తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికైన నూరి ఫాతిమా మాట్లాడుతూ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. నా పై నమ్మకంతో తూర్పు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించిన జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. గుంటూరు 1 టౌన్ లో మైనార్టీ మహిళకు అవకాశం ఇవ్వడం జరిగింది. జగనన్న నా పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా గుంటూరు 1 టౌన్ లో భారీ మెజారిటీతో గెలుపొంది జగనన్నకు గిఫ్ట్ గా అందిస్తాను. ప్రజలకోసం నిరంతరం కష్ట పడతాను. మా నాన్నగారు ఎలా అయితే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారో అదే విధంగా ప్రజలకు చేరువలో ఉంటాను.
వైస్సార్ జెండా రెపరెపలాడేలా కృషి చేస్తాను. నన్ను ఈ స్థానంలో నిల్చోబెట్టిన వైసీపీ అధిష్టానం కు తూర్పు కార్యకర్తలుకు, నాయకులకు ధన్యవాదాలు.
ysrcp
ముఖ్యమంత్రి జగన్ బుధవారం కాకినాడ వస్తున్నారు. అయితే ఆయన పర్యటన పూర్తిగా బహిరంగ సభకి పరిమితం చేశారు. వాస్తవానికి ఆయన కాకినాడలో నూతనంగా నిర్మించిన కొండయ్య పాలెం ఫ్లై ఓవర్, కళాక్షేత్రం, సైన్స్ మ్యూజియం, స్కేటింగ్ ట్రాక్ ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొనాలి. కానీ కాకినాడలో అంగన్వాడీలు, సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. వాలంటీర్లు కూడా ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన పరిమితమవుతోంది. ఎస్పీ ఆఫీసులో హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి 30 మీటర్ల దూరంలో ఉన్న బహిరంగ సభ ప్రాంగణానికి సంక్షేమ పథకాల లబ్ధిదారులతో శోభాయాత్ర గా వెళ్తారు. బహిరంగ సభ నుంచే వాటిని ప్రారంభిస్తారు.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు ఏజెన్సీ నుంచి సకాలంలో జీతాలు రాక ఇబ్బంది పడుతుండడంతో కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే తన దైన శైలిలో స్పందిచారు. జీతాలు పెంచాలన్న తమ డిమాండ్ల సాధనకోసం ఆందోళనలో కూర్చున్న కార్మికులకు తన సొంత నిధులతో ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే మాట విని తిరిగి విధుల్లోకి వచ్చిన కార్మికులకు, నష్టపోయిన నాలుగురోజుల పనిదినాల వేతనాన్ని ఎమ్మెల్యే చెల్లించేందుకు సిద్ధమయ్యారు. అలాగే ప్రభుత్వం కార్మికులకు వేతనాలు పెంచేంతవరకు ప్రతినెల మూడు వేల రూపాయలు అదనంగా తన సొంత నిధుల నుంచి చెల్లిస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రభుత్వం కార్మికులకు వేతనం పెంచేంతవరకు తన సహాయం అందిస్తానని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి తన ఆర్థిక సహాయం మూడు వేల రూపాయలను అందిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గతంలో కూడా గోపవరం పంచాయతీ శానిటరీ వర్కర్లు, ప్రొద్దుటూరు మున్సిపాల్ కార్మికులు, జిల్లా ఆస్పత్రిలోని కార్మికులకు ఇదే తరహాలో ఆర్థిక సాయం అందించిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. కార్మికుల సమస్య పట్ల న్యాయమైన డిమాండ్ పట్ల తాను సానుకూలంగా ఉన్నానని.. అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పెంచడానికి కొంత సమయం పడుతుందన్నారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తల విషయంలో కూడా వారి డిమాండ్ల పరిష్కారం కావాలని జీతాలు పెరిగి వారు కూడా మిగిలిన వారిలాగే ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రొద్దుటూరు మున్సిపాల్టీలో పనిచేసే 43 మంది అవుట్ సోర్సింగ్ పబ్లిక్ హెల్త్ వర్కర్లకు నాలుగు రోజుల దిన వేతనం మూడు వేలు, అలాగే 39 మంది క్లాప్ డ్రైవర్లకు నాలుగు నెలల వేతనం, ఆందోళన కారణంగా నష్టపోయిన దిన వేతనాన్ని అందిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. సుమారు 18 లక్షల రూపాయల నిధులను ఎమ్మెల్యే ఈ సందర్భంగా వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మిదేవి, కమీషనర్ వెంకట రమణ, కౌన్సిలర్లు వరికూటి ఓబుళ రెడ్డి, జిలానీ, కమాల్, నాగరాజు, వైసిపి రాష్ట్ర నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో భాగంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు గడుస్తున్న విడుదల చేయకపోవడం దారుణమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చదిపిరాళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు. జమ్మలమడుగు లోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యవస్థలను నిర్వీర్యం చేశాడని కడప ఉక్కు పేరుతో, గండికోటలో ఫైవ్ స్టార్ హోటల్ పేరుతో భూములను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. గాలివాటంగా వచ్చిన జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గాలి మాటలు మానుకోవాలని హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏమీ చేయకపోగా తన సొంత జిల్లా కడపకు కూడా ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. జగన్ పోతేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఈ సందర్భంగా రాజేష్ తెలిపారు. వచ్చే ఎన్నికలలో మీరు ఏ పార్టీలో ఉంటారని విలేకరులు ప్రశ్నించగా… ఇప్పుడు ఏ పార్టీ తరపున ప్రెస్ మీట్ నిర్వహించామో అదే పార్టీ నుంచి పోటీ చేస్తామని తెలిపారు. జమ్మలమడుగు బరిలో వైయస్ కుటుంబ సభ్యులు ఉండాలని తాము కోరుకుంటున్నామని ఆ ఎన్నికలలో వారిని ఓడించి తీరుతామని ఈ సందర్భంగా రాజేష్ రెడ్డి మీడియాకు తెలిపారు.
Read Also..
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు కు చెందిన తెదేపా నేత చింతల అశోక్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి తిరుమల వరకు పాదయాత్రను ప్రారంభించారు. టిడిపి ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ 1200 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టడం చాలా ఆనందదాయకమని అన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన సాగుతోందని, అన్ని వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి – జనసేన ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోందని పేర్కొన్నారు. పాదయాత్ర చేస్తున్న అశోక్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు ఉంది అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్నారు. ఎక్కడ చూసినా అరాచకాలు, వైసీపీ నాయకుల దాడులు చూస్తూనే ఉన్నామన్నారు. రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారన్నారు. రాష్ట్రంలో సామాన్యులు ప్రశాంతంగా బ్రతకాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాబోయే ఐదు సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రంను ప్రపంచ పటంలో చూపించగలరన్నారు.
కాకినాడ రూరల్ విద్యుత్ నగర్ వెంకన్నబాబు కళ్యాణ మండపం లో కాపు సద్భావన సంఘం అధ్యక్షులు, రాష్ట్ర కాపు జే.ఏ.సి కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాసు, కాపు జే.ఈ.సి మెంబర్ లు అర్. ప్రకాష్, ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కాపు కులస్తులను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు కార్యచరణ చేయటం లేదని, కాపు లకి రిజర్వేషన్ కల్పించే విధంగా పోరాటం చేయవల్సిన అవసరం ఉందన్నారు. వై.ఎస్. జగన్ అధికారం లో కి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ కి ప్రతి ఏటా 2000 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికీ 5 సంవత్సరాలకు కలిపి 10000 కోట్లు ఇవ్వాల్సి ఉందనీ, జగన్ కాపులకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండ ఎన్నికలకు వెళ్తే తగిన గుణపాఠం చెప్పడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. జనవరి 3 వ తేదీన విజయవాడ లో కాపు, ఒంటరి, బలిజ, కులాల జేఏసి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ పై చర్చిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జేఏసి కార్యవర్గ సభ్యులు ఉన్నారని వారి వారి పరిధిలో ఆక్టివ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారని, రాబోయే కాపు తరాల కోసం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో కాపు సభావన సంగం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా, రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా చీమకుర్తి మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు ముఖ్యమంత్రి YS జగన్ మోహనరెడ్డి ఇచ్చిన హామీలు తక్షణమే నెరవేర్చాలని ఈ నెల 26వ తేది నుండి చీమకుర్తి మున్సిపాలిటీ లో నిరవధిక సమ్మె జరుపుతున్నారు, ఇందు వలన చీమకుర్తి వీధులలో పేరుకుపోయిన చెత్త, అసలే కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో ఎక్కడ చెత్త అక్కడే ఉండుట వలన వ్యాధులు ప్రభలే ప్రమాదం పొంచి ఉంది. కావున పారిశుధ్య కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చితే, కార్మికులు అండగా నిలిచి గ్రామ ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా కాపాడతారు. లేనియెడల సమ్మె ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈరోజు భీమవరం వేదికగా విద్యా దీవెన నగదును బటన్ నొక్కి ఎనిమిది లక్షల తొమ్మిది వేలమంది విద్యార్థుల ఖాతాలో 584 కోట్ల రూపాయలు జమ చేయనున్నారు. జివిఆర్ జూనియర్ కళాశాల వద్ద బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. సీఎం బహిరంగ సభ హెలిప్యాడ్ ప్రాంతాల ఏర్పాట్లను, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోహన్ రాజు, మంత్రి కార్మూరి వెంకట నాగేశ్వరరావు, ప్రభుత్వ చీప్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, జిల్లా ఎస్పీ యు.రవి ప్రకాష్ పరిశీలించారు. సీఎం జగన్ పర్యటన నేపద్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుకట్టమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం 10 గంటలకు గుంటూరు తాడేపల్లిగూడెం నుండి బయలుదేరి 10:45 నిమిషాలకు భీమవరం లూధరన్ గ్రౌండ్ హెలిప్యాడ్ కు చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గాన బహిరంగ సభ ప్రాంతానికి వస్తారని తెలిపారు. కావున సీఎం పర్యటనను నియోజకవర్గ ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు.
పల్నాడు జిల్లా, సత్తెనపల్లిలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థల్లో దోపిడీ జరిగింది. వేల ఎకరాల అసైన్డ్ భూములన్నీ కొట్టేశారు. రెవెన్యూ చట్టాన్ని మార్చారు. దానికోసమే అడ్వకేట్లంతా కోర్టులను బాయికాట్ చేస్తున్నారు. రాష్ర్టంలో రైతుల భూములన్నీ నాయకుల చేతిలోకి తీసుకుని వెళ్ళాలని చూస్తున్నారు. మా పార్టీ లోకి రాకుంటే భూములు లాక్కుంటము అనే ఉద్దేశంతో ఈ చట్టం. డాక్యుమెంట్ మా దగ్గర ఉంటుంది డౌన్ లోడ్ చేసుకోండి అంటున్నారు.ఇది చాలా పెద్ద ప్రమాదం. ఎవరు ఎన్ని డాక్యుమెంట్ లైన డౌన్ లోడ్ చేసుకోవచ్చు.ఎన్ని బ్యాంక్ లలో నైన లోన్ తీసుకోవచ్చు. ప్రజలను నిలువు దోపిడీ చేద్దామని చూస్తున్నారు. ఇకనైనా జగన్ మీ దోపిడీ ఆపాలి. మేం అధికారంలోకి రాగానే ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం.
బాపట్ల ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి ప్రయత్నించిన అంగన్వాడి కార్యకర్తలను భారీ పోలీసు బలగాలతో అడ్డుకుంటున్న బాపట్ల పోలీసులకు, అంగన్వాడీ కార్యకర్తలకు తోపులాట జరిగింది. ఉదయం మా ముందే బాపట్ల శాసనసభ్యులు కోనా రఘుపతి బయటికి వెళ్లారని, మమ్మల్ని చూసుకుంటూ వెళ్లారు గాని మమ్మల్ని ఏమాత్రం పలకరించి ఎందుకు వచ్చారని అడగలేదని అంటే అంగన్వాడీలు అంత తీసేసారా, ఎమ్మెల్యేకి అంత అహంకారం పనికిరాదని రాష్ట్రంలో వైసిపి శాసనసభ్యులు అందరూ ఇలాగే ప్రవర్తిస్తున్నారని, త్వరలోనే ముఖ్యమంత్రి జగన్కు, వైసీపీ ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుతామని అంగన్వాడీలు హెచ్చరించారు.