బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సెలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్, ప్రధాన కార్యదర్శిపైనా కేసులు నమోదు చేయాలంటూ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను మరో పిటిషన్ తో అటాచ్ చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ క్లారిటీ ఇచ్చింది. ఈ భూమి లావాదేవీలతో సంబంధం ఉన్న రెవెన్యూ శాఖ అధికారులను కూడా జవాబుదారీ చేయాలంటూ బెంచ్ నొక్కిచెప్పింది. కోకాపేటలో సర్వే నెం. 239, 240 బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సెలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ కోసం 11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ గతేడాది లాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి జారీ అయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వెంకట్రామిరెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించి కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది.
Rangareddy
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ నిర్వహించిన దాడుల్లో ఏకంగా 100 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. ఆయన గతంలో హెచ్ఎండీఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్ గా ఉంటూనే మరోవైపు పురపాలన, పట్టణాభివృద్ధి విభాగం ఇన్చార్జి డైరెక్టర్ హోదాలో కొనసాగారు. ఈ క్రమంలో హెచ్ఎండీఏ నుంచి రికార్డులను ఆయనే పంపేవారు. డైరెక్టర్ హోదాలో ఆయనే జీవోలిచ్చేవారు. రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, భువనగిరి, సంగారెడ్డి మొత్తం ఏడు జిల్లాల్లోని భూములకు సంబంధించిన అనుమతుల్లో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. హెచ్ఎండీఏ పరిధి జోన్లలోని నిబంధనల్ని ఆసరాగా చేసుకొని వందల దరఖాస్తులకు ఆమోద ముద్ర వేసేందుకు భారీగా వసూలు చేశారని అభియోగాలు ఉన్నాయి. ఒక్కో అంతస్తుకు 4 లక్షల వరకు లేఅవుట్లలో ఒక్కో ఎకరాకు లక్షల్లో వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. నెలకు 70-80 దస్త్రాలకు అనుమతులు మంజూరు చేస్తూ ఆస్తులు సంపాదించారని బాలకృష్ణపై అభియోగాలున్నాయి.
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం ఈ రోజు అయోధ్యలోని రామ మందిరం లో బాల రాముని విగ్రహ ప్రతిష్టించుకోవడం కోసం 500 సంవత్సరాలు వేచి చూశామని ఈరోజు నెరవేరిందని విగ్రహన్ని ప్రతిష్ట చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని రామభక్తులు వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి ఊరు వాడ భక్తిశ్రద్ధలతో శ్రీరామ నామంతో మారుమోగింది వీధి వీధి వాడవాడ భక్తిశ్రద్ధలతో చిన్నలు పెద్దలు అన్న తేడా లేకుండా శ్రీరామ నామస్మరణతో మారుమోగించారు. హిందువుల యొక్క చిరకాల కోరిక అయోధ్య రామ మందిరం నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు భారతదేశనికే కాకుండా ప్రపంచ దేశంలో కూడా రాముని యొక్క ప్రతిష్టను పొగుడుతూ రాముని యొక్క గుణగణాలను కీర్తిస్తు దేశంలో మళ్ళీ రామరాజ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని వ్యక్తం చేసారు.
రంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆరు ట్రావెల్స్ బస్సుల్లో 30 కేజీల గంజాయిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న10 మందిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో అందరూ యువకులే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తీసుకువస్తున్నారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో గంజాయిని డోర్ డెలివరీ చేసేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. షాద్ నగర్ నియోజవర్గం కొత్తూరు మండలంలో గంజాయి చాక్లెట్ల విక్రయం కలకలం సృష్టిస్తుంది. కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రవర్తనలో మార్పు కనిపించడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంగోర్ నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారికి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఘా పెట్టిన ఎస్ఓటి పోలిసులకు కొత్తూరులోని కిరాణా షాపుల డబ్బాలలో గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి, పూర్తి సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చార్మినార్ గోల్డ్ పేరిట పసుపు, బంగారు వర్ణంలో గల సుమారు 8 కేజీల గంజాయి చాక్లెట్ ప్యాకెట్లు పట్టుపడ్డాయి. చాక్లెట్లను విక్రయిస్తున్న ఒడిస్సా రాష్టానికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకీ తీసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. గంజాయి చాక్లెట్ల విక్రయ వ్యవహారంలో కొత్తూరు ఇన్స్పెక్టర్ నర్సింహా రావును వివరణ కోరగా గంజాయి చాక్లెట్ల వ్యవహారం నిజమేనని, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు, కేసును పూర్తి స్థాయిలో దర్యాఫ్తు చేసిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
Read Also..
రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండల కేంద్రంలోని బాకారం గ్రామ రెవెన్యూ పరిధిలో డ్రీమ్ వ్యాలి సమీపంలోని గుర్తు తెలియని మహిళా కాలుతున్న మృతదేహాన్ని గమనించిన చుట్టూ ప్రక్కన వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే మొయినాబాద్ సీఐ పవన్ కుమార్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని చేవెళ్ల ఏసిపి ప్రశాంత్ రెడ్డి కీ సమాచారం ఇవ్వడంతో ఏసిపి ప్రశాంత్ రెడ్డి అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం క్లూస్ టీంకు మరియు డాగ్స్ స్క్వాడ్ సమాచారం ఇచ్చి పరిశీలించడం జరిగిందని తన ప్రాథమిక దర్యాప్తులో తెలిపిన విధంగా ఎక్కడో ఈ అమ్మాయిని చంపి ఇక్కడ తీసుకొచ్చి ఈ రోజు మూడు గంటల ప్రాంతంలో తగలబెట్టినట్టు ఏసిపి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మృతదేహం దగ్గర ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని అప్పటికే పూర్తిగా కాలిపోయి ఉన్నట్లు గుర్తించామని అమ్మాయి లోతుస్తులు మాత్రమే ఉన్నాయని జడకు మాత్రం రెడ్ క్లిప్ ఉన్నట్టు ఏసిపి దర్యాప్తులో తెలిసినట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించామని అక్కడ ఒక రోజు వేచి చూసిన అనంతరం పోస్టుమార్టం నిర్వహిస్తామని ఆ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని మీడియా తొ తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అతివేగం యువకుని ప్రాణాలను బలిగొంది. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఎస్సై మాహేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సంకెపల్లి గూడ గ్రామానికి చెందిన మల్లే రాఘవేందర్ గౌడ్(21) గురువారం రాత్రి 11 గంటల సమయంలో నాగరగూడా నుండి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. మార్గమధ్యంలో గ్రామ సమీపంలోని భారత్ గ్యాస్ గోదాం వద్ద బైక్ అతివేగం గా నడపటం వల్లన అదుపుతప్పి డివైడర్ ను ఢీకొంది. ప్రమాదంలో ఛాతీ భాగంపై బలమైన గాయాలు తగలడం వల్లన ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే షాద్‌నగర్ లోని ఏబీపీ హాస్పిటల్ కి తరలించగా అక్కడ వారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోవాల్సిందిగా కోరారు. షాద్‌నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు ప్రభుత్వ డాక్టర్లు తెలిపారు. యువకుడు చనిపోవడానికి కారణం ఛాతీ పైన బలంగా డివైడర్ తగలడం తో చనిపోయినట్లు తెలుస్తోంది. తండ్రి శ్రీశైలం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ప్రారంభించిన రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, అడిషనల్ డీసీపీ రష్మీ పేరు మాల్, నార్సింగ్ ఎసిపి లక్ష్మి నారాయణ, శంకర్ పల్లి సిఐ వినాయక్ రెడ్డి, ఎస్ఐ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ.. సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఎక్కడ ఏం జరిగినా మనం ఈజీగా కనిపెట్టవచ్చని దానివల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆయన తెలిపారు శంకరపల్లి లో మొత్తం 102 సీసీ కెమెరాలను ఎర్పాటు చేశామని ఈ సీసీ కెమెరాలు ఏర్పాటుకు దాతలు ముందుకు వచ్చి 25 లక్షల రూపాయలు విరాళం అందించారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు. సీసీ కెమెరాలను ఎర్పాటు చేసినా వెంబడే ఇద్దరు దొంగలను కూడా గుర్తించినట్టు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అలాగే శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని ఈ సంక్రాంతి తర్వాత దాని పునాది స్టోన్ వేసి 2024 సంవత్సరం అయిపోయేసరికి పోలీస్ స్టేషన్ ను కూడా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
రంగారెడ్డి జిల్లా.. చేవెళ్ల నియోజకవర్గంలో విద్యుత్ షాకుతో ఒగ్గు కళాకారుడు మృతి చెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోనే చందనవల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. షాబాద్ ఎస్సై మహేశ్వరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారుడు శివకుమార్ (29)మృతి చెందాడు. ఇతనికి ఒక బాబు, ఒక పాప ఉన్నట్టు సర్పంచ్ తెలిపారు. ఇతను షాబాద్ మండల పరిధిలోని చందనవెల్లి గ్రామానికి చెందిన కందివనం మహేందర్ గౌడ్ తన ఇంటి వద్ద ఎల్లమ్మ కళ్యాణం నిర్వహించారు. ఒగ్గు కథ కళాకారుడు శివకుమార్ తన బృందంతో మైక్ తో కథ చెప్పేందుకు మౌత్ పీస్ తీసుకోగా దానికి విద్యుత్ షాక్ వచ్చి శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గం లోని అజీజ్ నగర్, షాబాద్ చౌరస్తా మరియు మోకీల ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసిపి మురళీకృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అజీజ్ నగర్ గేటు సమీపంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసిపి మురళీకృష్ణ మరియు సిఐ నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారికి కేస్ బుక్ చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ రెండు గంటల వరకు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.





Total views : 196554