అనకాపల్లి జిల్లా, కంటతడి పెట్టుకున్న మంత్రి గుడివాడ అమర్ నాథ్. నాకు టిక్కెట్ దక్కలేదని కొన్ని పత్రికలు ఛానళ్ళు రాస్తున్నాయి. అమర్ పనైపోయింది అంటు ప్రచారం చేస్తున్నారు. చిన్న వయస్సు నుండే కష్టాలు చూసిన వాడిని ఇలాంటి వార్తలు వల్ల నేను దిగజారిపోను. అన్నింటికంటే పెద్ద పదవి ఒకటి ఉంది అది వైసీపీ కార్యకర్త పోస్టు అది ఉంటే చాలు ఇంకేమి అవసరం లేదు. మీతో పాటు కార్యకర్త గా జెండా మోయడానికి సిద్దం ఉన్నా. వీధివీధుల్లో కార్యకర్త గా తిరుగుతా. రాష్ట్రవ్యాప్తంగా ఓ ముఠా తయారైంది. వైసీపీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డాం అధికారం వచ్చాక కొంత మందికే పదవులు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు అలాంటి వాళ్ళు పార్టీలో ఉండటం కంటే వెళ్లడమే మంచిది. నా రాజకీయ జీవితం సంతృప్తిగా ఉంది. గతంలో చంద్రబాబు కొడుకు అనుభవించిన పదవి నాకు జగన్ ఇచ్చారు. కార్పోరేటర్ గా ఎమ్మెల్యేగా మంత్రి పని చేసా అది చాలు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు భరత్ కు సహకరించాలి.
Telugu News
తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికైన నూరి ఫాతిమా మాట్లాడుతూ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. నా పై నమ్మకంతో తూర్పు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించిన జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. గుంటూరు 1 టౌన్ లో మైనార్టీ మహిళకు అవకాశం ఇవ్వడం జరిగింది. జగనన్న నా పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా గుంటూరు 1 టౌన్ లో భారీ మెజారిటీతో గెలుపొంది జగనన్నకు గిఫ్ట్ గా అందిస్తాను. ప్రజలకోసం నిరంతరం కష్ట పడతాను. మా నాన్నగారు ఎలా అయితే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారో అదే విధంగా ప్రజలకు చేరువలో ఉంటాను.
వైస్సార్ జెండా రెపరెపలాడేలా కృషి చేస్తాను. నన్ను ఈ స్థానంలో నిల్చోబెట్టిన వైసీపీ అధిష్టానం కు తూర్పు కార్యకర్తలుకు, నాయకులకు ధన్యవాదాలు.
అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ను ముట్టడించిన ప్రజలు. పని చేయాలంటే లంచం అడుగుతున్న ఎలక్ట్రికల్ ఏ.ఈ. ఎం.నాగేశ్వరరావు. వినియోగదారుల నుండి అధిక మొత్తంలో లంచం డిమాండ్ చేస్తున్న ఏ.ఈ. మీటర్ గురించి అప్లై చేసిన వినియోగదారుడు ను 40వేలు రూపాయలు లంచం డిమాండ్ చేశాడంటూ ప్రజల ఆరోపణ. ఎక్కడికి వెళ్లినా నన్ను ఏమి చేయలేరని ఏ.ఈ. నాగేశ్వరరావు ధైర్యం. సబ్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ప్రజలు.
జగ్గయ్యపేట జాతీయ రహదారి భీమవరం టోల్ ప్లాజా వద్ద అంగన్వాడీలను అడ్డుకుంటున్న పోలీసులు. విజయవాడ కలెక్టరేట్ వద్ద బైటాయింపు కార్యక్రమానికి వెళ్తున్న అంగన్వాడి మహిళలను నిలిపివేస్తున్న పోలీసులు. మా హక్కుల సాధన కోసo వెళ్తుంటే ఆపడం ఏంటని అడుగుతున్న అంగన్ వాడీలు. మహిళలని చూడకుండా పోలీసులు అసభ్యంగా మాట్లాడుతున్నారని అంగన్వాడి సభ్యులు మండిపడుతున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన భవానీ దీక్షా విరమణలు. ఐదు రోజులపాటు కొనసాగనున్న భవానీ దీక్షా విరమణ కార్యక్రమం. నాలుగు హోమగుండాలని వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేసిన ఆలయ అధికారులు అర్చక స్వాములు. నేతి టెంకాయలను సమర్పించి భవానీ దీక్షలను విరమణ చేస్తున్న భవానీ భక్తులు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి. కనుచూపుమేరకు ఎర్రని దుస్తులతో ఇంద్రకీలాద్రి ఆలయానికి పోటెత్తిన భవానీ భక్తులు. ప్రత్యేక కౌంటర్లలో ఇరుముడులను సమర్పిస్తున్న భవానీలు. మూడు షిఫ్ట్ లలో 300 మంది గురు భవానీలు. కేశఖండనశాలలో 850 మంది క్షురకులను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. 20 లక్షల లడ్డూలను భవానీలకు అందుబాటులో ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. గిరి ప్రదక్షణలో భవానీ భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణుకు సెంట్రల్ నియోజకవర్గం సీటును కేటాయించకపోవడంతో ఒక్కసారిగా భారీ సంఖ్యలో మల్లాది విష్ణు నివాసానికి చేరుకున్న వైసీపీ శ్రేణులు మల్లాది విష్ణు అభిమానులు. ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ నియోజకవర్గం సీటు మల్లాది విష్ణు కు కేటాయించాలని కోరుతూ రోడ్డుపై భారీగా చేరుకున్న ప్రజలు. మల్లాది విష్ణు కే సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతూ భారీ ఎత్తున నినాదాలు చేస్తున్న వైసీపీ శ్రేణులు మల్లాది అభిమానులు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, 53 మద్యం సీసాలను, 5 లక్షల 50 వేలు నగదును స్వాధీనం చేసుకున్న గన్నవరం పోలీసులు. సాధారణ తనిఖీలలో భాగంగా గన్నవరం మండలం కేసరపల్లి- సవారిగూడెం జంక్షన్ వద్ద వాహనాలు చెకింగ్ లో భాగంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న గన్నవరం పోలీసులు. వారి వద్ద నుండి 53 మద్యం సీసాలను 5 లక్షల 50 వేలు నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గన్నవరం పోలీసులు.
ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో పురుగుమందు సేవించి తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కి చెందిన కొప్పుల విజయభారతి (35), కొప్పుల శ్రీనిధి (13)గా గుర్తింపు. స్థానికుల సమాచారంతో చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో గన్నవరం మండలం చిన్న ఆవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కి తరలింపు. పురుగుమందు సేవించిన తల్లీకూతుళ్ల ఆరోగ్యం పరిస్థితి విషమం. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాకినాడ, సీఎం వీడియో కాన్ఫరెన్స్ కి దూరంగా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు. సెక్రటేరియట్ నుంచి పాల్గొన్న సీఎం జగన్. జనవరి నెలలో అమలు చేసే పధకాలకి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రి దాడిశెట్టి రాజా. పిఠాపురం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొన్న ఎమ్మెల్యే దొరబాబు కి పిఠాపురం సీటు నిరాకరించిన సీఎం, అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ సొంత వర్గాన్ని మెయింటైన్ చేస్తున్న దొరబాబు. అధికారులు నుంచి సమాచారం వచ్చిన స్పందించని ఎమ్మెల్యే.
విజయనగరం జిల్లా,
స్నేహితులతో కలిసి అరకు విహారయాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డ యువకుడు. కొత్తవలస – అరకు ప్రధాన రహదారిలో నిమ్మలపాలెం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం జిల్లా మింది గ్రామానికి చెందిన యువకుడు తేజ (23) మృతి చెందాడు. స్నేహితులతో కలిసి అరకు విహారయాత్రను ముగించుకొని తిరిగి వస్తుండగా నిమ్మలపాలెం గ్రామం వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న వ్యానును బలంగా ఢీకొనడం వల్ల సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. అతనితో పాటు ప్రయాణం చేస్తున్న మరొక యువకుడు భాను తీవ్రంగా గాయపడటంతో 108 అంబులెన్స్ లో పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.




Total views : 92206