మరో వారంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి, ఈ నెల 25 నుంచి జిల్లాల పర్యటనకు సీఎం జగన్ సన్నాహాలు చేస్తున్నారు. తొలి దశలో రోజుకు రెండు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అలాగే కేడర్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తొలి సభ శ్రీకాకుళం జిల్లాలో జరుగుతుందని సమాచారం. ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రెండో దశలో రాష్ట్రమంతా మరోసారి పర్యటించనున్నట్టు సమాచారం.
ysrcp
వైసీపీ మూడో జాబితా విడుదల అయింది. ఇప్పటికే రెండు విడతలు విడుదల చేసిన సీఎం జగన్ మూడో లిస్టు ఖరారు చేశారు. మొత్తం 21 మందితో కూడిన జాబితాను తాజాగా విడుదల చేశారు. నిజానికి బుధవారమే ఈ లిస్టును విడుదల చేయాల్సి ఉంది. పలువురి విషయంలో స్పష్టత రాకపోవడంతో ఈ రోజు విడుదల చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో చర్చించిన తర్వాత 21 నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఇంచార్జులను ప్రకటించారు. పార్లమెంట్ పరిధిలోనూ పలువురికి ఇంచార్జులుగా అవకాశం కల్పించారు. ఈ జాబితాలో విజయనగరం లోక్సభ కు చిన్న శ్రీను, ఏలూరు లోక్సభ కు కారుమూరి సునీల్ కుమార్, విశాఖపట్నం లోక్సభ- బొత్స ఝాన్సీ, శ్రీకాకుళం లోక్సభ- పేరాడ తిలక్, విజయవాడ లోక్సభ- కేశినేని నాని, కర్నూలు లోక్సభ- మంత్రి గుమ్మనూరి జయరాం, తిరుపతి లోక్సభ- కోనేటి ఆదిమూలం ఇన్ఛార్జీలుగా నియమితులయ్యారు. ఇచ్ఛాపురం- పిరియ విజయ, టెక్కలి- దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి (ఎస్సీ రిజర్వుడ్)- కంభం విజయ రాజు, రాయదుర్గం-మెట్టు గోవిందరెడ్డి, దర్శి- బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు (ఎస్సీ)- ఎం సునీల్ కుమార్, చిత్తూరు- విజయానందరెడ్డి (ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్) ఇన్ఛార్జీలుగా నియమితులయ్యారు. మదనపల్లి- నిస్సార్ అహ్మద్, రాజంపేట- ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కోడుమూరు- డాక్టర్ సతీష్, ఆలూరు- బూసినే విరూపాక్షి, కోడుమూరు (ఎస్సీ)- డాక్టర్ సతీష్, గూడూరు- మేరిగ మురళి, సత్యవేడు (ఎస్సీ)- డాక్టర్ మద్దిల గురుమూర్తి, పెనమలూరు- జోగి రమేష్, పెడన- ఉప్పాల రాము అపాయింట్ అయ్యారు.
ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఏడు లక్షల కోట్ల అప్పులు చేశామని ఒకరంటే, 10 లక్షల కోట్లు అని ఇంకొకరు అంటున్నారనీ, వైసీపీ ప్రభుత్వం ఏకంగా 13 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు అంటున్నారని బుగ్గన చెబుతూ అసలు ఏ ప్రాతిపదికన ఇలా అంటున్నారని నిలదీశారు. కోవిడ్ సమయంలో రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలమైన విషయం నిజమేనని ఆయన అన్నారు. అయితే తెలుగుదేశం హయాంతో పోలిస్తే వైఎస్ఆర్ సీపీ అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్లలో చేసిన అప్పులు తక్కువేనన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 2014-2019 మధ్య కాలంలో అప్పులు 22 శాతం పెరిగితే, ఈ నాలుగున్నరేళ్ల కాలంలో పెరిగిన అప్పులు 12 శాతం మాత్రమేనని మంత్రి వివరించారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో రెవెన్యూ రాబడి 6 శాతంగా ఉందని, వైసీపీ ప్రభుత్వంలో 16.7 శాతంగా రెవెన్యూ రాబడి ఉందని తెలియజేశారు. 2018-19 చంద్రబాబు నాయుడి పాలనలో 5.3 శాతం నిరుద్యోగిత ఉందని, 2018-19లో 44 లక్షల 86 వేల పిఎఫ్ అకౌంట్లు ఉన్నాయన్నారు.
పల్నాడు జిల్లా, నరసరావుపేట లోని ఎస్పీ రవి శంకర్ రెడ్డిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు కలిశారు. అనంతరం ఆంజనేయులు మాట్లాడుతూ.. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన స్వార్థం కోసం పచ్చని గ్రామాల్లో చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు తమ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేశానని, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని అన్నారు.
వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల వాయిదా పడింది. వైసీపీ ఇంఛార్జిల మార్పుల చేర్పులకు సంబంధించి మూడో లిస్టు ప్రకటనను వైసీపీ అధిష్టానం వాయిదా వేసింది. మరికొన్ని స్థానాలపై స్పష్టత రాకపోవడంతో లిస్టు విడుదలను వాయిదా వేశారు. మూడో జాబితాలో 14 స్థానాల్లో సీఎం జగన్ మార్పులు చేర్పులు చేశారని వార్తలు వచ్చాయి. మూడో లిస్టును సీఎం జగన్ ఫైనల్ చేసేశారని, కాసేపట్లో ఆ జాబితాను విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. చివరి నిమిషంలో జాబితా ప్రకటనను వాయిదా వేశారు. ఇప్పటివరకు జగన్ 38 స్థానాల్లో ఇంఛార్జిలను మార్పులు చేశారు. మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు చేర్పులతో జాబితా రిలీజ్ చేశారు. రెండో విడతలో 27 స్థానాల్లో మార్పులు చేశారు. అయితే మొదటి జాబితాలో ఎక్కడా కూడా ఎంపీ స్థానాలు ప్రకటించ లేదు. రెండో జాబితాలో మాత్రం మూడు ఎంపీ స్థానాల్లో మార్పులు చేశారు.
ప్రకాశం జిల్లా దరిశి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఒంగోలు ఎద్దుల పందాలు కార్యక్రమంను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ఇన్చార్జి మంత్రి మెరుగు నాగార్జున ప్రారంభించారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో న్యూ క్యాటగిరి, సీనియర్ విభాగం పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం ఇవి రెండు కళ్లలా భావించి ఏ ముఖ్యమంత్రి పరిపాలించనంత సుభిక్షంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారు. మీకు సంక్షేమ పథకాలు అందితేనే మాకు ఓటు వేయండి అని ధైర్యంగా మీ ముందుకు వస్తున్నాం అన్నారు. ప్రతిపక్షాలు పొత్తుల్లో భాగంగా రెండు మూడు కండువాలు వేసుకొని కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దర్శి నియోజకవర్గంలో మరోసారి బూచేపల్లినీ సమన్వయకర్తగా అవకాశం ఇస్తారని మీరు మరోసారి ఆదరించి గెలిపించాలని మంత్రి అన్నారు. దరిశి లో బూచేపల్లి గెలిస్తే రాష్ట్రంలో జగనన్న గెలుస్తాడని ఆయన అన్నారు.
విజయవాడ, ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పై రెండో రోజు కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష. నిన్న గుర్తింపు పొందిన పార్టీల నుండి వినతుల స్వీకరణ చేపట్టిన సీఈసీ రాజీవ్ కుమార్. విడతలవారీగా కలెక్టర్లు, ఎస్పీలు , ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల సన్నద్దత పై అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఈసీ. నేడు పార్టీలు ఇచ్చిన వినతులు, ఫిర్యాదుల పై, ఎన్నికలకు అధికార యంత్రాంగం ఉన్నతస్దాయి చర్చ జరుపనున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం.
కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన, నూతన నిర్మాణాలను పూర్తి చేసుకున్న సచివాలయాలను రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సుమారు 3 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను కన్నబాబు ప్రారంభించారు. ఈ సంధర్బంగా కన్నబాబు మాట్లాడుతూ సర్పవరం గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపించేందుకు అహర్నిశలు నాయకులు సహాయ సహకారాలతో నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వై.సి.పి సీనియర్ నాయకులు పుల్లా చందు, పుల్లా ప్రభాకర్, సర్పవరం గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Also..
కడప జిల్లా.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని టిడిపి నాయకులు ఎవరు ఏమీ చేయాలని అనుకోవడం లేదని, ఆయనకు ఎవరైనా హాని కలిగిస్తే, ఆయన ఫోను హ్యాక్ చేస్తే తాము ఒప్పుకోమని, ఈ విషయంలో ఎమ్మెల్యేకు మద్దతుగా ఉంటామని ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన ఫోన్ ను ఆస్ట్రేలియాలో ఉన్న కొందరు హ్యాక్ చేసి, తన పేరున నకిలీ ఖాతాతో ఫేస్బుక్ లో అశ్లీల చిత్రాలు పెడుతున్నారని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంపై తాము స్వాగతిస్తున్నామన్నారు. ఈ విషయంలో ఎవరున్నా శిక్షించాలని, పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఇదే సందర్భంలో గతంలో బీసీ నాయకుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ను బెదిరించిన కేసులో నిందితులను పట్టుకోవాలని, జిల్లా ఎస్పీనీ ఎమ్మెల్యే కోరాలన్నారు. అలాగే వైసిపికి చెందిన కొందరు వ్యక్తులను కూడా బెదిరించిన విషయంలో పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని ప్రవీణ్ రెడ్డి ప్రశ్నించారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ కార్యాలయం నందు స్థానిక శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు. అనంతరం గురజాల నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి, జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రెస్ మీట్ నిర్వహించారు. సుమారు 1500 కోట్లతో దాచేపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేశామన్న కాసు, ప్రతి పట్టణం ప్రతి గ్రామంలో లెక్కలతో వస్తామని చెప్పారు. ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వని తెలుగుదేశం పార్టీ, వైసీపీ ప్రభుత్వంలో 3330 ఇళ్ల స్థలాలు ఇచ్చామని కాసు మహేష్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగాలంటే జగన్ ను తనను తిరిగి ఆశీర్వదించాలని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కోరారు.
Read Also..