జగన్, వెలంపల్లి అవినీతి గురించి పోతిన మహేష్ కే ఎక్కువ తెలుసని జన సేన సమన్వయ కర్త అమ్మి శెట్టి వాసు (Ammisetty Vasu) అన్నారు. గత ఐదేళ్లుగా వారిద్దరి అవినీతి గురించి ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నో విషయాలు చెప్పిన మహేష్ కు వైసిపి లో చేరగానే వారిద్దరూ పునీతులు ఐపోయారా.. అని వాసు ప్రశ్నించారు. జన సేన వీర మహిళలు మల్లెపూడి విజయలక్ష్మి, తిరుపతి అనూష తో కలసి వాసు మీడియాతో మాట్లాడారు. జగన్, వెలంపల్లి అవినీతి పై మహాష్ కు ఉన్నంత అవగాహన మరెవరికీ లేదన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం మహేష్ వైసిపికి పే టీమ్ బ్యాచ్ గా మారిపోయారని, అప్పటి వరకు అవినీతి పరులైన వారు ఆయన పార్టీ మారగానే దేవుళ్ళు ఐపొయారా అని వాసు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సినిమాల గురించి, ఆస్తుల గురించి మహేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మరో సారి ఇదే విధంగా ఆయన వ్యవహరిస్తే మాత్రం జన సైనికులు మహేష్ ఇంటిని ముట్టడించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అంతే కాదు మహేష్ చేసిన అవినీతి. మోసాల చిట్టాను కరపత్రాల రూపంలో ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు. పశ్చిమ నియోజక వర్గాన్ని అభివృద్ధి పరచేందుకు బీజేపీ తరఫున రంగం లోకి దిగిన సుజనా చౌదరి గురించి మాట్లాడితే సహించబోమని, ఆయన గెలుపు ఇప్పటికే ఖాయమైపోయిందన్న విషయాన్ని నియోజక వర్గ ప్రజలు అంగీకరి స్తున్నారని వాసు అన్నారు. పార్టీలో ఉంటూనే వైసిపి కి మహేష్ కోవర్టుగా పనిచేశారని వాసు అన్నారు. పవన్ పొత్తు ప్రకటన చేశాక టపాసులు కాల్చింది పోతిన కాదా అన్నారు. మహేష్ కోసం చంద్రబాబు తన సీట్లు త్యాగం చేసింది గుర్తు లేదా అని వాళ్ల నాయకులను ఒప్పించింది నిజం కాదా అని వాసు ప్రశ్నించారు. పశ్చిమం లోని 22 డివిజన్ల జనసేన అధ్యక్షులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భూగర్భ సంపద దోపిడీ.ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.భూగర్భంలో లభించే విలువైన ఖనిజ సంపద అక్రమార్కుల పాలవుతోందా..? ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం కొందరి జేబుల్లోకి వెళ్తోందా..? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైట్ క్వార్జ్ పేరుతో జరుగుతున్న అక్రమ తవ్వకాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అనుమతులు లేకుండానే తెల్లరాయిని…
- ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి.లంచం ఇస్తేనే పని జరుగుతుందనే స్థాయి నుంచి… లంచాల కోసమే పథకాలను సృష్టించే స్థాయికి కొందరు అధికారులు దిగజారిపోయారు. తాజాగా ఏసీబీకి చిక్కిన డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఉదంతం దీనికి నిలువెత్తు నిదర్శనం. ఏసీబీ చర్యను స్వాగతిస్తున్నప్పటికీ… సామాన్య ప్రజల నుంచి…
- ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు.తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీపికబురు అందించారు. గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా ఆర్టీసీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై మంత్రి…





Total views : 148954