నాంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ రిమోట్ ఇప్పుడు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో ఉందని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ కారణంగానే కేంద్రంలో బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తోందని విమర్శించారు. బీజేపీ గెలుపుకు కాంగ్రెస్ తనను బాధ్యుడిగా చెబుతోందని, కానీ ఆ పార్టీ విజయం సాధిస్తే తాను ఎలా బాధ్యుడిని అవుతాను? అని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఆరెస్సెస్‌తోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. అందుకే ఇప్పుడు గాంధీ భవన్ రిమోట్ మోహన్ భగవత్ చేతిలో ఉందని ఎద్దేవాచేశారు. ఎవరు ఎన్ని చెప్పినా… బీజేపీతో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Hyderabad
ఖైరతాబాద్ నియోజకవర్గంలో బిజెపి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆ పార్టీ అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డి కాలనీలు, బస్తిలలో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇందుకోసం పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఐదేళ్ళపాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాను చేసిన సేవలే గెలిపిస్తాయంటున్న బిజెపి అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి.
కర్ణాటక రైతులు మాదిరిగా తెలంగాణ రైతులకు కూడా మోసపోద్దని ఈరోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద రైతులు మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు కర్ణాటక నుండి రైతులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు హామీలు ఇచ్చిందని ఎన్నికల్లో గెలిచాక ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వారు ఆరోపించారు. తెలంగాణ రైతులు చాలా తెలివైన వారని కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని కర్నాటక రైతులు తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేశారు.
మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ ఆయూబ్ ఇళ్లలో ఈడీ సోదాలు చేపట్టింది. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు జి.వినోద్ నివాసంలోనూ ఈ సోదాలు కొనసాగాయి. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారంటూ ఈ ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన మూడు కేసుల ఆధారంగా ఈడీ సోదాలు చేపడుతోంది. ముగ్గురి నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు, పలు పత్రాలు స్వాధీనం చేసుకుంది.
Read Also..
Read Also..
అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పోలీస్, పి.ఓ పోలింగ్ అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకొనుటకు జిల్లాలోని 15 నియోజకవర్గాలలో ప్రత్యేక ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలలో ఎన్నికల విధులు నిర్వహించే పి.ఓ లు, ఏ.పి.ఓ లు, ఇతర పోలింగ్ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఆయా నియోజకవర్గాల్లో సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్నికల విధులు నిర్వహించనున్న పోలీసు అధి కారికారులు, సిబ్బంది ఆయా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ లో ఓటు వేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట్ తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ ను పరిశీలించారు. అదే విధంగా కార్వాన్ నియోజకవర్గం గోల్కొండ తహశీల్దార్ కార్యాలయం, చార్మినార్ నియోజకవర్గం మొఘల్ పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్, బహదూర్ పుర నియోజకవర్గం బహదూర్ పుర తహశీల్దార్ కార్యాలయం ఫెసిలిటేషన్ సెంటర్ లలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను పరిశీలించారు.
కేంద్రం తీసుకువచ్చిన పాలసీ వల్లే హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించినా.. కేసీఆర్ సర్కార్ పెట్రోల్ మీద వ్యాట్ తగ్గించకుండా, బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 2014లో ఆంధ్రా తెలంగాణ విభజన జరిగినప్పుడు తెలంగాణ వద్ద చాలా సొమ్ము ఉండేదని, అలాంటి రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చిండని విమర్శించారు. తెలంగాణలో ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకొచ్చే ప్రాంతం హైదరాబాద్‌ని, కానీ అలాంటి తెలంగాణను రెవెన్యూ లోటుకు తెచ్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆర్థిక లోటును దాచిపెడుతోందని ఆరోపించారు. దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మారుతోందన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం కృషి చేస్తున్నదని చెప్పారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలో దోమల గూడ , ఏ.వి. కాలేజ్ నుండి ప్రారంభమైన రోడ్ షో. మహారాష్ట్ర Dy సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, MP, BJP పార్లమెంట్ బోర్డ్ సభ్యుడు, డా K. లక్ష్మణ్ తో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూస రాజు తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో లో పాల్గొన్నారు.. ముషీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పూసరాజు తో పాటు గాంధీ నగర్ కార్పొరేటర్ పావని వినయ్, రామ్ నగర్ కార్పొరేటర్ రవి చారి, కావాడి గూడ కార్పొరేటర్ రచన శ్రీ వెంకటేష్, ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్, బిజెపి యువమోర్చా కార్యకర్తలు వేల మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీలో భారీ ఎత్తున కార్యకర్తలు బిజెపి పార్టీ సీనియర్ నాయకులు తరలివచ్చారు.. బిజెపి నినాదంతో దద్దరిల్లిపోయిన ముషీరాబాద్ రోడ్లు.
వనపర్తి పట్టణ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో నేడు రేవంత్ రెడ్డి బహిరంగ సభకు విజయవంతం చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మెగా రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు . సభస్థల అవారణాన్ని ఆయన పరిశీలించారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. వనపర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు
ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్ లను వేగవంతంగా పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ సెక్టోరియల్ అధికారులను ఆదేశించారు. సోమవారం బంజారాహిల్స్ లోని కొమరం భీమ్ భవన్ లో ఈ.వి.ఎం ల కమిషనింగ్ పై జిల్లా ఎన్నికల అధికారి సెక్టోరియల్ అధికారులకు, అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్స్ కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ… ఎన్నికల కమిషన్ సూచనల మేరకు సెక్టోరియల్ అధికారులు బి.ఎల్.ఓ ల ద్వారా ఇంటింటికి ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్ లను పంపిణీ చేయాలని, సంబంధిత సమాచారాన్ని బి.ఎల్.ఓ యాప్ ద్వారా పొందుపరిచే విధంగా ఆర్.ఓ చర్యలు తీసుకోవాలని తెలిపారు రిటర్నింగ్ అధికారికి అందజేయాలని తెలిపారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్ లన త్వరగా పంపిణీ చేసి నివేదిక పంపాలని తెలిపారు. ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ లో భాగంగా 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు తమ ఇంటి వద్దే ఓటు వేసేందుక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. హోం ఓటింగ్ లో సెక్టోరియల్ అధికారులు మైక్రో అబ్జర్వర్లు, పోలింగ్ ఏజెంట్ లు తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకావాలని తెలిపారు. ఓటింగ్ అనంతరం వారికి వేలిపై సిరా చుక్క వేయడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ రోజు దివ్యాంగులకు సహాయకుడిగా వచ్చిన వారికి కుడి చేతి వేలిపై సిరా చుక్క వేయాలని అన్నారు
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదనీ ప్రజాస్వామ్య పరిణతి వచ్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతదనీ, విచక్షణతోటి బాగా ఆలోచించి మంచి అభ్యర్థికి, మంచి పార్టీకి ఓటెయ్యాలి. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ఆషామాషీగా ఓటు వేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండలం మామిడిపల్లి, శ్రీనివాసుల గూడ, మొదళ్ళ గూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ కు ఆయా గ్రామాల్లో ప్రజల నుండి భారీ స్పందన లభించింది. స్ధానిక నేత మాజీ జెడ్పి వైస్ చైర్మన్ నాగర్ కుంట నవీన్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎమ్మేల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. ఏ పార్టీకి ఓటేస్తే మంచి జరుగుతది.. ఏ పార్టీకి ఓటేస్తే చెడు జరుగుతది..? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయగలగాలనీ, ప్రజలకు ఉన్న ఒకే ఆయుధం ఓటు. ఆ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలె’ అని అంజయ్య చెప్పారు. ‘పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటు వేయాలె. బీఆర్ఎస్ పార్టీ చరిత్ర ఏందో మీకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ అభివృద్ధి కోసం. తెలంగాణ ఏర్పాటైనంక బీఆర్ఎస్ పార్టీ ఎంత బాగా అభివృద్ధి చేసిందో మీరందరూ చూస్తున్నరు. మరె 50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది..? అడుగడుగునా తెలంగాణను మోసం చేసింది. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసిన కరువు కాటకాలే ఉండె. పత్తికాయలు పగిలినట్లు రైతులు గుండెలు పగిలి చనిపోయిండ్రు. అదీ కాంగ్రెస్ పరిపాలన’ అని అంజయ్య ఎద్దేవా చేశారు




Total views : 203133