ఎవరి కాళ్లు పడితే వారివి పట్టుకోవాల్సిన అవసరం తనకు లేదని, తనకు ప్రాధాన్యం ఇచ్చిన జగన్ కాళ్లు తప్ప మరెవరివీ పట్టుకోబోనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. తాను కాళ్లు పట్టుకుంటానంటూ వస్తున్న విమర్శలకు ఆయనిలా బదులిచ్చారు. ఎస్సీ నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఇప్పుడు వస్తున్నవారు ఒకప్పుడు జగన్ నువిమర్శించారని, కాబట్టి నమ్మకస్తులకు టికెట్లు ఇవ్వాలని సీఎంకు విన్నవిస్తున్నట్టు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పెనుమూరులో ఓ పెద్దాయనకు బీఫారాలు ఇస్తే ఇప్పుడు ఆయన తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా ఎస్సార్‌పురం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ysrcp
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు నేపథ్యంలో, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పై హైదరాబాదులో కేసు నమోదైంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ గురించి అసత్య వ్యాఖ్యలు చేశారంటూ మల్లు రవి బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ మరణానికి కారణం సోనియా గాంధీ, చంద్రబాబేనని నారాయణస్వామి ఇటీవల షర్మిల కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను మల్లు రవి తప్పుబట్టారు. ఉమ్మడి ఏపీ సీఎంగా వ్యవహరించిన వైఎస్సార్ కు సోనియా ఎంతో ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు సోనియా ప్రత్యేకంగా విమానాలు పంపించి వెతికించారని తెలిపారు.
ప్రతికూల వాతావరణం వల్లే హెలికాప్టర్ ప్రమాదం జరిగిందన్న విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గ్రహించాలని మల్లు రవి హితవు పలికారు. నారాయణస్వామి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Read Also..
కడప జిల్లా, కాజీపేటలో 300 కుటుంబాలు వైకాపా నుంచి తెలుగుదేశం లోకి చేరిక. వైకాపా ఎంపీటీసీ చంద్ర భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు టీడీపీ ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో టీడీపీలోకి చేరికలు. సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి కావాలని సొంత పార్టీ ఎంపీటీసీ అడిగితె సస్పెండ్ చేసిన ఘనత వైకాపా కు చెందుతుంది. వైకాపా ఎంపీటీసీనే చేరుతున్నారంటే వారి అరాచకం అర్ధం అవుతుంది. రాష్ట్రానికి అభివృద్ధి కావాలి సంక్షేమం కాదు. అభివృద్ధి లేకుండా సంక్షేమం పనికిరాదు. అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని రాత్రికి రాత్రే అరెస్టు చేస్తారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది. నియంత పాలన ఎక్కువ రోజులు ఉండదు. మైదుకూరు శాసనసభ్యులు రఘురామిరెడ్డి కి దోచుకోవడం తప్పితే అభివృద్ధి చేయడం తెలియదు. శాసనసభ్యుడు రఘురామిరెడ్డికి సంక్షేమానికి, అభివృద్ధికి తేడా కూడా తెలియదు. తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యం అని వైకాపా నుంచి తెలుగుదేశం లోకి చేరుతున్నారు. తెలుగుదేశం లోకి స్వచ్ఛంగా చేరుతున్న వైసీపీ పార్టీ అధికార నాయకులు. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. కాజీపేట మండలం అభివృద్ధిలో వెనకబడి ఉంది అని వెల్లడించారు.
ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పార్టీ మారుతున్నాడని పలు సామాజిక మాధ్యమాలలో వచ్చిన కథనాలకు రాయచోటి ఎంపిడివో సభా భవనంలో మీడియా ద్వారా వైకాప సీనియర్ నాయకులు, మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. మా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పదవులను సైతం పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కుడి భుజంగా నిలిచారు. ప్రజల శ్రేయస్సు కోసం, రాయచోటి అభివృద్ధి కి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు తోడు నిలిచిన ఏకైక నాయకుడు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. వైఎస్సార్ కుటుంబ కోసం పదవులను సైతం వదులుకున్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పై అసత్య ఆరోపణ కథనాలు ప్రచురించడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. రాయచోటి అభివృద్ధి కోసం ఆహార్నిశలు కృషి చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న గడికోట శ్రీకాంత్ రెడ్డి ని రాజకీయంగా ఎదుర్కోలేకనే కొంత మంది కుట్రలతో ఇటువంటి కథనాలను ప్రచారం చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డి పల్లి మండలంలో పెన్షన్ కానుక కార్యక్రమంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణాలో పోటి చేసిన పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్దులుకు సాధారణ మైన బర్రేలక్క కు వచ్చిన ఓట్లు కుడా ఆ పార్టీకి రాలేదని అటువంటి వారంతా కలిసి వస్తే జగనన్ను ఏమి చేయగలరని ఘాటుగా హెచ్చరించారు. అవ్వ, తాతలు జగనన్న ద్వారా లబ్ది పొందిన ప్రజల ఆదరాభిమానాలు జగన్ మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉన్నాయన్నారు. ప్రజల మద్దతు పొందాలి కానీ, నీచమైన రాజకీయాలు చేస్తున్న వారికి సిగ్గు ఉండాలన్నారు. తల్లి కొడుకులు, అన్నాచెల్లెలు మధ్య చిచ్చు పెట్టడమే పనిగా పెట్టుకొన్నారని ఆరోపించారు. తండ్రి చనిపోతే ఎ తప్పు లేనప్పటికీ 16 నెలలు జైల్లో పెట్టినా కుడా కన్నీటి బాధను దిగమింగుతూ ఒక్కడే పోరాడాడు కానీ వీళ్ళ మాదిరిగా నిచమైన రాజకీయాలకు చోటివ్వని దమ్ము, ధైర్యం కలిగిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి చెప్పుకునేందుకు గర్వపడుతున్నాం అన్నారు. ప్రజా సేవే ద్యేయంగా నిజయతే శ్వాసగా బ్రతికేటంటు వాడిగా ఉంటూ చిత్త సుద్ది, ప్రజల మద్దుతుతో రాజకీయాలు చేస్తాను, తప్ప మీ మాదిరిగా పుట కోక రాజకీయం చేసే వాడిని కాదని నా ప్రాణం ఉన్నంత వరకు ఒకే పార్టీలో ఉంటానని వారు స్పష్టం చేశారు. శ్రీకాంత్ రెడ్డి వైసిపికి షాక్ ఇవ్వనున్నాడు, షర్మిలమ్మ పార్టీలోకి వెళ్ళుతున్నారని అటువంటి కథలు రాసిన వారికి సుగ్గు ఉండాలన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ప్రపంచంలో ఏ ఒక్కరు కుడా చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. నీచమైన కథలు రాస్తే నేను ఖండించాలనా.. ప్రజల మధ్య మాట్లాడతాను కానీ.. అనవసరమైన వారి దగ్గర నేను ఏందీ ఖండించ్చేది వేదవల్లారా, మా నాయకుడు ఒక్కడే జగన్ మోహన్ రెడ్డి అని, నా దారి జగన్ మోహన్ రెడ్డి దారి అని గట్టిగా హెచ్చరించారు.
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను తొలగించి ఆ నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… చింతలపూడి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ఉన్నమట్ల ఎలిజా స్థానంలో మరొక అధికారికి అవకాశం ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఏలూరు ఆర్టీఏ వెహికల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న విజయరాజుకు చింతలపూడి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ చింతలపూడి ఎమ్మెల్యే కు నో చెప్పినట్లు తెలుస్తుంది. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ తో చింతలపూడి టికెట్ తనకే ఇవ్వాలంటూ ప్రాధేయపడినప్పటికీ, చింతలపూడి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఎలిజాకు స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే ఎలిజాను అమలాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రతిపాదన చేశారని అయితే తాను చింతలపూడిలోనే పోటీ చేస్తానని ఎంపీగా పోటీ చేయనని అన్నట్లు తెలుస్తుంది. దీనికి తోడు తాజాగా తన అనుచర గణంతో తాడేపల్లిలోని మిథున్ రెడ్డి ఇంటి వద్ద తనకే టిక్కెట్ ఇవ్వాలంటూ తన అనుచరులతో ధర్నాలు చేయించారు. ఒకవేళ వైసీపీ అధిష్టానం తలొగ్గి ఎలిజాకు టికెట్ ఇస్తే ఈసారి తప్పకుండా చింతలపూడిలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగులుతుందని పార్టీ వర్గాల్లో, ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చింతలపూడి ఎమ్మెల్యేగా గెలిచిన ఎలిజా ఇప్పటికే దండుగా ప్రజావ్యతిరేకతను మూట కట్టుకున్నారు, ఐప్యాక్ సర్వేలో ఎమ్మెల్యే ఎలిజాకు మైనస్ మార్కులు రావడంతో సీఎం జగన్ ఎమ్మెల్యే ఎలిజానుపక్కన పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి.
జీఎస్టీ కమిషనర్ ఉద్యోగి గా పనిచేసిన ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ఉద్యోగాన్ని పక్కన పెట్టి 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. అంతకముందు టీడీపీ కంచు కోటగా చింతలపూడి నియోజకవర్గం ఉండేది. 1983 నుంచి 1999 వరకు ఐదు సార్లు టీడీపీ తరుపున పోటీ చేసిన కోటగిరి విద్యార్ధ రావు గెలుపొందారు. ఆ తరవాత సామాజిక సమీకారణాల నేపథ్యంలో జనరల్ నియోజకవర్గంగా ఉన్న చింతలపూడి ఎస్సి నియోజకవర్గంగా మారింది. 2014 లో మాజీ మంత్రి పీతల సుజాత టీడీపీ తరుపున పోటి చేసి గెలిపోందారు. 2019లో ఫ్యాన్ గాలిలో గెలిచిన ఎలిజా వలన జరిగిన నియోజక వర్గ అభివృద్ధి దేవుడెరుగు ఎక్కడ రూపాయి వస్తుందో అక్కడికి వాలిపోవడమే కాకుండా ఎమ్మెల్యే గా నాలుగు సంవత్సరాల కాలంలో కోట్లాది రూపాయలు వెనకేసారని నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకున్న ఎమ్మెల్యే ఎలిజాపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఎమ్మెల్యేగా మా గ్రామంలో ఎం అభివృద్ధి చేసావు.. మాకిచ్చిన హామీలు ఎక్కడా అంటూ ప్రజలు నిలదీస్తున్నడంతో తిరిగి ఎమ్మెల్యే ఎలిజాకు నియోజకవర్గంలో టికెట్ ఇస్తే పరాజయం తప్పదని తెలుసుకున్న పార్టీ అధిష్టానం కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.
చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తిని నిలబట్టేందుకు వైసీపీ అధిష్టానం కార్యాచరణ రూపొందిస్తే…. టిడిపికి కంచుకోటగా ఉన్న చింతలపూడి నియోజకవర్గాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టిడిపి జెండా ఎగరవేసేందుకు తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తుండట… ఇందులో భాగంగానే ఎన్నారై గా ఉన్న బొమ్మాజీ అనిల్ టిడిపి టికెట్ కోసం తన ప్రయత్నాలు జరుపుతూనే… నియోజకవర్గంలో జరుగుతున్న టిడిపి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ నియోజకవర్గ టిడిపిలో చక్రం తిప్పే నేతల మద్దతు కూడా కూడబెట్టి, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై అధికార పార్టీపై పోరాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇటీవల నారా లోకేష్ చేపట్టిన యువగళమ్ పాదయాత్ర చింతలపూడి నియోజకవర్గంలో దాదాపు మూడు రోజులపాటు సాగింది. నారా లోకేష్ పాదయాత్రను విజయవంతం చేయడంలో కూడా బొమ్మాజీ అనిల్ కృషి చేశారని టిడిపి వర్గాలు కూడా అనిల్ కు ఈసారి టిక్కెట్ ఇస్తే నియోజకవర్గంలో టిడిపికి పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా టిడిపి టికెట్ కోసం మరో ఎన్నారై సొంగా రోషన్ కుమార్ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. గత కొంతకాలంగా సొంగ రోషన్ కుమార్ టిడిపిలో పనిచేస్తూ నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇటు నియోజకవర్గంలో టిడిపి చేపట్టే కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీ టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోను పార్టీ జెండా ఎగరవేస్తానని పార్టీ బాస్ వద్ద టిక్కెట్ కోసం తన ప్రయత్నాలు జరుపుతున్నారు. వీరితో పాటు మాజీ మంత్రి పీతల సుజాత, మరి కొంతమంది ఆసవాహులు టికెట్ కోసం తమ ప్రయత్నాలు తాము జరుపుతున్నారు.
చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ కొత్త వారికి ఛాన్స్ ఇచ్చి… అక్కడ పాగా వేయాలని చూస్తుంటే… వైసీపీ చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేస్తూ టిడిపి కంచుకోట ను కైవసం చేసుకునేందుకు ఇటు టిడిపి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. దీంతో చింతలపూడి నియోజకవర్గంలో అటు టిడిపి ఇటు వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా కొత్తవారు బరిలో నిలుస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైఎస్సార్సీపీ రెండవసారి నియోజకవర్గాల ఇన్చార్జిల పేర్లను ప్రకటించింది. ఇందులో ప్రధానంగా యువతకు ప్రాధాన్యత ఇస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థిగా తుడా చైర్మన్ మోహిత్ రెడ్డిని ప్రకటించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రస్తుత ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు మోహిత్ రెడ్డి ఇప్పటికే గడపగడపకు మన కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. 2019 ఎన్నికల తర్వాత నుంచి కూడా ప్రజల మధ్యలోనే ఉండి ప్రజలకు కావలసిన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని, కరోనా సమయంలో అయితే ఒక అడుగు ముందుకు వేసి ప్రతి ఇంటిని ఆదుకున్నమని అన్నారు మోహిత్ రెడ్డి. ఈసారి చంద్రగిరి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని కచ్చితంగా వైసీపీ జెండా ఎగుర వేస్తామని చంద్రగిరి ఇంచార్జ్ మోహిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖాయమయ్యింది. బుధవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన షర్మిల సోనియా, రాహుల్, ప్రియాంకల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలో రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల పాత్ర ఎంత ఉండబోతోంది అనే దాని మీద ఆసక్తి నెలకొంది. నిజానికి ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా? లేదా? అన్నట్లుగానే ఉంది. షర్మిల చేరికతో ఏపీ కాంగ్రెస్ కు కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. ఉనికి చాటుకునే అవకాశం ఉంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో కీలకంగా వ్యవహరించిన పార్టీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాకూర్ ను ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా నియమించారు. దీన్ని బట్టే కాంగ్రెస్ ఏపీ ఎన్నికలను ఎలా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.
ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ అధికారంలోకి రావడం అనేది జరిగే అవకాశం లేదు. అటు వైసీపీ మరోవైపు టీడీపీ-జనసేన ఉమ్మడి పోటీని తట్టుకుని కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు. కానీ కొన్నిచోట్ల తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా కృష్ణ, గుంటూరు జిల్లాలపై షర్మిలా ప్రభావం ఉండనుంది. ఆ జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే షర్మిలతో టచ్ లో ఉన్నారు. వైసీపీలో మార్పుల పర్వంతో డైలమాలో పడ్డ చాలామంది నేతలు షర్మిల వైపు చూస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే బాహాటంగానే షర్మిలతో కలిసి నడుస్తానని ప్రకటించారు. తాజాగా మరో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
గతంలో వైఎస్ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న నేత మల్లాది విష్ణు. కాంగ్రెస్ లో ఉన్న ఆయన వైసిపి స్థాపించడంతో వైసీపీలో జాయిన్ అయ్యారు. 2014లో వైసీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019లో మరోసారి పోటీ చేసి.. 100 ఓట్ల తక్కువ మెజారిటీతో గెలిచారు. ఈ క్రమంలోనే ఈ సారి ఆయనకు సీటు నిరాకరిస్తోంది వైసీపీ అధిష్టానం. మరోసారి గెలిచే అవకాశం లేదనే ఆలోచనతోనే తనను పక్కన పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోనే ఇప్పుడు కాంగ్రెస్‌లో జాయిన్ అవ్వాలని భావిస్తున్నారు.
ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యం కూడా కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ హయాంలో రెండుసార్లు మంత్రి పదవి చేశారు. కాంగ్రెస్ నుంచి టిడిపిలో జాయిన్ అయి ఎమ్మెల్సీ అయ్యారు. తరువాత మూడు రాజధానుల ప్రకటనతో వైసీపీలో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్సీ అయ్యారు. డొక్కా కూడా తనకు కనీసం అధినేత జగన్ ను కలవటానికి కూడా అవకాశం లభించడం లేదంటూ బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచన చేస్తున్నారు..
మరో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా ఇలాంటి అసంతృప్తితో ఉన్నారు. మోపిదేవి వెంకటరమణ కూడా వైయస్ కుటుంబానికి చాలా దగ్గరి వారు. జగన్ మొదటి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. శాసనమండలి రద్దు క్రమంలో మంత్రి పదవి వదులుకొని ఎంపీగా వెళ్లారు. ఇప్పుడు ఆయనను రేపల్లె ఇన్చార్జి నుంచి కూడా తప్పించారు. దీంతో అసంతృప్తితో ఉన్న మోపిదేవి కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని వినిపిస్తోంది. మరో నేత కొలుసు పార్థసారథి కూడా వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్ననేత. కాంగ్రెస్‌లో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇటీవల జగన్ తనను పట్టించుకోవడం లేదని.. జగన్ పట్టించుకోకపోయినా.. ప్రజలు పట్టించుకుంటున్నారని బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కొలుసు పార్థ సారథి కూడా కాంగ్రెస్ వైపు, షర్మిల చేరికవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా రెండు జిల్లాలలో పాత కాంగ్రెస్ లీడర్లు, వైసీపీ నుంచి సీటు ఆశించి భంగపడ్డ లీడర్లు కాంగ్రెస్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. మరి షర్మిల కాంగ్రెస్ లో చేరితే.. ఏపీ రాజకీయాల్లో చురుకుగా ఉంటారా? ఆమెకు ఏపీసీసీ పదవి ఇస్తారా? లేక ఏదైనా జాతీయ పదవి ఇస్తారా? షర్మిల భవిష్యత్ రూట్ మ్యాప్ ఏంటి? వైసీపీకి దెబ్బపడుతుందా? టీడీపీ-జనసేన కూటమి ఓట్లు చీలతాయా? ఇనే ప్రశ్నలకు సమాధానం మరికొద్ది రోజుల్లో తేలనుంది.
అమరావతి, నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటన. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావును పరామర్శించనున్న సీఎం వైఎస్ జగన్. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావును ఆయన నివాసంలో పరామర్శించనున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం లోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల లో ఆర్భాటంగా మంత్రి సురేష్ చేత ప్రారంభించిన “ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమం గత నాలుగు రోజుల నుండి ఆటలు ఆడే క్రీడ కారులు లేక క్రీడ మైదానం విలవిలలాడిపోతుంది. క్రీడాకారుల కోసం రోజు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎదురుచూసి వారి కళ్ళు కాయలు కాస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మార్కాపురంలో అట్టర్ ప్లాప్ అయింది. ఆటలు ఆడడానికి ఏ క్రీడాకారులు రాకపోవడంతో వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధులు సహనం కోల్పోయి అసహనంతో ఉన్నారు.