పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే ఎంత భద్రంగా ఉంటదో, తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతులో ఉంటే అంతే భద్రంగా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు మహేశ్వరం నియోజకవర్గం లోని సరస్వతి గూడ, అగర్మియా గూడ, లేమూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంత్రి మాట్లాడుతూ చుట్టం చూపులాగా ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. నియోజకవర్గ ప్రకారంగా ఎలాంటి అవగాహన లేని వాళ్ళు నియోజకవర్గంలో తిరుగుతున్నారు .ఒకరేమో డబ్బుల సంచులు మోసుకొని తిరుగుతున్నారు, ఒకరేమో కులమతాలను రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చెప్పి తిరుగుతున్నారు.గడచిన తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఎలాంటి కులమతాల మధ్య చిచ్చు లేకుండా, తెలంగాణను సస్యశ్యామలంగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు,ఎంపీటీసీలు, సర్పంచులు,వార్డు సభ్యులు అనుబంధ సంఘాల అధ్యక్షులు,మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Hyderabad
కూకట్ పల్లి లోని జేఎన్టీయూ యూనివర్సిటీ వద్ద ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ప్రధాన గేట్ విద్యార్థుల తో కలిసి భారీ ధర్నా నిర్వహించారు . యూనివర్సిటీ పరిధిలోని R17, R18, R 22 లో జరిగిన పరీక్షలకు సంబంధించి క్రెడిట్ విధానాల వల్ల విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందని కోవిడ్ సమయాలలో విద్యార్థులకు సరైన తరగతులు జరగక ఇబ్బందులు పడడమే కాకుండా అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయాలలో మార్పులు చేసి R17, R18, R 22 లో డైటైన్ అయిన విద్యార్థులను మినహాయించి తదుపరి తరగతులకు ప్రమోట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ముగిసిన తర్వాత భారీ ఎత్తున జేఎన్టీయూ యూనివర్సిటీని ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకొని అధికారులు వారికి న్యాయం చేయాలని బల్మూరి వెంకట్ కోరారు.
Read Also..
ఇన్ఫోసిస్ సంస్థ ఉద్యోగులకు తాజాగా సర్ప్రైజ్ ఇచ్చింది. ఉద్యోగులకు పనితీరు ఆధారంగా 80 శాతం వెరియబుల్ పే చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఈ బోనస్‌కు అందరూ అర్హులు కారని పేర్కొంది. కంపెనీ ప్రకటన ప్రకారం లెవెల్ 9 అంతకంటే దిగువ స్థాయి ఉద్యోగులకు సగటున 80 శాతం వేరియబుల్ పే ఇవ్వనుంది. ఈ మేరకు ఉద్యోగులకు సంస్థ ఈమెయిల్ పంపించింది. జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో ఉద్యోగుల పనితీరు, సంస్థలో నిర్వహించిన సామార్ధ్యాన్ని బట్టి బోనాస్ వర్తిస్తుందని తెలిపింది. వారానికి 70 పనిగంటలు సూచనతో ఇటీవల సంచలనం స్పృష్టించిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, కొత్తగా వ్యాపారవేత్తగా మారడం కష్టంతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు. సాప్ట్వేర్ ఇంజినీర్,ఫైనాన్షియల్ ఎనలిస్ట్ కావడం సులభమే కానీ పారిశ్రామికవేత్తగా కొనసాగడం కష్టం అన్నారు. దానకి ఎంతో శ్రమ అవసరం అన్నారు. భారత్‌లో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు అన్నారు. అయితే, దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు అనూకూల వాతావరణం కోసం భారత ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది అభిప్రాయపడ్డారు.
సైదాబాద్ లో గడప గడపకు తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను మలక్ పేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ అక్బర్ ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. తనను ఆశీర్వాదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో ప్రజలు ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోకు విశేష స్పందన వస్తుందని చెప్పారు. అంతేకాకుండా ఇతర పార్టీ నేతలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తగా పెళ్లయిన మహిళలకు లక్షలతో పాటు తులం బంగారం ఇల్లు లేని పేదలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల సాయం, ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు అందించనున్నామని వివరించారు. సాగుకు 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్, అన్ని ప్రధాన పంటలకు సమగ్ర పంటల భీమా ఇస్తామని వెల్లడించారు. ఎస్సీ కుటుంబాలకు 12 లక్షల వరకు ఆర్థిక సాయం, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లలు కేటాయించినున్నట్లు స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగల భర్తీ ఎస్టీ కార్పొరేషన్లు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు రూ. 12 లక్షలు ఆర్థిక సాయం ఆరోగ్య శ్రీ పథకం 10 లక్షల పెంపు ప్రతి విద్యార్ధికి ఐదు లక్షల విద్య భరోసా కార్డు బీడీ కార్మికులకు జీవిత బీమా ఈఎస్ఐ వర్తింపు స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీతో 10 లక్షల ఋణం అందిస్తామని తెలిపారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల సాయం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఆరోగ్య భీమా, ఇంటి స్థలాలు తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఆరు నెలల్లో మెగా డీఎస్సీ అమలు చేస్తామని తెలిపారు.
Read Also..
ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించి నేను మీకు ఉన్నాను అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని బిఆర్ఎస్ ప్రభుత్వం కోరుకుంటుందని మంత్రి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్నాయన్నారు. 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి తొమ్మిదిన్నర సంవత్సరాల లో జరిగింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలని, మళ్లీ BRS ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి గా కేసీఆర్ బాధ్యతలు చేపడతారని మంత్రి అన్నారు.
మహిళ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని సంపద సృష్టించాలని మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. అంతే కాకుండా మహిళల కోసం నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేశామన్నారు. దేశంలోనే తొలిసారిగా మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం వి-హబ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలు మానసికంగా చాలా బలంగా ఉంటారని ఆయన అన్నారు. మ్యానిఫెస్టోలో లేకున్నా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ వంటి పథకాలను ప్రత్యేకంగా మహిళల కోసం ప్రారంభించామన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో మహిళలు, గర్భిణులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామ్నారు. దీంతో దవాఖానల్లో డెలివరీల శాతం పెరిగిందని తెలిపారు. మైనార్టీల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి చిన్నారిపై 10 వేల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ను మహిళలు సురక్షితంగా భావిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో కూకట్ పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ముద్ధం నరసింహ యాదవ్ తో కలిసి డివిజన్ లోని ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఈరోజు డివిజన్ పరిధిలోని ప్రియదర్శిని హోటల్ నుండి ప్రారంభమై ఎస్సీ బస్తి, మాల బస్తీ, అంజయ్య నగర్, హాస్మత్ పెట్టు, మల్లికార్జున నగర్ కాలనీ, వివిధ బస్తిలలో వేలాదిమంది కార్యకర్తల నడుమ ఎన్నికల ప్రచారం చేపట్టారు.
పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి మాధవరం కృష్ణారావును భారీ మెజార్టీతో గెలిపించాలని పాదయాత్ర చేపట్టారు. మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ… ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, మరి అదే విధంగా కూకట్పల్లి నియోజకవర్గం లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లు నీ కోరారు. నియోజకవర్గంలో పాటు ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ ను కూడా ఇంకా అభివృద్ధి చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.
హైదరాబాద్ శివారులో భారీగా నగదు పట్టుబడింది. తనిఖీల్లో రూ.6.5 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బండ్లగూడ అప్పా జంక్షన్ దగ్గర ఈ డబ్బును పట్టుకున్నామని తెలిపారు. లెక్కలు చూపని డబ్బును ఆరు కార్లలో తరలిస్తున్నారని అధికారులు చెప్పారు. ఈ డబ్బును ఎన్నికల కోసం తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన నేతకు సంబంధించిన నగదుగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే…. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈరోజు బన్సీలాల్ పేట డివిజన్ లో ప్రచారం నిర్వహించిన సనత్ నగర్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఇండ్ల నిర్మాణం కోసం నామమాత్రపు ఆర్ధిక సహాయం అందించాయి అని పేదల కష్టాలు తెలిసిన పెద్ద మనసున్న మారాజు KCR అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా న్యాయబద్ధంగా పేదలకు అందించారని నగరంలో ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల వరకు త్రాగునీరు ఉచితంగా అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పేద, మధ్య తరగతి ప్రజలకు BRS ప్రభుత్వం లో ఎంతో మేలు జరిగింది అని
BRS తోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు సాధ్యమయ్యాయని ఈ సందర్భంగా మాట్లాడారు కారు గుర్తుకే ఓటు వేసి హ్యాట్రిక్ బరిలో తనను నిలబెట్టాలని ప్రజలను కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.
Read Also..
ఘట్కేసర్ మండలం మాజీ ఎంపీపీ యాట కుమార్ కుటుంబానికి దర్గా దయాకర్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వ హయాంలో యాట కుమార్ ఘట్కేసర్ మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గతంలో టీడీపీ సీనియర్ నాయకుడైన తోటకూర జంగయ్య యాదవ్ తో కలిసి పార్టీ కార్యక్రమానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో యాట కుమార్ మృతి చెందాడు. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా కుమార్ భార్య(రేణుక) కూడా మృతి చెందింది. యాట కుమార్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులను ఇద్దర్నీ కోల్పోయిన పిల్లల బాధ్యత ఇప్పటివరకు బంధువులు చూసుకుంటున్నారు.




Total views : 203036