రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధి లో మంచాల్ మండల గ్రామాలలో సుమారు 136 సిసి కెమెరాలు ప్రధానమైన చోట్ల పెట్టడం జరిగింది. మంచాల్ మండల పోలీస్ స్టేషన్ లో రాచకొండ సి పి, సుధీర్ బాబు సిసి కెమెరాలను ఆవిష్కరించడం జరిగింది. సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రతి ఏరియాలో సిసి కెమెరాలు తీసుకురావడం చాలా అభినందనీయం. ప్రజా ప్రతినిధులను అధికారులను అభినందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగిన సిసి ఫుటేజ్ ద్వారా నిందితులను పట్టుకోవడం సులభంగా ఉంటుందని వివరించారు. నేరాలు చేసే వారికి కట్టిన శిక్షలు ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో డ్రగ్స్ ద్వారా యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నందున అధికంగ చెడిపోవడానికి కారణాలు అవుతాయి. డ్రగ్స్ బారిన పడకుండా పిల్లలకు యువతకు విద్యార్థులకు ప్రతి ఒక్కరు వారికి సరైన సలహాలు సూచనలు ఇస్తూ సరైన మార్గంలో నడిపించాలని కోరారు. ఇలాంటి కార్యక్రమానికి సహకరించిన ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.. కార్యక్రమంలో రాచకొండ సిపి సుధీర్ బాబు, డీసీపీ శ్రీనివాస్ రావు, ఏసిపి శ్రీనివాస్, సీఐ కాశీ విశ్వనాథ్.. స్థానిక ప్రజాప్రతినిధులు, స్టూడెంట్ పలువురు పాల్గొన్నారు.
Rangareddy
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం పూజిత అక్షింతల కలశ వితరణ మహోత్సవాన్ని నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాస్కర యోగి హాజరైనారు. ఈ కార్యక్రమంలో అయోధ్య నుంచి శ్రీరాముని అక్షింతలను తీసుకువచ్చి ప్రతీ ఇంటింటికి పంపించే కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాల్ని నిర్వహించి శ్రీరామునీ రాజ్య పరిపాలన, ఆయన గొప్ప తనం గురించి వివరించారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామానికి అక్షింతలు పంపించి డిసెంబర్ వరకు హనుమాన్ దేవాలయంలో పెట్టి హనుమాన్ చాలిసను పఠించి జనవరి 1 తరువాత ప్రతి గడపగడపకు అందించాలని ఈ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాస్కరా యోగీ, బీజేపి నాయకులు, భజరంగ్ దళ్ నాయకులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో గత రెండు రోజుల నుంచి భారీగా పొగ మంచు కురుస్తుంది. ఈ పొగమంచు వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొగ మంచు కురవడం వల్ల ప్రమాదాలు జరగవచ్చని వాహన దారులు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు తెలిపారు. అలాగే ఆస్తమా వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ పొగ మంచుకు బయటికి రాకూడదన్నారు. ఒకవేళ వచ్చినా మాస్కులు ధరించాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పి. సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీ శ్రీనగర్ ఫ్యాబ్ సిటీలో ముక్కోటి(వైకుంఠ) ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు యువ నాయకులు కార్తీక్ రెడ్డితో కలిసి పి. సబితా ఇంద్రారెడ్డి ఉత్తరద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదములు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు సబితా ఇంద్రా రెడ్డి ప్రజలందరికి వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపతో మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని చెందిప్ప గ్రామ పరిధిలో ఉన్న 124 సర్వే నంబర్ గల 8.22 ఎకరాల భూమిని హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ముస్లిం వ్యక్తులు మొత్తం 7.22 ఎకరాలా భూమిని తమ పేరు మీద పట్ట భుమిగా మార్చి జెసిబి లు తీసుక వచ్చి సాప్ చేపిస్తున్న క్రమంలో గ్రామస్థులు తెలుసుకోని అడ్డుకోవడం జరిగింది. ఈ విషయంపై పోలీసులు కలుగజేసుకొని అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క భూమి ఎప్పుడు సాగులో లేదు ఇది ఒక కొండ ప్రాంతంగా మాత్రమే ఉండేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ కొండపైన ఒక మసీదు మరియు కొండ కింది ప్రాంతంలో ముస్లింల స్మశానవాటిక ఉండేది. ఇట్టి భూమిపై కన్నేసిన భూ బకాసురులు 2016 నుంచి పట్టా భూమిగా మార్చుకొని కబ్జాలకు తీసుకునే ఉద్దేశంతో జెసిబిలు పెట్టి సాప్ చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ యొక్క భూమి 2016 వరకు లావని పట్టాగా ఉండేదని ఇందులో కొంత భూమి అనగా ఒక ఎకరం వరకు కడమంచి వారి పై ఉన్నట్టు తెలుస్తోంది. కడమంచి వారిపై ఉన్న భూమి లావిని పట్టగాను చూపిస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ఎమ్మార్వో ను అడగగా తను లేనని తర్వాత కలుస్తానని దాటవేస్తున్నారని అక్కడి ప్రజలు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు అయనకు ఘన స్వాగతం పలికారు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటి సారిగా చేవెళ్ల ప్రాంతానికి వచ్చిన అయనకు చేవెళ్ల నియోజకవర్గం లోని 5 మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్, చేవెళ్ల సర్పంచ్ శైలజా ఆగి రెడ్డి డీసీసీ ఛైర్మెన్ వెంకట్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
మొదటిసారిగా చేవెళ్ల ప్రాంతానికి వచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు గడ్డం ప్రసాద్ కుమార్ కు పుష్పగుచ్చం ఇచ్చి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పామేన భీం భరత్, చేవెళ్ల సర్పంచ్ శైలజా ఆగిరెడ్డి, డిసిసి ఛైర్మన్ వెంకట్ రెడ్డి, అభిమానులు పాల్గొన్నారు. తమ ప్రాంతం నుంచి మొదటిసారిగా స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక కావడం గర్వకారణంగా ఉందని నాయకులు తెలిపారు.
Read Also..
Read Also..
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాల్టీలో కార్మికులు ఉద్యమించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. పట్టణంలో మొత్తం 82 మంది కార్మికలు ఉన్నారు. వారిలో కేవలం ఇద్దరికి మాత్రమే వేతనాలు పెంచారు. మిగతా 80 మంది పట్ల అధికారలు వివక్ష చూపుతున్నారని వారంతా ఆరోపిస్తున్నారు. తమకు కూడా జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గత వారం రోజులుగా నిరసన తెలుపుతున్నా ఉన్నతాధికారులు స్పందించం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్య పరిష్కారం చేయకుంటే రెండు మూడు రోజుల్లో సమ్మెకు కూడా దిగుతామని హెచ్చరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. భూదాన్ పోచంపల్లిలో పర్యటించనున్నారు. ఈనెల 20న రాష్ట్రపతి ఖరారైంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోం. హెలిప్యాడ్ స్థలాన్నిరాష్ట్రపతి వెంట వచ్చే మూడు మిలిటరీ హెలిప్యాడ్ స్థలాలను పరిశీలించారు. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 18న ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. తన పర్యటనలో భాగంగా భూదాన్ పోచంపల్లి వెళ్తారు. చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు. పద్మశ్రీ, సంత్ కబీర్, ఇతర జాతీయ పురస్కార గ్రహీతలతో మాట్లాడుతారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అవార్డులు వచ్చిన 16మందిని గుర్తించి వారి జాబితాను ఢిల్లీకి పంపించారు. వారిలో ఎంపిక చేసిన ఐదు నుంచి 10 మందితో రాష్ట్రపతి ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. శ్రీరంజన్ హ్యాండ్లూమ్ యూనిట్లు సందర్శిస్తారు. మగ్గాలు, మగ్గం నేసే ప్రక్రియ పరిశీలిస్తారని అధికారులు వివరించారు.
Read Also..’
Read Also..
యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ భూతం రాజ్యమేలుతోంది. భువనగిరి ఎస్.ఓ.టి. పోలీసులు కల్తీ పాలు తయారు చేసే ముఠా ఆటకట్టించారు. భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల, గౌస్ కొబ్లండ గ్రామాల్లో కల్తీ పాల దందా జోరుగా సాగుతోంది. పక్కా సమాచారంతో కాపుకాసిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి 350 లీటర్ల కల్తీ పాలు స్వాధీనం చేసుకున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్లు సీజ్ చేశారు. కల్తీపాల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. స్థానిక పోలీసులకు సమాచారం ఉన్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదులు సైతం వెళ్లాయి. దీంతో ప్రత్యేక టీంను రంగంలోకి దించారు. నిందితులను అరెస్ట్ చేశారు.






Total views : 197913