సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్టపై వెలసిన ఆరో శతాబ్దం నాటి ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం లో మహాశివరాత్రిని పురస్కరించుకొని నేటి నుండి ఉత్సవాలు మొదలయ్యాయి. మహాశివరాత్రి ఉత్సవ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి శశిధర్ మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని అన్నారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని, క్యూ లైన్ లో భక్తులకు మంచినీటి సౌకర్యం వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఐదు రోజుల పాటు నిర్వహించే జాతరకు సుమారు 5 లక్షల మంది స్వామివారికి దర్శించుకోనున్నారని అన్నారు.
Medak
సంగారెడ్డి జిల్లా (Sangareddy District) :
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మెళ్ళ చెరువు ఆక్రమణల పై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు కోరాడ ఝులిపించారు. గత ప్రభుత్వ అండతో మెళ్ల చెరువు లోని FTL ల్యాండ్ ను కబ్జాదారులు ఆక్రమించి పెద్ద ఎత్తున మట్టిని నింపారు. ఆక్రమణలకు పాల్పడిన వారికి వత్తాసు పలుకుతూ మ్యామ్యాలకు అలవాటు పడి చర్యలకు అధికారులు వెనుకంజ వేశారు. చెరువు కబ్జా చేసిన వ్యక్తి ఎవరో తెలిసి కూడ వారి పేరు చెప్పకుండా గుర్తు తెలియని వ్యక్తులు మట్టిని నింపారు అన్నా ఇరిగేషన్ AE ఫిర్యాదు మేరకు రామచంద్రపురం పోలీసుల కేసును సైతం నమోదు చేశారు.
ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు FIR నమోదు చేసి పోలీసు అధికారులు మమా అనిపించి ఆ తరువాత చేతులు దులుపు కున్నారు. చెరువులో ఆక్రమణలపై గతంలో NGT స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన కబ్జాదారుల అమ్యమాలకు అలవాటు పడ్డా అధికారుల ఆక్రమణలపై కళ్ళు మూసుకొని ములిగారు. గత ప్రభుత్వ హయాంలో నేతలకు తొత్తులుగా మారి కబ్జాలకు సహకరించిన అధికారులు పై ఇప్పటికైనా ఉన్నతధికారులు చర్యలు తీసుకోవాలనీ ప్రజలు కోరుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కబ్జాల పై రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు పలు మార్లు ఫిర్యాదులు అందిన అధికారులు స్పందించకపోవడం పై అప్పట్లో భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. రాజకీయా నాయకులు సైతం కబ్జాదారులకు అండగా నిలిచిన నేపథ్యంలో, నేడు మేళ్ళ చెరువు కబ్జాల పై అధికారులు చర్యలు తీసుకోవడం పట్లా హర్షం వ్యక్తమవుతోంది. గత కొన్ని ఏళ్లుగా మేళ్లచెరువులో సుమారు 10 ఎకరాల మేరకుకబ్జాకు గురవుతున్న విషయం తెలిసిన కూడా అటువైపు చూడని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అటువైపు చూడకపోవడం పలు విమర్శలకు దారి తీస్తుంది. ఇరిగేషన్ శాఖ డీ ఈ రామ స్వామినీ మీడియా ప్రతినిధిలు వివరాలను అడిగితే ఏమీ తెలియనట్లు మొఖం చాటేయడం, కబ్జాదారులకు ఎంతవరకు సహకరిస్తున్నాడో అర్థం అవుతుంది. ఇలాంటి అధికారులు ఉండడం వల్ల రాబోవు రోజుల్లో నియోజకవర్గంలో కొన్ని చెరువులను రికార్డుల్లో తప్ప వాస్తవంగా చూడలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి కఠినమైన ఆదేశాల మేరకు మూడు శాఖల అధికారులు చర్యలు చేపట్టారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
నరేంద్ర మోడీ (Narendra Modi) :
ఈ నెల 5 వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) సంగారెడ్డి జిల్లాలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్న సందర్భంగా పటాన్ చెరు ఎల్లంకి కళాశాలలో ఎస్పీ రూపేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పీఎం బహిరంగ సభ స్థలానికి చేరుకునే వాహన దారులు నిబంధనలు, ఆంక్షలు పాటించవలసి ఉంటుందన్నారు. బస్సులలో మీటింగ్ ప్లేస్ కు వచ్చే వారు కామారెడ్డి, రామాయం పేట, తూప్రాన్ వైపు నుండి మీటింగ్ కు వచ్చే బస్సులు కండ్లకోయ వద్ద, సిద్ధిపేట, గజ్వేల్ వైపు నుండి మిటింగ్ కు వచ్చే బస్సులు షామీర్ పేట్ వద్ద, మెదక్, నర్సాపూర్ వైపు నుండి మీటింగ్ కు వచ్చే బస్సులు గుండ్ల పోచమ్మ వద్ద, సంగారెడ్డి, జహిరాబాద్, జోగిపేట, వైపు నుండి మీటింగ్ కు వచ్చే బస్సులు ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ -3 వద్ద, హత్నూర, దౌల్తాబాద్ వైపు నుండి మీటింగ్ కు వచ్చే బస్సులు ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ -3 వద్ద, హైదరాబాద్, లింగం పల్లి మీదుగా మీటింగ్ కు వచ్చే బస్సులు ముత్తంగి వద్ద ORR ( ఔటర్ రింగ్ రోడ్డు ) ఎక్కి సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ -4 వద్ద దిగి, కిష్టా రెడ్డి పేట, పటేల్ గూడా మీదుగా ఎల్లంకి కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్ కు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. కార్లల లో మీటింగ్ ప్లేస్ కు వచ్చే వారికి సూచనలు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కామా రెడ్డి, రామాయం పేట, తూప్రాన్ వైపు నుండి కార్లలో మీటింగ్ కు వచ్చేవారు కండ్ల కోయ వద్ద, సిద్ధి పేట, గజ్వేల్ వైపు నుండి కార్లలో మీటింగ్ కు వచ్చేవారు షామీర్ పేట్ వద్ద, మెదక్, నర్సాపూర్ వైపు నుండి కార్లలో మీటింగ్ కు వచ్చేవారు గుండ్ల పొచమ్మ వద్ద ORR ( ఔటర్ రింగ్ రోడ్డు ) ఎక్కి, ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ -3 దగ్గర దిగి ఎడమ చేతి వైపు సర్వీస్ రోడ్ ద్వారా రామేశ్వరం బండ దగ్గర గల పార్కింగ్ ప్లేస్ కు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట వైపు నుండి కార్లలో మిటింగ్ కు వచ్చేవారు ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ – 3 వద్ద ఎడమ చేతి వైపు సర్వీస్ రోడ్ ద్వారా రామేశ్వరం బండ దగ్గర గల పార్కింగ్ ప్లేస్ కు చేరుకోవాలన్నారు. హత్నూర, దౌల్తాబాద్ వైపు నుండి కార్లలో మీటింగ్ కు వచ్చేవారు ORR (ఔటర్ రింగ్ రోడ్డు) ఎడమ చేతి వైపు సర్వీస్ రోడ్ ద్వారా రామేశ్వరం బండ దగ్గర గల పార్కింగ్ ప్లేస్ కు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. హత్నూర, దౌల్తాబాద్ వైపు నుండి కార్లలో మిటింగ్ కు వచ్చేవారు ORR ( ఔటర్ రింగ్ రోడ్డు ) ఎడమ చేతి వైపు సర్వీస్ రోడ్ ద్వారా రామేశ్వరం బండ దగ్గర గల పార్కింగ్ ప్లేస్ కు చేరుకోవాల్సి ఉంటుందన్నారు.
మీటింగ్ కు వచ్చే బస్సులు తప్ప మరే ఇతర వాహనాలు సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ -4 వద్ద దిగరాదన్నారు. హైదరాబాద్, లింగం పల్లి మీదుగా మీటింగ్ కు వచ్చే వాహనాలు ఏవి కూడా బీరం గూడ కమాన్ వైపు నుండి కిష్టా రెడ్డి పేట, పటిల్ గూడా వైపు వెళ్లరాదన్నారు. ఎలాంటి వాహనాలు సుల్తాన్పూర్ ఎగ్జిట్ నెంబర్ -4 నుండి ORR (ఔటర్ రింగ్ రోడ్డు) ఎక్కరాదన్నారు. పోచారం కమాన్ నుండి ముత్తంగి ORR (ఔటర్ రింగ్ రోడ్డు) కుడి చేతి వైపు సర్వీస్ రోడ్ లో ఎలాంటి వాహనాలు రావద్దన్నారు. GMR – ఫంక్షన్ హాల్ నుండి APR రోడ్డు ద్వారా పటేల్ గూడాకు వెళ్ళే మార్గంలో ఎలాంటి వాహనాలు రావద్దని, పటాన్ చెరు నుండి ఇంద్రేశం వెళ్ళే వారు ముత్తంగి హరి దోషా వద్ద యు టర్న్ తీసుకొని ORR (ఔటర్ రింగ్ రోడ్డు) ఎడమ చేతి వైపు సర్వీస్ రోడ్ ద్వారా ఇంద్రేశం వెళ్ళవలసి ఉంటుందన్నారు. ఇంద్రేశం గ్రామం నుండి పటాన్ చెరు వెళ్ళే వారి ORR (ఔటర్ రింగ్ రోడ్డు) వద్ద రైట్ టర్న్ తీసుకొని సర్వీస్ రోడ్ గుండా వెళ్ళి NH – 65 ద్వారా పటాన్ చెరు వెళ్ళవలసి ఉంటుందన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి : జిల్లా స్థాయి అధికారులతో సత్తుపల్లి లో సమీక్ష సమావేశం…
రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. సభా స్థలికి ఐదు కిలో మీటర్ల మేరకు యాంటీ డ్రోన్స్ నిబంధన ఉంటుందన్నారు. మూడంచెల భద్రత తో 2 వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. స్కూల్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. సభా స్థలికి వచ్చే వారు ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని, కేవలం మొబైల్స్ మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. క్యూ ఆర్ కోడ్ ద్వారా పార్కింగ్ రూట్ మ్యాప్ ఏర్పాటు చేశామన్నారు.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామంలోని త్రివేణి హైస్కూల్ లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్ట్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ మెగా సైన్స్ ఫెయిర్ అందరినీ ఆకట్టుకుంది. దాదాపు 85 అంశాలతో కూడిన సైన్స్ ఫెయిర్ తో వినూత్నంగా విద్యార్ధిని, విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శనలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా త్రివేణి పాఠశాలల వైస్ ప్రిన్సిపాల్ ఫర్జానా.. ‘మా పాఠశాల ఆవరణలో జరిగే వార్షిక సైన్స్ ఎగ్జిబిషన్ దేశానికి అందించే చిరు నైవేద్యమని, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మాత్రమే ఆధునిక ప్రపంచంలో మన మాతృభూమికి విముక్తి కల్పిస్తుందని విశ్వసిస్తున్నామన్నారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలలో విద్యార్థులు _ సేవ్ సాయిల్, ఆర్గానిక్ ఫార్మింగ్, హైడ్రాలిక్ క్రేన్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, భువన విజయం, సోలర్ ఫ్యాన్, ఫైర్ అలారం, రోబోటిక్ ఫైర్ ఫైటర్ వంటి అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో త్రివేణి హైస్కూల్ ఏసీఆర్ఓ సాయి నర్సింహ రావు, డైరెక్టర్ డాక్టర్ జి. వీరేంద్ర చౌదరి,
పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: తాగునీటి కోసం మహిళలు రోడ్డుపై ధర్నా..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తుండగా ఒక్కసారి మంటలు చెలరేగడం తో భయాందోళనకు గురయ్యారు. పాఠశాల ప్రాంగణం ఆవరణలో చిత్తు పేపర్ల కు నిప్పు పెట్టడం తో హాస్టల్ ఆవరణలో ఉన్న గడ్డి, చెట్లు అంటుకొని భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: మిర్చి రైతుల ఆవేదన..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
లాస్య కారును ఢీకొన్న టిప్పర్‌ను పోలీసులు తాజాగా గుర్తించారు. పోలీసులు సదరు టిప్పర్ లారీని సీజ్ చేశారు. యాక్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత టిప్పర్‌ను కర్ణాటకలో పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో టిప్పర్ డ్రైవర్ కీలక విషయాలు వెల్లడించారు. అతి వేగంతో వచ్చిన ఎమ్మెల్యే కారు టిప్పర్ ను ఢీకొట్టడంతోనే యాక్సిడెంట్ జరిగిందని డ్రైవర్ తెలిపారు. మొదట కారు టిప్పర్ ను ఢీకొన్న తర్వాత వేగంగా వెళ్లి రెయిలింగ్ ను ఢీకొట్టిందని డ్రైవర్ వెల్లడించారు. లాస్య ప్రయాణిస్తున్న కారు వేగంగా టిప్పర్ ను ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. ఈ రోజు సాయంత్రం రంగారెడ్డి జిల్లా పోలీసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కీలక విషయాలు వెల్లడించే చాన్స్ ఉంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: నేడు బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమం
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏసిపి ఏ. బాలాజీ, కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వివరాలు తెలియపరుస్తూ
నిందితుల వివరాలు
- గంగులోత్ చంద్రశేఖర్ తండ్రి బాలు, వయస్సు 23 సంవత్సరాలు, గ్రామం కొండాపూర్, మండలం దూల్మిట్ట, జిల్లా సిద్దిపేట.
- అగుళ్ల శ్రీనివాస్ తండ్రి పోచయ్య, వయస్సు 36 సంవత్సరాలు, గ్రామం & మండలం కేశవపట్నం, జిల్లా కరీంనగర్.
- కడారి జలంధర్ తండ్రి పాపయ్య, వయస్సు 34 సంవత్సరాలు, గ్రామం & మండలం హుజురాబాద్, జిల్లా కరీంనగర్.
ఫిర్యాది చిట్టబోయిన బాబు తండ్రి పోచయ్య గ్రామం చిన్నకోడూర్ అతను వెలికట్ట గ్రామ శివారు శ్రీ సిద్ధి రియల్ ఎస్టేట్ వెంచర్లు తేదీ: 19-02-2024 నాడు సాయంత్రం తన యొక్క ఫ్లాట్ దగ్గరికి వెళ్లి చూడగా ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కరెంటు పోల్స్ కు ఉన్న అల్యూమినియం వైర్ ను కట్ చేసి దొంగలించుకుని పోయినారని పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగింది.
Follow us on : Facebook, Instagram & YouTube.
కేసు పరిశోధనలో భాగంగా ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో వెలికట్టే X రోడ్డు వద్ద తొగుట సిఐ లతీఫ్, కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బందితో కలసి వాహనాలు తనిఖీ చేయుచుండగా పై ముగ్గురు నిందితులు ఆటో TS02UA-8364 గల దానిలో అల్యూమినియం వైర్ వేసుకొని వెళ్ళుచుండగా అనుమానంతో ముగ్గురు నిందితులను పట్టుకుని విచారించగా అల్యూమినియం వైర్ దొంగలించినామని ఒప్పుకున్నారు.
పై ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకొని ఎక్కడెక్కడ ఏ దొంగతనాలు చేసినారని విచారించగా ముద్దాయి గంగులోత్ చంద్రశేఖర్ గత కొన్ని రోజుల క్రితం నూతనంగా నిర్మించే ఇండ్లలో కరెంటు వైర్ ఫిటింగ్ చేస్తూ జీవించేవాడు. వచ్చే డబ్బులు తన యొక్క జల్సాలకు సరిపోనందున నూతనంగా ఏర్పాటు చేసిన వెంచర్ల వద్ద కరెంటు అల్యూమినియం వైర్ దొంగలించి అమ్ముతే ఎక్కువ డబ్బులు వస్తాయని నిర్ధారించుకొని తన స్నేహితులు అగుళ్ళ శ్రీనివాస్, కడారి జలంధర్ కు ఈ విషయము తెలియపరచగా వారు కూడా ఒప్పుకున్నారు. ముగ్గురు కలిసి కరెంట్ అల్యూమినియం వైర్ దొంగతనం చేద్దామని అమ్మితే వచ్చే డబ్బులతో జల్సాలు చేయవచ్చని నిర్ణయించుకుని.
గుగులోత్ చంద్రశేఖర్ తన మోటార్ సైకిల్ నెంబర్ TS36N-2771 పైన ఎక్కడెక్కడ నూతనంగా నిర్మించిన వెంచర్లు ఉన్నాయో చూస్తూ ఉండేవాడు తరువాత ముగ్గురు కలిసి ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న వెంచర్లో అల్యూమినియం వైర్ కట్టర్ తో కట్ చేసి ఆటోలో వేసుకుని వెళ్ళినారు. వారం రోజుల క్రితం ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న వెంచర్లో కరెంటు కనెక్షన్ లేనిది గమనించి కట్టర్ తో కరెంటు స్తంభాలకు కల అల్యూమినియం వైరు కత్తిరించుకుని ఆటోలో వేసుకుని వెళ్లి జల్సాలకు డబ్బులు లేనందున అమ్ముదామని నిర్ణయించుకుని ప్రజ్ఞాపూర్ స్క్రాప్ దుకాణం యజమాని చేపట్టి వెంకటేష్ వద్దకు వెళ్లి అల్యూమినియం వైర్ అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలకు ఖర్చు పెట్టుకున్నారు.
మరో వారం రోజుల క్రితం ఆటో మోటార్ సైకిల్ పై వెళ్ళచ్చు కుకునూరు పల్లి మండలంలోని తిప్పారం వెళ్లే దారిలో నూతనంగా నిర్మించిన వెంచర్లో కరెంటు అల్యూమినియం వైరు దొంగలించుకొని అటోలో వేసుకొని వెళ్ళినారు. మరో నాలుగు రోజుల క్రితం మెదినిపూర్ గ్రామ శివారులో ఉన్న నూతన వెంచర్లో కరెంటు అల్యూమినియం వైర్ కట్టర్ తో కట్ చేసుకుని ఆటోలో వేసుకొని వెళ్లి సిద్దిపేట మనిషిసింగ్ స్క్రాప్ దుకాణం యజమాని అల్యూమినియం వైరు అమ్మి వచ్చిన డబ్బులు జల్సాలకు ఖర్చు చేసుకున్నారు.
తదనంతరం కుకునూరు పల్లి మండలం వెలికట్ట గ్రామ శివారులో ఉన్న వెంచర్లో కరెంటు అల్యూమినియం వైర్ దొంగలించారు. తరువాత ఎల్కతుర్తి గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన వెంచర్లో కరెంట్ అల్యూమినియం వైర్ కట్ చేసి ఆటోలో వేసుకున్నారు. తరువాత మానకొండూర్ గ్రామ శివారులో రైతు వ్యవసాయ పొలాలు ట్రాన్స్ఫారం వద్ద కరెంటు పోల్స్ కు ఉన్న అల్యూమినియం వైర్లు కట్ చేసుకుని ఆటోలో వేసుకుని అల్యూమినియం వైర్ అమ్మడానికి ఈరోజు ప్రజ్ఞాపూర్ కు వెళ్లుచుండగా పోలీసులు పట్టుకొని 1280 కేజీల అల్యూమినియం కండక్టర్ వైర్, ఒక ఆటో, ఒక మోటార్ సైకిల్, రికవరీ చేసి పై నిందితులను కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరుగుతుంది. కేసు విచారణ కొనసాగుతుంది.
ఇది చదవండి:
ఇది చదవండి: రాజమండ్రి ఎంపీ భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Bandi Sanjay :
రేషన్ కార్డులు ఉన్నవారికే 6 గ్యారంటీలు అమలు చేస్తామంటే పేదలను మోసం చెయ్యడమేనని, ముందు అర్హులైన పేదలకు నూతన రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతే గ్యారంటిలు అమలు చేయాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు ఎంపీ బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజాహిత యాత్ర చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పై చురకలు విసిరారు. గత ప్రభుత్వంపై ప్రజల సమస్యల కోసం కొట్లాడితే నా మీద వంద కేసులు పెట్టి జైలుకు పంపారని, ఇక్కడున్నా నాయకుడు పెద్దమనిషి ఏమయినా కొట్లాడాడా ఆయన మీద ఏమైనా కేసులు అయ్యాయా అని ప్రశ్నించారు. గౌరవెల్లి భూ నిర్వాసితులకు ఇంతవరకు పరిహారం అందలేదని, వారు జైలుపాలు, గాయల పాలై ఉంటే రాత్రికి రాత్రి వచ్చి వారిని ఆస్పత్రికి తీసుకుపోయి కాపాడనన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్, కేటీఆర్ కు కేవలం తన మీద ఆడిపోసుకోవడం తప్ప వేరే పనిలేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇందిరమ్మ రాజ్యం తేస్తామంటూ ఆమె పాలనలో వచ్చిన ఎమర్జెన్సీని తెస్తారేమోనని అనుమానం వస్తుందన్నారు. 90 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చెయ్యనోల్లు పది రోజుల్లో చేస్తారా అని, గ్యారంటీల అమలు విషయమై తను మాట్లాడితే రాముని విషయం వారు మాట్లాడుతున్నరన్నారు. రేవంత్ రెడ్డి పిసీసీ అధ్యక్షుడిగా ఉండడం ఇష్టం లేకనే ఆయనను తీసేయాలని ఇక్కడున్న పెద్ద మనిషి పొన్నం గొడువ చేస్తున్నడన్నారు. కేసిఆర్ పది ఎండ్లలో 5 లక్షల కోట్ల అప్పు చేస్తే, 2 నేలల్లోనే కాంగ్రెస్ వాళ్లు 10 వేల కోట్ల అప్పు చేశారని ఎద్దేవా చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
రాముడు అయోధ్య లో పుట్టిండ అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని, తను మా అమ్మకు పుట్టినట్టు గ్యారంటీ అక్కడున్న నర్సులు, డాక్టర్ లు చెప్తారన్నారు.
ఈ విషయమంటే తన పై కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తూ రాద్దాంతం చేస్తున్నరన్నారు. సంస్కార హీనులు కాంగ్రెస్ వాళ్లని, తను సంస్కార హినున్ని కాదని, మా తల్లి ఆయన తల్లి అయిన ఇద్దరు తనకు సమానమేనన్నారు. అందరూ తల్లులు నా తల్లితో సమానమని, మీరు చెడు ఉద్దేశాలు అపదించుకొని ఆమెను అవమాన పరుస్తున్నరన్నారు. తను ఎంపిగా గెలవకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, మీరు పెట్టిన కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటావో లేదో చెప్పాలి.
కేటీఆర్ తో బీఆర్ఎస్ కథమైందని, ఇక్కడున్న పెద్ద మనిషి పొన్నం ప్రభాకర్ తో కాంగ్రెస్ కూడా నాశనం అవుతుందని ఎద్దేవా చేశారు. రేషన్ బియ్యం మీద ఫోటోలు పెట్టుకుంటున్న కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు బియ్యం ఇవ్వవద్దని ప్రధాని మోడీకి లేఖ రాస్తానని, ఇక రేపటి నుండి వాళ్ళ రేషన్ బియ్యం ఇవ్వాలన్నారు. అభివృద్ధికి కలిసి పనిచేద్దామంటే, అనవసరంగా తనను గెలుకుతున్నారని మండి పడ్డారు. ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే తన ఫ్లెక్సీలు చింపేయడంతోపాటు అందులోని రాడ్లు కూడా ఎత్తుకెళ్తున్నారని విమర్శించారు.
Read Also…
ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident).. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి:
సంగారెడ్డి జిల్లాలో నాందేడ్ అఖోలా 161 వ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ వేగంగా వచ్చి కారును ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఈ ఘటన అందోల్ మండలం మాసాన్ పల్లి హైవే బ్రిడ్జి కింద చోటుచేసుకుంది. జోగిపేటకు చెందిన ఆరుగురు యువకులు చాయ్ తాగేందుకు జోగిపేట నుండి కారులో ముందుగా చౌటకూర్ దాబాకు వచ్చారు. అక్కడ దాబా బంద్ ఉండడంతో అదే కారులో మాసన్ పల్లి వద్ద హైవే పక్కన హోటల్ వెళ్లి చాయ్ తాగారు. తిరిగి వెళ్తున్న క్రమంలో మాసాన్ పల్లి బ్రిడ్జి కింద కారు ఆపి వారు మూత్ర విసజ్జన చేస్తుండగా వెనకనుండి వచ్చిన టిప్పర్ లారీ వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది.
Follow us on : Facebook, Instagram & YouTube.
అయితే కారు ముందు మూత్ర విసర్జన చేస్తున్న ముగ్గురు యువకులపై ఢీకొట్టిన టిప్పర్ లారీ మరియు కారు రెండు వారిపై వెళ్ళడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా జోగిపేటకు చెందిన మైనారిటీ యువకులు వీరంతా మెకానిక్ వర్క్ చేస్తుంటారు. మృతి చెందిన యువకులు జోగిపేటకు చెందిన వాజిద్ (28) హాజీ(28) బుక్రాన్ (29) కాగా మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా అతడిని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలు కావడంతో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాత్రి వేళల్లో జోగిపేట పరిసర ప్రాంతా ఏరియాల్లో భారీగా అక్రమ మోరం రవాణా జరుగుతుంది.
అయితే కారును డికొట్టింది మోరం టిప్పర్ లారీ అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహలను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మర్చ్యూరికి తరలించారు. 161 వ జాతీయ రహదారిపై తరుచుగా ప్రమాదాలు జరిగి చాలా మంది మృత్యువాత పడుతున్నారు. మొన్న రెండు రోజుల క్రితం ఇదే రహదారిపై సంగుపేట వద్ద కారు బైక్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరు కూడా 161 నేషనల్ హైవే బ్రిడ్జి కింద ప్రమాదం జరిగింది. 161 జాతీయ రహదారి గత కొంత కాలంగా రోడ్డుప్రమాదాలతో రక్తసిత్తమవుతుంది.
ఇది చదవండి: తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీ
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Prajahita Yatra :
రేపటి నుండి మూడు రోజులపాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ రెండో విడత ప్రజాహిత యాత్ర చేపట్టనున్నట్లు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మ శ్రీరామ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొమ్మ శ్రీరామ్ మాట్లాడారు. రేపు కోహెడ నుండి రెండో విడత ప్రజాహిత యాత్ర ప్రారంభమవుతుందని, యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ నిధులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అప్పగించకుండా ఆ నిధులను పారదర్శకంగా వినియోగించాలని స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ కు విజ్ఞప్తి చేశారు. ఎండాకాలం ప్రారంభం కాకముందే ఇప్పడికే గిరిజన తండాలు, మారుమూల గ్రామాలలో మొదలైన త్రాగు నీటి ఎద్దడిని తొలగించడానికి కృషి చేయాలని కోరారు. రెండుసార్లు గాలిపాటున గెలిచిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ బిఆర్ఎస్, బిజెపి ఒక్కటేనని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.