టిటిడి ఉద్యోగ నియామకాల్లో రాయలసీమకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాయలసీమ మేధావుల సంఘం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి డిమాండ్ చేశారు.
టిటిడి అధికారులు జోనల్ విధానాన్ని అమలు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయలేదని దీనివల్ల రాయలసీమ యువతకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు పురుషోత్తం రెడ్డి. మాజీ దేశ ప్రధాని ఇందిరాగాంధీ తీసుకొచ్చిన రాజ్యాంగంలోని 371/డి ఆర్టికల్ ప్రకారం టీటీడీలో ఉద్యోగాలను రాయలసీమ జిల్లా వాసులకు కేటాయించాలనీ, గతంలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రాయలసీమ గర్జన పేరుతో అనేక కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. చిత్తూరు జిల్లా అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు దీనిపై వెంటనే స్పందించాలని, టిటిడి చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసిన నోటిఫికేషన్ ను వెంటనే సవరించాలని విజ్ఞప్తి చేశారు.
TTD
తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి శుక్రవారం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ చక్రత్తాళ్వారుకు, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం చేపట్టి హారతి ఇచ్చారు. హారతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి అనే యోగి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అందుకు సంతసించి శంఖు, చక్ర, గధా భూషితుడైన శ్రీ మహావిష్ణువు అతనికి ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యాడు. పద్మనాభ మహర్షి స్వామి ఆజ్ఞానుసారం చక్రతీర్థంలో తపస్సు చేశాడు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించాడు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపించి ఆ రాక్షసుని సంహరించాడు. అటు తరువాత ఆ మహర్షి శ్రీ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని కోరాడు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది. వరాహ పురాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్రతీర్థం ప్రముఖ తీర్థంగా చెప్పబడింది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Read Also..
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ బండి కి జాకీలు వేసి బిజెపి, జనసేన పార్టీలు తిరిగి తెలుగుదేశం పార్టీకి జీవం పోయడానికి ప్రయత్నిస్తున్నాయని. ఇందులో భాగంగా బిజెపి నాయకులు భాను ప్రకాష్ రెడ్డి తిరుపతి అభివృద్ధి కోసం కేటాయించాలనుకుంటుంన్న శ్రీవారి ఒక శాతం నిధులను వ్యతిరేకించడం లోనే అంతరార్థం బయట పడింది అని వైసీపీ నేతలు ముద్ర నారాయణ, బాలిశెట్టి కిషోర్, వాసు యాదవ్, దొడ్డ రెడ్డి మురళి తదితరులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ గత చరిత్రలో భాను ప్రకాష్ రెడ్డి కౌన్సిలర్ గా, టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేసిన కాలంలో కమిషన్ లేనిదే పనిచేయ డన్న కీర్తిని గడించారన్నారు. దీనిని బట్టి చూస్తే నేడు ఎంత సంపాదించడానికి ఒక శాతం నిధులకు అడ్డుపడుతున్నాడని అనుమాన వ్యక్తం చేశారు. దీనివలన ప్రత్యక్షంగా కారు తదితర ప్రైవేటు వాహనాల కార్మికులు, పరోక్షంగా తిరుపతి ప్రజలు, భక్తులు, ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భానుకు కళ్ళు తెరిపించాలని వెంకన్నను వేడుకుంటున్నాము అన్నారు.
Read Also…
Read Also…
తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగ మహోత్సవానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు ఆదివారం తిరుమలలో ఘనంగా జరిగింది. తిరుమలలోని కల్యాణవేదిక వద్దగల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ ఈవోఎవి.ధర్మారెడ్డి దంపతులు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఉద్యానవన సిబ్బంది, శ్రీవారి సేవకులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఈవో ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి పుష్పయాగాకి శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపనతిరుమంజనం జరిగిందని చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం జరుగుతుందన్నారు. ఇందుకోసం 17 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగిస్తామని చెప్పారు. తమిళనాడు నుంచి నాలుగు టన్నులు, కర్ణాటక నుంచి రెండు టన్నులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి రెండు టన్నులు కలిపి మొత్తం 8 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారని వెల్లడించారు. శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సందర్భంగా ఆదివారం ఉదయం రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేశారు. అక్కడ స్నపనతిరుమంజనంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ , శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పట్టనుంది. తిరుమల శ్రీవారిని నిన్న 70,686 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం..3.02 కోట్లు కగా ..శ్రీవారికి తలనీలాలు 34,56 3భక్తులు సమర్పించుకున్నారు…34,563 మంది. కంపార్ట్మెంట్ లు అన్ని నిండి ఆక్టోపస్ బిల్డింగ్ వరకు క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు.టోకెన్ లు లేని భక్తులకు 24 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన పంచమితీర్థం (చక్రస్నానం) శనివారం ఉదయం 12.10 గంటలకు అత్యంత వైభవంగా జరిగింది. దేశ నలమూలాలు నుంచి వేలాది మంది భక్తులు పవిత్ర స్నానంమాచరించడానికి తిరుచానూరుకు తరలివస్తారు. దీనికోసం తిరుచానూరు సర్పంచ్ కె.రామచంద్ర రెడ్డి సుమారు 9 సంవత్సరాల నుండి ప్రతి యేటా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.రాత్రి 7000 మందికి అల్పాహారము, ఉదయం 10,000 మందికి అల్పాహారము, మధ్యాహ్నం భారీగా 25 వేల మందికి భోజనం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ , శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం.తిరుమల శ్రీవారిని నిన్న
67,140 భక్తులు దర్శించుకున్న భక్తులు..నిన్న హుండీ ఆదాయం..4.01 కోట్లు..శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…26,870 మంది. కంపార్ట్మెంట్ లు అన్ని నిండి శిలాతోరణం వరకు క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు.టోకెన్ లు లేని భక్తులకు 24 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి పంచమి సారెను పంపించారు..తిరుచానూరులో జరుగుతున్న అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ముగింపు ఘట్టమైన పంచమి తీర్థం సందర్భంగా అనాధిగా వస్తున్న అచారం ప్రకారం వెదురు గంపలో పసుపు-కుంకుమ, చందనం, పట్టుచీర పెట్టి గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేకపూజలు చేసి ఊరేగింపుగా కాలినడకన తిరుచానూరుకి తీసుకెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం నాలుగు మాడవీధులలో అమ్మవారి సారెను ఊరేగింపుగా తీసుకెళ్లి మెట్ల మార్గం గుండా తిరుపతికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. మధ్యహ్నం 12:00 గంటలకు జరగనున్న పద్మావతి అమ్మవారి పంచమి తీర్థ పూజ కార్యక్రమంలో పసుపు-కుంకుమ సారెను అర్చకులు అమ్మవారికి అలంకరిస్తారు. టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకంగా శ్రీవారి ఆలయం నుంచి తీసుకెళ్లే సారుకు ఎంతో విశిష్టత ఉందని, పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఆఖరి ఘట్టమైన పంచమి తీర్థ మహోత్సవానికి ఎంతో విశిష్టత ఉందని అన్నారు. వేలాదిమంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తారని, అందుకు తగిన ఏర్పాట్లను టిటిడి పూర్తి చేసిందని భక్తులు భక్తిశ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరించాలని అన్నారు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి..
Read Also…
Read Also…
పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి కలిసి తమ వ్యాపార దోపిడీ కేంద్రంగా మార్చారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. ఈవో ధర్మారెడ్డిని ఇటీవలే సీఎం జగన్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ ధర్మారెడ్డిగా మార్చాడని ఆరోపించారు. ఢిల్లీలో ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్లో పనిచేస్తున్న ధర్మారెడ్డిని జగన్ రెడ్డి ఏరికోరి రాష్ట్రానికి తీసుకొచ్చాడని, అసలు అతనికి టీటీడీ అధికారిగా పనిచేసే అర్హత ఉందా అని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆనం వెంకట రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘గతంలో వైఎస్ఆర్ సీఎం అయ్యాక ధర్మారెడ్డిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నియమించారని అప్పటి నుంచి ఆయన మరణించే వరకు కొనసాగారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణం అనంతరం ధర్మారెడ్డి తిరిగి డిఫెన్స్ సర్వీసులకు వెళ్లిపోయాడని గుర్తు చేశారు. ఇదే ధర్మారెడ్డి తిరిగి జగన్ ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంపై వాలిపోయాడని విమర్శించారు. ఢిల్లీలో ఉన్న ధర్మారెడ్డిని డిప్యుటేషన్ పై ఏపీకి పంపాలని జగన్ మోడీకి లేఖ రాయడం ఓకే చెప్పడం చకచకా జరిగిపోయిందని ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 14 గంటల సమయం పడుతుంది. తిరుమల శ్రీవారిని నిన్న 71,123 భక్తులు దర్శించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం..3.84 కోట్లు..శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…26,689 మంది. ఇంకా 26 కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటలు శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.






Total views : 90699