మందమర్రి సింగరేణి ఏరియా కేకే-5 గని పై ఉదయం షిప్ట్ లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు. వివిధ యూనియన్ లకు చెందిన నాయకులు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఐఎన్టీయూసీ లో చేరినారు. రాష్ట్ర అభివృద్ధి ద్యేయం గా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందనీ అన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలన నుంచి విముక్తి చేసి ప్రజల పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. సింగరేణి సంస్థ లో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే సింగరేణి ప్రైవేటీకరణ జరగదనీ కార్మికులు అపోహలు వీడండి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త గనులు తీసుకొచ్చెందుకు ప్రణాళికలు చేస్తుందని అన్నారు. సింగరేణిలో కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చి సింగరేణికి పూర్వ వైభవం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందనీ అన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారంటీ లు ఇచ్చినట్టుగా ఐఎన్టీయూసీ యూనియన్ కార్మికులకు ప్రత్యేకంగా ఇస్తున్న ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు.
గతంలో మాదిరిగా సింగరేణి లో రాజకీయ జోక్యం ఉండదని అన్నారు. ఈ నెల 27 న జరిగే సింగరేణి ఎన్నికల్లో గడియారం గుర్తుకి ఓటు వేసి ఐఎన్టీయూసీ నీ బలపరచి భారీ మెజారిటీ తో గెలిపించుకోవాలని కార్మికులను కోరారు.
Adilabad
ఈ రోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో 99వ ఆవిర్భావ వేడుకలను మందమర్రిలో ఘనంగా నిర్వహించరు. ఈ కార్యక్రమానికి
CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు రేగుంట చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగ మందమర్రి పార్టీ కార్యాలయం పార్టీ పట్టణ కార్యదర్శి కమెర దుర్గ రాజు జెండా ఎగురవేశారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి ముఖ్య కూడలిలోని పార్టీ జెండాను ఆవిష్కరించారు. జిల్లా సమితి సభ్యులు భగత్ సింగ్ భవన్ వద్ద రాయబారం వెంకన్న అబ్రహం స్తూపం వద్ద భీమనాధుని సుదర్శన్ జెండాను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ… ఈనెల 20 నుండి 26 వరకు జరుగు సిపిఐ 99 ఆవిర్భావ వేడుకలను పట్టణ, మండల, గ్రామ స్థాయిలలో అరుణ పతాకలను ఎగురవేసి ఘనంగా నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది అన్నారు. 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించినటువంటి పార్టీ ఆవిర్భవించినాడే దున్నే వారికి భూమి కావాలని పార్టీ చెప్పడం జరిగినది నాటి నుండి నేటి వరకు బడుగు బలహీన వర్గాల, పేద ప్రజల కార్మిక కర్షకుల కోరకు ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదీ అన్నారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీ పోరాటాల ఫలితంగా కార్మికుల, కర్షకుల పక్షాన అనేక హక్కులను చట్టాలను తీసుకురావడం జరిగిందన్నారు. పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేస్తుంది అన్నారు. నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి దున్నేవాడికి భూమి కావాలి అని సుమారు పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీది అని అన్నారు. ఈ కార్యక్రమంలో Aituc బ్రాంచ్ కార్యదర్శి సలెంద్ర సత్యనారయణ, సీపీఐ పట్టణ నాయకులు పాల్గొన్నారు.
మందమర్రి ఏరియా సింగరేణి గుర్తింపు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు పట్టణ INTUC కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, INTUC సెంట్రల్ నాయకులు జనక్ ప్రసాద్ సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో 51% తెలంగాణ రాష్ఠ్ర వాటా కల్గి ఉండి అధికారంలో నూతనంగా అత్యధిక జనాధరణ కల్గిన కాంగ్రెస్ పార్టీ ఉండి.. ముఖ్యంగా సింగరేణి కార్మిక క్షేత్రాలలో కాంగ్రెస్ పార్టీ MLA లు గెలుపొందినారు. రానున్న కొద్ది రోజుల్లో తప్పక MP సీటును కూడా భారీ మెజరటీతో కైవసం చేసుకోబోవు తరుణంలో SCCL కార్మిక లోకానికి ఒక ముఖ్య విన్నపం. రానున్న సింగరేణి యూనియన్ ఎలక్షన్ లో తప్పక INTUC కి అధికారం అందించినట్లైతే తప్పక మీ అవసరాలను, మీ హక్కులను, మీ అభీష్ఠాలను తప్పక అటు అత్యధిక వాటా కల్గి ఉన్న మన రాష్ఠ్ర అసంబ్లీలో మరియు కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్ లో మన MLA లు, మన MP లు కార్మిక అభీష్ఠానికి అనుగుణంగా పనిచేసి కార్మికుల మన్ననలు పొందుతారు. సింగరేణి కార్మిక యూనియన్ ఎన్నికల్లో INTUC ని బలపరచి గడియారం గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సింగరేణి కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, INTUC సెంట్రల్ నాయకులు జనక్ ప్రసాద్, IINTUC ఏరియా నాయకులు పాల్గొన్నారు.
క్రిస్మస్ పర్వదినం సందర్బంగా విద్యార్థులకు క్రిష్మస్ జన్మదినం పండుగ, క్రీస్తు జననం, జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు, శాంతా ఏంజిల్ ప్లస్, వేషాదారుణలతో క్రీస్తు విశిష్టతను గురించి విద్యార్థులకు చదువుతో పాటు ఇతరుల పట్ల ప్రేమ, దయతో మెలగాలని, నృత్యాలతో పాటు, సామాజిక, అత్యందిమీకత, మంచి అలవాట్లుతో మెలగాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాలలో క్రిస్మస్ జన్మదినం సందర్బంగా కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. చాలా మంది చిన్నారులు శాంటా, ఏంజెల్ డ్రెస్ వేసుకున్నారు. క్రిస్మస్ చెట్టుతో వేదికను అలంకరించారు. పిల్లలు యేసు జననం మరియు ఆయన జీవిత చరిత్రను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రమోహన్, అయూబ్, అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీమతి ఫరీదా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Also..
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ప్రగతి మైదానంలో సింగరేణి ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు సింగరేణి అధికారులు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీరాంపూర్ ఏరియా జిఎం సంజీవరెడ్డి హాజరై మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి సింగరేణి సాధించిన విజయాలు, సింగరేణి సంస్థలో విధులను నిర్వహించిన ఉత్తమ కార్మికులను గుర్తించి వారికి బహుమతి ప్రధానోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే గమ్యం ఒకే లక్ష్యం ఒకే కుటుంబం అనే స్ఫూర్తితో సింగరేణి అనేక విజయాలను సొంతం చేసుకుందన్నారు. సింగరేణి సంస్థ నష్టాలలో ఉన్న సంస్థ ఇప్పుడు లాభాల బాటలో పయనించడమే కాకుండా దేశానికి వెలుగులు అందించడంలో తెలంగాణ రాష్ట్ర సిరుల వేణి సింగరేణి ముందంజలో ఉందన్నారు. సింగరేణి కార్మికుల కృషితోనే ఈ అద్భుతాలను సుసాధ్యం చేయడం సాధ్యమైందన్నారు. సింగరేణి సంస్థ కేవలం బొగ్గును వెలికి తీయడమే కాకుండా సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లు, సోలార్ పవర్ ప్లాంట్ లు నిర్మించి ప్రొడక్షన్ లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో మన తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. అనంతరం ప్రగతి మైదానంలో నిర్వహించిన పాటల పోటీలతోపాటు నృత్యాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు తమ కుటుంబాలతో పాల్గొనగా, ఇతరులు కూడా ఈ కార్యక్రమాలను తిలకించడానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు.
సింగరేణి 135 వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో సింగరేణి హై స్కూల్ మైదానం లో ఆవిర్భావ దినోత్సవo ఘనంగా నిర్వహించారు. గౌరవ వందనం అనంతరం సింగరేణి సంస్థ జెండాను ఆవిష్కరణ చేసిన మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ A. మనోహర్..
సింగరేణి అధికారులు, కార్మికులు, సింగరేణి మహిళా సేవా సమితి సభ్యులు ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ స్టాల్స్, తినుబండారు స్టాల్ లను మందమర్రి ఏరియా జిఎం A. మనోహర్, మహిళా సేవా సమితి అధ్యక్షురాలు సవిత మనోహర్ లు ప్రారంభించారు. సింగరేణి వర్క్ షాప్ కార్మికులు ఏర్పాటు చేసిన పవర్ ప్లాంట్ సబ్ స్టేషన్ ను హెల్త్ డిపార్ట్మెంట్, సింగరేణి రెస్కు్ టీం, వివిధ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన పరికరాలు జిఎం సందర్శించి, పనితీరు ఎలా వుంది అని సింగరేణి రెస్క్యూ సిబ్బంది ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకునే చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. జియం మాట్లాడుతూ.. సింగరేణి సిరుల తల్లి నల్ల బంగారం పుట్టినరోజు నేడు, 135 వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నందుకు కార్మికులకు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. 135 సంవత్సరాల నుండి దక్షణ భారత దేశానికీ కొంగు బంగారం, తెలంగాణ రాష్ట్రానికి తల మణికం, ఆరు జిల్లా లలో విస్తరించి ఉన్న సింగరేణి తల్లి కొంగు బంగారం, ఈ ప్రాంతంలో లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న సింగరేణి సంస్థ రక్షణతో కూడిన నిత్యం శ్రమించే కార్మికులు బొగ్గు ఉత్పత్తి సాధించుడయే సింగరేణి లక్ష్యమని అన్నారు. సింగరేణి సంస్థ యాజమాన్యం బొగ్గుగనుల్లో అత్యాధునికమైన పరికరాలతో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లొ అధికారులు, కార్మికులు, జాతీయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా.. మాజీ కేంద్ర మంత్రివర్యులు, బడుగు బలహీవర్గాలకు ఆశాజ్యోతి, రాజకీయాల్లో ఓటమి అంటూ ఎరుగని వీరుడు, ప్రజల శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం అలుపు లేకుండా పోరాటం చేసిన యోధుడు, స్వర్గీయ గడ్డం వెంకటస్వామి 9వ వర్ధంతి సందర్బంగా చిత్ర పటానికి పూల మాల వేసి, నివాళులు అర్పించి, మందమర్రి మనోవికాస్ స్కూల్ విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసారు. మందమర్రి, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవ్గంలో వెంకటస్వామి (కాకా) సేవలు మరువలేనివి అని నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడేవారు అని గుర్తు చేశారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటంలో తను వంతు పాత్ర చరిత్రలో చిరస్మరణీయులు అని వర్ణించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, INTUC నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్ ప్రకటన నేపథ్యంలో మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజారాం గ్రామంలో రూరల్ సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 15 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. అనంతరం గ్రామంలో విస్కృత తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని గ్రామస్తులకు సీఐ సూచించారు. గ్రామంలో ప్రజలందరి భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. ప్రజల రక్షణ, భద్రత పూర్తిగా పోలీసులదే అని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో కొత్త వ్యక్తులు ఇల్లు అద్దె కొరకు వస్తే పూర్తి వివరాలు అడిగి వారి వద్ద నుండి గుర్తింపు కార్డులు తీసుకోవాలని ఏదైనా అనుమానం వస్తే వెంటనే 100కి డయల్ చేయాలని ఆయన తెలిపారు. నిరంతరం ఈ తనిఖీలు చేయడం వల్ల నేరాల రేటు తగ్గి ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చునని ఆయన చెప్పారు. ప్రాణహిత గోదావరి పరివాహక అటవీ ప్రాంతంలో పోలీసులతో కుంబింగ్ నిర్వహించి తగు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Also..
సింగరేణి బొగ్గు గని కార్మికుల్లో తిరుగులేని పట్టు నిలుపుకున్న తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) గుర్తింపు ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో కార్మిక నాయకుల్లో నైరాశ్యం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీకి అనుభంద సంఘంగా ఉన్న టీబీజీకెఎస్ ఏడో దఫా ఎన్నికల్లో పోటీ చేయవద్దన్న నిర్ణయంపై ముఖ్య నాయకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం తెలిసిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ కు వెళ్లిన వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్యలు గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు లేవని గమనించిన ముగ్గురు నాయకులు కూడా పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, కెంగెర్ల మల్లయ్యలు తమ రాజీనామా చేసినట్టుగా వెల్లడించారు. వరసగా రెండు సార్లు సింగరేణి గనుల్లో తిరుగులేని పట్టు నిలుపుకున్న టీబీజీకెఎస్ ఈ సారి అనూహ్య నిర్ణయం తీసుకోవడం వారికి మింగుడు పడకుండా చేసిందనే చెప్పాలి. దశాబ్దాలుగా సింగరేణి కార్మికులతో అనుభందం పెనవేసుకున్న ముగ్గురు నాయకులు టీబీజీకెఎస్ నుండి పోటీ చేసి మరోసారి పట్టు నిలుపుకోవాలని భావించినప్పటికీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం వారిని నిరాశకు గురి చేసింది. దీంతో ముగ్గురు ముఖ్య నాయకులు కూడా పదవులకు రాజీనామా చేయడం సింగరేణి వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
భవిష్యత్తు కార్యాచరణ..?
మరో ఆరు రోజుల్లో గుర్తింపు సంఘానికి సంబంధించిన పోలింగ్ జరగనుంది. హై కోర్టులో ఇంధన శాఖ పిటిషన్ వేసి చాలినంత యంత్రాంగం లేనందున తాము ఎన్నికలు నిర్వహించలేమని… ఎన్నికలు వాయిదా వేయాలని కోరింది. అయితే గురువారం హై కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసి ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరపాలని ఆదేశించింది. దీంతో ఎన్నికలు అనివార్యం అయిన నేపథ్యంలో టీబీజీకేఎస్ పోటీ చేయవద్దన్న తీసుకున్న నిర్ణయంతో ముఖ్య నాయకులు ముగ్గురు కూడా పదవులకు రాజీనామా చేశారు. అయితే కార్మిక వర్గాల్లో ప్రభావం చూపించే నాయకులు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందున్నదే ప్రశ్నార్థకంగా మారింది. మరో కార్మిక సంఘానికి అనుకూలంగా వీరు ప్రచారం చేస్తారా లేక వేరే కార్మిక సంఘంలో చేరి తమ పట్టు నిలుపుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా సింగరేణి ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వెనక కారణాలు ఏంటన్నది మాత్రం అంతుచిక్కకుండా పోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడమే కారణమా లేక అధికారంలో ఉన్నప్పుడే కార్మిక సంఘాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడమా అన్నది మాత్రం పజిల్ గా మారింది. అయితే ఈ సారి జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మాత్రం గులాబీ జెండాలు కనిపించవని మాత్రం తేలిపోయింది.
జన్నారం జింకల పునరావాస కేంద్రం సమీపంలో ఆటో రిక్షా టైరు పగిలి బోల్తా పడింది. ఈ ఆటోలో మొత్తం పది మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో జన్నారం ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థినిలు ఉన్నారు వారికీ స్వల్ప గాయాలయ్యాయి. అలాగే డ్రైవర్ తో పాటు ఉన్న మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి వారిని అక్కడి స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.





Total views : 195884