తెలంగాణ ఇచ్చిందని వివరించారు. “కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏక్ అనార్ హై సౌ బిమార్ హై” అన్నట్లుగా ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో ఒక్క కుర్చీ కోసం అనేక మంది కొట్టుకుంటారని, కానీ తాము మాత్రం తమ సీఎం అభ్యర్థి సీఎం కేసీఆర్ అని గర్వంగా చెబుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు. కుర్చీ కోసం కొట్లాటకే కాంగ్రెస్ నాయకుల సమయం సరిపోదని, ఇక ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఆ పార్టీ నాయకులకు లేదని అన్నారు. బీఆర్ఎస్ బలమైన పార్టీ అని, కాబట్టి తప్పకుండా మూడో సారీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని బీజేపీ చెబుతోందని, కానీ ఆరు సార్లు అవకాశం ఇస్తే అవకాశం ఇచ్చినా చేయని పనులు కొత్తగా ఏమి చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి 54 ఏళ్లు అవకాశం ఇచ్చినా ఏమీ చేయలేదని విమర్శించారు. గుణమున్న గణేష్ కావాలా లేదా ధనమున్న ధన్ పాల్ కావాలా అన్నది నిజామాబాద్ తేల్చుకోవాలని, గుణమున్న గణేష్ గుప్తాను ప్రజలు గెలిపించుకుంటారన్న సంపూర్ణ విశ్వాసముందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏలోనే గుణముందని తెలిపారు. ప్రజల కోసం మంచి చేసే వ్యక్తి గణేష్ అని చెప్పారు. నిజామాబాద్ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించారని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం సీఎం కేసీఆర్ ను ఒప్పించి రూ. 45 కోట్లు తెచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అంటే పుష్పక విమానమని, ఎంత మంది వచ్చినా స్వాగతించామని, ఇంకా రావాలన్న కూడా స్థలముందని, అంత పెద్ద పార్టీ తమదని స్పష్టం చేశారు. డివిజన్ వారీగా సమన్వయం చేసుకోవాలని, తద్వారా ప్రతీ గల్లీలో తమకు ఎదురు ఉండదని స్పష్టం చేశారు. కనీసం 55 వేల మెజారిటీతో గణేష్ గుప్తాను గెలిపించడానికి కృషి చేయాలని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు





Total views : 196760